మార్జాల మలం

పిల్లులు: మేమొక పిల్లి రాజావారిని తెచ్చుకున్నమని, వారికి 'పోక్ (పోకిరి)' అన్న పేరు పెట్టేసుకున్నామన్న శుభవార్త మీకు తెలిసే వుంటుంది. మల విసర్జన విషయంలో, మూత్ర విసర్జన విషయంలో పిల్లులకు వున్న శ్రద్ధ, పరిశుభ్రత చూస్తే ముచ్చటేస్తుంది. ఇసుకలాంటి ప్రదేశాన్ని తవ్వి అందులో విసర్జించి పైన మట్టిని కానీ, ఇసుకని కానీ కప్పివేస్తాయి. ఇంట్లో ఇసుక, మట్టి వుండదు కాబట్టి ఇక్కడివారు సాధారణంగా అందుకోసం ప్రత్యేకంగా లిట్టరునూ, లిట్టర్ బాక్సునూ ఏర్పాటుచేస్తారు. మేమూ అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసాము.   మనుషులెవరన్నా ఆరుబయలు మలవిసర్జనకు గానీ, మూత్ర విసర్జనకు గానీ వెళ్ళినప్పుడు అంత జాగ్రత్త పడుతారా?  మనది మనం శుభ్రపరచుకోవడమే ఎక్కువనుకుంటారు - సమాజ సేవ అనుకుంటారు! 

గాడిదలు: సూర్యాపేటలో వున్నప్పుడు ఒకసారి పనిలేక తీరికగా గాడిదలని పరిశీలించాను. ఒక చోట గుంపుగా గాడిదలున్నాయి. ఒకటి రోడ్డు పక్కగా మూత్ర విసర్జన చేసింది. దాని పని అయిన తరువాత వెనకే ఇంకో గాడిద వచ్చి అంతకుముందు గాడిద మూత్ర విసర్జన చేసిన స్థానంలోనే అది కూడా పోసింది. దాని వెనకే ఆ మందలో వున్న మరొక గాడిద కూడా సరిగ్గా అదే స్థానంలో విసర్జన చేసింది. అలా ఆ గుంపులోని అన్ని గాడిదలూ అలాగే విసర్జించాయి. అలా అన్ని గాడిదలకూ ఒక్క సారే ఎలా మూత్రం వస్తుందబ్బా అని ఆశ్చర్యపోయాను. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమయినా వుందా అని బుర్ర గోక్కున్నాను. 

కుందేళ్ళు: కెనడాలోని నయగరా ఫాల్సులో నివసిస్తున్నప్పుడు రెండు కుందేళ్ళని పెంపకానికి తెచ్చుకున్నాము. వాటికి లిట్టర్ బాక్స్ ట్రైనింగు ఇవ్వడం మా వల్ల అయ్యింది కాదు. వాటికి లిట్టర్ బాక్సులోనే మల మూత్ర విసర్జన చేసేలా శిక్షణ ఇవ్వడం కష్టమయిన విషయమేనని నెట్టులో తెలుసుకుని నెత్తీ నోరూ కొట్టుకున్నాను కూడా. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేసిపారేసేవి. కాస్త నయమేమిటంటే అది తడిగా వుండక గుండ్రంగా గోళీల్లాగున వుండేవి. ఇంట్లో ఎక్కడెక్కడో ఆ గోళీలు పెట్టేవి. ఆ గోళీలను వెతికి వేటాడలేక నాకు ఆయాసం వచ్చేది. మొత్తం మీద ఎంత శుభ్రం చేసినా, ఎన్ని శుభ్రం చేసినా అక్కడో ఇక్కడో కొన్ని గొతికలు కనపడకుండా మిగిలిపోయేవి. ఆ గొతికల వల్లనే ఏమో మా పెద్దమ్మాయికి వంటి నిండా స్కిన్ ఎలెర్జీ కూడా వచ్చేసింది. వాటి మల బద్ధకాన్ని భరించలేక హ్యూమేన్ సొసయిటీకి వాటిని ఇచ్చివేసి దులిపివేసుకున్నాము.  మేము ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు బేస్మెంటు ఖాళీ చేస్తుండగా కూడా ఆ మలగోళీలు సామానుల వెనుకాల చాలానే కనిపించాయి. మొత్తం మీద ఇకముందెప్పుడూ ఇంటిలోపల కుందేళ్ళని పెంచడానికి తీసుకురాకూడదని డిసైడ్ అయ్యాము.     

సినిమా పైరసీ లేకుంటే మేము ఇక్కడ బ్రతికేదెలా?!

షికాగోలో వుంటున్న మేము వారానికి ఒకసారి భారతీయ గ్రోసరీ దుకాణాలకి వెళ్ళి వారానికి రెండో మూడూ పైరేటెడ్ డివిడిలు ఒక్కోదానికి డాలరో. రెండు డాలర్లో పెట్టి తెచ్చుకుంటాము. మరీ మంచి సినిమా అని తెలిస్తేనే సినిమా హాలుకి వెళ్ళి చూస్తాము.  కుటుంబం అంతా సినిమాకు వెళ్ళాలంటే టిక్కెట్టు ఖర్చే 50$ అవుతుంది. ఇక అక్కడ తినడానికి ఏమన్నా కొనకతప్పదు కదా. మనం ఊరుకున్నా పిల్లలు ఊరుకోరు కదా. తినే ప్రతిదానికీ ధరలు విపరీతంగా మండిపోతాయి. బయట డాలరు కి దొరికేది ఇక్కడ నాలుగయిదు డాలర్లకు అమ్ముతారు.

ఇక కొన్ని సినిమాలు మంచివి అని తెలిసినా మాకు అంతగా నచ్చక అర్రెర్రే ఈ సినిమాకి అనవసరంగా ఇంత పెట్టి వచ్చాము, పైరేటెడ్ డివిడి వచ్చేదాకా ఆగి చూసివుంటేపోయేది అనుకుంటాము. ఇలా విడుదలయిన సినిమాలన్నీ సినిమాహాళ్ళలో చూడాలనుకుంటే నెలకు ఎన్ని వందల డాలర్లు తగలెయ్యాల్సొస్తుందో కదా. ఇప్పుడు పైరసీకి వ్యతిరేకంగా ఉద్యమమ నడుస్తోందని దానికి మద్దతుగా మనం కూడా పైరేటెడ్ డివిడిలు తీసుకురావద్దని సినిమాల వీరాభిమాని అయిన మా ఆవిడతో అన్నానే అనుకోండి... అహ మాటవరుసకి అన్నానే అనుకోండి -  నా కేసి ఎలా చూస్తుందో మీరెవరయినా ఊహించగలరా?       

విజ్ఞప్తి

(ఫొటో క్రెడిట్: వికిపీడియా)  

ఈ క్రింది విషయాలల్లో మీకు ఎవరికయినా ఆసక్తి వుండి పరిశోధనలు చేసారా? ఈ క్రింది విషయాలల్లో మీకు విశేషమయిన ఆసక్తి వుంటి వీటిల్లో వేటినయినా అనుభవంలోకి తెచ్చుకున్నంత పరిణతి వుంటే, వుందని అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. ఇందులో అన్నీ నేను నమ్ముతున్నానని కాదు గానీ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు బహుళంగా ఆసక్తి చూపిస్తున్నారు. వారికి మీ  ప్రజ్ఞ, మీ నాలెడ్జి ఉపయుక్తం కావచ్చు.   

Astral Projection
Lucid Dreaming
Out of body Experiences
Meditation
Psychic Connections with Nature or animals

హిందూ మనోభావాలూ - ముస్లిం మనోభావాలూ


వాటి గురించి ఆంధ్రభూమిలో 'వీక్' పాయింట్ లో వచ్చిన సాక్షి (ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి) వ్యాసం చదవండి: 
http://www.andhrabhoomi.net/weakpoint/6-weak-point-164

పుస్తక సందేహాలు

స్వప్న రాగలీన బ్లాగులోని ఒక టపాకి ఒకరు రోజంతా ఆఫీసులో కూర్చుని ఇలాంటి చెత్త బ్లాగులో పెట్టడం కన్నా ఆ మద్దిన ఎదో పుస్తకం ఏత్తానన్నావ్ కదా అది ఎయ్యకూడదూ?  అని వ్యాఖ్య చేసి నాలో నిద్రపొతున్న బద్దకాన్ని తట్టిలేపారు. పుస్తకం వ్రాయడం, ప్రచురించడం అంటే మాటలా. అసలే మన తెలుగువారిలో చదవడం అన్నది అంతర్ధానమవుతున్న అలవాటు. ఇక చదివేది మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న కొద్దిమంది పుస్తకప్రియులు. పుస్తకం వ్రాయడం ఒక ఎత్తు కాగా ప్రచురించుకోవడం, అవిష్కరించుకోవడం, అమ్ముకోవడం, సన్మానించుకోవడం అవన్నీ ఎత్తులకు పైఎత్తులు.  అవన్నీ మనవల్ల జరిగే పనేనా?  ఒక పబ్లిషర్ నా పుస్తకాన్ని ప్రచురిస్తామన్నారు కానీ కనీసం 200 పేజీలు కావాలంట. నా అనుభవాలు, ఆలోచనలు అన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తే తప్ప అన్ని పేజీలు కావు. మరీ అంతగా వివరిస్తే అది బూతు పుస్తకం అంటారు! అందువల్ల వాళ్ళు పబ్లిష్ చేయకపోవచ్చు.

ఎన్ని కష్టాలు పడి అయినా సరే మన పుస్తకాన్ని అచ్చులో చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరయినా కొని చదువుతారా అన్నది తరువాత.  చూద్దాం. కొన్నిసార్లు మనకు నచ్చిన పనులను ప్రతిఫలేక్ష లేకుండా నిర్వికారంగా చేస్తూపోవాలి. అందువల్ల కొన్ని డబ్బులు పోవాల్సొచ్చినా అలా నిర్వికారంగా వుండాలి! మన పుస్తకం మనం అచ్చులో చూసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తప్పవు.  ప్రపంచమంతా వీడియో మీడియాకి వెళుతుంటే మనం ఇంకా ఇలా పుస్తకాలంటూ వేలాడటం అవసరమా అని కూడా అనిపిస్తోంది కానీ ఎక్కువగా ఆలోచిస్తే ఏ పనులూ చేయలేము. కొన్ని కొన్ని పనులు కొద్దిగానే ఆలోచించి అలా అలా చేస్తూపోవడమే ఉత్తమం.  ఎనీ వే, పుస్తకం రిలీజ్ అయితే మాత్రం మీరు నాకు సన్మానం చేస్తానని గ్యారంటీ ఇవ్వాలి మరి. లేకపోతే నేనీ పుస్తకం వ్రాయనంతే. ఆ.  సో, మళ్ళీ పుస్తకం మీద పడుతాను. చూస్తాను - ఈ ఆనందం ఎన్ని రోజులో.

కొన్ని సందేహాలు వున్నాయి. ఎవరయినా తీర్చగలిగితే సంతోషిస్తాను.
- వివిధ పత్రికలలో, పోర్టల్లలో ఆయా విషయాలపై వచ్చిన వ్యాసాలను వారికి ధన్యవాదాలు ప్రకటించి నా పుస్తకంలో వేసుకోవచ్చా లేక వారి అనుమతి తీసుకోవాలా?
- తెలుగు వికీ లో వున్న సంబంధిత వ్యాసాలను వారికి క్రిడిట్స్ ఇచ్చి నేను ఉపయోగించుకోవచ్చా లేక అనుమతి తీసుకోవాలా?