ఆదివారం 31 జనవరి 2010

శ్రీక్రిష్ణార్జునుల సఖ్యత

రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు, ప్రజలందరి సొమ్ము కాబట్టి ఎవరు రకంగానయినా నిర్వచిందుకోవచ్చు. యార్లగడ్దకి ద్రౌపది యమ నచ్చింది కాబట్టి వారికోణంలో వారు నవల వ్రాసేసారు - అవార్డూ ఇవ్వాలనుకున్నారు. మరి మనక్కూడా ఇష్టాలుంటాయి కదా. భారతంలో నాకు బాగా నచ్చే పురుషులు శ్రీకిట్టుడూ, అర్జునుడూనూ. విశేషమేమిటంటే  వారిద్దరికీ  మంచి స్నేహం, సఖ్యతానూ.  నిన్న కత్తి మహేశ్ గారు వారిద్దరి సఖ్యత గురించి వివరించారు. వివరాలకు నా గత టపా చదవండి.
యార్లగడ్డ పండితులు కాబట్టి ఆ నవల వ్రాసేరు - ఓ పది మంది చదివారూ - దానికి అవార్డ్ ఇవ్వాలనుకున్నారు - పౌర 'తొక్కల' సంఘం లేకుంటే ఇప్పటికి అవార్డ్ చేతిలో పడివుండేదేమో. మరి మనం వ్రాస్తే ఎవరు చదువుతారు? మీరు చదువుతారు! మీకోసమని ఓ నవల వ్రాసేయలేనుకదా. అందుకే ఓ పేరాతో తృప్తి పడిపోదామని డిసైడ్ చేసా.
అర్జునుడు

క్రిష్ణుడి పడగ్గది సీను:

అర్జునుడు ముసిముసి నవ్వులు  నవ్వుతూ క్రిష్ణుడి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. తలదగ్గర కూర్చున్న దుర్యోధనుడికి అర్జునుడి  ముసిముసినవ్వులు చూస్తూవుంటే యమకంపరంగా వుంది. అయినా మనవాడు అర్జునుడు  శ్రీక్రిష్ణ ముఖారవిందం చూస్తూ మరింత దుర్యోధనుడి గురించి పట్టించుకోలేదు. బెడ్రూము కిటికీనుండి ఏటవాలుగా వచ్చి పడుతున్న కిరణాలు అర్జునుడి బుగ్గమీద పడి తెగముద్దులిచ్చేస్తున్నాయి. ఇంకా క్రిష్ణుడు గారు లెగకపోయేసరికి అసలే ఆత్రంగా వున్న అర్జునుడు బావ లేవాలని ముసిముసినవ్వులు పెంచేశాడు. ఆ నవ్వులు దుర్యోధనుడికి గుర్రపు సకిలింతల్లాగా వినిపించి, అనిపించి విసుక్కున్నాడు. ఇంతసేపటి నుండి వెయిటు చేస్తున్నా ఆ మహాశయులు లేవకపోయేసారికి దుర్యోధనుడు విసుగ్గా నిట్టూర్పులు  విడుస్తూ కూర్చున్నాడు. బావగారు ఇంకా లేవకపోయేసారికి సిగ్గుపడుతూనే అర్జునుడు శ్రీక్రిష్ణుడి గారి పాదాలు తాకేడు. క్రిష్ణుడు కళ్ళు తెరచి చూస్తే ఎదురుగ్గా అర్జునుడు. వెంటనే 'బావా, ఎప్పుడు వచ్చితీవు...' అని దీర్ఘం తీసుకుంటూ ఆనందపరవశుడయి అర్జునుని సాదరంగా ఆహ్వానించాడు. శ్రీ ముందూ వెనుకలూ చూడకుండా ఇవాళ మరీ ఇంత ఆత్రంగా వున్నాడేంటీ, నన్ను చూడక చాల్రోజులయ్యింది కదా అందుకేనేమో అనుకున్నాడు అర్జున్. శ్రీని వారించడం ఎలాగో తెలియక చిన్నగా దగ్గాడు. అయినా మనోడు పట్టించుకోలేదు. చేతులు చాచి హగ్ కోసం ఆహ్వానిస్తూనేవున్నాడు. అర్జునుడు మరింత ఖంగారు పడి ఆ గదిలో మరొకరు కూడా వున్నారని చెప్పాలని కొద్దిగా గట్టిగా  దగ్గాడు. అర్జునుడు ఎందుకు దగ్గుతున్నాడో లైటు  వెలుగక, ఎందుకయినా మంచిదని తన చేతులని అలాగే సాచి వుంచి విండోల దగ్గర ఎవరయినా వున్నారేమో అని చూసాడు. లే, ఎవ్వరూ కనపడలే. మళ్ళీ చేతులు ముందుకు సాచాడు. మళ్ళీ ఖంగారుగా అర్జునుడు ఇంకాస్త గట్టిగా  దగ్గాడు. ఓ అర్జునుడి గొంతులో ఖిచ్ ఖిచ్ అనుకొని హాల్స్ అడుగుతున్నాడేమో అనుకొని తలగడ క్రింద దాచుకున్న హాల్స్ తీసి చాలా ప్రేమతో అర్జునుడికి ఇవ్వబోయాడు. అర్జునుడు సన్నగా విసుక్కొని బావా అని ప్రేమగా పిలిచి 'నేను దగ్గుతున్నది హాల్స్ కోసం కాదు బావా' అని సెలవిచ్చాడు. 'మరెందుకు!?' అన్నాడు శ్రీక్రిష్ణుడు మురిపెంగా. తలదగ్గర దేభ్యం ముఖం వేలాడేసుకొని కూర్చున్న దుర్యోధనుడిని చూపించాడు. ఇప్పటిదాకా  వీళ్ళిద్దరిని  చూస్తూ మండిపడుతున్న  దుర్యోధనుడి ముఖం చూసి నీరు  కారిపోయిన క్రిష్ణుడు ఏడవలేక నవ్వుతూ అతగాడిని పలకరించాడు. 

శనివారం 30 జనవరి 2010

ఇండియా నుండి ద్రౌపది వచ్చేసిందండోయ్!

అపార్ధం చేసుకోకండి. నాయకి ద్రౌపది కాదు - నవలా ద్రౌపది వచ్చింది. వెబ్సైటు నుండి ఆర్డర్ చేస్తే నిన్ననే ఇండియా నుండి వచ్చింది. చాలా కష్టపడి ఆ ప్యాకేజీ విప్పానని మా ఆవిడ చెప్పింది. ఏంటీ ఈ నవల, దీనినంత అర్జంటుగా ఇండియా నుండి తెప్పించుకునీ చదవడం అవసరమా అని అడిగింది. ఈ నవలను అర్జంటుగా చదవకపోతే కొంపలంటుకుపోతాయి అన్న లెవల్లో సీనిచ్చా. అలా అయితే ఈ నవల ముందు నేనే చదువుతా అని ముందేసుకుంది.

రెండు నిమిషాలు చదివిందో లేదో క్రిష్నుడికి ద్రౌపది సఖి అంటాడేమిటీ అని ధర్మసంధం లేవనెత్తింది. వార్నీ రెండు నిమిషాలు ఆ నవల చదివావో లేదో కథ అంతవరకూ వచ్చిందీ అని బోలెడు ఆశ్చర్యపోయా. అలా అని ఊరుకుందా - ఊరుకోలేదు - మళ్ళీ రెట్టించి అదే సందేహాన్ని అడిగింది. నా గొంతులో పచ్చివెలగకాయ పడింది. అంటే గొప్పోళ్ళ వ్రాతలు అంత వీజీగా మనకు అర్ధం కావు - నవల అసాంతమూ చదవాలి - అప్పుడు కానీ మనకు లైటు వెలగదేమో అని సెలవిచ్చాను. నిజంగానే నవల అప్పుడే శ్రీక్రిష్ణుడూ, ద్రౌపదిల సఖ్యత దాకా వచ్చిందీ అని మళ్ళీ బోల్డు హాశ్చర్యపోయా. మా ఆవిడ పేజీలు అటూ ఇటూ తిప్పి ఇంకా కథ చదవడం మొదలెట్టలా - ఇదేదో ఉపోద్ఘాతమో, మరేదో వున్నట్లుంది - అందులో వుంది అని అంది. హర్రే - ఎవరో గానీ నవలలోని సస్పెన్స్ ముందే విప్పదీసేసారా అని మళ్ళీ హాశ్చర్యపోయా!

ఎనీ వేస్, ద్రౌపది వచ్చింది - ఇక ఇరగదీసెయ్యాలంతే. రాత్రే పరిచయాలూ గట్రా చదివేసి వార్మప్ అయ్యా. గొప్ప నవల కదా - గొప్ప గొప్పోళ్ళే పరిచయాలు వ్రాసేరు.

కొసమెరుపు: ఎంత తగలేసి ( మా ఆవిడ భాషలో) ఇండియా నుండి ఈ నవల తెప్పించావూ అని మా ఆవిడ ఎందుకో ఇంకా అడగలా. అడిగివుంటే ఒక సీను అయిపోయి మనస్సుకు కాస్త ప్రశాంతంగా వుండేదేమో. ఆ మధురక్షణాలు ఇవాళ వస్తాయేమోనని కాస్త ఇదిగానే వుంది.

శుక్రవారం 29 జనవరి 2010

Let us go back to basics!

రెండేళ్ళ క్రితం అనుకుంటాను మా ఇంట్లో ఓ ప్రస్థావన చేసేను - ఒక్క రోజు యంత్ర పరికరాలు కానీ, విద్యుత్తు కానీ, విద్యుత్ పరికరాలు కానీ, ఆధునిక వస్తువులు కానీ ఏమీ ఉపయోగించకుండా గడుపుదామని. మా ఆవిడ సహజంగానే తిరస్కరించింది. మా పెద్ద పాప క్లుప్తంగా నోప్ అంది - కరెంటు లేకపోతే తన ఇంటర్నెట్ ప్రపంచం కూలిపోతుంది కదా - అందుకే. హ్మ్. మా చిన్న పాప చాలా ఉత్సాహ పడింది. కానీ ఇంట్లో ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకోకపోవడంతో ఎటూ తేలలేదు.     

మరో రెండు రెండు రోజుల తరువాత నేను, అమ్మలు (చిన్న పాప) కలిసి ఇంట్లో మరోసారి ప్రస్థావించాము. ఈసారి మాఅవిడ మరింత ఖచ్చితంగా నో అంది. అలా అయితే ఏడుపుగొట్టు సీరియళ్ళు, సినిమాలు చూడలేదు కదా. వాటిని ఒఖ్ఖరోజయినా త్యాగం చేయడం ఇష్టం లేకపోయింది. మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే సినిమాలు, సీరియల్లు చూడనివ్వకుండా గృహహింస చేస్తున్నట్లు అవుతుందేమోనని వెనక్కు తగ్గాను. మా స్ని యథాప్రకారం నోప్ అంది కానీ తరువాత మళ్ళీ కన్విన్స్ చేస్తే వినవచ్చు.      

చిన్నది, నేను చాలా అసంతృప్తి పడిపోయాము. ఇంట్లో అందరూ అంగీకరిస్తే ఒక రోజు ఇలా చెయ్యాలనీ, అలా చేయ్యాలనీ, క్యాండిల్ లైటు వెలుగులో అందరం ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలనీ అలా అలా ఎన్నో ఊహలు కన్నాము.  కనీసం మనమన్నా అలా గడిపేద్దాం డాడీ అంటూ అప్పుడప్పుడు చిన్నది గుర్తుకుచేస్తున్నా ఇంట్లో అందరూ ఒప్పుకోకపోవడంతో నాకూ ఆసక్తి తగ్గి వాయిదా వేస్తూవచ్చాను.  

ఇకనైనా ఒప్పుకోనివారిని వదిలేసి ఒక గదిలో అన్నా కరెంటు వెలుగు తీసివేసి సువాసనలు వెదజల్లే క్యాండిల్ లైటు వెలుగుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆ తరువాత ఆ వెలుగులో చిన్న పిల్లల కథలు చదువుతూ కాలక్షేపం చేస్తాం లేదా ఏవయినా బోర్డ్ గేమ్స్ ఆడతాం.   అలా మూలాల్లోకి వెళ్ళిన మా రోజు ఎలా జరిగిందీ తెలియజేస్తాం. మీరూ మీ ఇంట్లో ఓ రోజు అలా బేసిక్స్ కి వెళ్ళి చూడకూడదూ? వీలయితే ఏడాదికి కనీసం ఒక రోజన్నా అలా గడిపితే మనం ఏం కోల్పోతూవస్తున్నామో వాటిని కనీసం స్పృశించవచ్చును.   

AP లాంటి కరెంట్ కట్ ప్రదేశాలలోని వారు అప్పుడప్పుడయినా బలవంతంగానయినా ఇలాంటి బేసిక్ జీవితాలు గడిపేస్తుంటారు కాబట్టి వారికి ఈ ప్రయోగాలు అక్కర్లేకపోవచ్చు! 

గురువారం 28 జనవరి 2010

సవరణ: గత టపా టైటిల్ మార్పు


నా గత టపా ఇది :
http://sarath-kaalam.blogspot.com/2010/01/3.html 

కొద్దిరోజుల క్రితం 'జడివాన' బ్లాగర్ శిశిర "ఓ 'బంగారం' కథ " సిరీస్ వ్రాసారు.  అందులో బంగారం అనే అమ్మాయికి 16 ఏళ్ళకే తల్లితండ్రులు ఇష్టం లేని పెళ్ళి చేస్తారు.  నా గత టైటిలులో బంగారం అని పెట్టడానికి కారణం అది గుర్తుకు తేవడమే కానీ ఎవరూ అది క్యాచ్ చేసినట్లు లేరు - చేసినా బావోదేమోలే అని మిన్నకున్నారేమో. నేను చెప్పాలనుకున్న భావం చెప్పినా, ఫోటో కూడా సూటబుల్ ఫోటో పెట్టినా టైటిల్ మరో రకంగా పెట్టేసరికి నేను చెప్పాలనుకున్న భావం చదువరులకు అందకుండా పోయింది. తెలుగు సినిమా స్టొరీల్లాగా శుభం కార్డు వేసినట్లయ్యింది కానీ వాస్తవాలు అలా వుండవు కదా. అదే కాకుండా నేను చెప్పేది చేసేదొకటి, గౌరవించేదొకటి అన్నది ధ్వనిస్తూ హిపోక్రాటుగా అనిపించాను కొందరికి. అదీ కాకుండా నేను హైలైట్ చేయదలుచుకున్న విషయానికి ఫోకస్ లేకుండా అయిపోయింది. పెళ్ళి విషయంలో అమ్మాయి ఇష్టాయిష్టాలని గమనించకుండా తమ సెంటిమెంట్లూ, ఇష్టాలూ తల్లితండ్రులు రుద్దితే ఫలితం ఎలా వుంటుందన్నదే నేను చెప్పాలనుకున్న విషయం. కనీసం పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి వున్న ఒక్క తండ్రి అన్నా, తల్లి అన్నా ఈ టపా వల్ల ఆ విషయం గుర్తుంచుకోకపోతారా అన్నదే ఈ సిరీస్ వ్రాయడానికి, నా వ్యక్తిగత విషయాలను పణంగా పెట్టి వ్రాయడానికి గల కారణం. టైటిల్లోని పొరపాటు వల్ల ఆ ప్రయత్నం, ఫోకస్ వృధా అయ్యింది, అందుకే ఈ సవరణ.   

I am sorry for the confusion.
  

బుధవారం 27 జనవరి 2010

సివరాఖరి పెళ్ళి చూపులు - 3: భిన్న ధ్రువాలు

(మా సంభాషణల్లో ఏమే, ఏమండీ అన్న పదాలు కేవలం నాటకీయత కోసం వాడినవి. నిజంగా అలావాడలేదు. డైలాగ్స్ ఖచ్చితంగా అవేకాకపోయినా భావం మాత్రం అదే.)  

మరునాడు బొప్పికట్టిన తలని తడుముకుంటూ మా ఆవిడని అడిగాను "ఏమిటే తొలిరాత్రే హింత షాకిచ్చావూ"
ముసిముసినవ్వులు నవ్వుతూ "పర్లేదు మీరు మారండి" అంది
"నేను మారనని ముందే చెప్పాగా"
"చెబితే చెప్పారు లెద్దూ"
"లేదు. నేను మారను - మారలేను" ఆకాశంలోకి చూపుడు వేలు చూపిస్తూ చెప్పాను
"అయితే మిమ్మల్ని నేను మార్చుకుంటాను"
"ఏంటీ మార్చుకునేదీ. నిక్కర్లు వేసుకున్నరోజుల్లోనుండే నా మనోభావాలని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాను. కుదరదు"
"నా మీద నాకు నమ్మకం వుంది. మిమ్మల్ని నేను మార్చుకుంటానుగా"
"నిన్న పెళ్ళి అయ్యిందోలేదో అప్పుడే నామీద నీకు ఇంత నమ్మకం ఏమిటీ? నేను ఎలా కనిపిస్తున్నానూ?" అని అడిగాను
"అది సరే గానీ మిమ్మల్ని నేను మార్చేస్తా. మీరు ఓకే అనండంతే"
"ఎలాబడితే అలా మార్చుకోవడానికి నా మనస్సు ఏమన్నా చపాతీ పిండి అనుకున్నావా?! అసలే మన మనోభావాలు మహా స్ట్రాంగూ" అని ముఖం గంటుపెట్టుకొని తల అటు తిప్పేసుకున్నాను. 
నా తలవైపుగా వచ్చి "మీరు మారుతున్నారు" అంది
"నేను మారను కానీ ఒక పని చెయ్యి. నువ్వే మారిపో" అని చెప్పాను
"కుదరదు"
"నాకూ కుదరదు"
"నాకూ కుదరదు"
"నాకస్సలే కుదరదు" ఇలా లాభం లేదని "మరి నేను చెప్పిన విషయాలు నీకు నచ్చనప్పుడు ఎందుకు పెళ్ళి చూపుల్లో నేను చెప్పిన వాటికన్నింటికీ గంగిరెద్దులా తల ఊపావు?" అని అడిగాను
"మా నాన్నగారు ఊపమన్నారు"
"అంటే మీ నాన్నగారు చెప్పినంత మాత్రాన ఓ య్యెస్ అనేయడమేనా?"
"అలా అనకపోతే మా నాన్న గారి మనోభావాలు ఇబ్బందిపడుతాయి"
నేను గుడ్లు మిటకరించాను. ఇలాక్కూడా లాభం లేదని శాంతంగా ఇలా అడిగాను "పోనీ నేనంటేనో లేదా నా భావాలంటేనో ఇష్టం లేదని మీ నాన్నగారికే నచ్చచెప్పలేకపోయావా?"
"చెప్పాను కానీ తేలిగ్గా తీసుకున్నారు. వయస్సులో ఇది సహజమని పెళ్ళి అయితే మీరే మారతారనీ చెప్పారు"
"హ!"
"అవును"
"అయినా సరే ఎదిరించకపోయావా?"
"కొద్దిగా అలాక్కూడా ప్రయత్నించాను"
"నిజ్జంగా! మరి ఏమయ్యింది?"
"సెంటిమెంటుతో ఆయింటుమెంటు పూసారు - నా నిరసనకి"
"హా. ఏంటా సెంటిమెంటూ"
"మా ఇంట్లో ఒక సాంప్రదాయం వుంది"
"ఏంటో అది"
"మొదటి పెళ్ళి చూపులే ఓకె కావాలి"
"ఛ"
"అవును. మా పెద్దక్కయ్యకి మొదటి చూపుల్లోనే సంబంధం ఓకె అయ్యింది, మా చిన్నక్కకి కూడా అలాగే అయ్యింది. నాకు కూడా అలాగే కావాలన్నారు"
"నా మొఖంలా వుంది ఈ సెంటి. పోనీ పెళ్ళి చూపుల్లో నువ్వు నాకు చెబితే, మీ వాళ్ళకి నువ్వే నచ్చలేదు అని నేను చెప్పేవాడిని కదా" 
"నేను మీకు నచ్చలేదంటే అది నాకు అవమానం"
"అహబ్బా. మరి ఇప్పుడెలా?" అని మూలకు తిరిగి జుట్టుపీక్కున్నాను. 
"అంత వర్రీ కాకండి. సులభ పరిష్కారం వుంది"
"హేమిటది?" గిరుక్కున మా ఆవిడ వైపు తిరిగాను.
"మీరు మారితే సరిపోతుంది"
మళ్ళీ జుట్టు పీక్కొని "మళ్ళీ మొదటికి వచ్చావా! అది జరిగేపని కాదు గానీ ఇంకోమాట చెప్పు" అన్నాను.
"మీరు ఎన్ని అన్నా మీరు మారక తప్పదు"
"అలాకాదుగానీ ఎంచక్కా విడిపోదాం" అని ఆత్రంగా అడిగాను
"కుదరదు"
"ఎందుకో"
"మా నాన్నగారి మనోభావాలు దెబ్బతింటాయి"
"మరి నా మనోభావాలు?" బేలగా అడిగాను
అదోలా చూసిది. ఆ చూపులో బోలేడు అర్ధాలు కనిపించాయి :(
"మీ మనోభావాల సంగతి నేను చూసుకుంటా కదా" అని దగ్గరికి తీసుకుంది. అలా నా మనోభావాలు కొంతకాలం హైబర్నేట్ అయిపోయాయి. కొత్త పెళ్ళి, కొత్త పెళ్ళాం మరి. తప్పుద్దా.

మొత్తం మీద...నేనూ మారలేదు - తనూ మారలేదు. నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు. అనుకున్నవన్నీ జరిగిపోతే, డ్రామా లేకపోతే జీవితాల్లో థ్రిల్లు వుండదేమో. 
(అయిపోయింది)

సివరాఖరి పెళ్ళి చూపులు - 2: రెండోస్సారి


ఒక్కటేమిటి - పలు అనుమానాలు. ఆ అమ్మాయి అంత వీజీగా నా ప్రస్థావనలకు ఎలా ఒప్పుకుంది. కొద్దిగానయినా చర్చించకుండానే అలా అవునని తల ఊపేస్తే  ఏమనుకోవాలి? కొంపదీసి తనది హరే రామ హరే క్రిష్ణ సంఘం కాదు గదా. రక్తిలో కూడా భక్తిని చూడగలవారు కొందరుంటారు - అలాంటి టైప్ కాదుకదా. అదేపద్ధతిలో ద్రౌపది మహా పతివ్రత అనే టైప్ కాదుకదా. లేకపోతే ఈ అమ్మాయి మందమతి? ఎందుకయినా మంచిది ఈ సంబంధం విషయంలో తొందరపడకూడదనుకున్నాను. మరింత క్షుణ్ణంగా ఈ అమ్మాయి గురించి స్టడీ చేయాల్సిందిగా సూర్యాపేటలోని నా మిత్రులని, బంధువులని  పూణే నుండి ఉరమాయించాను.

రిపోర్టులన్నీ సవ్యంగానే వస్తున్నాయి. వారి కుటుంబానికి బాగా తెలిసిన బంధుమిత్రులు కూడా కొంతమంది వున్నారు. వారి ఫీడ్‌బ్యాక్ కూడా సవ్యంగానే వుంది. నేను ఒక భావంతో చెబితే ఆ పెళ్ళి చూపుల ఖంగారులో, ఒత్తిడిలో ఆమె మరో విధంగా అన్వయించుకుందేమో! నా భావం ఆమెకు సరిగ్గా చేరలేదేమో. ఇప్పుడు ఏం చేసేది చెప్మా? నాకు అమ్మాయితో సెకండ్ ఇంటర్యూ ఏర్పాటుచేయమని కబురు అందించాను. ఈ సారి బాగా ప్రైవసీ వుండాలని హెచ్చరించాను. మళ్ళీ నేను సెలవుల్లో సూర్యాపేటకి రావడానికి ఆరు నెలలు పట్టింది. అది కూడా మంచిదే అనుకున్నాను. ఈలోగా నాగురించి ఆ అమ్మాయి బాగా ఆలోచించుకోవడానికి వీలు అవుతుంది. ఏమయినా అభ్యంతరాలు వుంటే ఎవరికయినా తెలియజేస్తుంది కదా అనుకున్నాను.

ఈ సారి మేడ మీద ఏర్పాటు చేసారు మా సమావేశం. వాతావరణం బావుంది. పిల్ల గాలులు వీస్తున్నాయి. సమయం రాత్రి ఏడున్నర గంటలు. నాకు భయపడి చంద్రుడు ఎక్కడో దాక్కున్నాడు. ఏమాత్రం వెలుతురు లేదు. ఆ అమ్మాయిని చూస్తూ మాట్లాడే అవకాశం లేకపోయింది. ఎదురుగ్గా కూర్చొని ఫోనులో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకున్నాము :(  నా ప్రపోజల్స్ కి ఆమె హావభావాలు ఎలా స్పందించాయో తెలుసుకొనే అవకాశం లేకపోయిందే అని గింజుకున్నాను. 

ఈ సారి వివరంగా, లోతుగా, స్పష్టంగా,దీర్ఘంగా నా జీవనవిధానం గురించి, నా విశాలభావాల గురించి తెలియజేసాను. నాలాంటి జీవన విధానం ఇష్టమయితేనే ఈ సంబంధానికి ఒప్పుకోమన్నాను. పెళ్ళయ్యాక మీరు మారండీ అని పోరుపెట్టవద్దు - నేను మారే ప్రసక్తే లేదు - అది నాకు సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పాను.  ఒకవేళ నేను గానీ, నా పద్ధతి గానీ నచ్చకపోతే, మీరు మీ తల్లితండ్రులకు ఆ విషయం చెప్పే ధైర్యం లేకపోతే, నాకు చెప్పండి - నేనే మీరు నచ్చలేదని చెబుతాను అని తెలియజేసాను. పెళ్ళయ్యాక సంసారంలో కలతలు రాకుండా వుండేందుకు గాను మీరు కూడా నా జీవన విధానం పాటించాల్సివుంటుందని, ఒకరు ఒకరకంగా, ఒకరు మరొక రకంగా జీవిస్తే తేడాలు వస్తాయనీ - అందుకు సిద్ధమయితేనే ఈ పెళ్ళికి ఒప్పుకోమనీ చెప్పాను.  

అన్నింటికీ అలాగే, అలాగే అంటూ పాజిటివ్‌గా స్పందిస్తూ వచ్చింది!  ఆమెకు 18 ఏళ్ళు నిండాయి. మేజర్. స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలిగే వయస్సు వుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా కూడా నన్ను అంగీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. మేడ దిగివచ్చి పెద్దవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

కొద్దినెలల్లోనే మా పెళ్ళి అయ్యింది.
ఆ రోజే మొదటిరాత్రి.
దగ్గరికి తీసుకున్నాను.
"ఏమండీ, మీరు మారండీ" అంది.
అంతే.
ప్రపంచమంతా  గాఢాంధకారం వ్యాపించింది.
ఓ-తెలుగు సెన్సారోళ్ళు (కరెంటు) కట్ చేసారు.
నేల మీద ఎవరో పడ్డట్లు దబ్బుమని శబ్దం వినిపించింది
(చీకట్లో ఏమయ్యిందో, ఎవరు పడ్డారో, ఎందుకు పడ్డారో ఓ-తెలుగు సెన్సార్ సభ్యులకు అర్ధం కాక జుట్టుపీక్కొని పై శబ్దాన్ని/ వాక్యాన్ని మాత్రం అనుమతించారు.) 
(ఇంకా వుంది)

మంగళవారం 26 జనవరి 2010

సివరాఖరి పెళ్ళి చూపులు - 1: అమ్మాయి నచ్చింది కానీ...


ఇది కాకుండా ఇంకా చూపులు ఏమయినా మిస్సయ్యానా అని బుర్రని బాగానే గాలించాను కానీ ఏమీ దొరకలేదు. అందుకే ఇక ఆఖరుది చెప్పేస్తున్నా. పూణేలో పీజీ చేస్తున్న రోజులవి. నాకో సంబంధం వచ్చిందంటూ మా ఫ్రెండు ఓ అమ్మాయి ఫోటో పంపించాడు. ఎత్తు నాకంటే తక్కువే అని తెలిపాడు. అమ్మాయి బావుంది. అమ్మాయిల్లో నాకు నచ్చాల్సిన ముఖ్యమయిన విషయం కూడా నచ్చింది. ఫేసుకన్నా ముఖ్యంగా అవి నచ్చాలి కానీ అవి చూడటం అంత వీజీ కాదు. ఏవో కాదులెండి - పాదాలు. ఫోటోలో పాదాలు చక్కగా కనపడుతున్నాయి - నాకు భలేగా నచ్చాయి.  ఇదివరకటి పెళ్ళి చూపుల్లో అమ్మాయి గనుక నచ్చివుంటే ఇబ్బందే అయివుండేది. ఆ తరువాత పాదాలు చూడాలి కాలెత్తు అని అడగలేముకదా.    

ఎలాగూ పూణే నుండి ఇంటికి రావడానికి కొంత సమయం వుంది కాబట్టి ఈలోగా ఆ అమ్మాయి గురించి రిసెర్చ్ చేయమని మా ఫ్రెండ్సుని ఉరమాయించాను.  రిపోర్ట్ నాకు తగ్గట్టుగానే వచ్చింది - సంతోషం. సెలవుల్లో సూర్యాపేటకు వెళ్ళాక అక్కడ వాళ్ళ అక్క ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు.  ఆ అమ్మాయితో టీ ఇప్పించారు - అమ్మాయి చాలా బావుంది. సరే, ఇంతవరకూ ఓకే కానీ నా భావాల సంగతో? అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడాలి అని చెప్పాను. పక్కనే వున్న గదిలోకి పంపించారు.

హ్మ్. అది మధ్య గది. ముదు గదిలో మగవాళ్ళు, వెనుక గదిలో ఆడవాళ్ళు, మధ్యగదిలో మేము. తలుపులు మూసే పరిస్థితి కూడా లేదు. దానికితోడు వాళ్ళక్కయ్య కొడుకు మహా తుంటరి - మాటిమాటికీ మా దగ్గరకి వస్తూ అంతరాయం కలిగిస్తూవచ్చాడు. ఇంకా ఏం ప్రయివేటుగా మాట్లాడుతాం! నాకు చిరాకేసింది కానీ ఏం చేస్తాం? నేను చర్చించబోయే భావాలేమో అందరూ వినేవి కావు గదా. ఎలాగబ్బా అని క్రిందామీద పడి రామాయణ, భారతాల సహాయం తీసుకున్నాను. 

నేను రాముని వంటి వాడిని కాదనీను, కృష్ణుడి వంటి వాడిని అనీనూ, నాకు ద్రౌపది లాంటి భార్య కావలయును అనీనూ చెప్పుకువచ్చాను. అలాగే అంది శాంతంగా. నేను ఉలిక్కిపడి సరిగ్గా వినిపించలేదేమో అని మరో సారి కాస్త స్వరం పెంచి చెప్పాను. మళ్ళీ అలాగే అంది. ఈమెకు ఏమన్నా చెవుడా అని అనుమానం వచ్చి వేరే కొన్ని సాధారణ ప్రశ్నలు వేసి చెవుడేమీ లేదని నిర్ధారించుకున్నాను.  కొద్దిసేపు అయాక మళ్ళీ రాముడు - కృష్ణుడు - ద్రౌపది ఉదాహరణలు ఇస్తూ ఈ సారి ఎందుకయినా మంచిదని వాక్యనిర్మాణం మార్చి చెప్పాను. మళ్ళీ అలాగే అని స్పందన. నాకు చాలా సంతోషం వేసింది - నా కాబోయే భార్య నాకంటే అడ్వాన్సుడులా వున్నందుకు!   ఇంకా అడిగేదేముంటుంది. సంతోషంగా ఆ గదిలోనుండి బయటకు వచ్చాను.  

ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటానికి మా అమ్మా, అక్కయ్యలను పంపిస్తానని చెప్పి ఆ అమ్మాయి వారింటి నుండి వచ్చేసాము.  వారింటినుండి బయటకి వచ్చాక ఒక చిన్న సందేహం వచ్చింది. ఆ అనుమానం నెమ్మదిగా పెనుభూతమయ్యింది. తీర్చుకునేదెలా? అదేంటో తరువాతి భాగంలో చెబుతాను. ఇంటికి వెళ్ళి అమ్మనూ, అక్కయ్యనూ ఈ అమ్మాయిని చూడటానికి పంపించాను. వాళ్ళు చూసి వచ్చారు. వాళ్ళకూ ఈ సంబంధం, ఈ అమ్మాయీ బాగా నచ్చాయి. అయితే నా డవుట్ నాకే వుంది కాబట్టి ఎందుకయినా మంచిది అని నిర్ణయం వెంటనే తెలియజేయకుండా మళ్ళీ పూణే వెళ్ళిపోయాను. 

మా పాప అంతర్ముఖి - 3: రాకుమారి


ఈ టపాల గురించి నిన్న మా పాపతో ప్రస్థావించాను. ఓకే అంది.

ఇంట్రావర్ట్స్ గిఫ్టెడ్ పర్సన్స్. వాళ్ళల్లొ ఏదో ఒక అద్భుతమయిన కళ వుంటుంది. మా పాప Anime ఆర్ట్ బాగా చేస్తుంది. కథలూ, కవితలూ వ్రాస్తుంది. కలల మీద పరిశోధనలు చేస్తుంది - ముఖ్యంగా ల్యూసిడ్ డ్రీమ్స్ మీద. సైకాలజీ మీద మంచి అవగాహన వుంది. చాలా సార్లు అడిగాను - తన ఆర్ట్ పొస్ట్ చేసే వెబ్సైట్ నలుగురికీ - కనీసం నాకు తెలియజేయమని. తాను ఆర్ట్ చేస్తోంది తన తృప్తి కోసమనీ, అందరికీ పబ్లిసిటీ చేయడం కోసం కాదని తిరస్కరిస్తుంది. వీరికి అసాధారణ ఆసక్తులు వుంటాయి. సాధారణ ఆసక్తులు వుండవు కాబట్టి మామూలు జనాల్లో వీరు కలవలేరు. ఏదయినా మెధోపరమయిన, విలువయిన చర్చలంటేనే ఆసక్తి కనపరుస్తారు. బయటి ప్రపంచం అంతా బహిర్ముఖులతో, ఎక్కువగా పనికిరాని విషయాలతో నిండి వుంటుంది కాబట్టి ఎక్కువగా వీరు తమదైన ఊహాజనిత ప్రపంచంలో గడిపేస్తుంటారు.   అందుకేనేమో స్నికి పాండోరా బాగా నచ్చింది.

డాక్టరుతో చర్చించాక ఒక స్పష్టత వచ్చింది. ఇక దీనిమీద అవగాహన రావాల్సింది మా కుటుంబ సభ్యులకు. ఊరునుండి త్రిరిగివచ్చాక మా మామయ్యగారినీ, మా ఆవిడనూ, చిన్న పాపనూ సమావేశపరిచాను. ఇప్పటిదాకా అందరం చేస్తున్న పొరపాట్లను వివరించాను. స్నిని అర్ధం చేసుకోవడానికి నేను చేసిన కృషిని వివరించాను. దానికి ఇంత కష్టపడాలా, ఇన్ని పుస్తకాలు చదవాలా, ఇంటర్నెట్టులో అంత వెతకాలా, అవసరం లేదు, చూస్తే అర్ధం చేసుకోవచ్చు, నాకు దానిని చూడగానే అర్ధమయ్యింది అన్నారు మా మామయ్య. ఓహ్,. అలాగా. అయితే మరి మీరు వచ్చినప్పటినుండీ దానిని ఎందుకు చులకనచేస్తూ వచ్చారు అని ప్రశ్నించాను.  మా పాపకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో మా ఆవిడకి వివరించాను. అంతర్ముఖుల బవుండరీస్ ఎలా వుంటాయో, వాటిని ఎలా గౌరవించాలో, ఎలా వ్యక్తిగతంగా తీసుకోవద్దో చిన్న పాప అమ్మలు కి వివరించాను. ఆ తరువాత నుండీ నేను చెప్పిన విషయాలు ఎవరు శ్రద్ధగా పాటిస్తూ వస్తున్నారో గమనించసాగాను.    

అన్నింటికన్నా నేను చెప్పింది చక్కగా ఆకళింపుచేసుకున్నది ఎవరో తెలుసా? మా అమ్మలు. నిజంగా అది సూపర్ గల్. ఇక మా మామయ్య గారు పాత తరం మనిషి కదా. వారు మారలేరు, నాకు తెలుసు. వారిని సౌమ్యంగా ఎప్పటికప్పుడూ నిగ్రహిస్తూ వచ్చాను - వారు మా గెస్టు మరియు పెద్దవారు మరియు మా ఆవిడ తండ్రి కాబట్టి సౌమ్యంగానే వ్యవహరించాల్సివుంటుంది. ఒకసారి మాత్రం ఓపిక నశించి అరిచాను. అవును మరి, నా బిడ్డ మనోభావాలని నేను కాపాడుకోవాలి కదా. పెద్దవారయిన మా మామయ్య మీద అరవడం తప్పని గ్రహించి మళ్ళీ కొద్దిసేపటికే సౌమ్యంగా మాటలు కలిపాను. నేను వారికి ఇవ్వాలనుకున్న మెసేజ్ అందింది - చాలు కదా. అప్పటినుండీ మా మామయ్య చాలావరకు హద్దుల్లో వుంటూవచ్చారు. 


(పై ఫోటో Anime గర్ల్ ఫోటో. ఈ ఆర్ట్ మా పాప గీసినది కాదుగానీ మా పాపకి Anime అంటే బాగా ఇష్టం వుండటంతో తన వేషధారణ, హెయిర్ స్టయిల్ అచ్చం ఇలాగే వుంటుంది.)

ఇక మా స్నిని అపార్ధం చేసుకోకుండా తనతో ఇంటరాక్ట్ అయ్యే బంధుమిత్రులకు ఇంట్రావర్ట్ లైఫ్ స్టైల్ గురించి కొంతయినా అవగాహన కలిగిస్తూ వస్తున్నాను.   ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల మా పాపలో మళ్ళీ ఉత్సాహం, చురుకుదనం, తనమీద తనకి నమ్మకం లాంటివి అన్నీ పెరిగాయి. తన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు అందరం గుర్తిస్తున్నాము, గౌరవిస్తున్నాము కాబట్టి సంతోషంగా వుంటోంది. తన కోణంలో ఆలోచిస్తూ, తన ప్రత్యేక వసరాలు తీరుస్తూ తనకు అండగా  వుంటూ వస్తున్నాము కాబట్టి తను కూడా మేము చెప్పినవీ కొన్ని వింటూ వస్తుంది. తను సంతోషంగా వుంటోంది కనుక తను గీసుకున్న వృత్తంలోనుండి అప్పుడప్పుడూ బయటకి వెంచర్ చేస్తూవస్తోంది. మేమూ తనని అలా పలుసార్లు సున్నితంగా ఆహ్వానిస్తూ వస్తుంటాము. కొన్నిసార్లు మన్నిస్తుంది - కొన్నిసార్లు తిరస్కరిస్తుంది. కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా తనే తన బవుండరీస్ దాటి మాతోనే కాకుండా అందరితో కులాసాగా వుంటూ వుంటుంది. వ్యక్తి ఆత్మసౌందర్యానికి ఇతరులు మన్నన ఇచ్చినప్పుడు వారిలో కలిగే వెలుగులు ఇవన్నీ.      

తనకు నచ్చినవారితో, తనకు నచ్చిన ప్రదేశాలకి వెళ్ళి వుండే అవకాశాలని ప్రోత్సహిస్తూవస్తున్నాము కాబట్టి తన పద్ధతిలో తాను జీవితాన్ని ఆనందిస్తోంది. తన అబిరుచులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ వాటికి అవసరమయినవి కొనిపెడుతూ వస్తున్నాము. ఇలా తన జీవితంలో పాజిటివ్ స్పిన్ వచ్చినందువల్ల తన ఆరోగ్యం కూడా మెరుగయ్యింది. తనలో పూర్వపు కళ వస్తోంది. బరువు పెరిగింది. తనకు ఇష్టమయిన ఫుడ్డు బాగా అందుబాటులో వుండేలా చేస్తున్నాము. అయినా సరే ఇంకా కొద్దిగా బక్కగా వుంటోంది కనుక ఈమధ్యే మరి కొన్ని చర్యలు చేపట్టాము. అలా అలా చెబుతూపోతే మా పొరపాట్లు ఎన్నో మేము సరిచేసుకుంటూ తన జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం కొనసాగుతూనే వుంటుంది. ఎవరు తనని అర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా అతర్ముఖులు ఆధారపడేదీ, అండగా నిలవాలని కోరుకునేదీ, ఓదార్పు కోరుకునేదీ తల్లితండ్రుల దగ్గరి నుండే కాబట్టి మేమున్నాం తనకి తనకి తోడుగా, కనీసం నేనున్నాను. ఇంకేం కావాలి తనకి. తనదైన ప్రపంచంలో రాజకుమారి తను.  నేను చక్రవర్తిని.

సోమవారం 25 జనవరి 2010

కొజ్జా కూతురితో పెళ్ళి చూపులు


మా ఇంట్లో ఒక డ్యాన్స్ మాస్టారు కిరాయికి వుండేవారు. కిరాయికి ఇచ్చిన తరువాత కొంత కాలానికి తెలిసింది ఈ విషయం. మాకు పెద్దగా సమస్య లేకపోవడంతో, పైగా ఆ మాస్టారు చక్కటి స్నేహశీలి కావడంతో మా ఇంట్లో అలాగే చాలా ఏళ్ళు కిరాయికి వుంటూవెళ్ళారు.   వారి ఇంటికి తన జాతికి చెందిన వ్యక్తులు చాలామంది వస్తుండేవారు. అందరూ మగ డ్రస్సులే వేసుకునేవారు లెండి. ఆహార్యంలో తేడా ఏమీ వుండకపోయేది.  అప్పుడు బాగా యవ్వనంలో వుండేవాడిని కదా ఆ మాస్టారుతో సహా తన ఫ్రెండ్స్ అందరూ వరుస బెట్టి నన్ను కెలికేవారు కానీ నేను తిరస్కరిస్తూ వచ్చేవాడిని.    

వాతావరణం బావున్నప్పుడు ఇంటి ముందు మంచం వేసుకొని చుక్కలని చూసుకుంటూ వేరే చుక్కలని ఊహించుకుంటూ విరహగీతాలు పాడుకుంటూ పడుకునేవాడిని. ఒకరోజు మా మాస్టారు గారి మిత్రుడు ఒకరు నా పక్కనే కూర్చొని ముచ్చట్లు, ఆ తరువాత కితకితలూ పెట్టనారంభించాడు. అది నాకు నచ్చని వ్యవహారం కావడంతో సున్నితంగా తిరస్కరించేసరికి సర్దుకొని కూర్చున్నాడు. అదిగో, ఆ వ్యక్తి బిడ్డే ఈమె.    

కొంతకాలం తరువాత ఆనంద్ అని మా క్లోజ్ ఫ్రెండ్ ద్వారా ఈ సంబంధం ప్రపోజల్ చేసారు. అలాంటి వ్యక్తి కూతురికి పెళ్ళి కావడం అంటే కష్టం కాబట్టి ఆ అమ్మాయి నచ్చితే వారికి సహాయం చేసినట్లవుతుంది కదా అని పెళ్ళి చూపులకి సరే అన్నాను. ఎందుకయినా మంచిదని ఆ అమ్మాయి నాకంటే ఎత్తు తక్కువే అని ముందే ధ్రువపరచుకున్నాను.      

పెళ్ళిచూపులకి నేను నా ఇద్దరి స్నేహితులతో కలిసి వెళ్ళాను. అల్పాహారాలు ముగించిన తరువాత టీ తీసుకొని వచ్చింది అమ్మాయి. అంతగా బావోలేదు. నా నిర్ణయం తరువాత తెలియజేస్తానని చెప్పి వచ్చేసాము. మా ఫ్రెండ్ ఆనంద్ ని కొన్ని సార్లు అడిగిందట అమ్మాయి - నా నిర్ణయం ఏమయ్యిందని. నేను బాగానే నచ్చానట అమ్మాయికి.  మొత్తం మీద ఆనంద్ ద్వారా చేదు నిర్ణయం తెలియపరిచాను  - నిస్పృహ చెందిందిట కొద్దిగా.  ఏం చేస్తాం. చూసిన వారందరినీ చేసుకోలేము కదా. 

అమ్మాయిల సున్నితమయిన భావాలు ఇబ్బంది పడకుండా పెళ్ళి చూపులకు వేరే విధానం ఏదయినా వుంటే బావుండును. వీడియో లేదా వెబ్ చాట్ పెళ్ళి చూపులు కొంతవరకు నయం కదా.  

మా పాప అంతర్ముఖి - 2: ఇంట్రావర్టేనా లేక...?

ఆ వీకెండ్ అంతా ఖాళీనే. అందుకే తీరిగ్గా ఆ వారాంతం అంతా మా స్ని వ్యక్తిత్వాన్ని అర్ధం చెసుకోవడానికే కెటాయించాను. మేమిద్దరం తప్ప ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ప్రశాంతంగా, తీరిగ్గా తనతో చర్చించడానికి, తన గురించి అధ్యయనం చేయడానికి, అర్ధం చేసుకోవడానికి వీలు కలిగింది. ఇలాంటి తీరిక దొరకడం చాలా అరుదు. మా చిన్న పాప ఇంట్లో వుంటే క్షణం తీరిక, ప్రశాంతత వుండదు. మహా హడావిడి మనిషి అది.    

ఇంట్రావర్టులు అనగానే పూర్తిగా ఏకాంతంగా వుంటారనికాదు. తమకు నచ్చిన కొద్దిమందితో బాగా సన్నిహితంగా, చురుకుగా వుంటారు. మా పాప క్లాసులో కాముగా వుంటుంది కానీ స్కూలులో స్నేహితురాళ్లతో చాలా హడావిడిగా వసపిట్టలాగా వుంటుంది. అలాగే తనకు నచ్చిన కొన్ని ప్రదేశాలకు వెళదామంటుంది. తన ఫ్రెండ్సుతో వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తుంది. మా కుటుంబంతో కలిసి ఇంగ్లిష్ సినిమాలకు వెళ్ళదానికి సంసిద్దత  వ్యక్తం చేస్తుంది. తనకు నచ్చిన సబ్జెక్ట్ ఎవరయినా మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడుతుంది. అందరూ మాట్లాడుకునే కాలక్షేపం కబుర్లు మాత్రం ఇష్టం వుండవు. ఏదయినా విలువయిన విషయం వుంటే మాత్రం అనర్గళంగా చర్చిస్తుంది.   

ఇంట్రావర్ట్స్ గురించి అన్ని విషయాలు అనగా వారి వ్యక్తిత్వం ఎలా వుంటుందీ, లక్షణాలు ఎలా వుంటాయీ, వారిని గుర్తించడం ఎలా, అర్ధం చేసుకోవడం ఎలా, వారికి తోడుగా నిలబడటం ఎలా మొదలయిన విషయాలు అన్నీ ఇక్కడ ఇవ్వడం నాకు సాధ్యం కాదు కనుక నా ఈ టపా చదవండి.

ఆ పుస్తకం చదవండి. లేదా ఇంట్రావర్ట్స్ గురించి గూగుల్ చేసి తెలుసుకోండి. ఈ పుస్తకం చదవలేకపోయినా అమెజాన్ సైటులో ఈ పుస్తకం గురించి వున్న పలు వ్యాఖ్యలు ఈ క్రింది లింకులో చదవండి చాలు - అంతర్ముఖుల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. అలా వుండటంలో పొరపాటు లేదనీ అది ఒక జీవన విధానం అని మీకు తెలుస్తుంది. మీరు అంతర్ముఖులయితే మీ గురించి మీరు తెలుసుకోవడానికి అవన్నీ చదవండి - మీరు బహిర్ముఖులు అయితే వారి గురించిన అవగాహన కొరకు, అర్ధం చేసుకోవడం కొరకు, చిన్నచూపు చూడకుండా వుండటం కొరకు చదవండి.    


మా పాప తాను ఇంట్రావర్ట్ నంటోంది. తాను అనుకున్నత మాత్రాన అది నిజమా కాదా? ఇంటర్నెట్టులో అధ్యయనం చేసాను. జెనెరల్ ఏంగ్జయిటీ, సోషల్ ఏంగ్జయిటీ, సిగ్గు, పిరికితనం, ఇంఫీరియారిటీ కాంప్లెక్స్, లేజీనెస్ లాంటివి కూడా కావచ్చు. వాటి లక్షణాలు శ్రద్ధగా పరిశీలించాను. అవేమీ కాదు...కానీ.. లక్షణాలను బట్టి చూస్తుంటే టీనేజి డిప్రెషన్ అయివుండొచ్చు అనిపించింది. దాదాపుగా ఆ లక్షణాలే మా పాపకీ వున్నాయి. ఆ లక్షణాల గురించి బాగా చదివాను. తరువాత మా పాపని పిలిచి చర్చించాను. పాపతో టీనేజ్ మాంద్యం లక్షణాల గురించి కూలంకషంగా చర్చిస్తూ తన అభిప్రాయం అడిగాను. నా అభిప్రాయాన్ని కొట్టిపారేసింది. అలాంటిదేం లేదండి. తాని విచారంగా ఏమీ లేనంది. పెద్దల డిప్రెషనులో విచారం కనిపిస్తుంది కానీ టీనేజీ డిప్రెషనులో విచారం కనిపించదు. టీనేజ్ డిప్రెషను గురించి మరింత సమాచారం కోసం ఆసక్తి వున్నవారు ఇంటర్నెట్టులో వెతకండి. లేదా ఈ లింక్ చూడండి.

తనతో దీర్ఘంగా చర్చించిన పిమ్మట కూడా తనది అంతర్ముఖమా లేక మాంద్యమా అన్నది ఒక నిర్ధారణకు రాలేకపోయాను. మా పాప మాటలు నమ్మి అంతర్ముఖం అని ఊరుకుంటే ముందు ముందు ఏదయినా కీడు జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే ఎందుకయినా మంచిదని ఈ విషయంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించాను. మా పాప అలాంటిదేం వద్దంది కానీ నేను అది లెక్కచేయలేదు.  కేడెంచి మేలెంచాలి.  తనకి రెండు అవకాశాలుఇచ్చాను. ఒకటి - మా ఫ్యామిలీ డాక్టరును సంప్రదించడం, రెండు - సైకాలజిస్టుని సంప్రదించడం. తను మొదటిది ఎన్నుకుంది. 

మా ఫామిలీ డాక్టర్ లియో నాతో చాలా ఫ్రెండ్లీగా వుంటాడు. జోకులు వేస్తాడు. మా కుటుంబం గురించి అతనికి మంచి అవగాహన వుంది. అతని దగ్గర అప్పాయింటుమెంటు తీసుకొని వెళ్ళాము. నేను క్లుప్తంగా వివరించిన పిమ్మట నన్ను బయటకి వెళ్ళమని కోరి దీర్ఘంగా మా పాపతో చర్చించాడు. ఆ తరువాత మా పాపని బయటకి పంపి నన్ను లోనికి పిలిచాడు.

రెడ్ ఫ్లాగ్స్ ఏమీ ప్రస్తుతం కనిపించడం లేదనీ ఆందోళన అక్కర్లేదనీ వివరించుకొచ్చేడు. సహజంగా తాను అంతర్ముఖి అయి వుండవచ్చనీ చెప్పాడు.  టీనేజి కాబట్టి వారి యొక్క ప్రవర్తన కొద్దిగా అపసవ్యంగా వుండటంలో ఆశ్చర్యం  ఏమీ లేదనీ వివరించుకొచ్చాడు. మా పాపతో సెక్స్ మరియు డ్రగ్స్ సమస్యలు కూడా చర్చించాననీ అలాంటివి ఏమీ లేవన్నాడు. ఒకవేళ వుండి వుంటే నాకు చెప్పకపోయివుండేవాడిననీ, ఇది కూడా మీ పాప అనుమతి తీసుకొని మాత్రమే చెబుతున్నా అన్నాడు. అలాంటి సమస్యలు ఏమయినా వుంటే పిల్లల ఆనుమతి మేరకే వైద్యుడు తల్లితండ్రులతో చర్చించాల్సివుంటుంది. మా పాపకి ప్రిస్క్రిప్షను అవసరం లేదన్నాడు కానీ నాకు ప్రిస్క్రిప్షను అవసరం అన్నాడు!? చిన్న చీటీ మీద నాకు అది వ్రాసిచ్చాడు. మా ఇంట్లో కూడా టీనేజీ పిల్లలున్నారని తామూ అదే మందు వాడుతున్నామని చెప్పాడు! టీనేజీ పిల్లలున్న ఎవరికయినా ఆ మెడిసిన్ బహు చక్కగా ఉపయోగపడుతుంది. మీరూ వాడండి. అదే ఇది.

పుస్తకం చదవలేకపోయినా కనీసం ఆ పుస్తకంపై వ్యాఖ్యలు అయినా ఇక్కడ చదవండి. ఈకాలపు టీనేజి పిల్లలపై ఒక అవగాహన వస్తుంది. 

ఆదివారం 24 జనవరి 2010

అదుర్స్ చూసేముగా!


నేను ఛాలెంజ్ చేసినట్లుగానే అదుర్స్ చూసాము. అందరూ భయపెట్టినంత భయంకరంగా ఏమీ లేదులెండి. కాలక్షేపం బఠానీగా అనుకుంటే బాగానే వుంది. నమో కూడా అంటే. వీలయితే థియేటర్లో - వీలుకాకపోతే డివిడిలో చూసెయ్యొచ్చు. ఓ చూడలేదే అని చింతించాల్సిన సినిమాలు కూడా కావు. జూ ఎంటీవోడు నాకు ఎలాగూ నచ్చడు కనుక ఎన్ని స్టెప్పులు అదరగొట్టినా నా దగ్గర ప్రయోజనం శూన్యం. హాస్యం అంతటానూ బాగా పండింది.మెయిన్ విలన్  హాస్యం కూడా బావుంది. మూడు పాటలు బావున్నాయి. అదుర్స్ పాట అదుర్స్. ఇక షీలా గురించి నేను అస్సలే వ్రాయదలుచుకోలేదు. ఓ రెండు మూడు సార్లు ఆమె గురించి వ్రాసినందుకే ఆమె గురించి సోది వ్రాస్తున్నానని కామెంట్స్ వచ్చాయి. ఇంకా ఎందుకులెండి!

నేను దీనికీ, నమోకూ సమానమైన మార్కులు ఇచ్చాను కనుక మా ఇంటివారి అభిప్రాయాలు తీసుకుందాం.
మా ఆవిడ: నమో కంటే ఇదే బావుంది. హాస్యం బావుంది. చారి నటన నవ్వులు పూయించింది.
మా చిన్న పాప: నమో కంటే అదుర్సే బావుంది. ఫన్ను ఇందులోనే ఎక్కువుంది.
మా పెద్ద పాప: తెలుగు సినిమా కనుక యథా ప్రకారం సినిమాకు రాలేదు.

మా చిన్న పాప, మా ఆవిడ అభిప్రాయాలు విన్నాక నా తూకం కూడా కొద్దిగా అదిరిందనే చెప్పవచ్చు.

కొసమెరుపు ఏంటంటే సినిమా కొసన నాకు తిట్లు పడ్డాయి. పడవా మరి? కొద్దిసేపు దాచివుంచమని సగం తినేసిన క్యాండీలు, పాప్‌కార్న్ ఇస్తే మొత్తం లాగిస్తే ఫలితం అలాగే వుంటుంది. సినిమా చివర అవి వున్నాయో లేవో చెక్ చేసుకున్నమా పాప నన్ను తిట్టేసింది. అదే అదనుగా ఇంకొకరు కూడా...హ్మ్.

మా పాప అంతర్ముఖి - 1: దెబ్బతింటూ వచ్చిన మనోభావాలు

స్కూల్ బస్సులో వెళ్ళనని మా పాప మొండికేసిందని గత టపాలో చెప్పాను కదా. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక అనునయంగా అడిగాను. అప్పుడు...అప్పుడు తన మనస్సులోని పొరలు ఒక్కొక్కటీ ఒక్కొక్కటీ విప్పి చెబుతూపోయింది. అలా గంటలు గంటలు అసిధారగా తన వాక్ప్రవాహం కనీసం అయిదు గంటలు పారింది. మధ్యలో అంతరాయం కలిగించడానికి, వేరే పనులు వుండటానికి ఎవ్వరూ లేరు. మా మామయ్యగారూ, మా ఆవిడ, చిన్న పాపా ఒక ఫంక్షనుకని న్యూ జెర్సీ వెళ్ళారు.

తను తన మనస్సు గురించీ, ఆలోచనల గురించీ, వ్యక్తిత్వం గురించీ చెబుతూ వుండగా నేను అంత ఆత్మన్యూనత చెందుతూపోయాను. ఎన్నో తెలిసిన నేను ఇంట్లో నా స్వంత బిడ్డ మనోవేదని అర్ధం చేసుకోలేకపోయాను. కొన్నేళ్ళుగా దానిని సరిగా అర్ధం చేసుకోకుండా వుంటూ వచ్చాము.  మా ఇంట్లో వారూ నాకంటే ఎక్కువగా తనపట్ల అదే చేస్తున్నా వారించలేకపోయాను. గత రెండున్నర ఏళ్ళకు పైగా తను ఈ ఇంట్లో పడుతున్న సంఘర్షణ, వ్యధ సోదాహరణంగా వివరిస్తూపోయింది. సిగ్గుతో తలవంచుకున్నాను. అంతా విన్న తరువాత అశ్రుధారలతో తనని అక్కున చేర్చుకొని నన్ను క్షమించమని అడిగి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చాను.
 
మా పాపకి మా ఇంట్లో అప్పటిదాకా జరిగిన చిన్న చూపు మరే ఇంట్లో, కనీసం మన బ్లాగర్ల ఇండ్లళ్ళలో జరగకూడడనే అభిలాషతో ఈ పోస్టులు వ్రాస్తున్నాను.

మా పాప మనోభావాలు ఎలా దెబ్బతింటూ వచ్చేయి?

- తను పదిమందిలో కలవదు, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడదు.
అందరితో కలిసిపోతూ మాలా సాధారణంగా వుండొచ్చు కదా అని ఇంట్లో అందరం ఎప్పుడూ మా చిన్న పాపని  ఉదాహరణగా చూపి అలా వుండాలని ఉద్బోధించేవారం. మాకు తోడుగా మా మామయ్య ఇండియా నుండి వచ్చి మనవరాలికి ఎప్పుడూ హిత బోధలు చేస్తుండేవారు.

- తన గదిలో ఎప్పుడూ తన సిస్టంలోనో, ఇంటర్నెట్టులోనో గడిపివేస్తుంది.
తన గదిలోనుండి బయటకి వచ్చి అందరితో కలవమని, ఏక్టివ్ గా వుండమని, తన గదిలోనుండి బయటకి వచ్చి అందరితో పాటు కూర్చొని టివి అయినా చూడమని వత్తిడి చేసేవారం. ఇంటర్నెట్ అడిక్షనుకి లోనయ్యిందని ఎద్దేవా చేసేవారం - పరిమితులు విధించేవారం. అలా మేము వత్తిడి చెసినప్పుడు తను మౌనంగా ఆర్ట్ ఏదో గీసుకుంటూ వుండేది. గదిలోని బయటకి వచ్చినా తన ఆర్ట్ తెచ్చుకొని గీసుకుంటూ గడిపేది.

- ఫంక్షన్ లకు, షాపింగులకు, మాల్సులకు వెళ్ళడానికి ఇష్టపడేది కాదు.
మేము బలవంతంగా బయలుదేరతీసేవారం. అలా మాతో వచ్చినా కారులోనే వుండిపోతానని మొండికేసేది. కోపం వచ్చి అరిచేవారం. ఒకవేల ఒత్తిడి మీద ఫంక్షనులకి వచ్చినా అందరితో కలిసేది కాదు, మౌనంగా వుండేది. అందుకని తనని పట్టించుకోవడం మానివేసేవారం. తనకి ఏక్టివ్ గా వుండటం కన్నా పాసివ్ గా వుంటూ అందరినీ పరిశీలించడం ఇష్టమని గ్రహించలేకపోయాము.

- క్లాసు గదిలో చురుకుగా వుండదనీ, ప్రశ్నలు వేయదనీ టీచర్ల నుండి ఫిర్యాదులు
తరగతి గదిలో చురుకుగా వుండొచ్చు కదా, ఉత్సాహంగా ప్రశ్నలు వేస్తూ విషయం పట్ల ఆసక్తిగా వుండొచ్చు కదా అని తనని ప్రశ్నించేవారం.

- తిండి మీద శ్రద్ధ వుండేది కాదు. బక్కగా, ఒక్కిగా తయారయ్యింది.
ఎందుకు సరిగ్గా తినవని విసిగించేవారం. మా మీది నిరసనతో కూడా సరిగ్గా తినట్లేదని గ్రహించలేకపోయాం.

శుక్రవారం 22 జనవరి 2010

స్కూల్ ఫోబియా! - 1



దాదాపు ఆరు నెలల క్రిందట:


హైస్కూల్ మొదటిరోజు. స్కూల్ బస్సులో ఎక్కడానికని వెళ్ళిన మా పెద్ద పాప 'స్ని' బస్సెక్కకుండానే తిరిగివచ్చింది. నేను ఆశ్చర్యపోయి ఎందుకని అడిగాను.

"నేను బస్సెక్కను, నువ్వే డ్రాప్ చెయ్యి" అంది.

హ్మ్. అది సులభం కాదు. నేను పనికి వెళ్ళేది ఒక వైపు తన స్కూల్ మరో వైపు. ఈ ఒక్కరోజు అయితే ఓకే అని తనని కారులో ఎక్కించుకొని వెళుతూ అడిగాను 'ఎందుకు బస్సెక్కలేదని'.

"రోజూ బస్సులో వెళ్ళను నాకు ఇష్టం లేదు" అంది.

హ? ఎందుకు?

ఏమో నాకు భయంగా వుంది.

కారణాలు అడిగాను లోతుగా. ఏమీ కారణాలు లేవు. "జస్ట్ అలా నాకిష్టం లేదంతే" అంది.

గుచ్చి గుచ్చి అడిగాను.

భయంగా వుంది అంది.

తన భయానికి కారణాలు ఆరా తీసాను. నిజమయిన కారణాలు ఏమీలేవు. నా దగ్గర ఏ విషయమయినా చెప్పే స్వేఛ్ఛ తనకి వుంది. ఏదో దాస్తున్నందని నేను అనుకోను.

"ఏమీ కారణం లేదు. నాకు బస్సులో వెళ్ళడం ఇష్టం లేదంతే" అంది.

ఈలోగా తన స్కూల్ వచ్చింది. తరువాత ఈ విషయం తీరిగ్గా మాట్లడుదాం అని చెప్పి పాఠశాల లోపలికి వెళ్ళింది.
ఆలోచిస్తూనే ఆఫీసుకి వెళ్ళాను. బస్సులో వెళ్ళడానికి ఇదమిద్దమయిన కారణం ఏమీ కనపడలేదు. స్కూల్ ఫోబియా? కావచ్చు. ఇంటర్నెట్టులో దాని గురించి ఇంకా ఇతర కారణాల గురించీ వెతికాను. స్కూల్ ఫోబియా కూడా అయివుండవచ్చు. స్కూల్ అంటే భయాన్ని ఇలా స్కూల్ బస్సు మీద తీర్చుకుంటున్నదేమో.

స్ని ఇంటికి వచ్చాక తీరికగా మాట్లాడాలనుకున్నాను.

(ఇంకా వుంది)

మీకు నటించాలని వుంటే ...


కన్సాస్ లోని మా స్నేహితుడు శ్రీనివాస్ ఒక ప్రముఖ ఛానల్లో ధారావాహిక కోసం యు ఎస్ లో చిత్రీకరించబోతున్నారు. పైలట్ భాగం చిత్రీకరణ మార్చి నెలలో జరుగుతుంది. చిత్రీకరణ ఎక్కువగా కన్సాస్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఎవరికయినా నటించడానికి ఆసక్తి వుంటే నన్ను సంప్రదిస్తే వారికి శ్రీనివాస్ కాంటాక్ట్స్ తెలియజేయగలను.    

యు ఎస్, కెనడాల్లోని ఇతర ప్రాంతాల ఔత్సాహికులకూ ఆహ్వానమే. మీ వీలూ, ఇతర వివరాలు, మీకు తగ్గ పాత్ర మొదలయిన వివరాలు శ్రీనివాస్ తో వివరంగా మాట్లాడవచ్చును. ఈ సీరియల్లో నేను, మా కుటుంబ సభ్యులు కొందరు కూడా పాల్గొనే అవకాశం వుంది.  మీకెవరికయినా ఆసక్తి వుంటే మాకు కూడా తోడు వుంటుంది. అందుకే ఈ ప్రకటన.  

మరో ఎత్తు చూపులు


నా ఒకానొక కోడలిని ఎత్తు కారణంగా పెళ్ళికి తిరస్కరించానని చెప్పాను కదా. మళ్ళీ అలాంటిదే ఒకటి అయ్యింది. మా ఫ్రెండ్ వేణుకి తెలిసిన అమ్మాయి ఈమె. పేదవారు. సూర్యాపేటకు దగ్గర్లోనే ఒక పల్లెటూరు వాళ్ళది. ఈమె మాత్రం హైద్రాబాదులో ఏదో చిరుద్యోగం చేసుకుంటూ వుండేది. తండ్రి వీర తాగుబోతు. ఆ అమ్మాయి మీద రకరకాల పుకార్లు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ రావడం లేదు. 

ఆ అమ్మాయితో ఇదివరకు నాకు కొద్దిగా పరిచయం వుంది. సూర్యాపేటలో ఒక సామాజిక సేవా సంస్థలొ ఆమె పనిచేస్తున్నప్పుడు కొద్దిరోజులు నేను కూడా స్వచ్చందంగా ఆ సంస్థలో పని చేసాను. అప్పుడు కలిసి పనిచేసాము. వాళ్ళు పేదవారయినా, తండ్రి తాగుబోతు అయినా, ఆమెకు ఇతరులతో పెళ్ళికి ముందు ప్రేమలున్నా, సంబంధాలున్నా అది మనకు సమస్య కాదు. ఆ అమ్మాయిని ఇదివరకే చూసాను కాబట్టి ఎలా వుంటుందో తెలుసు. గొప్ప అందగత్తె కాకపోయినా ఫరవాలేదు. నాకు నచ్చింది. కాకపోతే నాకంటే ఎత్తు ఏమో అన్న సంశయం.   

ఆమెతో మాట్లాడి అలాగే ఎత్తు విషయం చూడటానికని వాళ్ళ ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళాను. చక్కగా మాట్లాడుకున్నాము. ఆమ్మాయీ, మర్యాదా, మన్ననా అన్నీ నచ్చాయి. నిలబడి ఎత్తు చూసుకున్నాము. హ్మ్. నాకంటే ఎత్తే! నాకు ఎటూ పాలుపోలేదు. నా నిర్ణయం మా ఫ్రెండు ద్వారా తెలియజేస్తానని చెప్పి బయటపడ్డాను.

నా దగ్గరి స్నేహితులతో చర్చించాను కానీ ఎటూ నిర్ణాయించుకోలేకపోయాను. ఆమెతో కొద్ది పరిచయం ఇదివరకే వుంది కనుక ఆ అమ్మాయి మంచిదని నాకు తెలుసు. ఆమెను పెళ్ళిచేసుకుంటే ఒక పేద కుటుంబానికి సహాయం చేసినట్లవుతుందనీ తెలుసు. ఎటూ నిర్ణయించుకోలేక నిర్ణయాన్ని కొద్ది రోజులువాయిదా వేసాను.

ఇలా పెళ్ళి చూపులు జరిగిన విషయం వాళ్ళ ఆఫీసులో తెలిసిందిట. ఈ సంబంధం అన్నా కుదురుతుందేమోనని ఆఫీసులోని ఆమె శ్రేయోభిలాషులు తరచుగా ఈమెను కనుక్కుంటుండేవారట. ఇంకా నిర్ణయం రాలేదని చెప్పేసరికి వారు ఈమె మీద జాలిపడేవారుట. ఈ విషయాలు ఆమె నా ఫ్రెండుకి చెప్పింది. అతని ద్వారా ఈమె సంగతులు తెలుస్తుండేవి.    

అనేక తర్జనభర్జనల మీదట ఆమెను తిరస్కరిస్తూ నిర్ణయించుకున్నాను. ఇప్పుడామె ఎక్కడ వుందో, ఏం చేస్తుందో తెలియదు. ఆ తరువాత ఆమె ఎప్పుడూ నాకు తటస్థపడలేదు. ఎత్తు కారణంగా మరో చక్కటి అమ్మాయిని దూరం చేసుకున్నానా అనిపిస్తుంది. అవసరం వున్నవారికి సహాయం చేస్తేనే ఆ సహాయానికి సార్ధకత వుంటుంది కదా.  అలాంటి సహాయం చెయ్యగలిగి కూడా... చెయ్యలేకపోయానే అన్నది గుర్తుకువస్తే మనస్సు చివుక్కుమంటుంది.  ప్చ్!

బుధవారం 20 జనవరి 2010

అవతార్ రెండో సారీ చూసేగా!


ఈమధ్య బ్లాగుల్లో అవతార్ గురించి నెగటివ్ ట్రెండ్ మొదలయ్యింది. అవతారుకి అదేదే బెస్ట్ సినిమా, కథ అవార్డులు రావడంతోనే అదంటే అసహ్యం మొదలయ్యింది కొందరికి! అవతార్ ఒక్కసారి చూసామంటేనే అదోలా చూస్తున్నారు జనాలు.  ఇక రెండోసారి నేను చూసానంటే నన్ను ఇంకా ఎలా చూస్తారో, ఎలా అంచనా వేస్తారో ఈ జనాలు :( 

రౌడీ ఈసినిమా చూసి అడవులు పట్టిపోయారుట - తన తోకని దేనికి తగిలించాలా అని వెతుకుతూ అలా అలా అంతర్ధానం అయ్యారుట. మళ్ళీ వారిని ఈ జనజీవన స్రవంతిలో కలపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. ఇంకో బ్లాగరూ 'ఇదేం అవతారం మహా ప్రభో' అని వ్రాసారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రెండో సారి సినిమా చూసానంటే  కామెంట్స్ అనే రాళ్ళ ద్వారా జనాలు నన్ను కొడుతారేమోనని భయంగానే వుంది :(

తొందరపడకండి, నా మీద రాళ్లలాంటి కామెంట్స్ విసరకండి. నేను ఎందుకు ఆ సినిమా రెండో సారి చూసానో, ఎందుకు అలా చూడాల్సివచ్చిందో ఈ దీనుడి దీనగాధని అర్ధం చేసుకోండి. అబ్బో, నీ సంగతి మాకు తెలియదా నవి హీరోయిన్ను చూడటానికి వెళ్ళావంటారు కదూ. హి హీ, కొంత నిజమే, కాదన్ను.

ఇంతకుముందు ఐమాక్స్ లో చూసా కదా ఇప్పుడు రియల్ 3D లో చూస్తే ఎలా వుంటుందా అని చూడటానికి కూడా వెళ్ళాను కానీ అదే ప్రధాన కారణం కాదు.  సినిమాను మరోసారి అనుభవించడానికి వెళ్ళాను కానీ అదీ ప్రధాన కారణం కాదు. మరెందుకు? ఇందుకు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆఫీసులో వున్నా, ఇంట్లో వున్నా ఓ ఇరవై నిమిషాలు కునుకు తీస్తాను. ఆఫీసులో అయితే గది తలుపు వేసుకొని కునుకు తీయడమో లేక కళ్ళు తెరచి వుంచే  కంప్యూటర్ కేసి చూస్తూ పవర్ న్యాప్ తీయడమో చేస్తుంటాను.

మొదటిసారి అవతార్ సినిమాకు మ్యాట్నీ షోకి వెళ్ళాము. కొద్దిసేపయ్యాక నిద్ర విపరీతంగా ముందుకువచ్చింది. హాయిగా ఓ ఇరవై నిమిషాలు కునుకు లాగించాను. ఆ సినిమా జోరులో వుండి మా ఆవిడ గానీ, పిల్లలు కానీ నా నిద్రని గమనించలేదులెండి. అలా గప్‌చుప్ గా లాగించాను కానీ ఆ ఇరవై నిమిషాలూ ఆ చిత్రరాజాన్ని మిస్సయ్యాను కదా అన్న అపరాధభావన నన్ను దహించివేస్తూ వచ్చింది. ఇక తాళలేక మా పిల్లలని వెంటేసుకొని  గత వారం మళ్ళీ సినిమాకి వెళ్ళాను.  మళ్ళీ మ్యాట్నీకే వెళ్ళాం అనుకోండి కానీ ఈ సారి జాగ్రత్తగా వ్యూహ రచన చేసాను. ఇంతకుముందు నిద్రపోయినప్పటి సన్నివేశాలు జరిగిపోయేదాకా ఆగి అప్పుడు ఎంచక్కా కునుకులోకి వెళ్ళాను. అలా మొత్తం మీద సినిమా మొత్తం కవర్ చేసేనన్నమాట. సెబ్బాశ్!

ఇంటికి వచ్చాక ఆనందం ఆపుకోలేక మా ఆవిడకి అసలు రహస్యం - అనగా ఈ సినిమా ఎందుకు రెండో సారి చూడాల్సివచ్చిందీ చెప్పాను. నా వైపు అదోలా చూసింది. మీరెలా చూస్తున్నారు ఇప్పుడు నా వైపు?  

అవతార్ సినిమా గురించి మా చిన్న పాప కామెంట్: మోదటి పది నిమిషాలే 3D. తరువాత అంతా రిప్ఆఫ్ (లాగే వుంది)!  (IMax or Real 3D)

అయిననూ చూసి తీరవలె...


హమ్మ, హమ్మ ఎంత కుట్ర, హెంత కుట్ర! బ్లాగులోకంలో నాకు తసమదీయులు వున్నారని తెలుసుగానీ ఇంతమంది తసమదీయులు వున్నారనిన్నూ, ఇంతలా నా మీద కుట్రలు చేస్తారనిన్నూ ఊహించలేకపోయాను. గత టపాలో 'అదుర్స్' అనే చిత్రరాజమును చూస్తే బాగుండేదేమో అన్న కోరికను కొద్దిగా బయటపెట్టాను. అంతే నా శ్రేయోభిలాషుల ముసుగులో నా శత్రువులు అంతా చేరి నన్ను ఆ చిత్రాన్ని చూడొద్దు చూడొద్దు అనే ఒహటే రకరకాల వర్ణనలతో భయపెట్టారు. 

నేను ఎక్కడ Jr. NTR స్టెప్పులకు పడిపోతానో లేక మా బ్రాహ్మి కామెడీకి పరవశించిపోతానో లేక షీలా అందాలను మైమరచిపోతానో అని ఈ అందరి కుట్ర, దగా. పోనీ వద్దులెండి అని అందరూ మామూలుగా చెప్పారా? లేదు, రకరకాలుగా ఆ సినిమాను వెగటుగా వర్ణించి చెప్పారు. హమ్మ హమ్మ ఇంతమంది నా మీద కుట్ర చేసి ఆ సినిమా చూడవద్దంటున్నారూ అంటే ఆ సినిమా తప్పకుండా గొప్పదయ్యే వుంటుంది.  అలా అని నేనేదో Jr. NTR వీరాభిమానిని అనుకునేరు - అస్సలు కాదు. అలా అని షీలాకు వీరాభిమానిని కాదు గానీ ఆమె కాస్త నచ్చుతుంది. ఇదివరలో ఈ చిత్రరాజాన్ని చూడాలని పెద్దగా వుండేది కాదు కానీ మీరందరూ కట్టగట్టుకొని వద్దంటున్నారు కాబట్టి నాలో ఆ సినిమా చూసి తరించాలనే పట్టుదల పెరిగింది. నేను ఆ సినిమా చూడాల్సిందే, నన్నాపకండి, నన్నాపకండి.  

పాపం పవన్ ఒక్కడే నా నిజమయిన శ్రెయోభిలాషి. అతనొక్కడే ఆ సినిమా ధైర్యంగా చూసెయ్యమని నైతిక ధైర్యం ఇచ్చేడు.  అతగాడిని చూసి నేర్చుకోండి అందరూనూ. ప్రోత్సాహం అంటే అలా వుండాలి! నామీద ఎంత కోపం వున్నా ఇలా ఓ చక్కటి చిత్రాన్ని నాకు దూరం చేయాలని మీకు ఎలా అనిపించిదీ అని నిలదీసి ప్రశ్నిస్తున్నా! మీకే కనుక హృదయం వుంటే నన్ను ఈ సినిమా చూడమని వెంఠనే ప్రోత్సహిస్తారు.   

మీరెంత నిరుత్సాహపరచినా నేను ఆ సినిమా చూడటం ఆగను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను! చూసి మీ కుట్రలన్నింటినీ భగ్నం చేయకపోతే నా పేరు శరత్తే కాదు. రండి, ఎవరు నా హితులో లేక శత్రువులో ఇప్పుడే తేలిపోవాలి. మీరు ఎటువైపు అనేది ఇప్పుడే, ఇక్కడే తక్షణం నిర్ణయించుకోండి. ఎవరయితే అదుర్స్ చూడవద్దంటున్నారో వారిని తసమదీయుల లిస్టులోకి వెళతారు. అనగా బ్లాకు లిస్టన్నమాట. అనగా నల్లకాగితం మీద తెల్లగా మీ పేర్లన్నీ వ్రాసి పెట్టుకుంటానన్నమాట. 

అవునూ మాయాబజార్ సినిమా చూసి చాలాకాలమయ్యింది. తసమదీయులు అంటే ప్రత్యర్ధి వర్గం వారే కదా?

మంగళవారం 19 జనవరి 2010

నమో అదుర్స్?


నిన్న 'అదుర్స్' సినిమాకు అని బయల్దేరాము. దారిలో ఇది చూడాలా లేక 'నమో వెంకటేశా!' చూడాలా అని చర్చ. ఏది బావుంటుందో, దేంట్లో ఎక్కువ హాస్యం వుంటుందో అర్ధం కాలేదు. బ్రహ్మి రెండు సినిమాల్లోనూ వున్నాడాయే. ఇలా లాభం లేదని మరో రకంగా వ్యూహరచన చేసాను. నమోలో ఒక్క హీరోయినే, అదే  అదుర్సులోనయితే ఇద్దరు హీరోయిన్లు! ఒక్క టిక్కెట్టుకి రెండు పిట్టలు! నమో హీరోయిన్ త్రిష నాకు నచ్చదు - బక్కగా, ఒక్కిగా వుంటుంది ముఖం. అదుర్స్ లోని నయన కూడా ఈ మధ్య గ్లామర్ తగ్గి నచ్చడం లేదు. ఇక మిగిలింది అదుర్సులో షీలా. ఆమె బావుంటుంది కాబట్టి అదుర్స్ కే జై కొట్టాను నేను. కారులో వున్న మా ఇంటి సభ్యులనీ ఒప్పించాను.         

తీరా హాలులోకి వెళ్ళాక అదుర్స్ ఇంకా రెండు గంటల తరువాత అనీ, నమో వెంటనే అని తెలిసింది. చేసేదిలేక నమోలో దూరాము. సినిమా వేళలు మా ఆవిడ తప్పుగా చూసినందువల్ల ఈ ఇబ్బంది ఏర్పడింది.

ఇంటర్వెల్:
ఇది కాకుండా అదుర్స్ చూసివుంటే బావుండేదేమో అని నేనూ మా ఆవిడా అనుకున్నాము.

సినిమా చూసాక కారులో తిరిగివస్తూ:
ఈ సినిమా థియేటరులో చూసి ఇన్ని డబ్బులు తగలేసేదానికన్నా హాయిగా డివిడిలో చూస్తే సరిపోయేదేమో అని నేనూ మా ఆవిడా అనుకున్నాము. మా చిన్న పాపకి మాత్రం ఏ సినిమాలోనూ లేనంత ఫన్ ఈ సినిమాలో కనిపించిందిట. మా పెద్ద పాప ఈ సినిమాకి రాలేదు. తనకు తెలుగు సినిమాలంటే ఎలెర్జీ. ఏడుపులూ, తూడుపులూ, ముక్కోణపు ప్రేమ కథాంశాలూ  గట్రా అంటే దానికి యమ చిరాకు. అది ABCD ( America-Born Confused Desi) మరి!    

నమో కన్నా అదుర్స్ చూసివుంటే బావుండేదేమో అనుకున్నాము. దూరపు కొండలు నునుపు కదా!      

నవతరంగం కెలుకుడు క్యాన్సిల్!



నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. నా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ నాకు చెప్పకుండానే 'ఓ వర్షం కురిసిన రాత్రి' అనుకుంటా సినిమా పేరు (తారాగణం, శరత్ బాబు, సిల్క్ స్మిత అనుకుంటా) వెళ్ళివచ్చారు. అది సస్పెన్స్ సినిమా. నాకు అలాంటి సినిమాలు అంటే బాగా ఆసక్తి. నాకు చెప్పకుండా సినిమాకు ఎందుకెళ్ళారు, చెబితే నేనూ వచ్చేవాడిని కదా అని కోప్పడ్డాను. దానిదేముంది లేరా, కావాలంటే స్టొరీ చెప్పేస్తాములే అన్నారు. వద్దు బాబూ, మీరు స్టొరీ, సస్పెన్స్ అంతా చెప్పేస్తే ఇంకా ఆ సినిమాలో చూడటానికి  ఏముంటుంది అన్నాను. అప్పుడు వారిద్దరికీ లైటు వెలిగింది. నా బలహీనత వారికి బాగా అర్ధమయ్యింది. నా పెడరెక్కలు విరిచి గట్టిగా పట్టుకున్నారు. నా మీద అఘాయిత్యం చేసారా? లేదు. అదయినా ఓకేనేమో కానీ నా మనస్సు పైన అఘాయిత్యం చేసేరు :( నన్ను గట్టిగా పట్టుకొని బలవంతంగా సినిమా కథ, సస్పెన్స్ అంతా చెప్పేసారు :(( ఇంకా నా బొంద ఏముంది ఆ సినిమా చూడటానికి - ఇక చూడలేదు ఆ సినిమా. 

నవతరంగం సైటులో Paranormal Activity సినిమా సమీక్షలో ఇంటెన్షనలుగా, టెన్షనలుగా, ఆత్రంగా, అర్జంటుగా ఆ సినిమా కథ అంతా చెప్పి సస్పెన్స్ కూడా విప్పజెప్పేసరికి నాకు బాగా మండింది. సస్పెన్స్ సినిమాల అభిమానిగా నా మనోభావాలు బలాత్కారానికి గురయ్యాయి. హ్మ్మ్. ఎప్పటినుండో ఆ సినిమా చూద్దామనుకుంటున్నాను కానీ ఇంకా వీలు కుదరలేదు. ఇంకా ఏం చూస్తాను ఆ సినిమా? అసలే ఆ సినిమా అంతంత మాత్రం, అంత సీను లేదంటున్నారు - ఇదిగో ఈ మహానుభావుడు వున్న ఆ కాస్తా గుట్టు విప్పేసారు, ఇంకేం చూస్తాం ఆ సినిమా - నా ఖర్మై!  రచయితకు తన పొరపాటు నాతో పాటు ఇతరులు సూచించినా సరిదిద్దుకోలేదు పైగా వివిధ కారణాలతో సమర్ధించుకుంటున్నారు!

వ్యాస రచయితకు ఆ సినిమా బొత్తిగా నచ్చకపోవచ్చు - అంతామాత్రాన సినిమా కథ అంతా పూసగుచ్చినట్లు చెప్పేసి సప్సెన్స్ తేటతెల్లం చేయడమేనా! ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవచ్చు కానీ కథ చెప్పడం ఏంటీ అదీ కావాలని చేసారంట. అంత ఇంటెన్షను , టెన్షను ఎందుకు?! కామన్ సెన్స్ వుండాలంటే తనకు కామన్ సెన్స్ లేదంటున్నారు. కామస్ సెన్స్ లేనప్పుడు కాంగా కూర్చోవాలి. తను కూడా సినిమా నిర్మించడమో, దర్శకత్వం వహించడమో చేయబోతున్నారని తెలుస్తోంది. వారి సినిమాలో గుర్రాన్ని బండి ముందు కాకుండా బండి వెనకాల కట్టివేసినట్లు ముందు సస్పెన్స్ చెప్పి తరువాత కథ చెబుతారేమో ఈ క్రియేటివ్ డైరెక్టర్! ప్రతి గొప్ప సినిమా కూడా కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. సినిమా నచ్చకపోయినంతమాత్రాన ఇతరులు ఆ సినిమా చూడవద్దంటూ కుట్ర చేయడమేనా?  అదీ నవతరంగం లాంటి సినిమాల మీద ఆసక్తి,అనురక్తీ,భక్తి ఉన్న కొంతమంది ఔత్సాహికుల కోసం ఉన్న ఒక వేదికలో?!  (కత్తి మహేశ్ సూచన మేరకు ఎడిట్ చేయడమైనది)


నాకూ సిక్స్త్ సెన్స్ సినిమా నచ్చలేదు మొదట్లో. కెనడాకి వెళ్ళిన కొత్త రోజులవి. ఆ సినిమా చాలా గొప్పదని విని నేనూ, మా అల్లుడు రవి ఆ సినిమాకు వెళ్ళాము. సినిమా చూస్తున్నంత సేపు ఎవరి జుట్టు వాళ్ళం బాగా పీక్కున్నాం. సినిమా చూసేసాక ఇది అందరూ అంత గొప్ప సినిమా అంటూ ఎందుకుంటారో తెలియక బాగా గొణుక్కున్నాం. కొద్ది రోజుల తరువాత అదే విషయం మా ఫ్రెండ్ దగ్గర ప్రస్థావించి ఆ సినిమా గురించి హేళనగా నవ్వాము. "ఓరి ఎర్రి పప్పల్లారా" అని మా ఫ్రెండు సినిమాలోని అసలు గొప్పదనం ఒక్క ముక్కలో చెప్పాడు! అప్పుడు ఆలోచిస్తే సినిమా ఉల్లిగడ్డ పొరలు, పొరలుగా విప్పదీసినట్లుగా మాముందు ఒక్కో సన్నివేశం అవిష్కృతి అయ్యి ఆ సినిమా డైరెక్టర్ నైట్ శ్యామలన్ కు జోహార్లు అర్పించాము. ఇప్పటికీ ఎవరయినా ఆ సినిమా చూడకపోతే అర్జంటుగా చూసెయ్యండి - అర్ధం కాకపోతే నన్నడగండి :)   

సప్సెన్స్ సినిమాలకి సస్పెన్సే ఆయువుపట్టు. ఇప్పుడు పైన సిక్స్త్ సెన్స్ సినిమా విషయం చెప్పాను కాబట్టి సినిమాతో పాటే అసలు విషయం ఒక్క ముక్కలో చెప్పేస్తే సస్పెన్స్ సినిమా అభిమానులకు నా నెత్తి మీద ఒఖ్ఖటి పీకాలనిపిస్తుందా  అనిపిస్తుందా లేదా?    ఆ సినిమా వ్యాసం మీది కామెంటులో ఒక బ్లాగర్ సిక్స్త్ సెన్స్ సినిమా సస్పెన్స్ కూడా చెప్పేసారు. క్రింద ఆ వ్యాసం లింక్ ఇస్తున్నాను - ఆ సినిమా చూడని వారుంటే జాగ్రత్త మరి!   అలాగే ఆ వ్యాసం చదివితే పారా నార్మల్ ఏక్టివిటీ సినిమా అంతా తెలిసిపోతుంది జాగ్రత్త.
http://navatarangam.com/2010/01/paranormal-activity/


ఆమధ్య ఎవరో జేంస్ కామెరూన్ హాలీవుడు శ్యామాసుందర్ రెడ్డి అని ఒక హాస్యస్పదమయిన పోస్టు వేసారు. ఇంకా ఇలాంటి దృష్టాంతరాలు కొన్ని వున్నాయి. నవతరంగంలో 999 వ వ్యాసం, 1000 వ వ్యాసం అనుకుంటూ చంకలు కొట్టుకోవడమేనా లేక కనీస ప్రమాణాలు పాటించేదేమన్నా వుందా అంటూ నవతరం వారి బాధ్యతారాహిత్యాన్ని నిశితంగా విమర్శిస్తూ చాలా వ్రాద్దామనుకున్నాను. మమ్మల్ని సినిమాలు ఏమయినా చూడనిస్తారా లేక సినిమా కథలు అన్నీ విప్పదీసి చెబుతారా అని గట్టిగా ప్రశ్నించాలనుకున్నాను. అయితే అందులో 1000 వ్యాసం సందర్భంగా  వారి యొక్క సిమ్హావలోకంలో ఇకపై నవతరంలో వచ్చే అన్ని వ్యాసాలు ముందుగా పరిశీలించబడి ఆమోదించబడుతాయి అని నిర్ణయించారు.

"అలాగే ఇక పై అన్ని వ్యాసాలు మా ఎడిటోరియల్ టీం approve చేశాక మాత్రమే నవతరంగంలో వ్యాసాలు ప్రచురింపబడతాయి."


సంతోషం - ఇంకా ఇప్పుడు నవతరంగాన్ని కెలకడానికి ఏమి మిగిలిందీ? ఇక నైనా అందులో కనీస ప్రమాణాలు పాటిస్తారని ఆశించవచ్చును.  నవతరంగం సైటులో Paranormal Activity  ఇకముందయినా తగ్గుతుందని ఆశిస్తాను!  వాళ్ళేదో నా లాంటి వారి మాట ఏదో పట్టించుకుంటారని కాదు కానీ నా బాధ్యతగా నేను చెప్పేయడం అంతే. నా దురద నేను తీర్చుకోవడం అంతే.     

సోమవారం 18 జనవరి 2010

లేడీ గాగా


కొన్ని నెలలక్రితం గే హక్కుల సభ జరిగినప్పుడు అందులో పాల్గొని ఆ ఉద్యమానికి మద్దతుగా ఈ సింగర్ మాట్లాడినట్లు వార్తలు రావడంతో ఎవరబ్బా ఈ సింగర్ అని అభిమానం పెంచుకొని ఆసక్తిగా ఆమె గురించి చూసాను. ఆమెది అదో రకమయిన అందం. అసలు అందం కంటే ఆకర్షణే ఎక్కువగా వున్నట్లు అనిపిచింది ఆమెను చూస్తుంటే. ఆమె భావాలూ, వెరయిటీ షోలూ నాకు ఆసక్తిగా అనిపించాయి.

2009 సంవత్సరంలో గాయక ప్రపంచంలో బాగా ఎదిగింది. ఇప్పుడు యు ఎస్, కెనడాల్లో ఈమె అంటే బాగా క్రేజ్ ఏర్పడింది. ఈమె తరచుగా వార్తల్లో వుంటోంది. విచిత్రమయిన వేషధారణతో, ప్రయోగాత్మక మయిన, వైవిధ్యమయిన, ఊహకు అందని విన్యాసాలతో, డైనమిక్ గా ఈమె అలరింపజేస్తోంది.

ఇంగ్లిష్ పాటలు నాకు అర్ధం కావూ, ఆసక్తి లేదు కనుక ఈమె ప్రాముఖ్యత గురించి ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నాను. ఆయా విషయాలపై పట్టు వున్నవారు ఈమె గురించి మనకందరికీ వివరంగా పరిచయం చేస్తే బావుంటుంది.

కెలకడానికి...



మీరందరూ గమనిస్తున్నారో లేదో కానీ బ్లాగావరణంలో చిన్న అగ్గి నడుస్తోంది. ద్రౌపది విషయం అంత పెద్దది కాదు లెండి అది. దాన్ని రాజెయ్యాలని నాకు మహా మంటగా/ఆసక్తిగా వుంది కానీ ఎక్కువగా వివాదం కాకముందే అది సరిదిద్దబడుతుందేమో అని చూస్తున్నాను. అందుకు గాను కొంత సమయం వేచి వుండదలిచాను. ఇప్పటికీ రెండు రోజులుగా పరిశీలిస్తున్నాను కానీ ఇతరులు సూచిస్తున్నా కూడా అక్కడ దిద్దుబాటు చర్యలు ఏమీ కనపడటం లేదు.


మా సమయం ప్రకారం మంగళవారం ఉదయం వరకూ చూసి అప్పటికీ కొందరికిగానీ, ఆయా పెద్దలకి గానీ జ్ఞానోదయం కాకపోతే ఆ విషయమై డప్పు కొట్టాలని చూస్తున్నాను. అందువల్ల కొందరిలోనయినా ఒక విషయం మీద కాస్తయినా స్పృహ పెరుగుతుంది ఆశాభావం నాకు వుంది. మెదడు మోకాల్లో వుండటం అంటే ఏంటో మీకు మరొక ఉదాహరణ తెలుస్తుంది.


Stay Tuned!

ఆదివారం 17 జనవరి 2010

శుక్రవారం 15 జనవరి 2010

పెల్లెటూరి కోడలితో పెళ్ళి ప్రయత్నాలు


ఈ అమ్మాయి పేరు మంజరి అనుకుందాము. మంజరి మా కజిన్ చిన్న బిడ్డ. బావుంటుంది, మర్యాద, మన్నన, మంచితనం. నాకు బాగా దగ్గరి చుట్టాలమ్మాయే కావడంతో ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. వారి కుటుంబం కూడా చాలా చక్కనిది. తనకు తండ్రి చిన్నప్పుడే పోయారు. అక్క పేదరికంతో పిల్లలని ఎలాగోలా నెట్టుకువస్తోంది. ఈ అమ్మాయిని పెళ్ళి చెసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికీ కొంత అండగా వుండవచ్చు అనుకున్నాను. మనకు కట్నాల పట్టింపులు ఏమీ లేవు కాబట్టి అలా కూడా వారి సమస్య తీర్చినట్లుంటుంది.

ఊరికి వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళి తప్పక గడుతుండేవాడిని. ఆ ఇంట్లోని పిల్లలూ, పెద్దలూ నన్ను బాగా ఆప్యాయంగా చూసుకుంటారు. మా అందరి మధ్య మంచి అనుబంధం వుంది. వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వారి ఇంటిలో ఒక సభ్యుడిగా కలిసిపోయేవాడిని. నా చిన్న కోడలు మంజరితో సహా పెద్ద కోడలు, అల్లుడు కూడా వాళ్ళ చిన్నప్పటినుండీ నాతో ఆడుతూ, పాడుతూ తిరిగిన వారే. వాళ్ళింటికి వెళితే నన్ను ఇక వదలనే వదలరు. బ్యాక్ గ్రవుండ్ అంతా బావుంది - భేష్ కదూ.      

...కానీ వారి నుండి పెళ్ళి ప్రస్థావన మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. మరి స్థాయి, హోదా, ఆస్థి గట్రాలలో అంతరాల వల్ల ధైర్యం చేయలేదా మరేదన్నానా అనేది నాకు తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికని నా క్లోజ్ ఫ్రెండ్ వేణుని వురమాయించాను. అతను మా ఊరెళ్ళి మా కజిన్ కుటుంబంతో మాట్లాడి వ్యవహారం అంతా దాదాపుగా చక్కబెట్టుకొని వచ్చాడు. భేష్. ఇంకా బావుంది. వాళ్ళకీ నేను బాగా ఇష్టమే కానీ పెళ్ళి గురించి అడగడానికి మొహమాటపడుతున్నారంట. సో, అన్ని సమస్యలు తీరాయి. కాదు - ఇంకో సమస్య, ముఖ్యమయిన సమస్య వుంది.   

కొన్నిట్లో నావి రాడికల్ భావాలు. అవి నాకు ముఖ్యం. వాటితో ఆ అమ్మాయి ఏకీభవించాలి కదా. ఆమెతో చక్కటి స్నేహం వున్నా ఈ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎంత చక్కటిదయినా నా భావాలతో ఏకీభవించలేకపోతే ప్రయోజనం లేదు. అందుకే మంజరితో ఏకాంతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అయితే పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇంకొకటి వుంది. అది ఎత్తు.

అవును. ఎత్తు. నేను కాస్త పొట్టి. అమ్మాయి నాకంటే ఎత్తు వుంటే నాకు ఇష్టం వుండదు. ఆ రోజుల్లో మా ఫ్రెండు వేణునే కాకుండా ఇంకొక దగ్గరి బంధువు కూడా తమ కంటే ఎత్తయిన పెళ్ళాన్ని చేసుకొని పడుతున్న అష్టకష్టాలు నాకు తెలుసు. ఎత్తు వున్న భార్యను గమనించకుండా ఎటన్నా నడిచివెళుతున్నపుడు తమ భార్యలని మూడు అడుగుల దూరంలో నడవమని ఆదేశించేవారు వాళ్ళు! ఎత్తు వున్న పెళ్ళాంతో వచ్చే కష్టాలు పగవాడిక్కూడా వద్దని నాకు మా ఫ్రెండు వేణు ఎప్పుడూ సినిమా స్కోప్లో చెబుతుండేవాడు (అప్పుడు ఐమాక్స్ లు లేవు మరి).  తన జీవితం ఎలా అయిపోయినా తన మిత్రుడి - అనగా ఈ శరత్తు జీవితం అయినా సరి అయిన ఎత్తులో వుండాలని మా వేణు కంకణం కట్టుకొని ఒక టేప్ పట్టుకొని తిరుగుతుండేవాడు.  

 అన్నిరోజులు ఆ అమ్మాయితో స్నేహంగా వున్నా ఈమధ్య తాను ఎత్తుపెరిగిందేమో అని సంశయం. ఆమె దాదాపుగా నా ఎత్తో, నాకంటే ఎత్తో వుండే సూచనలు వున్నాయి. నా ఎత్తు అయితే ఎలాగోలా కష్టకష్టంగా అడ్జస్ట్ చేసుకొవచ్చు కానీ నాకంటే ఎత్తయితే? బాప్ రే బాప్.. వద్దు వద్దు. మరి ఎత్తు సంగతి ఏం చేద్దాం అని వేణుని అడిగాను. నేను వున్నా కదా అని నన్ను మేము వుంటున్న సూర్యాపేట నుండి మా స్వంత ఊరు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మిత్రుని ఇంట్లో నన్ను కూర్చోబెట్టి టేప్ తీసుకొని మంజరి ఇంటికి వెళ్ళాడు. 

మా ఫ్రెండు ఇంట్లో కూర్చొని వున్న నాకు తెగ సస్పెన్స్. ఎత్తు సరిపోతుందో లేదో అని. అక్కడున్న మా ఫ్రెండు వెంకట్ రెడ్డితో దీని గురించే చర్చలు. కొద్ది సేపు అయాక ముఖం వేళాడేసుకొని వచ్చాడు వేణు. విషయం అర్ధమయ్యింది. నాకంటే దాదాపు రెండు అంగుళాలు ఎక్కువ ఆ అమ్మాయి. దీర్ఘంగా నిట్టూర్పు విడిచాను.  హ్మ్మ్

ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనుకుంటాను - చక్కటి అమ్మాయిని మిస్సయ్యానని. ప్చ్!    ఆ తరువాత ఆ అమ్మాయికి ఒక పేద అబ్బాయితో పెళ్ళి అయ్యింది. కొంతకాలం నుండి కొద్దిగా జీవితంలో పైకి వచ్చినట్లున్నారు. నా గురించి ఆ అమ్మాయి మనస్సులో ఏం వుండేదో ఎప్పుడూ కనుక్కోలేకపోయానే అనిపిస్తుంటుంది. ఎందుకో చాలా స్నేహితంగానే వున్నా కూడా ఆమె మనస్సులోకి తొంగిచూడలేకపోయాను. ఒకవేళ చూసివుంటే - ఒకవేళ అమ్మాయికీ నా మీద అనురాగం వుండివుంటే ... ఎత్తుని త్యాగం చేసేవాడినేమో!...ఏమో? ఏంటో కొన్ని కొన్ని బంధాలు ఇలాగే అస్పష్టంగా మిగిలిపోతుంటాయి - ఎందుకిలాగా? అర్ధం కాదు. అదీ జీవితాల్లో ఒక భాగం కాబోలు.

ధూం ఆయారే :))

గత సంవత్సరం చాలామందిని హాస్యంగా, కొండకచో అసంబద్దంగా కెలికిన ధూం మళ్ళీ బ్లాగు జీవన స్రవంతిలోకి వచ్చారు. ఒకే వ్యక్తిలో సమర్ధతా, అసంబద్ధతా చూడాలనుకుంటే ధూంలో చూడవచ్చు. హాస్యంగా ఇతరులని ఎంత విమర్శిస్తారో, కొన్ని సార్లు వారి అభిప్రాయాలు చూస్తే హెమీ అర్ధం కాక జుట్టు పీక్కోవలనిపిస్తుంది. ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలంటే అప్పుడప్పుడు వారిలో మార్తాండను కూడా చూడవచ్చన్నమాట! 

చాలాసార్లు సునిశిత హాస్యంతో సమర్ధవంతంగా వ్రాసినా కొన్నిసార్లు తాము పట్టిన కుందేటీకి మూడే కాళ్ళు అన్న పద్ధతిలో అలా అర్ధం పర్ధం లేకుండా అలా వేలాడుతూనే వుంటారు. కొంతమంది దానికి స్లీజీ బ్లాగు అని బిరుదు ఇచ్చారు. అలాంటి గొప్ప బ్లాగు కొంతకాలంగా మూతపడిపోయి ఇదిగో ఇవ్వాళే మళ్ళీ లేచింది. 

అప్పట్లో వారు చాలామందిని కెలికినా కూడా  కూడలిలో వస్తూనేవుండేది. కూడలి నిర్వాహకులు వీవెన్ ని కూడా కెలికేసరికి నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని వారు అనుకున్నారేమో ధూం బ్లాగుని కూడలి లోనుండి పీకి పారేసారు :)) అందుకే అది ఇప్పుడు హారం, జల్లెడ సంకలినిలల్లో మాత్రమే మీకు కనపడుతుంది.

ఇలా ధూం గురించి వ్రాసినంత మాత్రాన, అక్కడ కామెంట్లు వేసినంత మాత్రాన, వెల్కం బ్యాక్ అని ఆహ్వానించినంత మాత్రాన వారిని నేను పూర్తిగా, అన్ని విషయాలలో సమర్ధిస్తున్నట్లు భావించకండి. ఆంశాల వారిగా మద్ధతు మాత్రమే! కొంతమంది నా అభిమాన బ్లాగర్లనీ వారు కెలికారు - సహజంగానే అది నాకు నచ్చలేదు కానీ ఎవరిష్టం వారిది. అందుకే మరింత పరిపక్వతతో వ్రాయాల్సిందిగా ధూం ను కోరడమయినది.  

http://dhoommachara.blogspot.com

గురువారం 14 జనవరి 2010

పల్లెలో పెళ్ళిచూపులు


ఆఫీసులో పనిలేదు, పండగ కాబటి తెలుగు పేపర్లు అప్ద్‌డేట్ కావడం లేదు. బోర్ గా వుంది అందుకే కాలక్షేపానికి నా ఒక పెళ్ళి చూపుల ముచ్చట్లు వ్రాస్తున్నాను.    

మా క్లోజ్ ఫ్రెండ్ చెప్పగా ఒకరి ఇంటికి పెళ్ళిచూపులకని వెళ్ళాను. మా ఫ్రెండుకి తెలిసిన ఒక సారు బంధువుల అమ్మాయి అట. ఒక పల్లెటూరు అది. నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి మా ఫ్రెండ్ ఇంటివారితో మాట్లాడటానికని లోపలికి వెళ్ళాడు. మనకు పెళ్ళి చూపులు చూడటం పెద్దగా అలవాటు లేదు కదా కాస్త ఉద్విగ్నంగానే వుంది.   

అప్పుడు టీ తీసుకొని నవ్వుతూ అమ్మాయి గదిలోకి వచ్చింది. ఆమె నవ్వు నచ్చింది, అందం నచ్చింది. ఆమె ఇచ్చిన టీ తీసుకుంటూ నేనూ నవ్వాను. ఆమే నవ్వింది - నేనూ నవ్వాను. ఇక కూర్చుంటుందేమో అనుకున్నాను కానీ తుర్రుమంది. హర్రె. అమ్మాయి నచ్చింది కానీ ఆమె భావాలు, అభిప్రాయాలూ గట్రా ఏమీ కనుక్కోలేకపోయనే, ఎలాగబ్బా. అలా వెకిలి నవ్వులు నవ్వకుండా గంభీరంగా అమెను కూర్చొమ్మని అడగాల్సివుండె అని చింతిస్తూ వుండగానే మా ఫ్రెండ్ వచ్చాడు.

నేను చిద్విలాసంతో అతని వైపు చూసాను. నేను ఎందుకు అలా చూస్తున్నానో అతనికి అర్ధం కాలేదు గానీ "పద అమ్మాయిని చూద్దువు గానీ" అన్నాడు
"అమ్మాయిని నేను అప్పుడే చూసేగా" అన్నాను మందహాసం చేస్తూ
"హ? ఎప్పుడు చూసావు?"
"టీ ఇచ్చింది కదా నాకు"
"నీ మొఖం. ఆమె ఆ అమ్మాయి కాదు. ఈ సారు బిడ్డ"
నేను గతుక్కుమన్నాను. "హర్రే అవునా. ఎవరో ఒకరు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. సెటిల్ చేయ్యి"  
"ఇప్పుడే ఆ అమ్మాయికి పెళ్ళంటే వాళ్ళ నాన్న తంతాడు. ఆ అమ్మాయి చదివేది తొమ్మిదవ తరగతే" అని అసలు అమ్మాయిని చూపించడానికి నన్ను లాక్కెళ్ళాడు నా ఫ్రెండు.

ఆ అసలు అమ్మాయి నాకు బొత్తిగా నచ్చలేదు. ఆ సారు బిడ్డే నచ్చిందనీ, ఎలాగయినా ఆ సారుని ఒప్పించమని, పెళ్ళీడు వచ్చాకనే పెళ్ళి చేసుకుంటానని  మా ఫ్రెండుని బాగా బ్రతిమలాడాను.
"నీకు ఇంకా మంచి మంచి అమ్మాయిలని చూస్తా కానీ ఆ అమ్మాయి గురించి వదిలిపెట్టు" అని నన్ను ఊరడించాడు.

చేసేదేముంది. గొణుక్కుంటూ ఆ ఊరి నుండి బయటపడ్డాను.

మంగళవారం 12 జనవరి 2010

వైశ్య - వేశ్య



నా చిన్నప్పుడు ఆరోతరగతిలోనో, ఏదో తరగతిలోనో రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి తెలుగులో ఒక పాఠం వుండేది. అందులో ...నాయుడు గారు వైశ్యావృత్తిని రూపుమాపడానికి ఎంతగనో కృషిచేసెను అని వుంది. అది చదివాక నాకు చాలా విచారంగా అనిపించింది. ఆయనగారి కృషే గనుక విజయవంతం అయ్యుంటే నాకు చాలా
చిక్కొచ్చేది. కోమటోల్ల దుకాణాలు నడవకుంటే చాక్లెట్లు, బిస్కట్లూ, బలపాలూ ఎక్కడ కొనుక్కోవాలి. అదీగాక అలా దుకాణాల మీదనే బ్రతుకు వెళ్ళదీస్తున్న మా క్లోజ్ ఫ్రెండ్ సురేందర్ వాళ్ళ ఇల్లు ఏమయిపోవాలి. నాయుడు గారు చేసింది నాకేమీ నచ్చలా. 

చిరాగ్గా మా అన్నయ్యను అడిగాను - నాయుడుగారికి వైశ్యులంటే ఎందుకంత మంట అని. మా అన్నయ్యకు అర్ధం కాక నా పుస్తకం తీసుకొని చదివి బాగా నవ్వి అతను రూపుమాపడానికి ప్రయత్నించింది వైశ్యావృత్తి కాదనీ వేశ్యా వృత్తి అనీ చెప్పాడు. 
వేశ్యావృత్తి?! అదేంటి? నేనెక్కడా వినలేదే అని మా అన్నయ్యని అడిగాను. 

మళ్ళీ ఫక్కున నవ్వి అటూ ఇటూ చూసి నెమ్మదిగా చెప్పాడు - 'లం...'  అని! దాంట్లో మాత్రం తప్పేంటో అని మనస్సులో సన్నగా గొణుక్కున్నట్టున్నాను.

తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా...


...మద్దతుగా తెలంగాణా వాదులందరూ రకరకాల త్యాగాలూ చేస్తున్నారు, రకరకాలుగా మద్దతు తెలియజేస్తున్నారు. రాజీనామాలు చేస్తున్నారు, పెన్ డవున్ అంటున్నారు, సినిమాలు ఆడొద్దు అంటున్నారు. అవన్నీ మీకు తెలిసినవే కదా. మరి వేర్పాటు వాదులయిన బ్లాగర్లూ, బ్లాగు రీడర్లూ మాత్రం అలాంటివి ఏవీ చేయడం లేదు. వాళ్ళు కూడా తమకు వీలయిన పద్ధతిలో నిరసన తెలియజేస్తే బావుంటుంది. అందుకోసం నిరహార దీక్షలు చేయడం, నవరంధ్రాలూ మూసుకోవడంలాంటి కఠినమయిన త్యాగాలు చేయమని కోరడం లేదు.

...కానీ కనీసం పెన్ డవున్ లాగా బ్లాగు డవున్ చేయొచ్చు కదా. తెలంగాణా వచ్చేదాకా బ్లాగులు వ్రాయమనీ, వ్యాఖ్యలు చేయమనీ భీష్మించుకొని కూర్చొని ఆ ఉద్యమానికి మాద్దతు తెలియజేయవచ్చుకదా?    తెలంగాణా వచ్చేదాకా సినిమాలు చూడకుండా, ఛానళ్ళు చూడకుండా ఆ డబ్బులు గల్ల గురిగీలో వేసి పోగుచేసి ఉద్యమానికి విరాళం పంపించవచ్చు కదా. ఇలా ఆలోచిస్తే ఎన్నో మార్గాలు వున్నాయి వారికి.

బయట ఎలాంటి త్యాగాలు చేసినా మనకు కనిపించదు కాబట్టి వారికి నిజ్జంగా ఉద్యమం మీద సానుభూతి వుంటే కేంద్ర ప్రభుత్వ సాచివేత వైఖరికి నిరసనగా  తమ తమ బ్లాగులను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడా కూడా కామెంటరాదని కూడా తెలియజేసుకుంటున్నాను.  హారం, కూడలి గట్రా సంకలినులకు వెంటనే బ్లాగు రాజీనామా పత్రాలని పంపించాలని నిర్వాహకులు ఆయా బ్లాగులు తమ సంకలినిలలో నుండి తీసిపారేసేదాకా ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నాను.         

ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? తెలంగాణా వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే మీరు తెలంగాణా వచ్చేదాకా బ్లాగులు వ్రాయరు, కామెంట్లు వేయరు కాబట్టి. మరి అదే పని సమైక్యాంధ్రా కోసం నువ్వు కూడా చేయొచ్చు కదా అంటున్నారా? అంత లేదు.  

అక్కడే ఆగిన హేతువాదులు


నేను మొదటినుండీ హేతువాదినీ, నాస్తికుడినీ, మానవతావాదినీని. కానీ తోటి వాదులు ఏదయినా పోస్టు వ్రాస్తే చదవబుద్ది కూడా కాదు. ఒక కారణం చిన్నప్పటి నుండి అలాంటి వాదాల్లో మునిగితేలినందువల్ల కొత్త సంగతులు ఏమీ కనిపించకపోవడం. అన్నీ తెలిసిన విషయాలే వుండటం. అందుకే ఇన్నయ్య గారి బ్లాగు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్ప చదవను. 

మరో విషయం ఏమిటంటే ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి ఈ భావాలలో తిరిగినప్పటి విషయాలకూ, ఇప్పుడు వాదులందరూ వ్రాసే విషయాలకూ పెద్దగా ఏమీ తేడాలేక అన్ని విషయాలు పాత చింతకాయ పచ్చడిలా అయిపోవడం. ఇంకా అవే జ్యోతిష్యుల మీది సవాళ్ళూ, గ్రహణాల మీద విసుర్లు, బాబాల బండారాలు. వీటినుండి చాలామని హేతువాదులు ఎదిగినట్లు నాకు అనిపించదు. మతవాదులూ, సామాన్యులు కూడా ఇదే విషయమై హేతువాదులని విమర్శించడం, హేళన చేయడం బ్లాగుల్లో కూడా చూసాను. ఆ విమర్శలని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. 

ఆ మూఢనమ్మకాలూ, బాబాల గిమ్మిక్కులూ ఇప్పటికీ లేవా అంటే వున్నాయి కానీ వాటికి మించిన సమస్యలు, పట్టించుకోవాల్సిన విషయాలూ వున్నాయి, వచ్చాయి. అలా కాకుండా అరిగిపోయిన రికార్డులా పాడిందే పాటరా పాసు పళ్ళ దాసరీ అని చెప్పిన విషాయాలే పాత పద్ధతిలో చెప్పి రోత పుట్టిస్తే ఎవరికయినా చిరాకు తప్పదు. అందుకే ఏ ఇన్నయ్యగారి బ్లాగులోనో తప్ప వేరే హేతువాదులు, హేట్ వాదులు వ్రాసిన వ్రాతలకి పెద్దగా ఆదరణ లభించిందని నేను అనుకోను.

కొత్త విషయాలు అంటే ఏమిటి? పరిశీలిస్తే చాలా విషయాలు వుంటాయి. ఉదాహరణకు నేను పాల్గొంటున్న LGBT విషయమే చూద్దాం. అలాంటివి ఈ మానవతావాదులు ఎందుకు పట్టించుకోరో అర్ధం కాదు. స్వలింగ సంపర్కం గురించి అప్పట్లో కోర్టు తీర్పు వచ్చింది - అలాంటివి అందిపుచ్చుకోవాలి. కెనడా, యు ఎస్ లో వున్న హెతువాదులు చాలావరకు ఇలాంటి కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. గే, లెస్బియన్  ప్రైడ్  పేరేడులల్లో కూడా సంఘీభావం తెలుపుతూ పాల్గొంటుంటారు.    

తెలంగాణా వేర్పాటు విషయమి హేతువాదుల స్టాండ్ ఏమిటి? చాలామంది అందుకుంటున్నదేమిటంటే మిగతా హక్కుల సంఘాల వారి లాగానే హేతువాదులు కూడా వేర్పాటుకి మద్దతు ఇస్తున్నారని. నిజమేనా? ఇన్నయ్యగారి లాంటి మేధావులు, నాస్తిక కేంద్రం వారూ, తదితరులు ఇలాంటి ప్రాముఖ్యమయిన విషయాలపై తమ స్టాండ్ ఏమిటో చెబితే బావుంటుంది కదా. 

ఇలా అని నాకు తెలిసిన నాస్తిక కేంద్రం వారికి పైన ప్రస్థావించిన విషయాలపై ఈలేఖ అయినా వ్రాసానా లేదు. ఇన్నయ్య గారితో ఈమెయిల్ పరిచయం వుంది - వారి అభిప్రాయం కోసం వ్రాసానా? C B రావు గారితో పరిచయం వుంది - అడిగానా?  లేదు. ఎందుకు? బద్దకం. ఇలా బ్లాగు పోస్టులు వ్రాయడమే వీజీ అనిపిస్తుంది నాకు.  అయితే కొన్ని విషయాలపై వ్రాసాను లెండి. స్వలింగ సంపర్కం గురించి మీ స్టాండ్ ఏమిటో తెలియజేయమని సమరం గారికీ, ఇన్నయ్య గారికీ వ్రాసాను. సమరం గారినుండి రిప్లయ్ రాలేదు. దానిమీది నా పుస్తకం చూసిన తరువాత అభిప్రాయం తెలియజేస్తానని ఇన్నయ్య గారు తెలిపారు.

నేను పనిచేస్తున్న ఆంశాలలోనే హేతువాదులందరూ అనుకరించాలని కాదు నేను అంటూంట. దేశకాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త ఆంశాలని కూడా తమ అజెండాలలో పెట్టుకొని ఉద్యమించాలి. అప్పుడే ప్రజలలో ఆసక్తి, ఆదరణ వుంటుంది. నా చిన్నప్పుడు నాస్తిక, హేతువాద ఉద్యమాలు, భావ జాలం విస్తృతంగా అగుపించేవి. ఇప్పుడు కేవలం వారి వారి సభలూ, సమావేశాలు తప్ప ఏమీ హడావిడి కనిపించదు - అడపాదడపా వార్తల్లో చిన్న అయిటెంగా తప్ప.     


కొన్ని కొన్ని హేతువాద సంస్థలు మాత్రం కాస్త చురుగ్గా వుంటున్నాయి. జన చైతన్య/విజ్ఞాన సమితి (పేరు సరిగ్గా గుర్తుకు లేదు) లాంటివి కాస్తో కూస్తో సమకాలీన ఆంశాలపై ఉద్యమిస్తూ ప్రజలమీద ప్రభావం చూపగలుగుతున్నాయి. అయితే అవి కూడా కొన్ని ఆంశాల వరకే పరిమితం అవడం చూస్తున్నాను.   హేతువాదులు కేవలం హేట్ వాదులుగా మిగిలిపోకుండా వున్నప్పుడే వారు చెప్పేవి ప్రజలకు కొద్దిగానయినా ఎక్కుతాయి.   

సోమవారం 11 జనవరి 2010

తియ్యాలా... వద్దా...?



ఇంతకుముందు బ్లాగులో అన్నట్లుగా నా వ్యూహాత్మక మౌనం ముగించాను. మనబోటోల్లు మౌనం వహిస్తే అది మౌనం - రాజకీయనాయకుల మౌనం అయితే వ్యూహాత్మక మౌనం. మన బోటోల్లం మాట్లాడితే మాటలు అదే రాజకీయ నాయకులవారి వైతేనేమో వ్యూహాత్మక చర్చలు. మనలాంటోళ్ళం ఏదయినా ప్లాన్ వేస్తేనేమో ప్లాన్ అదే రాజకీయనాయకులు ప్లాన్ వేస్తే అది వ్యూహం. ఇలా ఎన్నో విషయాలని నవ్వులపాలు చేస్తున్నట్లుగానే వ్యూహాన్ని కూడా నవ్వులపాలు చేస్తున్నారు కొంతమంది పొలిటీషియన్స్! 

సరే అసలు విషయానికి వద్దాం. తియ్యాలా...వద్దా అన్నది నా ధర్మ సందేహం. అంటే నా పెద్దల బ్లాగునో లేక ఈ బ్లాగునో ఊడబీకాలని ఆలోచిస్తున్నానేమోనని, మీరు వద్దు వద్దు అని తెగ బ్రతిమలాడితే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటాననే అపొహలు ఏమీ పెట్టుకోకండి. ఇది అంతకంటే కఠినమయిన విషయం! 

ఆమధ్య తెలంగాణా వేర్పాటు వాదం మీద వళ్ళు మండి, అలాగే నా మీసాల మీద కూడా నాకు వళ్ళు మండి  మొత్తం మీద తెలంగాణా పేరు చెప్పి నా మీసాలని త్యాగం చేసాను. నా మీసాల మీద నాకు ఎందుకు వళ్ళు మండింది అని అడక్కండి - అది P చిదంబర రహస్యం! తీసేసాను - బాగానే వుంది. మా చిన్న పాపను అడిగాను - ఎలా వుంది అని. వున్నా - లేకున్నా బాగానే వుంది అంది. ఓకె. మా ఆవిడను అడిగాను - బాగానే వుంది కదా అంది. ఓఖ్ఖే. మా పెద్ద పాపని అడగలేదు - అడిగితే అది తాత్విక చింతనతో ఏదో డవిలాగ్ వేస్తుంది. సౌరిస్ తన తండ్రి చలంకి ఈశ్వరుడిని చూపించినట్లు మా పెద్ద పాప కూడా ఎన్నడో నాకు ఈశ్వరుడిని చూపిస్తుందేమోనని నాకు ఇప్పటినుండే బెంగ పట్టుకుంది. సరే, మళ్ళీ అసలు విషయానికి వద్దామేం.     

తీసేసిన మీసంతో నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చేసాను. బావుంది..బావుంది. మనని తిడుతూనో, పొగడుతోనో రోజూ కొన్ని కామెంట్లు వస్తుంటాయి కదా. ఇవాళ ఉదయమే నిద్ర లేవగానే కామెంట్లు చూసాను. 'కొజ్జాలాగా కనపడుతున్నావ్' అని ఒక వ్యాఖ్య వుంది :(  దెబ్బకి మత్తు వదిలిపోయి నిటారుగా అయ్యాను. ఇన్నేళ్ళుగా ఎన్ని వీడియోలు చేసినా ఇంకా దరిద్రంగా తిట్టారు కానీ ఇలా తిట్టలేదు. హతవిధీ అని లేని నా మీసాలని తడుముకున్నాను. అంతటి కఠిన వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఆ వ్యాఖ్యాతను వెంటనే బ్యాన్ చేసాను. 

ఇప్పుడు మీరు చెప్పండి...పెంచాలా, వద్దా? ... నా మీసాలు!  బ్లాగావరణంలో ఈ మధ్య కొందరు గొంతెమ్మ ప్రశ్నలు వేస్తున్నారు - అందుకే నేనూ ఇలా ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు! అప్పట్లో యర్రం శెట్టి శాయి కామెడీ నవల ఒకటి చదివాను. అందులో ఒక పాత్రకి - భవానీ శంకరం అనుకుంటాను - ఇలాంటి డవుటే వస్తుంది - తన కొత్త ప్రియురాలిని ఈ ప్రశ్న అడగాలని తెగ ఉబలాటపడుతాడు. ఆ కథలో తరువాత ఏమయ్యిందో గుర్తుకులేదు. 

ఈ టపా వల్ల కొంపదీసి కొజ్జా వాళ్ళ మనోభావాలు ఏమన్నా గాయపరుస్తున్నానా?  అలాంటిదేమన్నా మీకు అనిపించి మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే నాకు తెలియజేయండి. మన్నించమని అర్జంటుగా అడుగుతా.  

వ్యూహాత్మక మౌనం!?

(ఈమధ్య రాజకీయ నాయకులు కొందరికి ఇలాంటి మౌనం పాటించడం ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా కొద్దిసేపు అనగా నా మరో టపా వచ్చేంతవరకు  వ్యూహాత్మకంగా మౌనం పాటించదలుచుకున్నాను. Don't disturb me. Please!)   

గురువారం 7 జనవరి 2010

Text from Exiledonline

కొందరికి exiledonline సైట్ తెరచుకోనందున ఆ విషయం ఇక్కడ ఇస్తున్నాను.

What You Should Hate / September 3, 2009


Enemy Of Larry Summers’ Ex-Boss Dies In Mysterious Helicopter Crash

By Mark Ames
What does the mysterious helicopter crash that killed one of India’s most popular politicians have to do with White House economic czar Larry Summers? Read on…

First, the crash: one of India’s most popular politicians, who heads the state of Andhra Pradesh, just died in a mysterious helicopter crash. What’s eerie is that the dead politician recently went public attacking India’s most powerful oligarch family, the Ambanis, threatening to take away their giant offshore gas concessions. Meanwhile the Ambani brothers, Mukesh (the world’s 7th richest man) and Anil (the world’s 34 richest) are battling each other in a blood feud that’s taking the whole country down with them–that’s not a hornet’s nest you’d want to stick your fingers into, even if you’re the governor of a huge Indian province. The Ambani brothers’ feud peaked in May when Anil’s helicopter was found to have been sabotaged just before takeoff (read about it here). Anil strongly hinted he suspected Mukesh, but no one will ever know who did it, because the mechanic who discovered the dirt and gravel in Anil Ambani’s helicopter gear box was hit by a train two days later in what was initially ruled as a “suicide,” but which later was ruled murder.
So why would an Ambani have anything to do with the mysterious helicopter crash of Andhra Pradesh’s Chief Minister Y.S. Rajasekhara Reddy? Just speculatin’ on a hypothesis, as the police chief says in Miller’s Crossing, and here’s why:
Just over a month ago, as the Ambani brothers’ insane internecine war over offshore gas deposits dragged on with no end in sight, Reddy publicly demanded that his state, Andhra Pradesh, take a share of the gas deposits for itself:
Even as the two Ambani brothers are locked in a legal battle over supply and price of gas from the Krishna-Godavari basin, the Andhra Pradesh government has sought its “due share” of the hydrocarbon asset.
He even attacked the brothers’ mother, who brokered the deal dividing up India’s gas between her feuding sons:
Andhra Pradesh Chief Minister Y S Rajasekhara Reddy on Sunday said that the settlement of the gas dispute between the Ambani brothers could not be left to their mother Kokilaben and the Centre must play a decisive role, for which he has written to the Prime Minister.
“The dispute over sharing of gas is not an issue to be settled by (the) mother (Kokilaben). It is for the government to decide who should get the gas and also at what price,” Reddy said on the sidelines of a function here.
Ah, Y.S., you shouldn’ta attacked their mother. Next thing you know…Reddy’s deady.
Oh, and by the way, don’t forget this one little fun-fact: Larry Summers, the guy appointed by Obama to run America’s economy, worked for Mukesh Ambani right up until he took his White House job. We’re in good hands, folks.

Mark Ames is the author of Going Postal: Rage, Murder and Rebellion from Reagan’s Workplaces to Clinton’s Columbine.

http://exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/

వై ఎస్ మరణం గురించి ఎగ్జైల్డ్ ఆన్లైన్ వార్తా కథనం   
http://exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/

చచ్చి కూడా సమైక్యాంధ్రాని సాధిస్తున్న YSR

వై ఎస్ ఆర్  హత్య రిలయన్స్ చేసిందన్న వార్త నిజమయినప్పటికీ, అబద్ధమయినప్పటికీ ఆ వార్త కొంతయినా ఒక మంచి పని చేస్తోంది. గత నెలన్నరగా అరిగిపోయిన రికార్డులా ఊదరగొడుతున్న తెలంగాణా వేర్పాటు సమస్య నుండి ప్రజలను, ప్రభుత్వాన్ని దారి మళ్ళిస్తోంది. మంచిదే కదా. ఇదే అదనుగా తెలంగాణా ఆశం అటకెక్కితే మరీ మంచిది.

ఈ విధంగా వై ఎస్ మరణించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐక్యత కోసం కృషిచేస్తున్నారు! Hats Off to YSR!

Piss 'Off'! - మరో సారి!


చాలా ఏళ్ళ క్రితం నాకు తెలిసినవారికి తెలిసినవారి ఇంట హైద్రాబాదులో ఒక వారం రోజులు వుండాల్సొచ్చింది. వాళ్ళ గెస్టు హవుజ్ నాకు బసగా ఇచ్చారు. గెస్ట్ హవుజ్ అంటే పెద్దది కాదులెండి ఒక రెండు గదులు. అంతవరకు బాగానే వుంది. మొదటి రాత్రి హాయిగా నిద్దరోయాను. మధ్యలో యూరినల్సుకి మెలకువ వచ్చింది. తలుపు తెరిచాను.

భౌ! భౌ!!

కుక్క! వికృతంగా మొరుగుతోంది ఇంటివాళ్ళ కుక్క. యూరినల్స్ గది బయట వుంది - మధ్యలో కుక్క - భీకరంగా మొరుగుతూ. రాత్రి పడుకునేముందు దానిని ఇలా స్వేఛ్ఛగా వదిలేస్తారని నాకు తెలియదు. ఆ కుక్క గారిని ఎంతో బుజ్జగించాను, బెదిరించాను, కొడతానని సైగలు చేసాను, తిట్టాను, అదిలించాను. ఊహు లాభం లేదు. నేను ఎప్పుడు బైటికి వస్తానా నా పిక్కనో, పీకనో నొక్కేద్దామని తయారుగా నాకు కుక్క కాపలాగా వుండేది. ఎన్ని చేసినా వృధా ప్రయాసే అయ్యింది. నేను మంచాడినని దానికి అర్ధం కాకుండా వుంది. 


ఇక లాభం లేదని తరుణోపాయం ఆలోచించాను. ఆ రెండు గదులూ శ్రద్ధగా వెతికాను. వాడేసిన బీరు బటిళ్ళు ఒక అట్టపెట్టెలో వున్నాయి. హమ్మయ్య గండం గడిచింది అనుకొని వాటిని ఉపయోగించాను. అలా అక్కడ వున్న వారం రోజులూ అలాగే లాగించాను. పొద్దుటే కుక్కని కట్టేసిన తరువాత ఆ బాటిళ్ళను పారబోసి శుభ్రం చేసి మళ్ళీ జాగ్రత్తగా లోపటపెట్టుకునేవాడిని. తప్పనప్పుడు ఇలాంటి వేషాలు తప్పవు మరి!

బుధవారం 6 జనవరి 2010

Piss Off!


 విజయవాడ VK Computers లో చదువుతూ, బోధిస్తూ వెలగబెడుతున్న రోజులవి. అక్కడ వేణి (అసలు పేరు కాదు) అనే అమ్మాయితో కలిసి సహజీవనం (?!) చేస్తుండేవాడిని. ఆమె ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తుండేది. ఒకరోజు రాత్రి నన్ను గదిలో పెట్టెసి బయటనుండి గొళ్ళెం పెట్టి పైన ఓనర్ వాళ్ళింటికి వెళ్ళి పడుకుంది. అలా ఎందుకు చేసిందో అడక్కండిక్కడ - ఈ బ్లాగుకి అది ఆఫ్ లిమిట్స్!    

ఆ గదిలో బాత్రూము లేదు. నాకేమో యూరినల్సుకి వస్తోంది. మరో వైపు నన్ను గదిలొ వేసి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయిందనే ఉక్రోశం, నిస్సహాయతానూ. నన్ను నేను పద్ధతిగా రిలీవ్ చేసుకొనే మార్గం కనపడలేదు.  చాలాసేపు ఓర్చుకొని ఇక లాభం లేదని ఆమె ఆఫీసుకు తీసుకువెళ్ళే బ్యాగును ఖాళీ చేసి అందులో పని కానిచ్చాను! ఆ రకంగా నేను ఆమెకు తగిన శాస్తి చేసినట్లయ్యింది.  

మరునాడు ఉదయం కిందికి వచ్చి తలుపు తీసి హడావిడిగా ఆఫీసుకి తయారయ్యింది. నేను కోపంగా వున్నాను కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఆమెను గమనిస్తూ మౌనంగా వుండిపోయాను.  బస్సుస్టాండుకి బయల్దేరుతూ బ్యాగు తీసుకుంది. బరువుగా అనిపించింది. ఆశ్చర్యంగా అది ఓపెన్ చేసి చూసింది. ఆమె ముఖంలో !?!. ఆ తరువాత ఆమె నోటి వెంట @#$^*()_+!

ఒక్క క్షణం ఆలోచించింది. బాత్ రూముకి వెళ్ళి శుబ్బరంగా ఆ బ్యాగు ఖాళీ చేసి బాగా కడిగి కాసేపు ఆరబెట్టి యథావిధిగా ఆఫీసుకు తీసుకెళ్ళింది. కొత్త బ్యాగు కొనుక్కునేంత దృశ్యం ఆమెకు లేదప్పుడు మరి.  

Oh Shit! - ఇంకోస్సారి!


మా ఆవిడ అప్పుడప్పుడూ బేబీ సిట్టింగ్ చేస్తూ వుంటుంది. పిల్లలకు వాడేసిన డైయాపర్లు ఒక పాలిథిన్ సంచిలో కట్టి బయటి తలుపు దగ్గర ఒక మూలకు పడేస్తుంది. మరునాడు ఆఫీసుకి వెళ్ళేప్పుడు ఆ సంచీని తీసుకొని ఇంటిముందు వుండే గార్బేజీ బిన్‌లో పడవేసి వెళ్ళడం నా విద్యుక్త ధర్మంగా నడుస్తుంటుంది.  

మా ఆవిడ నాకు ఆఫీసులో లంచ్ కోసమని చపాతీలు జిప్ లాక్ కవరులో పెట్టి దానితో పాటూ పళ్ళు కూడా ఒక పాలిథిన్ సంచిలో పెట్టి ఇస్తుంది.  

ఒకరోజు ఆఫీసు టైములో చపాతీలు ఓవెన్ లో వేడిచేద్దామని వెళ్ళాను. పాలిథిన్ సంచీ ఓపెన్ చేస్తుండగానే ఘుమఘుమ వాసనలు వచ్చాయి. ఫుడ్డు ఛానల్ చూసి మా ఆవిడ ఏదన్నా కొత్తరకం వంటచేసి పెట్టిందేమోనని ఆసక్తిగా ఆ సంచి ఓపెన్ చేసి చూసాను!

సోమవారం 4 జనవరి 2010

హి హి, సంక్రాంతికి ఊరెళుతున్నారా?!

T ఇడియట్స్  (ఎవరో వాడారు ఈ పదం. నచ్చి నేనూ వాడుతున్నా. తెలంగాణా వారినందరినీ కాదు అంటూంట - కేవలం వారిలోని ఇడియట్స్ ని మాత్రమే) ఏమని గర్జించారో, గాండ్రించారో చూసేరుగా. కొంపదీసి ఈ అయిదవ తారీఖున ప్రత్యేక తెలంగాణా ఇవ్వకపోతే పండక్కి వెళ్ళిన సీమాంధ్ర వాళ్ళని మళ్ళీ హైద్రాబాదులోకి రానివ్వరంట కదా.

మరి మీరు ఊరెళుతున్నారా? ఏమని డిసైడ్ చేసారు? వెళితే మాత్రం తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళడమే ఉత్తమమేమో. తిరిగివద్దామనుకుంటున్నారా? ఎందుకయినా మంచిది మళ్ళీ తిరిగివచ్చేప్పుడు పండగకి చేసిన వంటలూ, ఫలహారాలు ఎక్కువగా తీసుకొచ్చుకోండి. తెలంగాణా బోర్డర్ లో ఆపితే మళ్ళీ బోర్డర్ సీమాంధ్రా వారికి తెరచుకునేదాకా అవి తింటూ బ్రతికేయొచ్చు.   

తెలంగాణా వాదులు తెలబాన్లుగా మారిపోతున్నారని లగడపాటి కూడా దాదాపుగా అనేసారు. పౌరహక్కుల నేతలు పరిహార హక్కుల నేతలుగా అవుతున్నారని కూడా అభిప్రాయం వ్యక్తం చేసారు. నిజమే.  ఈ పౌరహక్కుల వాళ్ళు ఎవరో. వాళ్ళ అజెండా ఏమిటో మనకు తెలిసిందే కదా. మేక వన్నె పులులు. హక్కుల వన్నె మావోయిస్టులు.  వాళ్ళ హక్కులు వేరే కదా.    

అన్నట్లు సమైక్యాంధ్రాకి మద్దతుగా, వేర్పాటు వాదానికి నిరసనగా కొంతమంది గుండు కొట్టించుకున్నారు కదా. నేను కూడా కొట్టించాను. గుండు కాదు - మీసాలు. నమ్మకం లేకపోతే నా వీడియోలు చూడవచ్చు :)   

శనివారం 2 జనవరి 2010

YouTube - Split Tamilnadu First

ఆంధ్రప్రదేశ్ ను విభజించేముందుగా తమిళనాడు ముక్కలు ముక్కలు కావాల్సిందే!

గమనిక : వీడియో పోస్టులను పరీక్షిస్తున్న దృష్ట్యా ఈ రోజు పలు టపాలు నానుండి రావచ్చును. అసౌకర్యమయితే మన్నించండి.

YouTube - Split Tamilnadu First

YouTube - Hitler on Telangana

ఈ వీడియో మీరు ఇదివరకే చూసివుండవచ్చు. చూడకపోతే చూడండి. పాశ్చాత్య సంస్కృతిలో సాధారణంగా ఉపయోగించే కొన్ని వల్గర్ పదాలు సబ్ టైటిల్స్ లో వున్నాయి - అది అభ్యంతరకరమయితే ఈ వీడియో చూడకండి.
YouTube - Hitler on Telangana

వీడియో: భారత్ - వంద రాష్ట్రాలు

చాలా నెలల తరువాత మళ్ళీ వీడియో చేస్తున్నందున నేను చెప్పాల్సిన భావాలని ఇంకా వివరంగా చెప్పలేకపోయానని గమనించగలరు. ఇది ఒక టెస్టు పోస్టులాంటిది మాత్రమే.