మల్లన్న దేవుడు - 2

కట్ చేస్తే మళ్ళీ కొన్నేళ్ళ తరువాతనే మా అమ్మగారికి ఆ గుడికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవడానికి వీలయ్యింది. ఆ సారి అవసరం పడింది కాబట్టి అమ్మ అక్కడికి వెళ్ళింది. కారణం నేను. ఆ మధ్య కాలంలో నేను చాలా డిప్రెషనులో వుండివుంటిని. ఎన్ని విధాలా ప్రయత్నించినా నేను అందులోనుండి బయటకి రాలేదు. అమ్మ తనకు తెలిసిన ప్రయత్నంగా, తన వంతు ప్రయత్నంగా వెళ్ళి ఆ దేవుని సహాయం ఆర్ధించింది. వారు ఏవో మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చేసి "బాబుకేం ఫర్వాలేదు. భేషుగ్గా బాగవుతాడు" అని చెప్పారుట. ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయలు నాతో తినిపించింది. ఆ మంత్రాలు, మహత్మ్యాల మీద నాకు నమ్మకం లేకపోయినా అమ్మ మనస్సును బాధపట్టడం ఇష్టం లేక నోరుమూసుకొని అవి తినేసాను.

కొన్ని నెలల తరువాత వివిధ పరిస్థితుల్లో మార్పు వచ్చి మొత్తమ్మీద  ఆ మాంద్యం నుండి నెమ్మదిగా బయటపడ్డాను. అయితే ఆ మంత్రించిన నిమ్మకాయలవల్లనే నేను బాగుపడివుంటానని మా అమ్మగారి విశ్వాసం. నిజం ఆ పెరుమాళ్ల కెరుక. నా డిప్రెషనుకి దారితీసిన పరిస్థితులూ, అందులో నుండి బయటపడటానికి దారితీసిన పరిస్థితులూ ఒక థ్రిల్లరుగా ఉరి అనే పేరిట వ్రాసాను. ఏ దృష్టికోణం నుండి చూస్తే ఆ కోణం వల్లనే నేను బాగుపడ్డాను అనుకోవచ్చన్నది అందులో చూపించాను.  ఓపిక వున్న వారు ఈ క్రింది సైటులో ఆ నవలను డవున్లోడ్ చేసుకొని చదవవచ్చును.  


ఆ తరువాత కొంతకాలానికి మా పెద్దక్కయ్య వాళ్ళ ఊరు వెళ్దామని ఏపూరు బస్సు ఎక్కితే ఒకరు పలకరించారు. ఆ మల్లన్న కొడుకు అట అతను. నన్ను బాగానే గుర్తించాడు. నాన్నగారు పరమపదించారనీ, అప్పటినుండీ ఆ గుడిని నేనే నిర్వహించుకువస్తున్నాననీ చెప్పుకువచ్చాడు.

ఈసారి ఎప్పుడయినా తీరిగ్గా ఇండియా వెళ్ళినప్పుడు ఆ గుడికి వెళ్ళి ఒక సారి బాల్యస్మృతులు అన్నీ గుర్తుకుతెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ సంగతులు గుర్తుకు రావడానికి ఓ కారణం వుంది. ఏదో మా నమ్మకం కొద్దీ మీరు ప్రస్థుత క్రైసిస్ నుండి బయటపడటం కోసం పూజలు చేయిస్తాను అని నా శ్రేయోభిలాషి అయిన ఒక బ్లాగ్మిత్రులు అన్నారు. సరే అనాలా లేక వద్దు అనాలా? ఈమెయిల్ రిప్లయ్ లో ఓ స్మైలీ ఇచ్చాను.

5 comments:

  1. గురువు గారు,
    కథ అద్భుతం.. కొంచెం సుత్తి ఉన్నా... చాలా బాగా చెప్పారు..

    మీ కథలు నిజాలో కల్పితాలో తెలియటం లేదు... అంత వాస్తవికం గా ఉన్నాయి...
    మీ నవలల లింకు అప్పుడెప్పుడో చూసినట్లు ఉరి పై క్లిక్ చేస్తే తెలిసింది... మొదలు పెట్టిన ... 51 వ పేజీ దాకా వచ్చి.. నన్ను చిన్న పిల్లవాన్ని చేసి అలా సాగతీస్తున్నారని... జంప్ లు చేస్తూ ఇదిగొ ఇప్పుడే ఒడగొట్టిన...
    చదువుతుంటే సూపర్ గా అనిపించింది గురువు గారు... నా ఇంటర్ తరువాత ఎంసెట్ లొ 25000 రాంక్ రావటం... ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ కి పోవటం... డిప్రెషన్ లో కి పోవటం... అది నా బీటెక్ అంతా కంటిన్యూ అవటం... తర్వాత నా మాస్టర్స్ కోసం ఇక్కడికి రావటం అన్ని ఒకసారి ఫ్లాష్ అయ్యాయి,, కాకపోతే ఏదో శాపం ఉంది అని సరిపెట్టుకుంటున్నాను.. నమ్మను .. కాకపోతే అనుకూలం ఐతే అబద్దం నిజమనుకుంటే బానే ఉంటుంది కదా..

    ReplyDelete
  2. Interesting.
    When others wish good for you, it will definitely happen. It may not be the "good" you wish for! It is like two fans of the opposing teams in the super bowl wishing that their own team wins. You have one favored solution in mind and your devout friend has another solution in mind - which one is the God going to listen to? something to ponder :)

    ReplyDelete
  3. @ కాయ
    ఉరి నవల నా ఆత్మకథ లాంటిది. అందులో 80% వాస్తవం మరియు 20% కల్పితం వుంది. మిగతా నవలలు మాత్రం కల్పితాలే సుమీ. ఉరిలో కొంచెం సాగతీత వుంది అనే విమర్శ వున్నా మీలాగే చాలామందికి ఆ నవల నచ్చింది. మీరు కూడా చాలా కాలం కౄంగుబాట పట్టారన్నమాట.

    @ కొత్తపాళీ
    :) ప్రస్తుతానికయితే మీ దేవుడు ఆ మిత్రుని మొరనే ఆలకిస్తున్నట్లున్నాడు. ఆఖరి రాజీకి వచ్చి చూస్తున్నాం. చూద్దాం ఈ ముచ్చట ఎన్నాళ్ళో.

    ReplyDelete
  4. "మా అమ్మగారి విశ్వాసం నిజం; ఆ పెరుమాళ్ల కెరుక, నా డిప్రెషనుకి దారితీసిన పరిస్థితులూ, అందులో నుండి బయటపడటానికి దారితీసిన పరిస్థితులూ " ఇలా చదువుకోండి... మీ నోట ఆ పెరుమాళ్ల కెరుక అన్న మాట వింటాను అనుకోలేదు...మీకంటూ కొన్ని భావాలున్నాయి...అందులో భక్తి భావం ఒకటి కావాలని నిజం గా అభిలషిస్తూ --- మీ శ్రేయోభిలాషి...

    ReplyDelete