హమ్మయ్య, డ్రైవరు డ్యూటీ కాస్త తప్పిందండోయ్

ఈ దేశాలకు వచ్చిన తరువాత నేను బాగా నిష్ణాతుడిని ఎందులో అయ్యానూ అంటే డ్రైవింగులో. పలు కారణాల వల్ల మా ఆవిడకి మొన్నటిదాకా లైసెన్స్ రాలేదు. ఎందుకు రాలేదూ అని అడక్కండి - అవన్నీ చెబితే నా మీదే నేరారోపణ నామీద చెయ్యడంతో పాటుగా నామీద పరువు నష్టం దావా వేస్తుంది మా ఆవిడ. మొత్తమ్మీద మా ఆవిడ అవసరాలకూ, పిల్లల అవసరాలకూ, నా అవసరలకూ, కొండొకచో ఇతరుల అవసరాలకూ తిరిగి తిరిగి మాంఛి నిష్ణాతుడిని అయ్యాను.

మరి కానేం? ఇదివరలో ఆఫీసునుండి అలసిపోయి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుందాము అంటే అప్పటిదాకా ఇంట్లో మగ్గిన మా ఆవిడ బయటకి వెళ్ళడానికని తయారుగా వుండేది. మా మేడం గారిని ఏ షాపింగ్ మాల్లోనో ఈ డ్రైవరు గారు దించేసి వచ్చేదాకా కారులో కునికిపాట్లో, బ్లాగుపాట్లో పడుతూ వేచివుండేవాడిని. అలాగే పిల్లలన్న తరువాత వాళ్లకి ఏవో రాచ కార్యలు వుండకమానవు కదా. వాటికి తిప్పీ, తీసుకువచ్చే బాధ్యత నాదేనాయే. ఇక వారాంతం అన్నా విశ్రాంతి తీసుకుందామంటే అంత దృశ్యం నాకెక్కడిదీ?   

ఇక సుదూర తీరాలకు వెళ్ళాలంటే విమానానికి తక్కువా, కారుకి ఎక్కువాయె మన పరిస్థితి.  అందుకే కారులోనే వెళ్ళేవాళ్లం సాధారణంగా ఎక్కడికయినా. అలా దూరాలకి వెళుతున్నప్పుడు కారులోనుండి ప్రోత్సాహం బాగానే లభించేది నాకు. "ఏంటీ, ఇంకా చేరలేదా? ఇంత నెమ్మదిగానా? ఇది కారా, ఎడ్ల బండా?" లాంటి ప్రశంసలు తరచుగా వినపడతూవుండేవి.  అలా అలా మా కుటుంబ సభ్యులు అందరూ నన్ను ఎద్దుని పొడిచినట్టు పొడుస్తూ ప్రోత్సహించగా, ప్రోత్సహించగా అలా అలా వాహన చోదకంలో పర్ఫెక్టు అయ్యేనన్నమాట.

మా ఆవిడకి డ్రైవర్ లైసెన్స్ వచ్చాక దృశ్యం మారింది. ఇప్పుడు ఆమెకు ప్రోత్సాహం నేను ఇవ్వడం మొదలెట్టాను. దాంతో ప్రోత్సాహం విలువేంటో అర్ధం అయ్యి నేను తోడుగా వస్తానంటే చాలు, అవో ఇవో సాకులు చెప్పి నన్ను వదిలించుకొని వెళుతోంది :) ఇప్పుడూ నేను ఆఫీసు నుండి రాగానే మా ఆవిడ తయారుగా వుంటోంది - కాకపోతే నాకోసం కాదు - కారు కోసం - ఉన్నది ఒక్క కారేనాయే.  వారాంతం కూడా నన్ను రెస్టు తీసుకో అని చెప్పేసి అమ్మలుని తీసుకొని ఆమె షాపింగ్ మాళ్ళకి వెళుతోంది. నేను ఎంచక్కా ఇంట్లో వుండిపోతూ కునికిపాట్లో, బ్లాగులో, టపాలో తీస్తున్నాను. ఇదేదో మా ఇద్దరికీ బాగానే వుంది. 

ఇదివరకు నన్ను కారులో వెయిటింగులో పెట్టి వీళ్ళు షాపింగ్ చేస్తుంటే వళ్ళు మండేది. షాపింగు చేసి ఖర్చు తప్ప ఏం సాధిస్తారో అర్ధం కాక విసుక్కునేవాడిని. ఆ నడకే నాకు వ్యాయామం అనేది కానీ అంతగా నమ్మేవాడిని కాదు. ఈ పెళ్ళినడకల వల్ల ఏం వ్యాయామం వస్తుందీ అని నా సందేహం. కాదట. ఈ షాపింగ్ నడకల వల్ల దాదాపు 220 క్యాలరీలు గంటకి కరిగిపోతాయిట. అంతేకాకుండా ఈ షాపింగ్ అన్నది ఆడవారిలో మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి ఉత్సాహవంతులుగా చేస్తుందిట. అందుకేనేమో, ఈమధ్య నా ఝంజాటం లేకుండా షాపింగుకి వెళ్ళి పూటలకు పూటలు  మాళ్ళలోనే నివసిస్తున్నందువల్లనేమో మా అనితలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అది మంచిదేగా. ఇవన్నీ గమనించీ మా ఆవిడని ఎంచక్కా ప్రోత్సహిస్తున్నాను - కానీ ఖర్చు మాత్రం చూసీ చూడనట్లు కాకుండా కాస్త చూసిపెట్టమని కోరుతున్నాను. ఆమె సౌకర్యం కోసం మరియు మా కుటుంబంలో తయారవుతున్న మరో డ్రైవరు కోసం మరో కారు/SUV వచ్చేనెలలో కొనే ఆలోచన కూడా వుందండోయ్.     

8 comments:

 1. ponlendi Sarth, mee avida manchidi kaabaTTi car maatram teesukoni..mee legs meeku vadilesindi :-)

  ( saradaagaa maatramee )

  ReplyDelete
 2. @ భా రా రే
  మా ఆవిడ నా కాళ్ళు విరగ్గొట్టినట్లుగానే వుంటోందండీ. నేను ఏదన్నా పనిమీద బయటకి వెళదామంటే కారు లేక అలాగే అనిపిస్తోంది.

  ReplyDelete
 3. Sarat garu

  Feb lo manchi car deals unnayi. nenu Nissan rogue konnamu.manchi deal ki vachhindi.
  Meeru kuda koneyyandi. intaki car konnaka kuda meeru old car eena. kotta car mee vaallaka. bhale varandi meeru. usual ga gents kotta car teesukuni , intlo vallaki old car vadilestaru.
  All the best !!

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  మా అందరికీ ఒకటే విషయం నచ్చడం అన్నది అసాధ్యం ... కానీ ఒక కారు విషయంలో మాత్రం అందరం ఏకీభావానికి రాగలగడం మాకే ఆశ్చర్యంగా వుంది. మా అందరికీ నచ్చింది 'ఫోర్డ్ ఎస్కేప్'. క్రెడిట్ సమస్యల వల్ల మరీ సీల్ బండి కొనలేను కానీ రెండుమూడేళ్ళ పాతది కొనాలని చూస్తున్నాను.

  మా ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలని (సూరిబావ కళ్ళళ్ళో ఆనందం చూడాలనే డైలాగు లాగా) ఈ కారు ఆమెకు ఇవ్వబోతున్నాను :) (నిజానికి ఇచ్చేది మా పెద్దమ్మాయికి లెండి...ష్! పిల్లల ఆనందం ముందు మన ఆనందం లెక్కచేయము కదండీ. పాత కారు నడుపుకొమ్మంటే వద్దుపొమ్మనగలదు)

  ReplyDelete
 5. mari ade... anaadigaa mana Hindu Kutumba Vyavastha manaku sardukupovadame nerpindi..., meeru koodaa daanini chedhinchaleru...
  Divorce ichchesthaa... ani prathi mogudoo, pellaam tho anevaade, kaani meeru nijamgaa... OK..Ok...ok...
  ika mee manasthathvam chandaalamainadi kaadu, meeru annee chakkagaa analyze chesthaaru..., mee reply lo naaku meeru koddigaa feel ayinatlu kanapadindi. adi veedevadraa baabu, family tho ilaa enjoy chesthunte, divorce goorchi maatlaaduthunnaadu ani...

  ReplyDelete
 6. Actually, I hate driving even at least once, I like to sit in the rear seat, enjoy the world or sleep or talk to my kid in the back seat. So, I planned for this very early, my wife got the license very immediately after her arrival into US, bought her car even before her license arrived. She initially enjoyed her new car and license.. now trapped.. :-) sweet kick.. :-)

  ReplyDelete
 7. మచ్చల మనిషిFebruary 14, 2011 at 10:30 AM

  గ్రూ గారు..

  కథ -3 ఎమైంది.. ఆ కేక నిజమా ? టీవీలోనిదా... లేక ఇదంతా కలనా ?

  ReplyDelete
 8. @ మచ్చల మనిషి
  కథ-3 గురించి ఎదురుచూసేవారు ఒక్కరయినా వున్నారన్నమాట. సంతోషం. ఈమధ్య అందరూ తిట్లతో, బూతులతో బ్యుజీగా వున్నారని నేనూ అది వ్రాయలేదు. ఒకటి రెండు రోజుల్లో ఆ చివరి భాగం వ్రాసేస్తాను.

  ReplyDelete