అఖిల అమెరికా బ్లాగర్ల సభలు నిర్వహించుకుందామా?

హైద్రాబాద్ బ్లాగర్లందరూ తెలుగు నడకల్లోనో, పుస్తకాల షాపుల్లోనో ఎంచక్కా కలుస్తూ మనని కుళ్ళబొడుస్తున్నారు. లాభం లేదు. మనం కూడా కలవాలి - వారిని మండించాలి. అందుకే మనం అందరం ఒక వారాంతం కలుద్దాం - కబుర్లు చెప్పుకుందాం - కెలుక్కుందాం. ఏమంటారు? ఎక్కడ కలుద్దాం అంటారు? ఎవరెవరికి ఉత్సాహం వుంది? ఎక్కడ కలుద్దామంటారు? ఆ వారాంతం ఏమేం చేద్దామంటారు? మా ఇంట్లో ఏర్పాటు చెయ్యాలంటే మాది పెద్ద ఇల్లు కాదు. అయినా సరే ఏర్పాటు చేసినా నాకో కుటుంబం అంటూ వుంది కాబట్టి వారిని ఆ రెండు రోజులూ మరో చోట ఎడ్జస్ట్ చెయ్యాలి. ఎవరూ ముందుకు రాకపోతే ఆ పనే చేస్తాను అనుకోండి.

సరే ఎవరు ఏర్పాటు చెసినా వారి మీద భారం పడకుండా అన్ని ఖర్చుల నిమిత్తం తలా కొంత చందా వేసుకుందాం. శుక్రవారం రాత్రికి వచ్చేసి ఆదివారం మధ్యాహ్నమో, సాయంత్రమో అందరూ వెళ్ళగలగాలి. అలా అయితేనే ఓ రెండు రోజులన్నా ఎన్నో విధాలుగా కాలక్షేపం చెయ్యవచ్చును. ఆ కాలక్షేపాలన్నింటికీ చక్కటి వైవిధ్యమయిన ఎజెండా తయారు చేద్దాం. ఎవరికి ఏ విషయంలో ప్రావీణ్యం వుందో వారు ఆయా కళల్ని ప్రదర్శించేలాగా ఏర్పాట్లు చేద్దాం.

ఉదాహరణకు కొత్తపాళీ గారొచ్చారు అనుకోండి వారితో దుర్యోధనుడి ఏకపాత్రాభినయం వేయిద్దాం. అక్కడి వారే అయిన కాలాస్త్రి వస్తే వారికి నాటకాలంటే ఆసక్తి అనుకుంటా పాంచాలి వేషం వేయిద్దాం. రౌడీగారు వస్తే వారి సంగీతం పెట్టే తెచ్చుకోమ్మందాం - వాయిస్తారు. ఇహ నాకంటారూ - మిగతా కొన్ని కళలతో పాటుగా హిప్నటిజం మీద కాస్త ప్రావీణ్యం వుంది. మీమీద హిప్నటిజం ప్రయోగిస్తా! ఉదయం, మధ్యాహ్నం బ్లాగుల మీద బ్లాగోల మీద చర్చలూ, గోష్టులూ, రచ్చబండలూ నిర్వహించుకుందాం. సాయంత్రాలు మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుందాం. ఇలా ఇలా ఆ రెండు రోజులకు గాను ఎన్నో కార్యక్రమాలు ఆలోచిద్దాం. వేసవి లో అయితే అందరికీ రెక్కలొస్తాయి కాబట్టి స్పింగులోనో, స్ప్రింగులోగానో మనం మన మీటప్ నిర్వహించుకుంటే బావుంటుంది. ఆడ లేడీ బ్లాగర్లకు ప్రత్యేక బస ఏర్పాటు చేద్దాం - ఎవరయినా వస్తే - అంత సీను, ధైర్యం వారికి వున్నాయని అనుకోను. చూద్దాం మరి.

ఇవండీ నా ఆలోచనలు. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇది నిర్వహించడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పండి. ఎవరయినా స్వంత ఇల్లు, పెద్ద ఇల్లు వున్నవారు ముందుకు వస్తే సౌకర్యంగా వుంటుంది. అన్నట్లు మరి మన పార్టీలో సాయంత్రాలు మందు పార్టీ వుంటే బావుంటుందా లేదా అన్నదీ చెప్పండి. తాగి మనాళ్ళు కొట్లాడేసుకుంటారంటారా? వాడొస్తే నేను రాను, వీడొస్తే నేను రాను అనుకోకండి. మనం స్వయంగా వ్యక్తులని కలవక ఎన్నో చిటపటలు కానీ స్వయంగా కలిస్తే చాలా చిటపటలు చల్లారిపోతాయి అని నా గత కలయికలు తెలియజేసాయి.
ఎవరెవరు రావడానికి ఉత్సాహంగా వున్నారో, ఎక్కడివరకయితే రాగలుగుతారో చెప్పండి. నా వరకయితే చికాగోకి 10, 12 గంటల్ డ్రయివు వరకు ఓకే. అంతకంటే ఎక్కువయితే బాగా ఆలోచించాల్సివుంటుంది. ఉదాహరణకి చికాగోలో ఆ సమావేశం పెడితే ఎందరు ఎవరెవరు రాగలరో చెప్పండి. వ్యక్తిగత ద్వేషాలు మనస్సులో పెట్టుకొని నిరాసక్తి చెందకండి. అలాంటి ద్వేషాలు చల్లార్చి స్నేహ కుసుమాలు విరబూయడానికి ఇలాంటి కలయికలు ఉపయొగపడుతాయి. కాకపోతే కనీసం బ్లాగు ద్వేషాలు బ్లాగుల వరకే వుంచేసి వ్యక్తిగతంగా అయినా స్నేహంగా వుందాం. బహుశా బ్లాగర్లలో ఇలాంటి సమావేశం మొదటిది కనుక ఎక్కువమంది ఉత్సాహం చూపకపోవచ్చు, రాలేకపోవచ్చు. అయినాసరే, కొద్దిమందితో అయినా మొదలెట్టేద్దాం. ఈ సమావేశం కనీస మాత్రం సవ్యంగా జరిగితే ప్రతి ఏడాది జరిపేద్దాం. కొన్ని ఇతర సందర్భాల్లో బ్లాగర్లు ఒకటి రెండు రోజుల పాటు కలుసుకొని వున్నా కూడా పూర్తి స్థాయిలో ఇలా కలుసుకోవడం ఇదే మొదటిసారి అవుతుండవచ్చు.

13 comments:

 1. @అలాంటి ద్వేషాలు చల్లార్చి స్నేహ కుసుమాలు విరబూయడానికి ఇలాంటి కలయికలు ఉపయొగపడుతాయి...
  ...మీరన్నది నిజం...నిజమ్

  ReplyDelete
 2. ఎందుకు గురువు గారు, అంతా అయ్యాక ఇంటికి వెళ్ళాక తిన్న గారెలు కక్కిస్తా అని ఒక టపా వేస్కోడానికి కాకపోతే...
  ఈ మాత్రం పెద్ద మనుషుల మీటింగ్ కి సపరేట్ ప్లేస్ కావాలా ?..అసలు మీలో కొందరైనా అప్పుడో ఇపుడో చాట్ చేస్తారా ?

  ReplyDelete
 3. @ kvsv
  :)

  @ kaaya
  నేను ఎవరితో పెద్దగా చాట్ చెయ్యను కానీ కొందరితో మాత్రం ఈమెయిల్సూ, ఫోనులు నడుస్తుంటాయి. చాటింగులు, ఈమెయిళ్ళూ మళ్ళీ వ్రాతలే కదా. అలా కాకుండా అందరం సరదాగా ముఖాముఖీ కలుసుకోవాలనీ, కొత్త పరిచయాలు అవాలనీ.

  ReplyDelete
 4. శరత్ గారు,

  మీరు ఖాళీ గా వుండకుందా ఏదో ఒకటి మొదలు పెడతారు. నాకైతే ఈ దేశం లో దూరాభారాల వల్ల ఇలాంటివి పెద్దగా వర్క్ ఔట్ అవుతాయన్నా నమ్మకం లేదు.కాకపోతే... ఆ మీటింగ్ కి ముందు, ఆ తర్వాత మీరు వంద పోస్ట్ లు రాయటానికి మెటీరియల్ మాత్రం వుంటుంది.:-))

  అపార్ట్మెంట్ ల్లో వుండే మన లాంటి వాళ్ళం ఇలాంటివి నిర్వహించాలన్న ఆసక్తి వున్నా వెనకడుగు వేయక తప్పదు ఒక్కోసారి. యెనీ హొ, బెస్ట్ ఆఫ్ లక్.

  ReplyDelete
 5. ఉత్తగా కలుసుకోని కబుర్లేనా.... long term strategy ఎమన్నా ఉందా..ఏమొ బాబు నమ్మలేము.

  చెల్లి.

  ReplyDelete
 6. i never wrote a telugu blog, but am a regular follower of koodali and particularly your blog. i look forward for the updates of this meeting.

  ReplyDelete
 7. ఇలా రాయడం మోడెస్టీగా ఉండదు కాబట్టి, ఎంబరాసింగ్ గా ఉంది కానీ, నా ఇల్లు చాలా మందినే accomodate చేయగలదు. 5 bedrooms, 5 full baths, 5000 sqft. కానీ ఇప్పుడు చలి పేలిపోతోంది కాబట్టి,సమ్మర్ బెటరేమో. అప్పుడయితే ఫ్యామిలీ ఇండియా వెళ్ళిపోతున్నారు కూడా కాబట్టి ఇల్లు ఖాళీ.
  Let me know

  ReplyDelete
 8. Enti...

  rendu rojulu stay...

  Aadavallu raaru antunnavu.. emi sangathi..

  Enjoy chedhhmane...

  Baaga sketch geesaavu..

  ReplyDelete
 9. కుమార్,
  నలుగురు మనుషులకి (కరెక్టేనా) 5000 చదరపు అడుగులా? ఏం చేసుకుంటారండీ అంత ఇల్లు? హమ్మో హమ్మో!

  శరత్, హోస్టే అన్ని ఖర్చులూ భరిస్తే ఇలాంటి మీటింగ్ లు బాగుంటాయి. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు ప్రయాణం ఖర్చులు కాకుండా ఇంకా ఈవెంట్ ఖర్చులు కూడా భరించాలంటే వాళ్ళకి వర్కవుట్ కావొద్దూ?

  ReplyDelete
 10. @ కల్పన

  నిజమే :)) తెలుగు నడక గురించిన పోస్టులు మొన్ననే పూర్తి అయ్యాయి. ఇంకా ఇండియా ట్రిప్పులోని బ్లాగర్ల విశేషాల పోస్టులు ఇంకా రెండు మిగిలేవున్నాయి. నాకు దేని మీద మూడు (మనస్సు, తీరిక, ఓపిక) వుంటే దాని మీదే వ్రాస్తుంటాను కాబట్టి కొన్ని వ్రాయాలనుకున్న టపాలు ఆలస్యం అవుతున్నాయి.

  మరీ దూరంగా వుండేవారు కష్టమే గానీ 10,12 గంటల కారు డ్రైవు దూరంలో వుండేవారు ఇష్టమయితే ఆ మాత్రం కష్టపడి అయినా రావచ్చు. పెద్ద ఇల్లు వుంటే బావుంటుంది కానీ చిన్న ఇల్లు అయినా ఫర్వాలేదండీ. మనోళ్ళేమన్నా కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారా ఏంటీ? పాండవులు ఎంతమంది అంటే నాలుగు వేళ్ళు చూపించినట్లుగా వుంటుంది పరిస్థితి. చూసారుగా ఈ టపాకు వచ్చిన రెస్పాన్స్. ఇహ కొంతమందిని ఇంట్లో వేడుకకి పిలిచినట్లుగా బొట్టు పెట్టి పిలిస్తే కానీ రారేమో. కనీసం ముగ్గురు వచ్చినా చాలు - ఓ ముందడుగు ఈ విధంగా పడటానికి.

  ఇంట్లో వేడుక అంటే గుర్తుకు వచ్చింది. ఆగస్టులో ఓ వేడుక వుంది. పెద్దగా చెయ్యదలచుకుంటే మాత్రం US, కెనడా లో ప్రస్థుతం వుంటున్న బ్లాగాభిమానులందరినీ ఆహ్వానిస్తానేమో.

  ReplyDelete
 11. @ చెల్లి
  ఏ బంధాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరు ఊహించగలరు చెప్పండి ;)

  @ వేణు
  బ్లాగులు వ్రాసేవారే అనేమీ కాదు. బ్లాగాభిమానులు ఎవరయినా పాల్గొనవచ్చు. మీ ప్రాంతం చెప్పండి.

  @ కుమార్
  అనవసరంగా గొప్పలు చెప్పుకోవడం బావుండదు కానీ అవసరం అయినప్పుడు చెప్పకపోవడం కూడా బావుండదు. సంతోషం. అలాగే వేసవిలో ఏర్పాటు చేద్దాం. ఇంతకీ మీ ప్రాంతం చెప్పలేదు. మంచు అంటున్నారు కనుక స్నో బెల్ట్ - నార్త్ అయ్యుండొచ్చు. డెట్రాయిట్?

  ReplyDelete
 12. @ అజ్ఞాత
  అంత లేదు లేమ్మా. ఏదో బ్లాగ్సేవ కొద్దిగానయినా చేసి కొద్దిగానన్నా బ్లాగు పుణ్యం సంపాదిద్దామని అంతే. ఇలాంటి సమావేశాల పుణ్యం, పురుషార్ధం రెండూ కలిసివస్తాయి. ఆ పురుషార్ధాన్ని ద్వందార్ధంలో తీసుకునేరు - ఎదవగోల. బ్లాగోస్ఫియరుకి మన వంతు ఊతం ఇచ్చినట్లూ వుంటుంది - సరదాగా కలిసి కబుర్లు చెప్పుకున్నట్లూ వుంటుంది.

  @ సుజాత
  మీరు చెప్పింది వాస్తవమే. నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఎలాగూ మా వాళ్ళు (యు ఎస్ బ్లాగాభిమానులు) వరదలా వచ్చిపడేంత దృశ్యం లేదని అర్ధం అవుతూనే వుంది కనుక హోస్టుకు ఆ మాత్రం ఖర్చులు భరించడం అంత సమస్య కాదనుకుంటాను. మా ఇంట్లో ఏర్పాటు చెయ్యల్సివస్తే ఆ ఖర్చులు నేనే భరిస్తాను.

  ReplyDelete
 13. సుజాత గారు,
  నిజమే,నలుగురు మనుషులే :-), Infact వారంలో మూడు/నాలుగు రోజులు ఉండేది ముగ్గురే.
  ఈసారి క్రిస్ట్ మస్ కి పది రోజుల పాటు, ఇంట్లో 10adults, 5kids మొత్తం 15 మంది తో, సందడి సందడిగా చాలా హాపీగా ఉండింది.

  శరత్,
  నేనుండేది మీకు పది గంటలు సౌత్(600miles in KS ). ఖర్చులదేముంది లెండి, అది చివ్వరి ఐటం.

  KumarN

  ReplyDelete