మొహమాటానికి 'పోకపోతే' అది అయ్యింది నాకు!



ఇది నా యొక్క మరో షిట్ కథ. అప్పుడు ఏ ఏడో, ఎనిమిదో చదువుతున్నాననుకుంటాను. కొత్తగుడెం నుండి మా అమ్మా నాన్నలతో ఇల్లందు వెళుతూ మధ్యలో టేకులపల్లిలో ఆగాము. అక్కడ మాకు తెలిసిన వారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఓ రోజంతా వున్నాము. నాకు నంబర్ టూకి వచ్చినా కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఆ గది వైపు వెళదామన్నా ఆ ప్రాంతాల్లో ఏదో ఒక పనిమీద ఆ ఇంటివాళ్ళ అమ్మాయి కనపడసాగింది. ఆమెకూ దాదాపు నా వయస్సే వుంటుంది. ఆ అమ్మాయి చూస్తుండగా ఆ గదికి వెళ్ళాలంటే నాకు చాలా సిగ్గేసింది. అలా నంబర్ టూ గదికి ఆమె ముందే వెళితే నన్ను అసహ్యించుకుంటుందేమోనని సంశయం. అలాంటి సంశయం ఎందుకూ అని ఇప్పుడు మీ సంశయాలతో నన్ను చావగొట్టకండి! ఏమో మరి, ఎందుకోగానీ అలా చాలా సగ్గడిపోయాను ఆ పని చేయడానికి.

ఎలాగోలా ఒక రోజంతా పట్టుదలతో నిగ్రహించుకున్నాను. లెట్రిన్ గది ఎదురుగ్గానే కనపడి ఊరిస్తూనే వున్నా కూడా ససేమిరా ధైర్యం చెయ్యలేకపోయాను. మరి గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట వెళ్ళకపోయావా అని మీ అనుమానం కదూ. ఓరి మీ అనుమానం పెనుభూతం కానూ. రాత్రి పూట ఆ లెట్రిన్ పరిసరప్రాంతాల్లో ఆ అమ్మాయి లేకపోవచ్చు కానీ ఏ కొరివి దయ్యాలో వుంటే? దయ్యాలు లేవు అని నాకు తెలుసు కానీ ఆ దయ్యాలకు తెలియదు కదా. అందుకే దయ్యాలంటే నాకు చచ్చేంత భయంగా వుండేది. ఆ రకంగా వాళ్ళింట్లో ఆ పని చెయ్యకుండా నా పట్టుదలను నిరూపించుకున్నాను! ఆ అమ్మాయి ముందు పరుగు నిలబెట్టుకున్నాను?!

మరుసటి రోజు వారికి వీడ్కోలు చెప్పి బస్సులో ఇల్లందు బయల్దేరాం. కొద్దిదూరం వెళ్ళాక ఇక నిగ్రహించుకోవడం నా వల్ల అయ్యింది కాదు. కిటికీలోంచి పచ్చటి పొలాలూ, నీటి కాలువలు కనిపిస్తూ నా మతి పోగొడుతూ బహిర్భూమికై ఊరించసాగాయి. మరీ ఇప్పుడే దిగేద్దామంటే టికెట్ ఖర్చులు వృధా అయిపోతాయని అమ్మానానలు అంటారేమోనని కాసేపు ఉగ్గబట్టుకున్నాను కానీ ఎక్కవసేపు నన్ను నేను సముదాయించుకోలేకపోయాను. ఇహ లాభం లేదని ధైర్యే సాహసే బహిర్భూమి అని మా అమ్మనానల దగ్గర నా అవస్ఠ గురించి గొణిగాను. కొద్దిసేపట్లో ఇల్లందు వస్తుంది కదా అని ఊరడించారు కానీ నా వర్ణనాతీతమయిన అవస్థ గురించి వారికేం తెలుసు. బుద్ధిగా తలూపి మరు క్షణమే హృదయవిదారకంగా నా అవస్థ చెప్పాను. మరి వాళ్ళింట్లో వెళ్ళివుంటే బావుండేది కదా అన్నారు మా అమాయకులు. ఏం చెబుతాం? ఏమో అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు అర్జెంటు, బస్సు ఆపుతారా లేక ... అని బెదిరించాను. మా వాళ్ళు ఝడుసుకుని వెంఠనే బస్సు ఆపించారు. కండక్టరూ, మిగతా అమాయక ప్రయాణీకులు శానా అచ్చెరువొందారు. ఇంకో అరగంటలోనో, గంటలోనో ఇల్లెందు వచ్చేస్తుంది కదా, టికెట్ల డబ్బులు ఎందుకు వేస్టూ అని ఉచిత సలహాలు ఇచ్చేరు. వారిని నమిలి మింగేలా చూసేసి మా పేరేంట్స్ వైపు దీనంగా చూసాను.

మా వాడికి యమర్జెంటూ అని వారిని బుజ్జగించి నన్ను బస్సు దింపి వాళ్ళూ దిగారు. దిగడమే ఆలస్యం రాకెట్ స్పీడుతో రోడ్డు పక్కన పొలాలకి అడ్డం పడ్డాను. దూరంగా పంట పొలాల పనులు చేస్తున్న యువతులు కనపడుతున్నా కూడా ఖాతరు చెయ్యకుండా నా పని కానిచ్చేసాను. అప్పుడు పొందినంత సుఖం, రిలీఫ్ మళ్ళీ జన్మలో ఎప్పుడూ పొందలేదనుకుంటా. నామాట మీద నమ్మకం లేకపోతే మీరూ ఓ రోజంతా ప్రయత్నించి చూడండి మరి.

9 comments:

  1. Chaduvutunte navvu aapuko leka poyaanu.
    chala natural ga honest ga raasaru.. navvu nalugu vidala manchidi(heath point of view).
    Thanks for such a humorous one!

    ReplyDelete
  2. ఏందీ.... యింతోటి సాహస కార్యం మేంప్రయత్నించి చూడాలా.. మాకొద్దు నాయనా ఈ చాలెంజీలు.

    ReplyDelete
  3. ఇక్కడికొచ్చినంక అట్ల సిగ్గు పడ్తలేను అన్నాయ్... ఏమో ఇండియా లో ఉన్నప్పుడు అదేం రోగమో... దాదాపు అందరూ మొహమాట పడేవాళ్ళే .. అందరి మెదళ్ళూ ఇంతేనా ?

    ReplyDelete
  4. @ మధు
    :)

    @ పండు
    ఒక్కరోజే అన్నాను కదా, కానిద్దురూ :))

    @ కాయ
    మీరు కూడా మొహమాటపడేవారా! ఎక్కడయినా మొహమాట పడొచ్చుగానీ ఇక్కడ మాత్రం మొహమాట పడవద్దని నాకు ఆ రోజుతో బాగా తెలిసివచ్చింది.

    ReplyDelete
  5. ఒకటి రెండు సార్లు అనుభవం అయ్యక కూడా.... మూడోసారీ అదే కథ ...ఆ పిల్ల ముందు మన హీరోయిజం ఏమైతుందో.. అనే భయం .. సిగ్గు

    ReplyDelete
  6. తాచెడ్డ కో..వనమంత...
    అన్నట్టు అయ్యవారు చేసింది కాక ఉచిత సలహాలు కూడాను..

    ReplyDelete
  7. prapancham lo manassaanthi anedi toilet lone dorukuthundi kadaa...

    ReplyDelete
  8. @ మిర్చిబజ్జి
    నిజమే. అయితే కొన్నిసార్లు ఆ మాత్రం మానసిక ప్రశాంతత కూడ కుదరని సందర్భాలు వుంటయ్.

    ReplyDelete
  9. దీన్ని బట్టి తెలిసిన నీతి:సెక్స్ నీ కాలక్రుత్యాలను వెంటనే తీర్చేసుకోవాలని

    ReplyDelete