బుధవారం 22 డిసెంబర్ 2010

నాకూ (నిజమయిన) నిరాహార దీక్ష చెయ్యాలని వుంది కానీ ...

ఈ వారాంతం జగనుకి మద్దతుగా తెలుగువాడి ఆత్మ గౌరవం పేరిట నిజంగానే ఒక రోజు దీక్ష చెయ్యాలని వుంది కానీ నా దీక్షని అభాసుచేయడానికి ప్రయత్నించే గొప్ప విలన్ మా ఇంట్లోనే వున్నారు. క్రిస్మస్ రోజు ఫుల్లుగా తిని మరుసటి రోజు దీక్ష చెయ్యాలని ప్రస్థుతానికి అనుకుంటున్నాను. అలా దీక్ష గనుక చేస్తే లైవ్ బ్లాగింగూ, లైవ్ వీడియో బ్లాగింగూ చేస్తాను కానీ కుట్రదారుతో వచ్చింది కష్టం.

ఆ సదరు వ్యక్తి మా ఆవిడ అనుకునేరు. కానే కాదు. మా అమ్మలు. నేను హంగర్ స్ట్రైక్ చేస్తున్నా అని ఏమాత్రం పసిగట్టినా దానిని నట్టేట ముంచడానికి అది విశ్వప్రయత్నాలూ చేస్తుంది. అంటే నా నోట్లో ఫుడ్డో లేక సలైన్ ఎక్కించడానికి ప్రయత్నించినా కొంతలో కొంత బాగానే వుండేదేమో గానీ అలాక్కాదు. అంతకంటే ఘోరమయిన కుట్రలు అది చెయ్యక మానదు. 

నేను ఎలాగూ ఎప్పుడూ ఫుల్లుగా ఆకలి మీద వుంటాను కాబట్టి ఎంచక్కా చక్కటి రుచికరమయిన పదార్ధాలని, ఆహారాన్ని నా ముందే తింటూ రోజంతా ఊరించి నన్ను అవస్థల పాలు చేస్తుంది - గ్యారెంటీ.   ఒహవేళ ముందే బ్రతిమలాడి ఏదన్నా ఒప్పందం దానితో కుదుర్చుకున్నా సరిగ్గా సమయానికి దానిని తుంగలో తొక్కెయ్యడం దానికి అలవాటే. అలా అని మా ఆవిడ అలా నన్ను ఏడిపించొద్దూ అని చెబుతుందా అంటే చెప్పనే చెప్పదు. నామీద పాత పగలూ, ప్రతీకారాలు గట్రా గుర్తుతెచ్చుకొని మరీ తీర్చుకొవడానికి ఇదే మంచి సమయం అని అమ్మలుని ప్రోత్సహించినా ప్రోత్సహిస్తుంది. ఇహ మా పెద్దమ్మాయి సిస్టంలో ఏం జరుగుతుందన్నది తప్పిస్తే ఇంట్లో ఏం జరుగుతుందీ దానికి పట్టదు. అంచేత అది నాకు సహాయానికి వచ్చి చెల్లిని కట్టడి చేస్తుందని భావించడం శుద్ధ వేస్టూ.     

ఇప్పుడు మీరు ఓ బోడి సలహా ఇవ్వబోతున్నారు - నాకు తెలుసు. తలుపులన్నీ బిడాయించుకొని గదిలో దాక్కుని నిరాహార దీక్ష చెయ్యమంటారు కదూ. అలా చేస్తే ఏం థ్రిల్లు వస్తుందండీ? కేసీఆరో, బాబో, జగనో వాళ్ళింట్లో వంటగదిలో   కూర్చొని అన్నం ముట్టనంటే మనకు మజా వస్తుందా? చేసేవాళ్ళకీ థ్రిల్లు వుంటుందా? అందుకే దీక్ష అంటూ చేస్తే మా ఇంట్లో వాళ్ళ ముందూ, మీ ముందూ (యూట్యూబ్ వీడియో ఫీడ్ తో) కూర్చొని చేస్తేనే ఓ రోజు ఫుడ్డు త్యాగం చెసినందుకు కాస్త గుర్తింపూ, తృప్తీ దక్కుతాయి కానీ ఎలాగబ్బా? నా నిరాహార దీక్ష వీడియోలని సాక్షి వాడికి పంపిస్తే శుబ్బరంగా సంతోషిస్తూ వేసుకోకపోతాడా? జగన్ కోసం ఓ కెనడియన్ దీక్ష అని స్క్రోలింగులో వెయ్యకపోతాడా అనేది నా అత్యాశ.

7 comments:

అజ్ఞాత చెప్పారు...

అలా మీరు చేస్తే మీకు TASTY FOOD ITEMS ని వీడియో ద్వారా పంపించి మీ దీక్ష భగ్నం చేస్తా .

కాయ చెప్పారు...

జగన్ కోసం చేస్తే మీకేం వస్తుంది గురువు గారు.. మేకెలాగు ఒక ప్రత్యేక డిమాండ్ ఉంది కదా... అవే హక్కులపై చేయండీ... అందరికీ కొత్తరకం త్రిల్లు ఇచ్చినవారవుతారు... చూద్దాం అనకుండా... చేస్తా అనండి..

అజ్ఞాత చెప్పారు...

A landmark legislation was signed into law in the US on gay rights today, yet you while away your efforts on accamma pichamma diskhalu and cbn/kcr/jagan? you call yourself an lgbt activist? what a waste?

astrojoyd చెప్పారు...

niraahara deekshaa..meeraa...joke baavundi

బుల్లబ్బాయ్ చెప్పారు...

joyd గారూ...

అన్న నిరాహార దీక్షలో "ఆహార" అంటే food..

మీరు ఆహార అంటే... అన్న ఎప్పుడూ చేసే చిలిపి టిఫ్ఫిన్లు, మిని మీల్సులు, ఫుల్లు మీల్సులు అనుకున్నట్టున్నారు... ;)

నాని చెప్పారు...

chala baga raasarandi

Ramu S చెప్పారు...

Boss,
you will definitely get solid coverage in saakshi's newspaper and channel. Good luck
Ramu