గమనిక: ఇది హిందువుల మనోభావాలను నొప్పించడానికి వ్రాసింది కాదు. ఓ బాబా గారి పైత్యానికి ఇది పేరడీ టపా మాత్రమే.
స్కైబాబా అనే తెలంగాణా ముస్లిం వాది ఒక పోస్టులో హిందూ ఆడ దేవతలు శానా అన్యాయం అయిపోతున్నారనీనూ, హిందూ మగ దేవుళ్ళ ప్రాబల్యం తగ్గించాలనీనూ అమూల్యాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అప్పుడు ముక్కులో వేలుపెట్టి ఊప్స్ కణత మీద వేలుపెట్టి తెగ ఆలొచిస్తే వారి వాదనలొ చాలా పస్ సారీ పస వుందనిపించింది. నిజమే కదా అని అర్జంటుగా వారితో ఏకీభవించాను. అపార్ధం చేసుకోవద్దు - వారి యొక్క ఆ భావంతో లీనమయ్యానంతే.
అప్పుడనిపించింది నాకు. ఔరా ఆడ దేవుళ్ళకూ, మగ దేవతలకూ సమాన హక్కులు కావాలనంగా లేనిది మన ఎల్ జీ బీ టీ హక్కులు మాత్రం ఎందుకు వుండొద్దూ అని. తరచి చరిత్రనూ, పురాణాలనూ తెరచి చూస్తే ఎల్ జీ బీ టీ దృష్టాంతరాలు కొన్ని కనిపించకపోవు. అంతెందుకు సాక్షాత్తూ శివా ది గ్రేట్ గాడ్ కూడా ట్రాన్సువెస్టూ, ట్రాన్సు జెండరూనూ (TG) కాదో.
అంచేత నేను మరీ ఎక్కువగా వ్రాయకుండా చెప్పొచ్చేదేమిటంటే మీరు హిందూ స్త్రీ పురుష దేవుళ్ళ సమాన హక్కులు కోరేవారయితే పనిలో పనిగా ఈ హక్కులు కూడా కోరితే బావుంటుంది. అలా ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లాగా ఒకేసారి అందరి, అన్ని దేవ హక్కులూ సాధించుకోవచ్చు. ఇలా దేవుళ్ళ సమానత్వాన్ని, హక్కులనూ నిర్దేశిస్తూ పార్లమెంటులో ఓ బిల్లు పెట్టాల్సిందిగా ఇందుమూలంగా డిమాండ్ చెయ్యడమయినది.
(ష్... ఇలా మెజారిటీ హిందూ దేవుళ్ళ పని అయిపోయిన తరువాత ముస్లిం, క్రిస్టియను దేవుళ్ళ హక్కులు కూడా సాధించుకుంటాం)

8 comments:
నువ్వు మలక్పేట్ రౌడీని విమర్శించావని నీ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాసాను. స్త్రీవాదినని చెప్పుకునే నువ్వు శరత్ కాలం' బ్లాగ్‌లో కామెంట్లు ఎందుకు వ్రాస్తున్నావు అని నన్ను తిడుతూ ఫోన్లు చేశారు. నువ్వు LGBTకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు. నీ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాసినందుకు నేను ఫోన్లో తిట్లు కాయాల్సి వస్తుంది.
శరత్తూ నీకు విషయం అర్థంకానప్పుడు నీకు కావాల్సింది టైంపాసేగా...కానీయ్!
ప్రవీణ్. నీ కామెంట్లు లేకపొతే శరత్ గారికి బండి నడవదు పాపం. కొంచెం కస్టమయినా కామెంట్లు పెడుతూ ఉండూ. అయినా తిట్లు నీకు కొత్తేమిటి. పొద్దున్న లేస్తే నీకు నీ గురువుకి ఎవరొ ఒకరితొ తలంటిచుకొకకొతే రొజు గడవదు కదా .
ప్రవిణ్య ఏంది నీ టాటా ల్యాండ్ లైను నుంచి నీ టాటా సెల్లుకి కాల్ చేసి తిట్టుకున్నావా, ఎందుకబ్బాయా ఫోన్ బిల్లు దండగ చక్కగా నీ మార్క్ కామెడీ మిస్స్ అవుతుండలా బ్లాగుల్లో
ప్రవిణ్య తిట్లు కాయడం ఎందీ, నాలుగు గాడిదల్ని కాచుకోకపోయా
@ ప్రవీణ్
నాకెప్పటినుండో ఒక సందేహం. నువ్వు నిజ్జంగా అమాయకుడివా లేక బోలెడంతా అమాయకత్వం నటిస్తూ మా చెవ్వుల్లో పూలు గానీ పెడుతుంటావా?
ఇలా కామెంట్లు వ్రాయనని బెదిరించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడనంతే. కావలంటే ఆమారణ నిరాహారా దీక్ష ఒకటి ప్రయత్నించి చూడండి. గమనిక: సలైన్ దీక్షలు నా దగ్గర పని చెయ్యవు. మీరు నికార్సుగా ఈ లక్ష్య దీక్ష చేసినట్లయితే ఓ అయిదు రోజుల తరువాత మీ డిమాండ్లు పరిశీలిస్తాను.
@ కత్తి
మీరు సోనియా, రాహుల్ లాగా క్రిస్టియన్లు కాబట్టి మీకు ముస్లిం మతోన్మాదం కంటేనూ హిందూ మతోన్మాదమే బాగా అర్ధం అవుతుంది. నేను నాస్తికుడిని కాబట్టి నాకు అన్ని మతాల ఉన్మాదమూ అర్ధం అవుతుంది. (అలా అని నేనేదో పరిపూర్ణ నాస్తికుడిని అని కాదు, నాస్తికులలోనూ లోపాలు వుండవని కాదు)
అప్పుడు ముక్కులో వేలుపెట్టి ఊప్స్
సాక్షాత్తూ శివా ది గ్రేట్ గాడ్ కూడా ట్రాన్సువెస్టూ, ట్రాన్సు జెండరూ
------------------------------
prayOgAlu bAgunnAy:)
ee praveen amAyakudE ..bAgA chiraku teppistE yedO matlAdestAdu ..adi pattukoni mana vallu godAri eedEstAru, pedda kEdi ani cheppi :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి