విదేశాల్లో వుండాలా, వెళ్ళాలా?

(మరొక సైటు నుండి పునః ప్రచురణ)

స్వదేశం నుండి విదేశాలకు వచ్చి స్థిరపడిన ప్రతి దేశీ కుటుంబానికీ ఈ ఆలోచన, ఈ ప్రశ్న తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనుకుంటాను. దేశకాలమాన పరిస్థితులను బట్టి ఒక్కోక్కరూ ఒక్కొక్క విధంగా ఈ ఆలోచనపై నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు కెనడా నుండి, యు ఎస్ ల నుండి ఇండియాకు వెళ్ళాయి. మరి కొన్ని కుటుంబాలు వెళదాం, వెళదాం అనుకుంటూనే వాయిదా వేస్తున్నాయి. ఒకటి రెండు కుటుంబాలు ఇండియాకి వెళ్ళి ఇమడలేక మళ్ళీ తిరిగివచ్చాయి. ఇలా ఇమడలేకపోయిన కుటుంబాల్లో మాదీ ఒకటి అని చెప్పుకోవచ్చు.

ఓ నాలుగేళ్ళ క్రితం కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్నాల్ళు గడుపుదాము అనుకున్నాము. మా పెద్దమ్మాయికి అక్కడి ఇంటర్నేషనలు స్కూళ్ళ గురించి ఊరించాము. అక్కడి బోర్డింగు స్కూళ్ళ గురించి చెప్పినట్లు తనూ అందులో వుండేందుకు ముచ్చటపడింది. ఒక పెద్ద గ్లోబల్ పాఠశాలలో చేర్పించాము. ఓ వారం బాగానే వుంది కానీ తరువాత మాత్రం ఇమడలేకపోయింది. ఇక్కడి బోధనా విధానానికి, అక్కడి బోధనా విధానానికి ఉన్న తేడాలతో పాటు కరికులం తేడాలు మొదలయినవాటి వల్ల అక్కడ చదువు అంటే బెదురు పుట్టుకు వచ్చింది.

ఆ పాఠశాలలో సౌకర్యాలు చాలా బావున్నాయి కానీ ఏం లాభం? ఎంత అంతర్జాతీయ పాఠశాల అని చెప్పుకున్న కూడా ఉపాధ్యాయుల ధోరణి కానివ్వండి, బోధనా ధోరణి కానివ్వండి సగటు భారతీయ ప్రమాణాలతో వుండిపోయేసరికి మా అమ్మాయి ఆ స్కూలుని తిరస్కరించేసింది. ఎందుకు డాడీ టీచర్లు అందరూ కొట్టినట్లే మాట్లాడుతారు? అన్నది మా అమ్మాయి ప్రశ్న. ఆ ఒక్క ఉదాహరణ చాలు మీకు పరిస్థితి అర్ధం చేసుకోవడానికి. ఇక్కడి ఉపాధ్యాయులు పిల్లలని ఎంత ప్రేమగా చూసుకుంటారు! కల్చర్ షాక్ కొట్టేసింది మా అమ్మాయికి.

ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఇది మా అమ్మాయిపై ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు. ఆమె తరగతి గదిలోకి వస్తే కూడా మా అమ్మాయి లేచి నిలబడదట. అదండీ మా అమ్మాయికీ, ఆవిడకీ మధ్య కల్చర్ షాక్. ఇక్కడి దేశాల్లో నేమో అలా లేచి నిలబడే సాంప్రదాయాలు లేవాయే. గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాలుకి ఈమాత్రం తెలియకపాయే. ఇలా మా అమ్మాయితో వాళ్ళూ, వాళ్లతో మా అమ్మాయీ ఇబ్బంది పడటం వల్ల ఆ పాఠశాల నుండి మా అమ్మాయిని నెల రోజులకే తీసివేయాల్సివచ్చింది.

ఇక మా చిన్నమ్మాయి సంగతి చూద్దాం. అప్పుడు తను కిండర్‌గార్టెన్ చదువుతోంది. మా ఇంటిదగ్గరి ఒక స్కూలులో చేర్పించాము. చక్కగా కొత్త యూనిఫార్మ్ కుట్టించి తొడిగించి పంపిస్తే ఆనందంగా వెళ్ళింది. ఎలా వుందో చూద్దామని మధ్యాహ్న భోజన వేళకి వెళ్ళాను. ఒక మూలన కూర్చొని బేలగా ఏడుస్తోంది. నేను వదిలిపెట్టి వెళ్ళినదగ్గరి నుండీ ఏడుస్తూనే వుందిట. నా మనస్సు ద్రవించింది. అలా ఆగకుండా ఏడుస్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్ళేవాడిని కదా అనుకున్నాను. అలాంటి ఏడుపులు అక్కడ సాధారణం అనుకుంటాను అందుకే వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ స్కూలుకి వెళ్ళిన రోజుల్లో ఎన్నడూ ఏడవలేదు. ఎందుకంటే ఆ వయస్సు పిల్లలకి ఇంట్లో కన్నా బడిలోనే సరదాగా వుంటుంది కాబట్టి, ఆటపాటలతో టీచర్లు అలరిస్తారు కాబట్టి, తల్లితండ్రులంత గొప్పగా విద్యార్ధులని టీచర్లు అప్యాయంగా చూసుకుంటారు కాబట్టి. అలా అలా చిన్నమ్మాయికీ అక్కడి స్కూళ్ళు నచ్చలేదు. ఇంకేం చేస్తాం, మానిపించివేసాము.

అక్కడ వుండటం మా దంపతులకి ఇష్టం వున్నా వుండకపోయినా మా పిల్లలకు మాత్రం సరిపడకపోవడంతో వెనక్కి యు ఎస్ కి వచ్చేయాల్సొచ్చింది. ఇక్కడ చదివిన విద్యార్ధులు ఇండియాలో ఇమడడం కష్టం లాగే వుంది. మనకు మన పిల్లలపై ప్రేమల కన్నా వారు సంపాదించే గ్రేడుల మీదే ప్రేమ ఎక్కవయితే మాత్రం వారియొక్క మనోభావాలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటివారు నిక్షేపంగా ఇలాంటివి ఇబ్బందులుగా భావించరు. మాకు మాత్రం ఇబ్బందిగా అనిపించి వెనక్కు వచ్చేసాం. అలా వెనక్కు రావడానికి ఇతర కారణాలు వున్నా కూడా పిల్లలు చదువు విషయంలోనే కాకుండా ఇతర చాలా విధాలుగా కూడా అక్కడ సౌకర్యవంతంగా భావించకపోవడం ప్రధానమయిన కారణం.

ఏ కుటుంబాలయినా స్వదేశానికి వెళ్ళాలనుకుంటే పిల్లలు చదువు మొదలెట్టకముందే వెళ్ళిపోవడం మంచిది అని నా ఉద్దేశ్యం. కొంతకాలం ఇక్కడి జీవన విధానానికీ, విద్యా బోధనకూ అలవాటు పడితే చాలావరకు వారికి భారతదేశం నచ్చకపోవచ్చు. ఇప్పుడు భారతడేశం అంటే మా పిల్లలకి తెనాలిరామలింగడి పిల్లి కథలా అయ్యింది. పిల్లిని పెంచి పాలు త్రాగించమని రాయల వారు రామలింగడికి డబ్బు ఏర్పాటు చెస్తే బాగా కాలే వేడిపాలు ఒకసారి తాగించి మళ్ళీ పాలు అంటే చాలు పిల్లికి బెదురు పుట్టేలా చేసాట్ట. అలాంటి బెదురే ఇప్పుడు మా పిల్లలకి ఇండియాలో చదువు అంటే ఏర్పడింది. ఒకటి రెండు వారాలు గడపడానికయితే సరే అంటారు కానీ మేము ఎన్ని సర్ది చెప్పినా అక్కడే వుండే సమస్యే లేదంటారు.

ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చినవారికి సాధారణంగా ఇండియాలో జీవించాలని మమకారం వుంటుంది. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మన పిల్లలకి మనం ఎంత చెప్పినా కూడా ఇక్కడే సౌకర్యవంతంగా అనిపిస్తుందని నాకు అర్ధమయ్యింది. మా పిల్లల చదువులు అన్నీ అయిపోయాక కనీసం రిటైర్మెంటు అయినా ఇండియాలో గడపాలని నా ఆశాభావం.

8 comments:

 1. Sarat ji,

  meeru ee post lo cheppinavi naku chala help ayyayi. I know I would see same issues when I go there. even though my child is very young, I dont think I will like those schools even when they are of international standards. Its a very hard battle mentally as my parents are getting old and on the other side, its this little child who does not even know what the word 'choose' means.

  Thank you for sharing your experience.

  ReplyDelete
 2. "కరికులం తేడాలు" ??

  ReplyDelete
 3. Sarath garu,

  Nenu ade dilema lo unna vellala leka inkade undala ani, ee article chala bagundi

  ReplyDelete
 4. త్ అన్నా,

  మాకు ఇటువంటి సమస్య ఫుచర్ లొ ఉంటుందేమో!
  -భరత్

  ReplyDelete
 5. @ అజ్ఞాత @ 22 ఫిబ్రవరి 2011 12:12 సా
  నేనన్నది కులాల గురించి కాదు - పాఠ్యాంశ కులం గురించి.
  http://en.wikipedia.org/wiki/Curriculum

  ReplyDelete
 6. Sarat,

  Nice Post. Have you come across these famous counter arguments?

  Asian perspective - http://online.wsj.com/article/SB10001424052748704111504576059713528698754.html

  American perspective -
  http://online.wsj.com/article/SB10001424052748703959104576082434187716252.html?mod=WSJ_article_related

  ReplyDelete
 7. రండి రండి బోలెడు ఉద్యమాలున్నాయి ...పాలు పంచుకుందురుగాని...

  ReplyDelete
 8. meeru retire ayaaka India raavaalanukuntunnaaru.

  kaanee mee pillalu vaallu retire ayaaka koodaa India raaru ani anukuntunnaa...

  saradaagaa 4 days India vachchinapudaina... ee vaathaavaranam lo imadalekunnaa kaneesam aa 4 days nu enjoy cheyaleremo... mee pillalu.

  kevalam ankelu dvaaraa maathrame India agra desam avuthundemo kaani, paristhithulu peddagaa maaravu.

  ReplyDelete