కాలు తప్పి కాలు లొట్టబొయ్యి...


సూర్యాపేటలో వున్న రోజుల్లో ఒక కంప్యూటర్ శిక్షణా సంస్థ కొన్నాళ్ళు నడిపించాను. ఆ రోజుల్లో వ్యాయామం ఎందుకు చేయడం నా ఎనెర్జీ వేస్టూ అని నాకు శరీర మర్ధన చేయడానికి నాకు తెలిసిన ఒక మంగలి (నాయీ బ్రాహ్మణులు అంటారా వీరిని?) ని నియమించుకున్నాను. మొదట్లో గంట అని మొదలుపెట్టి నెమ్మదిగా రోజు రోజుకీ సమయం తగ్గిస్తూ వచ్చేసరికి అతగాడిని ఫైర్ చేసాను. అతగాడిని ఫైర్ చెయ్యడానికి ఇంకో కారణం కూడా వుంది. నాకు మసాజ్ చేస్తున్నందువల్ల నాకంటే ఎక్కువగా అతనికే వ్యాయామం లభిస్తుండేది. అందుగ్గాను కుళ్ళుకొని అతగాడిని మానిపించివేసాను.

అలా అతగాడు నా దగ్గరి నుండి వెళ్ళిపోయినా అతగాడు చెప్పిన ఒక విషయం నాకు అప్పుడప్పుడు గుర్తుకువస్తుండేది. అతని కాలుకు ఏదో పుండు ఎందుకో అయ్యి ఎంతకూ తగ్గలేదంట. ఎంతమంది డాక్టర్లకి చూపించినా, ఎన్ని చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపొయ్యిందంట. నా కాలు తీసివెయ్యాలంటున్నారు సారూ అని నా దగ్గర బాధపడ్డాడు. ఎక్కడయినా ఫర్వాలేదు గానీ కాలుకి ఏదన్నా అయితే మాత్రం జాగ్రత్తగా వుండాలట సారూ - తొందరగా, తేలిగ్గా తగ్గదంట సారూ అని సెలవిచ్చాడతను.

నా చిన్నప్పుడు మా ఊర్లో మా బాల్య స్నేహితుడు సురేందర్ ఇంటికి వెళుతుండేవాడిని. వాళ్ళ తాతకి కాలుకు ఏదో అయ్యి తగ్గక ఎంతో అవస్థ పడుతుండేవాడు. ఆ కాలు ఇంఫెక్షన్ పోవడానికని వళ్ళు గగుర్పొదిచే చర్యలకు కూడా దిగ్తుండేవాడు ఆ తాత. ఆ విషయం చెబితే మీకు ఏదోలా అనిపించవచ్చు కానీ ఇలాంటి విషయాల తీవ్రత తెలియజెప్పేందుకై అది ప్రస్థావిస్తున్నాను. తన కాలు ఇంఫెక్షన్ తినెయ్యడానికీ కాలు లోనికి జలగలని పంపించేవాడు!

నాకు పుండు అయ్యిందోచ్ అన్న నా టపాను మీరు చదివేవుంటారు. దాని ప్రోగ్రెస్ రిపోర్టే ఇది. ఆ పుండు/కురుపు/గడ్డ వల్ల నా యొక్క కొన్ని మూర్ఖత్వాలు బయటపడి వాటిని వదిలించుకోగలిగాను - కొన్ని డాలర్ల డబ్బులు కూడా వదిలించుకొని. ఆరోగ్య పరిస్థ్తితి విషమించడానికి సూచన తీవ్రమయిన జ్వరమో, తీవ్రమయిన నొప్పో వుండాలని భావించేవాడిని. అందుకే నా కాలుకి గడ్డ అయి లోజ్వరం వస్తూనేవున్నా, రాత్రి పూట చెమట్లు పడుతూనేవున్నా, చలిపెడుతూనే వున్నా, కాలు కొద్దిగా వాస్తూనేవున్నా, కొద్దిగా నొప్పెడుతున్నా కూడా లైటుగా తీసుకుంటూవచ్చాను.

నొప్పికి మందులు వేసుకుంటూ నడిపించుకువచ్చాను. ఆ గడ్డ అదే పెరిగి పెద్దదాయ్యి అగ్నిపర్వతం అయ్యి లావా విరజిమ్ముతూ అదే పేలిపోతుందని ఎదురుచూస్తూ వచ్చాను. వారం తరువాత ఓ రోజు ఉదయం పాదం కొద్దిగా వాయడం చూసాను. మధ్యాహ్నం చూసుకుంటే పాదం అంతా ఉబ్బిపోయింది. నా కాలు పరిస్థితి విషమించిందని అప్పుడు అర్ధమయ్యింది. వెంటనే హాస్పిటలుకి వెళ్ళాను. డాక్టర్ కూడా నా స్థితి చూసి కంగారు పడింది. బాగా ఇంఫెక్షన్ వచ్చిందని చాలా గట్టి ఎంటీబయాటిక్స్ వాడాలని చెప్పి చిన్న సర్జెరీ చేసి బ్యాండేజీ వేసి పంపించింది.

ఇంటికి వచ్చాక డాక్టర్ ఎందుకు అంత టెన్షన్ పడిందా అని Abscess గురించి గూగుల్ చేసాను. అప్పుడు అర్ధమయ్యింది నా పరిస్థితి. గాంగ్రీన్ కి దగ్గర్లో వుందనుకుంటా నా పరిస్థితి. ఏంటీ బయాటిక్స్ కి నా కాలు స్పందిస్తుందా లేదా అన్న టెన్షనుతో గడిపాను. అవి పనిచేయకపోతే ఇంకా చాలా కాంప్లికేషన్లు మొదలవుతాయి. కాలు వాపు వల్ల కాంప్లికేషన్స్ ఏమిటో గూగుల్ చెసి తెలిసికొని అది తగ్గించడానికి స్వయంగా సత్వర చర్యలు తీస్సుకున్నను. ఒక్కసారి డామేజీ ఎంటో అర్ధమయ్యాక యుద్ధప్రాతిపదిక మీద నష్టనివారణా చర్యలు చేపట్టాను. ఇప్పుడు కాలు వాపు బాగా తగ్గింది కానీ ఇంకా నొప్పి వుంది. క్రమంగా నొప్పి తగ్గుతోంది. ఇంఫెక్షన్ అంతా తగ్గడానికని ప్రతి మూడు రోజులకు ఒకసారి బ్యాండేజీ మారుస్తూనేవున్నాం. ఇప్పటికీ కూడా బ్యాండేజీ వేసుకునే తిరుగుతున్నాను.
నా పరిస్థితి చూసి నాకు డయాబెటిస్ వుందేమో అన్న అనుమానం మీకు రావచ్చు. ఏమీ లేదు. నిన్న కూడా పరీక్షించుకున్నాను. మొదట్లోనే డాక్టర్ దగ్గరికి వెళితే నాకు ఈమాత్రం కాంప్లికేషన్లు కూడా వచ్చెవి కావు. ఏదో సాధారణమయిన గడ్డ అని భావించి స్వంత వైద్యం చేసుకుంటూ, అపోహలతో ఉపేక్షిస్తూ ఇంతవరకు కొని తెచ్చుకున్నాను. ఆ మంగలతను చెప్పిన విషయం గుర్తుకు వున్నా కూడా, ఆ తాత విషయం గుర్తుకు వస్తున్నా కూడా, ఎంత ఆరోగ్య భీమా వున్నా కూడా డాక్టరుకి ఈమాత్రం దానికి 25 డాలర్ల కో-పే ఎందుకు తగలెట్టాలని ఊరుకుంటే ఇప్పుడు బిల్లు ఎంతయ్యిందో ఇంకా కొన్ని వారాల వరకు తెలియదు. ఇన్సూరెన్స్ డిడక్షన్ల క్రింద $500 అయినా అయివుండవచ్చు. కొంతలో కొంత నయమేంటంటే ఫ్లెగ్జిబుల్ హెల్త్ స్పెండింగు ఎకవుంటులో బాగానే డబ్బులు వున్నాయి నాకు. అవి ఖర్చు చేస్తున్నాను.

ఇందువల్ల నేను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటంటే కాలుకి వచ్చే ఆరోగ్య సమస్యలను ఉపేక్షించకూడదనీ, ఎక్కువ నొప్పి, జ్వరం లేకుండా కూడా ఆరోగ్యాలు విషమించవచ్చుననీ, ఇలాంటి విషయాల్లో వారం రోజులు వెయిట్ చెయ్యొద్దనీ, మూడు రోజులకయినా ముందడుగు వెయ్యాలనీనూ. నా బ్లాగు ద్వారా నేను నా చదువరులకు అందించదగ్గ గొప్ప విషయం నా అనుభవాలు - తద్వారా నేను నేను నేర్చుకున్న నీతులూనూ అని ఎప్పుడో వెళ్ళడించాను. ఆ కొవలోనిదే ఈ టపా. మీకు ఇలాంటి సందర్భాలు వస్తే జాగ్రత్తపడండిక.

3 comments:

 1. మొదటి విషయం....
  1. మంగలి అనేది కులం (ప్రస్తుత పరిభాషలో సామాజిక వర్గం) పేరు అయినా, ముందుగా అది "వృత్తి" పేరు... ఆ వృత్తికి ఇంకో పేరు లేదు ..ఆ సామాజిక వర్గానికి ఉన్నా...అంచేత మీరు నిస్సంకోచంగా ఆ పేరుతో ఆ వృత్తిని పిలవచ్చు...(ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే)
  2.రెండో విషయం...మన ప్రాచీన జీవన విధానంలో ప్రతీ వ్యాధికి ఏదో ఒకరకమైన "నివారణ" చెప్పబడింది... కొన్నిటిని సైన్స్ అంగీకరించదు.. కొన్నిటిని మనం అంగీకరించము..."సైన్స్" అయినా "శరత్-కాలం" అయినా ఏదైనా ఒక నమ్మకం ....నమ్మకం ఎక్కడ ఉంటుందో..అక్కడ తప్పులు/లోపాలు కనబడవు...
  3.మూడో విషయం ...మీరు పాదం వాచిపోవడం అనేది ఒక తీవ్రమైన పరిణామంగా అనుకుని వెంటనే వైద్యుని వద్దకు పరిగెత్తారు ...కానీ అక్కడే అస్సలు ఎపిసోడ్ ప్రారంభమైంది... అది ఆపుడే పక్వానికి రావడం మొదలుపెట్టింది(ఇదీ నా అభిప్రాయమే)..మీరు వైద్యుని వద్దకు వెళ్ళినా వెళ్ళకున్నా అది పగిలేది...
  4.ఇక్కడి(ప్రాచ్య దేశ) జనాలకు , ప్రతీదీ సమస్యే కాబట్టి వాళ్ళు మొదట అమెరికన్లా, తర్వాత డాక్టర్ గా ఆలోచించారు.. మన వైద్యులు వేరు మీద గోరు మొలిచినా యాంటి బయాటిక్స్ ఇస్తారు ..కాని ఇక్కడి డాక్టర్లు ప్రాణం మీదకు వస్తేగాని యాంటి బయాటిక్స్ ఇవ్వరు... మీ పరిస్థితి ఇబ్బందికరంగా అయిందీ అని వాళ్ళు అనుకుని మీకు యాంటి బయాటిక్స్ ఇచ్చిందే గానీ...ఇంకొటేం గాదు..
  5.చివ్వరి విషయం.... కాలు అయినా, కన్ను అయినా ఎదైనా ..ప్రతీదీ ముఖ్యమైనదే ...మీకు కాలుకి ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు కాలు గురించి చెప్పారు ...
  6.అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ...ఇవన్నీ నా అభిప్రాయాలు ...ఇవి ఎవరివి వారికుంటాయ్....అంచేత వీటిలో అంత బుర్ర బద్దలుకొట్టుకోవల్సిన అవసరం అస్సలు లేదు...
  మీరు ఈ విషయం గురించి అంత భయపడవలసిన అవసరం లేదు.. మీ కాలు చక్కగా మరో రెండ్రోజుల్లో "అక్కడికి" "ఆసభలకి" పరిగెడుతుంది ...డోంట్వర్రీ ....
  మీ అనుభవాలు అందరితో పంచుకున్నందుకు సర్వదా మీరు అభినందనీయులు ..

  ReplyDelete
 2. కాలికెందుకు గడ్డ అయ్యింది అన్నాయ్.. ఐతే గియితే... ఇంక వేరే దానికి కావాలి కాని... ఒహో ..కాలితో ఏమైనా వేశాలేశారా... దీన్ని యే ఇజం అనాలి. ?

  ReplyDelete
 3. Infection to legs may lead to gangrene as legs generally have less blood supply compared to other body parts limiting body self defense mechanism to act upon the wound through blood.So infection to toes,fingers must be dealt immediately as they may deteriorate to gangrene for which only treatment is amputation.

  ReplyDelete