శుక్రవారం 30 ఎప్రిల్ 2010

పుస్తకం ప్రింటింగుకి

నా గే పుస్తకం ఈ సోమవారం నుండీ ప్రింటింగుకి వెళుతోంది. వారం పదిరోజులు పట్టొచ్చన్నారు ప్రింటర్స్. ఇక డిస్ట్రిబ్యూటరుని వెతుక్కోవాలి.  ఆ పుస్తకం అమ్మగల ధైర్యం వున్న బుక్ డిస్టిబ్యూటర్స్ ఎవరయినా వుంటే సూచించండి.   

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు కేవలం తమ పుస్తకాలనే డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేక ఇతరులవి కూడా చేస్తారా? 

దయ్యాలతో నా సహవాసం!

ఎవరయినా ఒంటరిగా ఈ సమయంలో ఈ భవనంలో పై అంతస్తుకి వెళ్ళి రాగలరా?

భువనగిరిలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న రోజులవి. ఒక దగ్గర రాత్రి ట్యూషన్లు చెబుతుండేవారు. అందులో పగలంతా ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. ఆ భవనం రెండు అంతస్తులు వుంటుంది. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. సైన్స్ ట్యూషన్ అయిపోయింది. మాస్టారు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూండగా టాపిక్ దయ్యాల మీదికి మళ్ళింది. అప్పుడు పై విధంగా మా సైన్స్ మాస్టారు సవాలు చేసారు.  ఒక్క విద్యార్ధి కానీ, విద్యార్ధిని కానీ ఆ సవాలుని స్వీకరించలేదు. నేను దయ్యాలను నమ్మను గానీ అవంటే చచ్చేంత భయ్యం.

ఎందుకు సారు అలా ఛాలెంజ్ చేస్తున్నారు? వెళితే ఏమవుతుంది అని నా పక్కనున్న అబ్బాయిని అడిగాను. రాత్రి పూట ఈ భవనంలో పై అంతస్తులో దయ్యాలు తిరుగుతుంటాయి అని చెప్పాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నిజ్జంగా అని అడిగాను నా కంగారు అణుచుకుంటూ. నిజమేనట, చాలా మందికి దయ్యాలు తిరుగున్నట్లుగా దాఖలాలు కనిపించాయిట. అందుకే ఈ భవనంలో రాత్రి ఎవ్వరూ ఒంటరిగా వుండరు అని చెప్పాడు.   కెవ్వ్ అనే కేకని బలవంతంగా అణుచుకున్నాను.    

ఇదంతా ఎన్ని ఏళ్ళనుండి జరుగుతుందేమిటి అని అడిగాను మనస్సు చిక్కబట్టుకుంటూ. దాదాపు ఏడెనిమిది ఏళ్ళనుండీ జరుగుతోందిట అన్నాడు వాడు. మరో సారి కెవ్వ్ ని ఆపేసాను. మరి అంతకుముందు ఏమయ్యిందట? అప్పుడు ఈ భవనం ప్రశస్తి దయ్యాలకి తెలియదటనా అని కంగారుగా అడిగాను. ఈ స్కూలు పెట్టకముందు ఈ భవనంలో కొత్త డాక్టర్లు ఎవరో వైద్యశాల పెట్టారనీ వాళ్ళు అనుభవం తెచ్చుకుంటున్న క్రమంలో కొంతమంది పేషెంట్లు టపా కట్టారనీ వాళ్ళే దయ్యాలయిపోయారనీ వివరించాడు.   మరోసారి కూడా నా కెవ్వుని బలవంతంగా అదిమివేసాను.    

ఇన్ని సార్లు నేను కెవ్వు కెవ్వు మనడానికి ఒక బలీయమయిన కారణం వుంది. అదేంటంటే ఆ భవనంలో ఒక రెండేళ్ళ క్రితం కొన్ని నెలలు గడిపాను! ఆ విషయం నా పక్కనున్న అబ్బాయికి తెలియదు. ఈ భవనంలో దయ్యాలున్నాయనే విషయం నాకు అప్పటివరకూ తెలియదు.  దయ్యాలున్నాయని తెలిస్తే ఆ భవనంలో చచ్చినా వుండేవాడిని కాదు. నన్ను మోసం చేసి, నిజాలు దాచి నన్ను ఆ భవనంలో ఒకరు వుంచారు. ఆ వ్యక్తికి నా భయాలు తెలిసీ నన్ను మభ్యపెట్టి ఆ భవనంలో ఎందుకు వుంచారో కనుక్కోవాలని స్ట్రాంగుగా డిసైడ్ అయ్యాను.

ఆ వ్యక్తి కూడా అక్కడే మరో సబ్జెక్టులో ట్యూషను చెబుతారు. క్లాసు నుండి బయటకి రాగానే వారు కలిసారు. ఇద్దరం కలిసి ఇంటి వైపు నడిచాము. అప్పుడు ప్రస్థావించాను ఈ విషయాన్ని. "నాన్నా, ఈ భవనంలో దయ్యాలు వున్నాయట కదా" అని అడిగాను
"అవును అలాంటి ప్రచారాలు వున్నాయి"
"మరి అప్పుడు మనం ఈ భవనంలో నివసించినప్పుడు ఎందుకు చెప్పలేదు?"
"చెబితే నువ్వు భయపడతావని చెప్పలేదు. అయినా దయ్యాలు అనేవి ఒక అభూత కల్పన. నీకు తెలుసుకదా"
నాకు తెలుసుగానీ దయ్యాలకు అవి లేవన్న విషయం తెలియదు కదా అని మనస్సులో అనుకున్నాను. "మరి ఈ భవనంలో దయ్యాలున్నాయని అందరూ ఎందుకనుకుంటున్నారు?"
"మనం వుండక ముందు చాలామంది ఇక్కడ కిరాయికి వుండేవారు. వారికి రాత్రి ఎవరో నడుస్తున్నట్లు, చెక్క మెట్ల మీద నడుస్తున్నట్లు కిర్రు కిర్రు శబ్దాలు అలా అలా ఏవేవో ధ్వనులు వినిపించేవిట. అందుకే అలా భయపడ్డారు" 
"మరి మనం వున్నప్పుడు ఆ శబ్దాలు వినిపించలేదా?"
"వినిపించాయి. కానీ నేను దయ్యాలని నమ్మను కాబట్టి భయపడే బదులు ఆ శబ్దాలు ఎక్కడినుండి వస్తున్నాయో పరిశీలించాను" అని మా నాన్నగారు అన్నారు
"మరి ఏం తేలింది?"
"ఈ భవనం పక్కనే బార్ వుందికదా. అందులో వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు వచ్చే రిసౌండే ఆ శబ్దాలు"
"మరి నాకెందుకు ఆ శబ్దాలు వినిపించలేదు"
"ఈ భవనంలో దయ్యాలు వున్నాయని నీకు తెలిసివుంటే నీకు కూడా ఆ శబ్దాలు వినిపించివుండేవి" అన్నారు మా నాన్నగారు నవ్వేస్తూ.   

మా నాన్నగారిని ఈ విషయం అడగడానికి రెండేళ్ళకు పూర్వం  నేను మా స్వగ్రామంలో చదువుకునేవాడిని. మా నాన్నగారు భువనగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూండేవారు. క్రింద ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. దయ్యాలకు భయపడి పైన ఖాళీగా వుంటుండటంతో, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మంచి మిత్రులు అవడంతో వారిని అడిగి మా నాన్నగారు అక్కడ నివసిస్తుండేవారు. అప్పుడు ఒక సారి మా నాన్నగారితో పాటు నేను కూడా భవనగిరికి వచ్చి కొన్ని నెలలు ఆ భవనంలో వున్నాను. ఆ తరువాత ఒక ఏడాదికి  మా అమ్మ , నేను కూడా భువనగిరి వచ్చి వేరే ఇల్లు తీసుకొని వుంటూ వచ్చాము. 

మరి ఇంత తెలిసాకనయినా ఆ భవనంలోని పై అంతస్తులోకి రాత్రి పూట ఒంటరిగా వెళ్ళాలనుకున్నానా? అంత దృశ్యం లేదు నాకు :(

గురువారం 29 ఎప్రిల్ 2010

బెల్జియంలో బురఖా బ్యాన్

బెల్జియం దిగువ సభ పబ్లిక్ ప్రదేశాలలలో బురఖాను వేసుకొని తిరగడన్ని నిషేధిస్తూ చట్టం ఆమోదించింది. వ్యక్తి యొక్క ముఖం చూడలేకపోవడం వల్ల భద్రతా పరమయిన సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, మహిళలను అణగద్రొక్కే విధానమనీ కారణాలు చూపి ఆ నిర్ణయం తీసుకున్నారు.   అలాంటి నిషేధమే అన్ని దేశాలతో సహా ఇండియాలో కూడా రావాలనీ, ముస్లిం మహిళలకూ స్వేఛ్ఛ వుండాలనీ కోరుకుంటున్నాను.

అలాగే మగవారికి అన్ని మతాలు ఒక్కటేననీ అన్ని మతాల స్త్రీల ముఖార విందాలను దర్శించే భాగ్యం మగవారికి వుండి తీరాలనీ సెలవిస్తున్నాను.  అంతకు కావాలంటే ఆడవారి చూపులు పడకుండా లేదా నాలాంటి మగవారి చూపులు పడకుండా మగ ముస్లిములు బురఖాలేసుకొని తిరగవచ్చనీ సూచిస్తున్నాను.   

 అయినా ఇదేం అన్యాయమండీ? మగాళ్ళను ఆడాళ్ళు ఎంచక్కా బురఖాలోంచి చూసెయ్యొచ్చు కానీ ఆడవారిని మగవాళ్ళు చూడకూడదా! ఇది ఆడ మగ సమానత్వం కాదు. నేనొప్పుకోను. వెంఠనే ఆడవారికి బురఖాలు ఎత్తెయ్యాలి లేకపోతే మగవారికి కూడా బురఖాలు దించెయ్యాలి. సమానత్వం జిందాబాద్.       

బుధవారం 28 ఎప్రిల్ 2010

మగ వేశ్యలు రారండోయ్!

ఒక్క ఆడవాళ్ళే వేశ్యా వృత్తి చేయాలా మరి మగ వాళ్ళు చేయకూడదా - ఇదేమి అసమానత - అందుకే వేశ్యా వృత్తిని నిషేధించాలని స్త్రీ సాధికారతా వాదులెవరో బ్లాగొంతెత్తి అరుస్తున్నారు. ఈ అసమానత్వ సమస్యకి ఒక పరిష్కారం వుంది. దానికి ముందుగా ఒక విషయం ఉదహరిస్తాను. 

చాలా ఏళ్ళ క్రితం ఒక కంపెనీలోని ఆడ కూలీలు సమ్మె చేసారు. మగ వారితో సమానంగా జీతాలు ఇవ్వట్లేదని వారియొక్క ఆందోళన. మూడు రోజులయ్యాక ఆ కంపెనీ వారు ఆ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆడ కూలీలు సమ్మె విరమించారు.  కొద్దిరోజుల తరువాత ఆడ కూలీల జీతానికి సమానంగా మగ కూలీల జీతం తగ్గిస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది!   

అదే విధంగా మగ వారు వేశ్యా వృత్తిలో లేరని అసలు వేశ్యా వృత్తినే రూపుమాపాలనుకోవడం మంచి పద్దతి కాదు. మరి సమానత్వం, సాధికారత ఎలా సాధించాలీ? దానికి వుందిగా ఒక పరిష్కారం! మగ వారిని స్పెషల్ డ్రైవులు ఏర్పాటు చేసి మరీ ఆ వృత్తిలోనికి ప్రోత్సహించాలి. అప్పుడు ఆడవారి మధ్య మగవారి మధ్య అసమానతలు తొలగుతాయి. మగవారు కూడా అదేపని చేస్తున్నారు కాబట్టి ఆడవారు/ఆడ వేశ్యలు ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరుగుతారు. ఎలా వుంది మన పరిష్కారం?  

ఆ మధ్య ఒక పెద్దల యాహూ గ్రూపు ఒకటి నిర్వహించేవాడిని. నా 'విశాల' భావాలు చూసి హైదరాబాదులోని ఒక మగ వేశ్య/ (వేశ్యుడు?)   ఒకరు ఆ గ్రూపులో చేరి తమ వృత్తి ప్రచారం మొదలెట్టాడు. ఎవరన్నా కస్టమర్లు వుంటే చెప్పన్నా అనేవాడు.   నాకే కస్టమర్లు లేరు ఇంకా నిన్ను ఎక్కడ రకమెండు చేస్తానులే బాబూ అనుకునేవాడిని :))  మీలాంటి గిట్టని వారు ఏదో ఫిర్యాదు ఇస్తే యాహూ వారు ఆ యాహూ అక్కవుంట్ క్లోజ్ చేయడంతో అలా ఆ గ్రూపుకి, అక్కడ అతగాడి వ్యాపార ప్రచారానికీ పుల్‌స్టాప్ పడింది.      

మనకి మగ వేశ్యలు కనపడనందువల్ల/తగులుకోనందువల్ల వాళ్ళు లేరనుకుంటే ఎలా?   కాకపోతే వారిది మైనారిటీ. వాళ్ళ మైనారిటీ హక్కులని రక్షిస్తూ వారిని వృద్ధిలోకి తీసుకువస్తూ మిగతా మగవాళ్ళనందరినీ ఆ వృత్తిలోనికి ప్రోత్సహించి సమానత్వం సాధించాలి గానీ అసలు వేశ్యా వృత్తికే తిలోదకాలు ఇవ్వాలంటే ఎలా? సమానత్వం సాధించే పద్ధతి అదేనా? మైనారిటీ మగ వేశ్యలకి అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలి. చదువులో, ఉద్యోగాల్లో, ఎన్నికల్లో  వారికి ప్రత్యేక కోటా వుండాలి. ఏదో తక్కువమంది వుంటారని చెప్పి ఆడ వేశ్యల ముందు మగ వేశ్యలని చిన్న చూపు చూడవద్దు. అవకాశాలు కూడా సమానంగా కల్పించాలి. అంటే ఒక మగ వేశ్యకి ఒక కస్టమర్/ప్యాసింజర్ దొరికేంతవరకు ఆడ వేశ్యల కస్టమర్లు వేచి వుండాలి లేదా ఆడ మగ తారతమ్యాలు ఎందుకు అనుకునే బై సెక్సువల్ మగ వేశ్యలని ప్రోత్సహించాలి. 

అప్పుడు మాత్రమే సమానత్వం, సౌభ్రాతృత్వం, సాధికారత మన సమాజంలో వెల్లివిరుస్తాయి. మీరేమంటారు బ్రదర్? 

గమనిక: ఇక్కడ మనం మాట్లాడుతున్నది వేశ్యావృత్తి మంచిదా కాదా లేక చట్టబద్దం చేయాలా వద్దా కాదు. ఆడ మగా సమానత్వం గురించి.

మంగళవారం 27 ఎప్రిల్ 2010

కెనడాలో లైంగిక విద్య

ఓంటారియో రాష్ట్రంలో ప్రతిపాదించబడి పలు నిరసనల వల్ల మళ్ళీ తిరిగి వ్రాయడానికై ఆగిపోయిన  పాఠ్యాంశాలలోని కొన్ని ముఖ్య విషయాలు:

ఆరోగ్యం మరియు శారీరక విద్య సబ్జెక్ట్ క్రింద ఇవి బోధించాలనుకున్నారు:
మొదటి తరగతి: శరీరంలోని ఇతర భాగాలకు తోడుగా జననాంగాలను కూడా ఏమంటారో తెలియజేస్తారు.
మూడవ తరగతి: హోమో సెక్సువాలీటీ అంటే ఏమిటి?
ఆరవ తరగతి: హస్త ప్రయోగం గురించి
ఏడవ తరగతి: ఓరల్ సెక్స్ మరియు అనల్ సెక్స్


మిగతా వివరాలకై ఈ క్రింది లింక్ చూడండి:


దానిమీద వ్యాఖ్యలకై ఈ క్రింది లింక్ చూడండి:

వా...:(( నా పుస్తకాన్ని ఇప్పటివరకూ ఒకే ఒక్కరు కొన్నారు!

హి హీ. అది నేనే. నా గే పుస్తకాన్ని లులు డాట్ కాం దగ్గర నేనే కొనుక్కున్నాను.  మామూలుగా కొత్త పుస్తకం తెరచినప్పుడు వచ్చే వాసన, ఆనందమే బావుంటుందంటే అదే కొత్త పుస్తకం మనం వ్రాసినదయితే ఆ అనుభూతి చెప్పలేము.  

లాభం లేదు నా గే ప్రస్థానం మీద సమీక్షలు ఎక్కడ వ్రాయాల్సొస్తుందో అని ఎవరూ కొనడానికి ధైర్యం చేయట్లేనట్లుంది.    అందుకే పథకం మార్చాను. నా పుస్తకం కొని చదివామని మీరు ధృవీకరిస్తే కొన్న మగవాళ్లకి ఒక బనీను ముక్క, ఆడవారికి ఒక జాకెటు ముక్క ఉచితంగా అందివ్వబడును.   త్వరపడండి మరి.

సోమవారం 26 ఎప్రిల్ 2010

'ఆట' ఆగితే ఆనందమే

నేను తెలుగు ప్రొగ్రామ్స్ పెద్దగా చూడను. ఆట ఒక రెండు సార్లు చూసివుంటాను. నాకు ప్రొగ్రాం కానీ, ఓంకార్ కానీ, అతని భాష కానీ, ప్రొగ్రాం నిర్వహించేతీరు కానీ ఏమాత్రం నచ్చలేదు. నేను ఎక్కువగా ఆ ప్రోగ్రాం చూడలేదు కాబట్టి ఆ పిల్లలు వేసినవి అసభ్య నృత్యాలో కావో నాకు తెలియదు కానీ పిల్లలమీద పనికిమాలిన వత్తిడి పెంచే కార్యక్రమాలు ఆగిపోవాలి.   పిల్లలకు సహజంగానే ఆసక్తి వుంటే మాత్రమే శాస్త్రీయ నృత్యమయినా, పాశ్చాత్య నృత్యమయినా నేర్పించాలి.  ఎలాగూ బడుల్లో పిల్లలకు బోలెడంత వత్తిడి వుంటుంది కాబట్టి తల్లితండ్రులు తమ అభిరుచులు అన్నీ పిల్లల మీద తీర్చుకుంటూ, అవీ ఇవీ నేర్పిస్తూ మరింత ఒత్తిడి పిల్లలకి కలగజేసే ధోరణి తొలగిపోవాలి.   పిల్లలకు నిజమయిన ఆసక్తి వున్న వాటికి వీలయినంతంగా మనం సహకరించాలి అని నా అభిప్రాయం.

ఆదివారం 25 ఎప్రిల్ 2010

ప్రపంచ వ్యాప్తంగా గే ట్రెండ్ ఇలా వుంది


స్వలింగ వివాహాలు ఈ క్రింది దేశాలు ఆమోదించాయి:
కెనడా, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, స్వీడన్, దక్షిణ ఆఫ్రికా మరియు కొన్ని ఇతర దేశాలు
ఈ దేశాలల్లో స్వలింగ సంపర్కాలకు మరణ శిక్ష:
ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్, మారిటానియా మరియు నైజీరియా , సూడాన్ లలోని కొన్ని ప్రాంతాలు.
ఈ క్రింది దేశాలలో స్వలింగ సంపర్కులపై నిబంధనలు సరళీకృతం అవుతున్నాయి:
చైనా, సింగపూర్, క్యూబా, నేపాల్

ఈ క్రింది దేశాలలో నిబంధనలు కఠినతరం అవుతున్నాయి.
బురుండీ, నైజీరియా, రష్యా, ఉగండా
 
యుఎస్ లో మసాచుసెట్స్, కెనెక్టికట్, ఐయోవా, వెర్మాంట్, న్యూ హాంప్షెయిర్ మరియు కొలంబియా జిల్లాలలో స్వలింగ వివాహాలకు ఆమోదం వుంది. అల్బేనియా దేశంలో గేల పట్ల వివక్ష చూపకుండా చట్టం వచ్చింది. ఇండియాలోని న్యూ ఢిల్లీలో స్వలింగ సంపర్కం మీద నిషేధాన్ని ఒక కోర్టు తిరస్కరించింది. నేపాలులో గే టూరిస్టులను ఆకర్షించేందుకు గాను ఈ ఏడాది స్వలింగ వివాహాలను చట్టబద్దం చేయనుంది. చైనాలో ప్రభుత్వపరంగా మొట్టమొదటి గే బార్ డిసెంబరులో మొదలయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 80 దేశాలలో స్వలింగ సంపర్కం చట్టవ్యతిరేకం. కనీసం ఏడు దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాలు ఇందుకు మరణ శిక్ష విధిస్తాయి.

`సోర్స్: హ్యూమన్ రైట్స్ వాచ్, ఇంటర్నేషనల్ గే అండ్ లెస్బియన్ రైట్స్ కమీషన్

శుక్రవారం 23 ఎప్రిల్ 2010

డామినో ఎఫెక్ట్

ఉదయం లంచ్ బాక్సులోకి చపాతీలు లేవు. అన్నం వుంది కానీ దానిని బాక్సు కట్టేంత ఓపిక, సమయం లేవు. మరి మీ ఆవిడ ఏం చేస్తోందీ అని తొట్టి ప్రశ్నలు అడక్కండి.    ఇవాళ ఆఫీసు కేఫిటేరియాలో తినక తప్పేట్లుగా లేదు అనుకొని ఆఫీసుకి వచ్చేసాను. లంచ్ టైముకి ఆఫీసు కేఫిటేరియాకి వెళదామనుకునేంతలో అది శుక్రవారం తెరచి వుండదని గుర్తుకు వచ్చింది. బయటకి వెళ్ళి తినేయాలని అర్ధమయ్యింది. బయటకి వెళ్ళేదెప్పుడూ తినేదెప్పుడూ, అది అరిగేదెప్పుడూ, నేను లంచ్ అవర్లో జిమ్ము కెళ్ళేదెప్పుడూ అని బెంగపడుతూ బయటకి వెళ్ళి ఫూట్‌లాంగ్ సబ్ మొత్తం తినేసాను.  అలా ఫుడ్డు ఫుల్లుగా లాగించి జిమ్ముకెళ్ళలేదే అని చింతిస్తూ మన్ను తిన్న పాములాగా నెట్టు బ్రవుజ్ చేస్తూ ఇలా ఇలా వ్రాస్తూ కాలక్షేపం చేస్తున్నాను.  

చూసారా ఇంట్లో ఒక్క రెడీమేడ్ చపాతీ లేకపోవడం వల్ల వచ్చిన కాస్కేడింగ్ ఎఫెక్ట్!   ఇంకా దీని సీక్వెన్స్ ప్రభావం ఇంకా వేటివేటి మీద పడుతుందో ఏమో ఈరోజు.  అందుకే ఎప్పుడూ అనుకుంటాను మొదటే జాగ్రత్త పడాలని కానీ అన్ని సార్లు సాధ్యం కాదనుకోండి. మరో సారి తెలిసివచ్చింది. మీకు కూడా చాలా సార్లు ఇలాంటి ఎఫెక్ట్ పడివుండొచ్చు కదూ. 

గే 'ప్రస్థానం' - 5000 పైసలు బహుమానం

నా గే పుస్తకాన్ని 'కొని' సమీక్ష వ్రాయండి. 5000 పైసలు బహుమతి గెలుచుకోండి. వచ్చిన సమీక్షల్లో అత్యుత్తమ సమీక్షకు మాత్రమే బహుమతి ఇవ్వబడుతుంది.  ఆలసించిన ఆశాభంగం. నేడే త్వరపడండి.

గురువారం 22 ఎప్రిల్ 2010

జల్లెడను, హారాన్నీ దాటేసిన మాలిక

మాలిక: Telugu Blogs

మాలిక అగ్రిగేటర్ http://maalika.org/  వచ్చిన తరువాత నా సైటుకి వస్తున్న హిట్స్ ట్రెండ్ పరిశీలిస్తూ వస్తున్నాను. గత కొద్దిరోజులుగా ఈ క్రింది విధమయిన ట్రెండ్ కనపడుతోంది.

ఈ బ్లాగుకి గత రోజు వచ్చిన హిట్స్ వివరాలు:


Top Traffic Sources

Sources
Visits
% visits
koodali.org (referral)
191 56.01%
maalika.org (referral)
56 16.42%
jalleda.com (referral)
27 7.92%
haaram.com (referral)
24 7.04%
(direct) ((none))
20 5.87%

బుధవారం 21 ఎప్రిల్ 2010

ఇండోర్ బ్లాగర్లూ - అవుట్డోర్ బ్లాగర్లూ!

మేము జంతు పరిరక్షణ శాల నుండి పిల్లిని పెంపకానికి తెచ్చుకున్నప్పుడల్లా పిల్లిని ఇంట్లోనే వుంచమనీ, బయటకి వదలొద్దనీ వారు సలహాలిస్తుంటారు. నేను అమాయకంగా ఎలానయితే భావ స్వేఛ్ఛను సమర్ధిస్తానో అలానే పిల్లి స్వేఛ్ఛను అక్కడ సమర్ధించినా నా భావాలు కొట్టిపారేస్తారు. ఇంటిలోపలే వుండే పిల్లి వల్ల ఈ క్రింది సమస్యలు వుండవు అని ఈ క్రింది విధంగా సెలవిస్తారు.
  1. Injury or death by vehicles
  2. Poisoned intentionally or accidentally
  3. Injury or death by fighting with other cats
  4. Infectious diseases contracted from other cats: FIP,FIV,FeLV,URIs
  5. Parasites: fleas, ticks, ringworm
  6. Injury or death by sadists
  7. Injury or death by dogs or predators
  8. Killing of wildlife by outdoor cats
  9. Getting lost, picked up by A/C
  10. Theft for sale as laboratory animals or "bait" for illicit gaming
  11. Problems with neighbors: cats littering their yards 
అవన్నీ చదివాక ఔరా ఇవన్నీ నిజమే కదా అనుకున్నా. ఇవే మన బ్లాగర్లకి కూడా వర్తిస్తాయని ప్రగాఢంగా నమ్ముతూ బ్లాగర్లందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎలాగూ ముందు నుండీ వైల్డ్ క్యాట్ లాంటి వాడినే కాబట్టి నాలాంటి వారు ఎలాగూ అవుట్ డోర్ బ్లాగర్లే అనుకోండి. అందుకే నాకు ఈ విషయాలు వర్తించవని మనవి చేసుకుంటున్నాను.    

మీ సౌకర్యం కోసం ఇప్పుడు ఒక్కొక్క పాయింటు వివరంగా చూద్దాం. అవుట్ డోర్ బ్లాగర్ మీరయితే :

1. నిరంకుశ బ్లాగు అగ్రిగేటర్ల యాజమాన్యం చేత మీ బ్లాగు తొలగింపబడవచ్చు
2. మీ బ్లాగుకి ఎవరయినా వైరస్ ఎక్కించేయవచ్చు
3. ఇతర బ్లాగర్లతో ముఖ్యంగా రౌడీ లాంటి వారితో గొడవ పడ్దప్పుడు మీ మనోభావాలు గాయపడవచ్చు. అప్పుడు 'యూ ఆర్ నాట్ వెల్కం హియర్!' అన్న బోర్డు బ్లాగులో పెట్టుకోవాల్సివస్తుంది.
4. బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాలు ఎక్కువయ్యి ఎయిడ్స్ రావచ్చు
5. సుఖ వ్యాధులూ రావచ్చు
6. శరత్తు లాంటి శాడిస్టు బ్లాగర్ల చేతిలో మీ బ్లాగు పడొచ్చు
7. కొన్ని విదేశీ శక్తుల ప్రభావం వల్ల మీ టెంప్లేట్ పనికి రాకుండా పోవచ్చు
8. మీకే ఆనందం ఎక్కువయ్యి ఇతర బ్లాగర్ల మనోభావాలను రక్కేయాలనిపించవచ్చు. 
9. బ్లాగు మాంత్రికుల చేతిలో పడి మీ బ్లాగు అదృశ్యం అవచ్చు
10. కెబ్లాస లాంటి వారు మీ బ్లాగుతో ఒక ఆట ఆడుకోవచ్చు. మీ బ్లాగుని బకరా బ్లాగుగా చేసుకొని ప్రయోగాలు చేయవచ్చు. 
11. మీకు పక్క వారి బ్లాగులో ... చేయాలనిపించవచ్చు. (డ్యాష్ మీరే పూరించుకోండి) 
ఇండోర్ బ్లాగరుగా వుంటే ఎన్ని లాభాలో అర్ధమయ్యింది కదా.  పై సమస్యలు ఏమీ మీకు రావు.  అసలు ఇండోర్ బ్లాగరంటే ఏంటో మీకు తెలిసివచ్చిందా లేదా? ఏ సంకలినిలోనూ తమ బ్లాగు రాకుండా జాగ్రత్త పడేవారే ఇండోర్ బ్లాగర్లు. అస్సలు బ్లాగు ఫీడే బయటకి రానీయకుండా, బ్లాగు అడ్రస్సు ఎవరికీ చెప్పకుండా తమ బ్లాగుని తాము మాత్రమే చదివి మురిసిపోయే బ్లాగర్లే నిజమయిన ఇండోర్ బ్లాగర్లు. వారికి నా వందనాలు!    

క్షుద్ర మాంత్రికులకు ఆహ్వానం!

బ్లాగుల్లోకి అన్ని వర్గాలవారూ వచ్చారు. సైన్సుని అసహ్యించుకునే తిరోగమన, సనాతనవాదులూ, బ్లాగు బాబాలూ, జ్యోతిష వేత్తలూ, వాస్తు వేత్తలూ విచ్చేశారు. ఒక వైపు శాస్త్ర విజ్ఞానాన్ని చులకన చేస్తూ మరో వైపు సైన్సు ఫలాలయిన ఇంటర్నెట్టూ, బ్లాగులూ వాడేసుకుంటూ వస్తుంటారు. అదేమంటే శాస్త్ర విజ్ఞానమూ, ఇంటర్నెట్టూ మీ ఒక్కరిదేనా అంటారు. తప్పులేదు. ఇంటర్నెట్టు ఏ ఒక్కరి సొత్తో కాదు. అందరూ ఉపయోగించవచ్చు.  

మన తెలుగు సంకలినులకు కూడా చాలా విశాల భావాలే వున్నాయి. పెద్దల విజ్ఞానాన్ని అందించే  బ్లాగులనయితే అనుమతించరు కానీ మూఢనమ్మకాలు, చాదస్తాలూ, మను ధర్మాలూ బోధించేవారికి మంచి పట్టమే కడతారు. తప్పు లేదు. భావ స్వేఛ్ఛ వుండాలి కదా. అందుకే బ్లాగులోకంలోకి క్షుద్ర మాంత్రికులను కూడా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు ఎంచక్కా బ్లాగుల్లో క్షుద్ర వ్యాపారం చేసుకోవచ్చు, ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. ఎవరయినా వద్దంటారా? ఎవ్వరూ వద్దనరు. అందరూ వారిని సమర్ధిస్తారు. భావ స్వేఛ్ఛ అందరికీ వుండాలి కదా. అయినా వాళ్ళు చేసే తప్పేంటి? తమ భావాలు, తమ వ్యాపారం తాము ప్రకటించుకుంటారు. వారు వ్యక్తిగతంగా చాలా మంచి వారు అయివుండవచ్చు. గౌరవనీయమయిన వృత్తుల్లోనూ వుండివుండవచ్చు. అలాంటి వారి బ్లాగులని నిరసించడం తప్పు తప్పు అంటారు.   

 నిజమే కదా. చేతబడులు చేయడం, మంత్రాలతో ఇతరులని చంపుతాననడం వారి వృత్తి కాబట్టి తప్పు పట్టలేమని మన బ్లాగర్లంటారు. ఆ చేతబడులూ, శ్మశాన కార్యక్రమాలు వగైరాలు వారికి భుక్తికి మార్గం కనుక వద్దనలేము అంటారు. ఇంకా ఆసక్తిగా తమ తమ శత్రువుల కాలి గోర్లూ, వెంట్రుకలు ఏ అడ్రస్సుకి పంపాలో తెలియజేయమని అడుగుతారు.  

చేతబడులు, నరబలులూ, నగ్న పూజలూ చేసేది సమాజ శ్రేయస్సు కోసం కనుక మేమేమీ డబ్బు ఆశించమని కావాలంటే మీరే స్వయంగా ఉదారంగా ఆ తంత్రాలకు అవసరమయ్యే యంత్రాలను సమర్పించుకోవచ్చని బ్లాగు మాంత్రికులు సెలవిస్తారు. మన బ్లాగు భక్తులు పరమోత్సాహంతో ఆ తాంత్రిక పూజలకు కావాల్సిన అమ్మాయిలనూ, బలులకు కావాల్సిన అబ్బాయిలనూ ఎక్కడికి సరఫరా చేయాలో తెలియజేయండని విన్నవించుకుంటారు. తప్పులేదు. మనకు బూతు అంటెనే విరక్తి కానీ బలులంటే విరక్తి ఏముంది. బ్లాగర్లతో సహా, సంకలినులు కూడా ఈ చక్కటి, చిక్కటి బ్లాగు ట్రెండు చూసి ముచ్చట పడుతాయి. ఈ బ్లాగులని ఉత్తమ బ్లాగులుగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు.    

ఆ తరువాత ట్రెండు మరింత ముందుకు వెళుతుంది. ఫలానా 'బాకు' బ్లాగర్ వెంట్రుక ఎలాగయినా పీకి తెస్తాం. ఏమన్నా పని జరుగుతుందా అని అనామకులు కూపీ లాగుతారు. లేకపోతే అమాయక క్షుద్ర బ్లాగర్ల మీద అవాకులూ చెవాకులూ పేలుతున్న శరత్తు కాలి గోరు ఎలా సంపాదించాలని బ్లాగు మాత్రికులు శరత్తు ఇంటిముందు రెక్కీ చేసినా చేస్తారు.    

అప్పుడు ఏకలింగం 'బ్లాగుబడులు చేద్దాం రండి' అని వ్యంగ్యంగా ఎప్పటినుండో వేయాలనుకుంటున్న టపా వేసినా వేస్తాడు. ఆనంద క్షుద్రాయణం అని కొందరు బ్లాగు పెద్దలు దీవించినా దీవిస్తారు.    పొరపాటున ఏ హేట్ వాదికో, పైత్యవాదికో ప్రమాదం అయితే, అనారోగ్యం అయితే అది మా బ్లాగు ఘనతే అని క్షుద్ర బ్లాగర్లు బ్లాగ్ముఖంగా మురిసినా మురుస్తారు, బ్లాగు హిట్స్ పెంచినా పెంచుతారు. ఒక పైత్య వాది ఇంట్లొ ప్రహ్లాదుడు పెరుగుతున్నాడన్నట్లే ఒకరి ఇంటి పెరట్లో దార్కా మాటువేసివున్నాడని సమాజ కల్యాణం కోసం యాగాలు చేసే పరమ భక్త బ్లాగర్లు సెలవిచ్చినా ఇస్తారు. 

అందుకే క్షుద్ర మాంత్రికులు బ్లాగుల్లో ఎంటర్ కావడానికి ఇదే తగిన సమయమని అంటాను. మంచి తరుణం మించిన దొరకదు. రండి బాబో రండి. మాకు క్షుద్రానందం కలిగించండి. 

తులసీ దళం నవల లోని టెక్నిక్ వాడి నన్ను శరతానందగా మార్చాలని రౌడీ భయంకరమయిన కుట్రలు చేస్తున్నాడు.  ఎక్కడ రౌడీ గారి వెంట్రుక?  

మంగళవారం 20 ఎప్రిల్ 2010

బలవంతపు బ్లాగు బ్రహ్మచర్యం


నా ఆత్మాభిమానానికి ఎక్కడా పెద్దగా సవాళ్ళు ఎదురుకావు ఒకవేళ ఎదురుపడినా నా అత్మాబిమానం ముందు మరేదీ లెక్కచేయకుండానే నెట్టుకొస్తున్నాను కానీ...కూడలి, జల్లెడల ముందు మాత్రం చతికిలపడిపోయాను. అవి సాంప్రదాయకపు బ్లాగులు కావడంతో, స్వాతి లాంటి సకుటుంబ పత్రికలలో వచ్చేటటువంటి విషయాలు వ్రాసినా బ్లాగు పిల్లలు హడలి ఛస్తారు కాబట్టి  అలాంటి బ్లాగులు వేసుకోము, టపా మీరితే తోక కోస్తామంటారు కాబట్టి కాస్త వళ్ళు దగ్గరపెట్టుకొని శరత్కాలం బ్లాగులో వ్రాస్తూ వస్తున్నాను. కాస్త జూలు విదిల్చినప్పుడు సి బి రావు గారు లాంటి నా బ్లాగు శ్రేయోభిలాషులు హెచ్చరిస్తూ నన్ను తగ్గిస్తూవస్తున్నారు. 

ఇలా బ్లాగుల్లో నాకు నచ్చినట్టు వ్రాసుకోకుండా సంకలినుల షరతులకి లోబడి నా భావ స్వేచ్చను అదిమి పెట్టుకొని బలవంతంగా బ్లాగు బ్రహ్మచర్యం పాటిస్తూ  రోజులు నెట్టుకొస్తున్నాను. ఈలోగా అడపాదడపా రసజ్ఞ బ్లాగులో వ్రాస్తూనేవున్నాను కానీ అది హారంలో మాత్రమే రావడంతో అలా వచ్చే హిట్స్. తిట్స్ ఎక్కువగా వుండవు.   మనలో విషయం వుంటే సంకలినులు అవసరమా అని కొందరంటారు కానీ సంకలినులలో రాకపోతే జనాలకి ఫోకస్ పోతుందనేది నా నమ్మకం. ఉదాహరణకు కొత్తపాళి గారివి, అరుణ పప్పు గారివి సంకలినులలో రావడం లేదు కదా. స్వయంగా నేను వారి బ్లాగులకి వెళ్ళి చూసి చదివే సందర్భాలు తక్కువే. అలా కాకుండా అగ్రిగేటర్లలో కనపడితేనే నాకు చదవడానికి ఈజీగా వుంటుంది.  అందుచేత సంకలినులను తూచ్ అనేంత దృశ్యం మనకు లేక అనువు కానప్పుడు అధికులమనరాదు కదా అణిగిమణిగి వ్రాస్తూ వస్తున్నాను.

అత్మాభిమానం, భావ స్వేఛ్చ ముఖ్యమా లేక ప్రజాదరణ ముఖ్యమా అన్న రంధిలో మొత్తమీద నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కూడలి, జల్లెడలలో నిభాయించుకువస్తున్నాను. కూడలి, జల్లెడలు ప్రైవేటు వ్యక్తులవి కాబట్టి ఎక్కువగా విమర్శించలేము. కావాలంటే నువ్వే ఓ అగ్రిగేటర్ పెట్టేస్కో అంటారు. అలా నేను ప్రయత్నించీ  చతికిల పడ్డాను. ఎవరికి ఏది నచ్చకపోయినా విమర్శించకూడదు, స్వంతంగా పెట్టేసుకోవాలి అంటే మనం ఒక దినపత్రికనూ, ఛానాల్నూ, సినిమా హాలునూ వగైరాలనూ పెట్టేసుకోవాలి లేకపోతే ఉన్న వాటినే తిట్టేసుకుంటూ చూస్తూపోవాలి కదా. అందుకే  అలా మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమయినా, కష్టమయినా అలా అలా ఇప్పటివరకూ ఆయా సంకలినులల్లో వుంటూ వస్తున్నాను. అలాంటి ఇరుకు సంకలినులల్లో మనగలడం ఇబ్బందే అయినా అది మన గరుజు కాబట్టి భరించకతప్పలేదు.    

హారంకు తోడుగా ఇప్పుడు మాలిక సంకలిని కూడా వచ్చింది కాబట్టి నాకు, నాలోని భావావేశానికీ కొద్దిగా ఆశలు రెక్కల్లా విచ్చుకున్నాయి. అలా అని పూర్తిగా కూడలి, జల్లెడలలోనుండి వైదొలుగుతానని కాదు గానీ కొంతకాలం పాటు ప్రయోగాత్మకంగా వాటిల్లో నా బ్లాగును అసెంబ్లీలాగా సుప్తచేతనావస్థలోనో, సుషుప్తావస్తలోనో (inactive) వుంచేయమని త్వరలో కోరి నా శరత్ కాలం బ్లాగులో నాదైన పద్ధతిలో వ్రాస్తూపోవాలని, మా ఉద్యమ గళం కూడా అందరికీ వినిపించాలని, మా హక్కులు కూడా అందరూ గుర్తెరగాలని ఆశిస్తున్నాను. హారంకి వలనే మాలికలో కూడా భావ ప్రకటనా స్వేఛ్ఛ ఎక్కువంటున్నారు కాబట్టి మనకు ఇబ్బందులు ఎదురుకావనే ఆశిద్దాం.  అయితే ఈ బ్లాగులో రసజ్ఞ అంత ఘాటుగా విషయాలు వుండవని తెలియజేసుకుంటున్నాను. మడిగట్టుకొని వున్నవారు మడిగట్టుకొని వున్న అగ్రిగేటర్లని చూస్తారు కానీ మనం మాత్రం ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషనుని, వైవిధ్యాన్ని, వివిధ హక్కులని ప్రోత్సహించే సంకలినులని ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం వుంది.  

బుధవారం 14 ఎప్రిల్ 2010

హమ్మయ్య ఆ పుస్తకం పూర్తయ్యింది.

మరీ అంత గొప్ప విలువలతో ఆ పూస్తకాన్ని కూర్చకపోయినా ప్రధమ ప్రయత్నంగా మొత్తం మీద పని కానిచ్చి పోతి డాట్ కాం www.pothi.com లో పెట్టేసాను. ఆ వివరాలు నా అడల్ట్ బ్లాగులో టపాగా ఇచ్చాను. పోతి నుండి ఎవరికయినా ఆసక్తి వుంటే కొనుక్కోవచ్చు. గూగుల్ యాడ్ వర్డ్స్ సహకారంతో గూగుల్ ప్రకటనల్లో కూడా నా పుస్తకం దర్శనమిస్తుంది. ఆ పుస్తకం పోతిలో అలా వుండగా అసలైన పబ్లిషర్ల కోసం ఇక వేట సాగిస్తాను.   

ఇక ఆ పుస్తకం సంగతి అలా వుండగా ఇక అంతర్ముఖి పుస్తకం పని పడతాను. ఆ పుస్తకములో అదనపు ఆకర్షణగా మా పెద్ద పాప గీసిన అనైం ఆర్టు చిత్రాలు టాపిక్కు తగ్గట్టుగా మరియు కవర్ పేజీ మీద పొందు పరచాలనేది నా ప్రయత్నం. 

శుక్రవారం 9 ఎప్రిల్ 2010

నాతో తోత తావాలి!

అవతార్ సినిమాలో నవిలకు తోకలెందుకు పెట్టారూ అని దర్శకుడు కేమరూనిని అడిగితే తోకలకు వున్న ప్రాముఖ్యత పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారెవరికయినా అర్ధమయిపోతుంది అన్నారుట. అలాగే నాకూ మా పోకిరి పిల్లి యువరాజావారిని దత్తత తీసుకున్నదగ్గరినుండీ అర్ధం అవసాగింది.  అవతారం సినిమా చూసాక తోకల్ని శ్రద్ధగా పరిశీలించే గుణం అబ్బటంతో మా పిల్లిగారు మా ఇంట చేరిన దగ్గరినుండీ ఆ తోకగారి యొక్క చిత్ర, విచిత్ర విన్యాసాలను కళ్ళారా వీక్షిస్తూవస్తున్నాను.  

అబ్బో దానితో మా యువరాజావారు ఎన్ని హొయలు వలికిస్తారూ? మగ పిల్లి అయ్యింది కాబట్టి ఇంకా బాగా వయ్యారాలు పోవడంలేదేమోనని నాకో డవుటు. వారు తమ తోకగారితో ఎన్నెన్ని విన్యాసాలు, ఎన్నెన్ని మెలికలు, ఎన్నెన్ని పొజిషన్లు, ఎన్నెన్ని, ఎన్నెన్ని!! ఆ తోకనే చూస్తూ అబ్బురపడుతూ బ్లాగులు రాయడం మానివేసి దేశసేవకి పుల్‌స్టాప్ పెట్టాలనిపిస్తుంది కానీ నా అభిమానులు ఊరుకోరు (పనికి వెళ్ళకపోతే మా ఆవిడా ఊరుకోదు) కాబట్టి కదలాల్సివస్తోంది.  

అస్సలే మగతోకవారు కదా. మళ్ళీ యువరాజావారాయే. అబ్బో ఏం రాచఠీవి, ఏం రాచఠీవి. ఏమి హుందాతనం, ఏమి దర్పం! బ్రిటన్ ముసలి యువరాజు ఛార్లెస్ లాగా కాకుండా మా యువరాజు మళ్ళీ వయస్సులో వున్న కుర్రాడాయే. వారెలా చురుగ్గా చంగుచంగున గంతులేస్తారో వారి తోకగారు కూడా వారితో పోటీ పడుతూ కదులుతూవుంటారు. 

తోకగారి కష్టాలు: అప్పుడప్పుడు అత్యుత్సాహంతో అస్మదీయులెవరో, తస్మదీయులెవరో మరిచిపోయి మా ఆవిడ పడుకున్నప్పుడు వారియొక్క తోక అలా అలా అలవోకగా మా రాణిగారి ముఖం మీద విశ్రాంతికి ఇచ్చినప్పుడు మాత్రం మా యువరాజావారి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అర సెకనులో వెయ్యోవంతులో మాహావేగంతో వారెక్కడికో విసిరివేయబడుతారు. నాకేమయ్యిందబ్బా, నేనెక్కడున్నానబ్బా అని యువరాజావారు తమ తోకని ప్రశ్నార్ధకం లాగా పైకెత్తి పెట్టి తత్వ విచారం చేస్తుండటం కద్దు.      

వారి తోకకి ఇంకా చిన్న చిన్న కష్టాలు వున్నాయిలెండి. మా ఇంటి అద్దాలలోనుండి ఉడుతలో, తొండలో బయట చెట్ల క్రింద చూసినప్పుడు తోకని అలెర్టుగా పెట్టి ఎటాక్ పొజిషన్లో వుండిపోతుంది కానీ ఏం లాభం వారు ఇండోర్ యువరాజావారాయే. తమ తోక పప్పులుడక్క కళ్లతొ మాత్రమే వాటిని వేటాడాగలిగి తోకవాల్చేసి నాలుక తడుపుకుంటూ మ్యావ్ అంటూ మూలుగుతుంది.

ఇలా తోకని పరిశీలిస్తుంటే కలుగుతున్న పరవశంతో నాకు కొన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి తోకలని ఊప్స్ తోక వున్న ప్రతి జంతువు తోకలని పరిశీలిస్తూపోయి దానిమీద ఒక ఉద్గ్రంధం వ్రాస్తే ఎలా వుంటుందని!  మీరు 'కొని' చదువుతానని హామీ ఇస్తే సీరియస్సుగా ఆలోచిస్తా! లోకంలో ఎన్నో హాబీలు వున్నాయి. ఇలా తోకాధ్యయనం కూడా ఒక హాబీగా ఎందుకు వుండకూడదు? కొంపదీసి ఆల్రెడీ ఇది హాబీగా వుందా? దానికో పేరు కూడా వుందా? పేరు గనుక లేకపోతే మనమే ఓ పేరు పెట్టేద్దాం. అలా మన పేరు తోక శాస్త్రంలో చిరస్థాయిగా వుండిపోతుంది. జంతు పరిశీలనలో భాగంగా జంతు శాస్త్రజ్ఞులు వాటి తోకలని కూడా అధ్యయనం చేస్తారు కానీ అలా సైంటిఫిక్ పనుల కోసం కాకుండా సరదాగా తోకలను పరిశీలించే హాబీ ఏదయినా వుందా అన్నది నా ప్రశ్న. మీకు నా అంత ఆనందం లేకపోయినా ఈ టపా చదివిన స్ఫూర్తితో దగ్గర్లో వున్న తోకల్ని ఓ చూపు చూడండి. గమనిక: మనుష్యులకు తోకలు వుండవు.   

 ఇలా తోకలు వున్న వున్న జంతువులను చూస్తుంటే నాకు కుళ్ళుగా వుంది. జంతువుగా నయినా పుట్టకపోతిని అని విచారంగా వుంది. నాకే గనుక తోక వుంటే ఎన్నెన్ని పనులు చేసేవాడినో ఆ తోకతో. ప్చ్. నన్ను మనిషిగా పుట్టించి పాపం చేసాడు మీ దేవుడు. తోకేగనుక వుంటే చెట్టుకి ఆ తోకతో తల క్రిందులుగా వ్రేలాడుతూ టపాలు వ్రాస్తుంటే వుంటుందీ..మజా. మాటలతొ చెప్పలేననుకోండి...తోకేగనుక వుంటే వ్రాతలతో చెప్పేవాడిని. నాకే గనుక ఫ్యూచర్లో మీ దేవుడెప్పుడయినా ప్రత్యక్షమయ్యి 'నీకేం కావాలో ఒక్కటే వరం కోరుకో శరత్తూ' అని అడిగితే ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యి మాటలు సరిగ్గా రాక ముద్ద ముద్దగా పలుకుతూ ఇలా అంటాను. 'నాతో తోత తావాలి స్వామీ'      
 

గురువారం 8 ఎప్రిల్ 2010

ఫలానా పుస్తకం 175 పేజీలు తయారయ్యింది

నేను ఆ మధ్య ఫలానా విషయం గురించి ఫలానా పుస్తకం ప్రచురించాలనుకుంటున్నట్లు చెప్పి పక్కన పడేసాను కదా.  ఆ పుస్తకం పూర్తి అయ్యింది. ఇప్పటికి 175 పేజీల డ్రాఫ్ట్ పూర్తి అయ్యింది. అయ్యింది. కేవలం ఆ ఒక్క దానిగురించే అంటే మరీ చిన్న పుస్తకం అయిపోతుందని ఇంకా కొంత మసాలా విషయాలు కూడా కలిపివేసాను. ఇంకా మరికొన్ని ముందూ వెనుకా హంగులు కలిపి చివరికి దాదాపుగా 200 పేజీలు అవచ్చు.

రేపటి నుండీ ఆ పుస్తకం ఎడిటింగ్ పనుల్లో వుంటాను. సంతృప్తికరంగా వచ్చాక ఇద్దరు, ముగ్గురు బ్లాగర్ల రివ్యూ కోసం పంపిస్తాను. వారి సూచనలకు తగ్గట్టుగా అవసరమయిన మార్పులు చేసి  పబ్లిషర్లను సంప్రదిస్తాను. అప్పట్లో ఒక పబ్లిషర్ ఆసక్తి చూపించారు గానీ ఈ పుస్తకంలో అదనంగా చేర్చిన హంగుల వల్ల వాళ్లకు అంత ఆసక్తి, ధైర్యం వుండకపోవచ్చు.

ఈ పుస్తకం నా స్వంత డబ్బులతో ముద్రించుకోవాలనుకున్నా పబ్లిషరుకి గట్స్ వుండాలి.  ఇందులో వివాదాస్పదమయిన ఆంశాలున్నాయి కాబట్టి ముద్రించడానికి అందరూ సాహసించకపోవచ్చు. మీకు తెలిసిన ధైర్యం వున్న పబ్లిషర్లు ఎవరయినా వుంటే సూచించండి. 

పిల్లినా? పెళ్ళామా?

నిన్న సాయంత్రం మా ఆవిడ గారు మా పిల్లి యువరాజావారి గురించి 'నేను ఇంట్లో వుండాలా లేక పిల్లి ఇంట్లో వుండాలా?" అని నన్ను తేల్చుకోమని గాఠ్ఠిగా వార్నింగ్ ఇచ్చారు!    మా యువరాజా వారిమీద ఏమాత్రం గౌరవం లేకుండా మా రాణిగారు వారిని పిల్లి అని సంబోధించడంతో మా మనస్సు చివుక్కుమన్నది అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 

సంసారం గట్రా విషయాలను పక్కకు బెడితే మనం పిల్లిని పెంచుకోవడం ఉత్తమమా లేక పెళ్ళాన్ని పెంచుకోవడం ఉత్తమమా అన్నది నిన్నటినుండి తొలుస్తున్న నా ధర్మ సందేహం! మీరేమంటారూ?

గమనిక: నా బ్లాగులు మా ఆవిడ చూడదు లెండి. మీరు నిస్సంకోచంగా వ్యాఖ్యలు వేయవచ్చును :)   

బుధవారం 7 ఎప్రిల్ 2010

3D లో నీలి చిత్రాలెప్పుడు?

అవతార్ - 2 సినిమా 4డి లో వుంటుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు 4డి లో కొన్ని లఘు చిత్రాలను చూసాను కానీ 3డి + 4డి లో చిత్రాలు వున్నాయో లేవో తెలియదు కానీ నేనయితే చూడలేదు. కేవలం 4డి చూడటం కన్నా 3డి + 4డి కలిపి చూస్తే ఆ అనుభూతి/(అనుభవం?) సూపరనుకుంటా. 4డి సినిమాలు కొన్ని చూసినా ఒక అనుభూతి మాత్రం గుర్తుండిపోయింది. డిస్నీల్యాండులో కీటకాల గురించి ఒక ఇరవై నిమిషాల 4డి చిత్రం చూసాము. చిత్రం పూర్తి అయ్యాక ఆ కీటకాలు అన్నీ వాటి స్థలాలకి వెళ్ళాలి కాబట్టి కొద్దిసేపు అలాగే కూర్చోమన్నారు. తరువాతేమయ్యింది అని ఇప్పుడే చెబితే మీరెప్పుడన్నా ఆ షో చూస్తే వచ్చే గొప్ప అనుభూతి పోతుందేమో.   

ఇక 3డిలో, ఐమాక్స్ 3డిలో ఇప్పటివరకు మనం అడ్వెంచర్ సినిమాలనీ, ఏనిమేషన్ సినిమాలనీ చూసాము కదా. ఇవాళే చదివాను  - హర్రర్ సినిమాలు కూడా 3డిలో తీస్తున్నారంట. సంతోషం కానీ నేను మాత్రం చూడకపోవచ్చు. ఆయా సినిమాల్లోని భయం కొంతవరకు ఇష్టమేఅయినా ఆ సినిమాల్లో వుంటే జగుప్సాకరమయిన దృశ్యాలు అంటే నాకు అయిష్టం. మీకు హర్రర్ సినిమాలు ఇష్టం అయితే ఇక అవి 3డిలో చూస్తే పండగే అనుకుంటా. 

ఇక అసలు విషయానికి వద్దాం. ఒకవైపు 4డి లో పూర్తి స్థాయి సినిమాల నిర్మాణం గురించి ప్రయత్నాలు జరుగుతుంటే నీలి చిత్రాలు ఇంకా 2డి లోనే వుంటూ పోవడం నాలాంటి వాడికి అసంతృప్తి కలిగించే విషయమే. అలాంటి  3D ఆలోచన అయినా ఎవరయినా చేస్తున్నట్లు లీలామాత్రంగానయినా, గుసగుసలయినా వినపడటం లేదు :( మీదగ్గర ఏమయినా సమాచారం వుంటే ఇక్కడ తెలియజేయండి - సంతోషిద్దాం.  శృంగార సినిమాలు కూడా 3డిలో రావాలనీ, వాటినీ ఐమాక్స్ థియేటర్లలో ప్రదర్శించాలనీ డిమాండ్ చేస్తున్నాను :) డిమాండ్ చేయడం మినహా మనమేం చెయ్యగలం? స్వంతంగా అలాంటి సినిమాలు తీసేంత సీను మనకు లేదు కదా మరి.

ఈ టపా వ్రాసిన తరువాత నాకు 4డి సినిమా అంటె సరి అయిన అవగాహన వుందా, అసలు నేనప్పుడయినా 4డి సినిమా చూసానా అన్న సందేహం వస్తోంది. సినిమా చూస్తూ వుంటే మనం కూర్చున్న సీటు కూడా సినిమాలోని సన్నివేశానికి తగ్గట్టుగా కదులుతుంది. అలాగే మరికొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ వుంటాయి. అలాంటి చిత్రాలని 4డి అనుకుంటున్నా కానీ అది వాస్తవం కాకపోవచ్చు.         

మంగళవారం 6 ఎప్రిల్ 2010

మా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు!

నా డెంటల్ ఫ్లాసింగు గురించి కాదులెండి. గత వారాంతం మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే వాళ్లని 'విలేజులో వినాయకుడు' సినిమా చూసారా అని అడిగాను. చూడలేదు, ఏం అన్నారు. అందులో మా బ్లాగర్ ఫ్రెండ్ నటించారు. అందుకే ఆ సినిమా చూడాలని డివిడి తెచ్చుకున్నా అని పొరపాటున చెప్పాను. అప్పుడు అందుకున్నారు. ఎప్పుడూ ఆ ఫ్రెండు నటించాడు, ఈ ఫ్రెండ్ నటించాడు అని మీరు మాకు చెప్పుకోవడమేనా? మేము అలా చెప్పుకోవద్దా. మా పరువులు పోతున్నాయి. మీరు వెంటనే ఏదయినా సినిమాలో నటిస్తే మీ గురించి కూడా మా స్నేహితులకి చెప్పుకుంటాము కదా! అని అందరూ కలిసి దులిపారు.

అసలే చిరుతాగుబోతును. అనగా అప్పుడప్పుడు మాత్రమే అదీ కొద్దిగా మాత్రమే తాగి ఆర్గాజం తెచ్చుకునే టైపు మనది. ఒక పెగ్గు మీద వున్నానప్పటికి. వాళ్ళు ఆ రకంగా అంటూ నన్ను తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్ధం కాక ముసిముసినవ్వులు రువ్వుతూండిపోయాను.  ఎవరన్నా అర్జంటుగా నాక్కూడా సినిమా ఛాన్స్ ఇప్పించేయండబ్బా.  మరీ హీరో పాత్ర వద్దులే కానీ కామెడీ రోలో, క్యారెక్టర్ రోలో ఇస్తే వేసుకొని తన్మయత్వం చెందుతాను.

ఆ సినిమాలో బ్లాగర్ రవిగారు నటించారని తెలిసి ఎలాగయినా ఆ సినిమా చూడాలని మా ఆవిడ ఆ సినిమా వద్దంటున్నా పట్టుబట్టి డివిడి తెచ్చుకున్నాను కానీ ఏం లాభం? శనివారం ఫస్ట్ షోగా మా ఇంట్లో వేద్దామంటే అబ్బే అది వద్దు లీడర్ చూద్దామని మా ఆవిడ. నన్ను నా సినిమా పెట్టుకోనివ్వలేదు. పోనీ ఆదివారం చూద్దామంటే వల్ల కాదంటూ ఏ మాయ చేసావె పెట్టేసారు. ఏం చేస్తాను. వచ్చే వారాంతానికయినా ఆ సినిమా చూడాలని కంకణం కట్టుకున్నాను. వచ్చే వారాంతం విలేజిలో వినాయకుండు సినిమా ప్రాప్తిరస్తు అని అందరూ దీవించేయండి మరి. ఆ సినిమాలో రవి గారు ఏ పాత్ర వేసారు, ఎలా వేసారు, సినిమా కథ ఏంటి, ట్విస్టులేంటి అని పైత్యతరంగం వారి మాదిరిగా అంతా నాకు చెప్పేయకండి మరి.  

సోమవారం 5 ఎప్రిల్ 2010

అందరూ నన్ను తిట్టండి ప్లీజ్!

ప్రతి ఒక్కరూ తమ తమ మానసిక ఆరోగ్యం బావుండటం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. యోగానో, పూజనో, హిప్నటిజమో లేక మెడిటేషనో లేకపోతే కత్తిలాంటి  కవిత్వమో లేక ఇంకేదన్నానో చేస్తుంటారు. నా మానసిక ఆరోగ్యం బావుండటం కోసం మెంటల్ ఫ్లాసింగ్ చేస్తుంటాను. అలా చేసేటప్పుడు బయటపడేవే నా టపాలు! 

సరే, మెంటల్ ఫ్లాస్ (Mental Floss) సంగతి పక్కకు వుంచేద్దాం. ఈ వారంలో నాకు డెంటల్ పరీక్ష వుంది - బెదురుగా వుంది. వా :((  అంటే నా పళ్ళు పీకుతారో లేదా డబ్బులు పీకుతారో అనే భయం కాదులెండి. తిట్లు పడతాయేమోనని. మనం కస్టమర్లము కాబట్టి గట్టిగా తిట్టాలని అనిపించినా డెంటల్ హైజినిస్టులు అంత గట్టిగా తిట్టలేరు కాబట్టి తిట్టీతిట్టనట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతారు! ఒరే డెంటల్ ఫ్లాస్ చేసుకోరా రోజుకి రెండు సార్లు అని నేను ఈ దేశాల్లో అడుగుపెట్టినప్పటి నుండీ నాకు చెబుతూనేవున్నారు. నామీద జాలిపడి ఒరేయ్ ఒక్కసారన్నా పడుకునేముందు ఫ్లాసింగు చేసి పడుకోరా అని బ్రతిమలాడుతూనేవున్నారు.  

ఈ మొండిఘటం వింటేనా? ఊహు. మనం పళ్ళని తోమడమే ఎక్కువ, సమాజ సేవ. ఇంకా ఓ దారం లాంటిది పట్టుకొని పళ్ళ సందున ఎక్కడెక్కడో ఏం కష్టపడతాము చెప్పండి? అసలే మనకు రాచ కార్యాలు ఎక్కువ కదా. దానికి తోడు ఈమధ్య పైత్యతరంగాన్ని సంస్కరించే పనిలో కూడా పడ్డాను కదా. ఇంకా మనకు తీరికెక్కడ ఏడుస్తుంది చెప్పండి?   దానికి తోడు ఓ పిల్లి ప్రిన్సుకూడా తెచ్చుకున్నాము కదా. 

మొత్తం మీద ఈ డెంటల్ వాళ్ల సణుగుడు భరించలేక మొహమాటం కొద్దీ అడపాదడపా ఫ్లాసింగ్ చేసినా దానిని కంటిన్యూ చేయడం మనవల్ల అయ్యింది కాదు. క్రితం సారి ఆరు నెలల క్రితం నా పళ్ళు తోమినప్పుడు మరింత శ్రద్ధగా ఫ్లాసింగు - దానివలన ఉపయోగములు అని మరింతగా లెక్చరు ఇచ్చారు. నేను బుద్ధిగా తలఊపి రాజకీయనాయకుడి లెవల్లో మీ కోరిక తప్పకుండా తీరుస్తానిన్నూ, తప్పకుండా ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు చేస్తాననిన్నూ హామీ ఇచ్చి వచ్చేసాను. మరి హైజినిస్టు కళ్ళళ్ళొ ఆనందం చూడాలి కదా. అందుకే. ఆ హైజినిస్టు కాస్త చూడటానికి బావుందనుకోండి - మనం ఎదురు చెప్పలేము కదా - తల గంగిరెద్దులా ఊపి - తిట్ల లాంటి ఉద్భోదలు ఆనందంగా అనుభవించీ వచ్చేస్తాము కదా.

గత ఆరునెలలనుండీ ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు గురించి ఆలోచిస్తూనేవున్నాను కానీ ఫ్లాసింగు అనుభవించడం నా వల్ల అయ్యింది కాదు. ఏంటో కత్తిగారిలా నాకూ ప్రతిదాన్నీ అనుభవించేయడం అలవాటయిపోయింది. మన్నించండి. ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేసుకుంటున్నట్లు ఫాంటసీలే గానీ ఒక్కనాడన్న వాస్తవంగా దానిని అనుభవించినవాడిని కాకపోతిని.

ఇప్పుడేమో తొమ్మిదో తారెఖున డెంటల్ క్లీనింగ్. మన నోరు తెరిచి పళ్ళు ఇకిలించగానే మన పరిస్థితి  ఏంటో , పళ్ళ సందుల్లోని పాచి ఎంతుందో అవతలవాళ్ళకి అనగా హైజినిస్టుకి అర్ధమవుతుంది. ఎలాగా చెప్మా? ఈ దంత మూర్ఖుడికి బుద్ధి ఎలా రావాలి చెప్మా! అందుకే మీరందరూ నన్ను తిట్టండి. మంచి అవకాశం మించిన దొరకదు మీకు! అలా అయినా నాకు బుద్ధి వస్తుందేమో చూద్దామేం. అలా అని అవకాశమిచ్చానని మరీ బూతులు తిట్టేయకండి ప్లీజ్. అసలే సున్నితమయిన హృదయం నాది - భరించలేను. మీరు అంతగా తిడితే మళ్ళీ బ్లాగ్ముఖంగా మెంటల్ ఫ్లాసింగు చేసేస్కుంటాను ఏమనుకున్నారో!! 

ఎవరికి వాళ్ళే తిట్టుకొని వాళ్ల మూర్ఖత్వం వదిలించుకోవాలి లేకపోతే ఇంట్లోవాళ్లతో తిట్టించుకోవాలి కానీ ఇలా బయటివారిని బ్లాగుల్లో అడుక్కొని తిట్టించుకుంటే బుద్ధి వస్తుందా అని అంటారా? నేను ఆశావాదిని. మీలాక్కాదు. మార్పు ఎక్కడయినా మొదలవ్వొచ్చు. ఎవరినుండయినా సరే - ఒఖ్ఖ తిట్టు ఒక పన్నునే మార్చేయవచ్చు  - ఎవరు చెప్పగలరు? ఇంక సందేహించకుండా మీరూ తిట్లు లంకించుకోండి. ప్లీజ్.    

మీరు తిట్లు తిడుతూనేవుండండి - నేను అనుభవిస్తూ వుంటాను. వాహ్ తిట్లు! 

ఆదివారం 4 ఎప్రిల్ 2010

నవతరంగం వాళ్ళు నా IPని బ్లాక్ చేసారా :))

నాకు ఇలా మెసేజ్ వస్తోంది. దీని భావమేమి తిరుమలేశా? నా ఒక్కడికే ఆ సైటు ఏక్సెస్ కావడం లేదా మీ అందరికి కూడానా?

The website declined to show this webpage

This error (HTTP 403 Forbidden) means that Internet Explorer was able to connect to the website, but it does not have permission to view the webpage.

ఆ వ్యాస రచయిత వెంకట్ ఉప్పలూరి క్షమాపణలు చెప్పారు కనుక వారికి ఆ టపాలో ఈ క్రింది వ్యాఖ్య వేద్దామనుకున్నాను కానీ ఆ సైటు నాకు ఏక్సెస్ కావడంలేదు. ఏ కజకిస్తానులో వున్నట్లో మరో IP వాడాలేమో ఖర్మై :(       బాబ్బాబు మీకు గనుక ఆ సైటు ఏక్సెస్ అయితే ఆ టపాలో గానీ, ఆ సైటులోగానీ నా గురించి ఏమయినా చెమక్కులు మెరుస్తూవుంటే గనుక తెలియజేయండి.


@ ఉప్పలూరి

ధన్యవాదాలు. వీలయితే ఇవాళే పిల్లలతో కలిసి ఈ సినిమా చూడటానికి వెళతాను. మీ సమీక్ష చదివిన దగ్గరినుండీ కథ తెలిసిపోయిందే అన్న అసంతృప్తి వున్నా మీరు చెప్పిన ఇతర విషయాల వల్ల ఈ సినిమా చూడాలని బాగా ఆసక్తి కలిగి ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. సినిమా చూసాక పిల్లలకూ, నాకూ ఎలా అనిపించిందో ఇక్కడే తెలియజేస్తాను. ఈ సినిమా గొప్పదనం గురించి మా ఆవిడకీ మీరు చెప్పింది చెప్పాను గానీ తలకెక్కలేదు. అందువల్ల సతీ సమేతంగా ఈ సినిమాకి వెళ్ళలేకపోవచ్చు. ఇకపోతే మా పోకిరి (మా పిల్లబ్బాయి అనగా పిల్లి అబ్బాయి) ని కూడా తీసుకువెళ్ళాలని వుంది కానీ థియేటర్ వాళ్ళు పెట్సుని అనుమతించరనుకుంటా.

శుక్రవారం 2 ఎప్రిల్ 2010

కర్చీఫ్ క్యాటగిరీ!

నేను యువకుడిగా వున్నప్పుడు మా మిత్రులతో కలిసి కనిపించిన ఆడవాళ్లని క్యాటగిరీలుగా విభజించి కామెంట్లు చేసుకునేవారం (వాళ్ళకి వినపడకుండానే లెండి). శరీరం బావుండి ముఖం ఛండాలంగా వున్న ఆడాళ్ళు కర్చీఫ్ క్యాటగిరీ అన్నమాట!

సినిమాకి మంచి కథే ప్రాణం అనాల్సిన అభిరుచి(!) కలిగిన బ్లాగు సినీ మేధావులు సినిమాలో కథే పట్టించుకోవద్దని కత్తిలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో నాకు పై విషయం గుర్తుకు వచ్చి ఫక్కున నవ్వు వచ్చింది. ఇంకా నయ్యం కథకి కథే అవసరం లేదు, కవితలో కవిత్వమే అవసరం లేదు అని వక్కాణించారు కాదు.  పోనీ సినిమాకి కనీసం మాటలయినా అవసరమా లేక సినిమాలని గుడ్లప్పగించి అనుభవిస్తూపోవాలా? ఓ కొత్త సినిమాకి ఆ జంట సినీ మేధావులు కలిసి మాటలు వ్రాసారంట.  ఆ సినిమా  విడుదల అయితే గియితే కనుక మరి కథ సంగతేమో గానీ కనీసం మాటలన్నా వుంటాయో లేకపోతే సినిమాకు వెళ్ళి అనుభవించి సినీస్ఖలించాలో(స్వప్నస్ఖలనం లాగా) మరి!   సినిమా కథ మీద, మాటల మీద విశ్వాసం లేకుండానే మాటలు వ్రాసిపడేసిన సినిమా మరి ఎలావుంటుందో ఆసక్తికరమే. ఆ మాటంటే పుష్పక విమానం సినిమా లేదా, ఛార్లీ ఛాప్లిన్ లాంటి మూకీ సినిమాలు లేవా -  మాటలు లేకుండానే ఆయా సినిమాలు హిట్టు కాలేదా అందుకే సినిమాలకి మాటలవసరం లేదని మరో స్టేట్మెంట్ ఇస్తారేమో తెలియదు.  

నాకు తెలిసి ఒక రకం సినిమాలలోనే కథ, మాటలు, సాకేతిక నైపుణ్యం, కెమెరా తదితరాలు పట్టించుకోరు జనాలు. అవి బూతు సినిమాలు, బ్లూ సినిమాలు. ఆయా సినిమాలను అనుభవించడానికి మాత్రమే చూస్తారు కనుక వేరే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఆ బూతు సినిమాలలో కూడా కథ, నిర్మాణపు విలువలు వుంటే ఆ సినిమాలు ఇంకా రంజుగా వుండి ఇంకా బాగా అనుభవించడానికి వీలవుతుంది.  

మంచి సినిమాకి మంచి కథే ప్రాణం అన్న విషయం తెలియడానికి మనం సినీ మేధావులమే కానక్కరలేదు - కామన్ సెన్స్ వుంటే చాలు.   ప్రతి దానికీ మినహాయింపులు వున్నట్లుగా కొన్ని కథ సరిగ్గాలేని సినిమాలు కూడా వివిధ కారణాల వలన విజయాలు సాధిస్తుంటాయి. విజయం సాధించినంత మాత్రాన అన్నీ మంచి సినిమాలు అయిపోవు. 

గురువారం 1 ఎప్రిల్ 2010

navapirates.com

నేను కూడా మిగతా అన్ని సేవలతో పాటుగా సినీసేవ చేయాలని ఇవాళే, ఇప్పుడే తీర్మానించుకున్నాను. ఏం సినీ సేవ ఒఖ్ఖ నవతరంగం వారే చెయ్యాలని రూలు వుందా? లేదు కదా. అందుకే సినీ కళామతల్లికి నేను కూడా ఒక్క సమిధనై (కాగడానై అందామనుకున్నా కానీ వద్దులెండి. ఎదవగోల) నన్ను నేను ఆహుతి ఇవ్వదలుచుకున్నాను.  

సేవ చెయ్యాలనుకోవడం వీజీనే గానీ ఎలా చెయ్యాలో ఈజీగా అర్ధం అయ్యి చావలేదు. నవతరంగా వారినే స్ఫూర్తిగా తీసుకొని వారికంటే మరో మెట్టు పైనే సేవచేయాలని కంకణం కట్టుకున్నాను. మరి నవతరంగంలో వారిలో వున్న గొప్ప ప్రత్యేకత ఏంటీ అని తలంతా బరుక్కొని ఆలోచిస్తే ఒక విషయం తేలింది. వాళ్ళు ఎంచక్కా తాజాగా విడుదలయిన సినిమా కథలన్నీ ట్విస్టులతో విప్పి చెప్పేస్తుంటారు. అదేమని అడిగితే పబ్లిక్ డిమాండు. పబ్లిక్ కథలడుగుతున్నారు కాబట్టి మేము కథలు అందిస్తున్నాము - అలా సినిమా తల్లికి షేవ చేస్తున్నాం అంటున్నారు. అయినా సినిమాలని అనుభవించాలి కానీ కథ కోసం ఎవరయినా సినిమాకి వెళతారా అని కత్తిలాంటి న్యూ సినీ మేధావులు అంటున్నారు. అయినా ఎన్ని కొత్త సినిమా కథలు తేటతెల్లం చేసినా మీ సేవలతో మేము పోటీపడగలమా చెప్పండి అని వెంకట్ సవినయంగా తెలియజేసుకుంటున్నారు.   హి హీ.. వివరాలకు ఈ క్రింది లంకె చూడండి:

ఇక సినిమాలో సస్పెన్స్ శాతం ఎంత వుందో కూడా నవతరంగం వారే తేల్చేసి సస్పెన్స్ వుంటే బోడి సస్పెన్స్ అని వారికివారే తేల్చేసి కథ గుట్టువిప్పుతారు. సస్పెన్స్ లేకపోతేనేమో సస్పెన్సే లేదు కదా అంది కథ తేటతెల్లం చేస్తారు. అది చెడ్డ సినిమా మీరందరు చూడొద్దని మీ అందరి జేబులో డబ్బుల బాగుకోసం కథ చెప్పేస్తున్నా అంటారు. మంచి సినిమా అయితేనేమో ఇక్కడ కథ చదివి అక్కడ సినిమా హాలులో అనుభవించమంటారు. అన్ని అనేది వాళ్ళే. మనం వారేం వ్రాసినా చదువుతూ కూర్చోవాలి. ఏమన్నా ఇలా అంటే మా సైటు మా ఇష్టం అంటారేమో తెలియదు. సినిమాలు కూడా ఆయా డైరెక్టర్ల, నిర్మాతల ఇష్టం. మరి మీరెందుకు వ్రాసుకోవడం?   

సినిమాని అనుభవించగానే సరిపోద్దా? స్ఖలించొద్దా? అందుకే నవతరంగం స్ఫూర్తిగా నేను నా పద్ధతిలో సినీ షేవ చెయ్యాలనుకుంటున్నాను. అదేంటంటే నవతరంగం రీడర్సు సినిమా కథలు చెప్పమని డిమాండ్ చేస్తున్నారట. చెప్పకపోతే తిడుతున్నారంట కదా. ఆ లెఖ్ఖన పైరేటెడ్ కాపీలు ఉచితంగా అందించట్లేదనే క్రోధం కూడా ఆ మహాశయుల్లో వుంటుండొచ్చు. వారి మనోభావాలు ఇబ్బందిపడకుండా ప్రతి సినిమా రిలీజ్ కాగానే ఉచితంగా ఆ సినిమా పైరేటెడ్ కాపీలు సినిమా అభిమానుల ఇంటింటికీ పంపుదామని కంకణం కట్టుకున్నాను.   ఎలా వుందండీ నా సినీకళాసేవాలోచన? నా ఆలోచన నచ్చితే కామెంటు ద్వారా మీకు ఏ సినిమా పైరేటెడ్ కాపీ కావాలో తెలియపరిస్తే మీకు తప్పకుండా పంపిస్తాను. లేకపోతే మా www.navapirates.com సైటుని అయినా సంప్రదించవచ్చును. ఆ కాపీ చూసి అనుభవిస్తారో లేక మనస్ఖలిస్తారో లేకపోతే దేన్నయినా పట్టుకొని క్రింద పొర్లుతారో  లేక  ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం.   

గమనిక: నా ఆలోచన నిజ్జం అనుకొని పోలీసోళ్ళకి ఫిర్యాదు చేయకండి!  ఇది ఏప్రిల్ ఫూలు టపా!! 

ఎం బి ఎస్ ప్రసాద్ - ఎం ఎఫ్ హుస్సేన్

గ్రేట్ ఆంధ్రాలో ఎం ఎఫ్ హుస్సేన్ గురించి ఎం బి ఎస్ ప్రసాద్ ఒక సిరీస్ మొదలెట్టారు. ఆసక్తి వున్నవారు చదవచ్చు.   


http://telugu.greatandhra.com/mbs/political/hussain_part1.php