నా కోసం - నా ఆలోచనలు

డాక్టర్ దివాకర్ యొక్క వ్యక్తిత్వ వికాసం కోర్సు చాలా ఏళ్ళ క్రిందట హైదరాబాదులో తీసుకున్నాను. అందులో వారు చెప్పిన ముఖ్య మయిన విషయం ఏంటంటే - మన మనస్సులోకి ఎప్పుడూ మంచి ఆలొచనలు వస్తుంటాయీ - వాటిని ఎప్పటికప్పుడు ఓ నోటుబుక్కులోకి ఎక్కించమని. అప్పట్లో అలాగే చేసాను కానీ క్రమంగా ఆ అలవాటు తప్పి ఆ నోటుబుక్కు పక్కకు పడేసాను. వచ్చిన ఆలోచనలు అప్పుడప్పుడూ చదువుకుంటూ, నెమరువేసుకుంటుంటే, ఆ ఆలోచనలు సరిదిద్దుకుంటుంటే అది మన వ్యక్తిత్వన్ని మెరుగుపరుస్తూ, విజయాల వైపు నడిపించగలదు.

అందుకే ఈ టపాని అటువంటి ఆలోచనల కోసం కెటాయించదలిచాను. ఎప్పటికప్పుడు నా మదిలో వచ్చే మంచి ఆలోచనలను ఇందులో వ్యాఖ్యల రూపంలో పొందుపరుస్తాను. అవి మీకూ ఎవరికయినా ఉపయోగకరంగా వుండవచ్చు - లేకపోవచ్చు. ప్రాధమికంగా మాత్రం ఈ టపాలోని వన్నీ నాకోసం నేను వ్రాసుకుంటున్నవి అని గమనించగలరు. నా ఆలోచనలపై చర్చ జరిగినా మంచిదే. ఎందుకంటే అలా నా ఆలొచనల్లొ లోపాలున్నా, గొప్పతనాలున్నా తెలిసిపోతుంది.  చర్చల వల్ల నా మనస్సులో ఆ ఆలొచనలు ఇంకా బాగా ఇంజెక్ట్ అవుతాయి.

ఆలోచనలు వ్యక్తిగతమే అయినా పబ్లిక్ గా పెట్టేయబోతున్నా  కాబట్టి నా యొక్క అన్ని ఆలోచనలు ఈ టపాలో పెట్టలేను కానీ వీలయినంతవరకు ప్రయత్నిస్తాను. 

39 comments:

 1. నిజమే. మనస్సు మన క్షేమం కోసం, ఉన్నతి కోసం గొణుగుతూనే వుంటుంది కానీ మనమే సరిగ్గా ఆలకించము. అవన్నీ ఆలకించి పాటించిననాడు విజయాలే విజయాలు. వినాలి. నా మనస్సును శ్రద్ధంగా ఆలకించడం అలవాటు చేసుకోవాలి. ఆ ఆలోచనలన్నీ రికార్డ్ చెయ్యాలి. వాటిని సాధన చెయ్యాలి. సాధించాలి.

  ReplyDelete
 2. బుల్లబ్బాయ్December 28, 2010 at 11:05 PM

  @@ ఎప్పటికప్పుడు నా మదిలో వచ్చే మంచి ఆలోచనలను

  అడ్డెడ్డె.. ఇక్కడ దెబ్బై పోయింది.
  Only "మంచి" ఆలోచనలే రాస్తారన్నమాట.
  మాకోసం మసాలా ఆలోచనలేమీ రాయరా?

  ReplyDelete
 3. నన్ను నమ్మండి. మనసును ఫాలో అయితే దక్కేది విజయం కాదు మంచివాడు అని నలుగురూ ఇచ్చే ఒక సర్టిఫికేటు. correct... నాలుక గీసుకొనేందుకు మళ్ళీ వేరే ఏదైనా కొనుక్కోకతప్పదు.

  ReplyDelete
 4. బుల్లబ్బాయ్December 29, 2010 at 1:57 AM

  నేనూ నా మనసుని ఫాలో ఐపోవాలని డిసైడయ్యా.
  2011 లో తెలుగు బ్లాగులతో నా టైం వేస్ట్ చేసుకోకూడదూ అని!

  ReplyDelete
 5. @బుల్లెబ్బాయ్,
  అన్నింటికన్నా శ్రేష్టమైన దివ్యమైన మనఃప్రభోదం, నిర్లక్షపెట్టకు సుమా!!

  ReplyDelete
 6. బుల్లబ్బాయ్December 29, 2010 at 9:18 AM

  నిజమే అన్నాయ్.. నిన్నా + ఇయ్యాల్లా ఒక 5-6 గంటలు ఈ చెత్త బ్లాగుల్లో గడిపాను.. మధ్యన ఆ పిచ్చి ప్రవీణ్ కామెడీ..

  అందుకే, 31 రాత్రి తర్వాత ఇక తెలుగు బ్లాగులు సూసేదే లేదు.

  ఇక శరత్ ఇంట్లో సమైక్యమా/విభజనా అన్నది Jan-1-2012 వాపస్ వొచ్చి కనుక్కుంటా ;)

  ReplyDelete
 7. @ విజయమోహన్
  అవును. ధన్యవాదాలు
  @ బుల్లబ్బాయ్
  నేను బ్లాగులు చూడటం, వ్రాయడం మానకపోయినా తగ్గిస్తున్నాను.
  @ మినర్వా
  మనస్సుని ఫాలో అయిపొమ్మన్నది ఆ విధంగా కాదు. మన సబ్ కాన్షియస్ మనస్సు మనలోని బర్నింగ్ డిజైర్ కి తగ్గట్టుగా ఎన్నొ విలువైన సూచనలు ఇస్తూవుంటుంది. అది గొప్ప విషయం. విచారకరమయిన విషయం ఏమిటంటే ఓ ప్రియురాలు గుససలాడినట్లు చెబుతుంది కానీ పెద్దగా అరవదు. అందుకే వాటిని అలా విని ఇలా వదిలేస్తాం. అవి పట్టించుకుంటే విజయానికి తాళం చెవి దొరికినట్లే.

  ReplyDelete
 8. నా నోట్స్ నుండి (జూన్ 08, 1998):

  When no great harm will result, let your children do it their way, even if you know they are wrong. They will learn more from their mistakes than from successes.

  ReplyDelete
 9. 2011 ఫైనాన్షియల్ గోల్స్: ఈ ఏడాది ఇంట్లో మిగతా పరిస్థితులని కాస్త చక్కబరిచాననే అనుకుంటున్నాను. 2011 లో నా ఆర్ధిక స్థాయి పెంచాల్సివుంది. అంటే ఇప్పుడేదో దివాళా తీసి వున్నానని కాదు గానీ డబ్బు అనే పరుగుపందెంలో లేను. 2011 లో నా పరుగు మొదలవుతోంది. అందుకు నా మనస్సునూ, శక్తి సామర్ధ్యాలనూ సంసిద్ధం చేసుకుంటున్నాను. ప్రణాలికలూ, వ్యూహాలూ పన్నుతున్నాను. శుభ సూచకాలు వాటంతటవే వస్తున్నాయి. వాటికి ఆలస్యం లేకుండా స్పందిస్తున్నాను. నా కలలు నిజమవడం జనవరి నెలలోనే మొదలవుతుందా అన్నది వేచిచూడాలి.

  బ్యాంకు బ్యాలెన్స్, కొత్త కారు, క్రూయిజ్ ట్రిప్ మొదలయినవి 2011 ఆర్ధిక నిర్దేశకాలు. వీటినీ, మిగతా 2011 టార్గెట్స్ ను ఇంకా స్పష్టంగా నిర్వచించాల్సి వుంది. ఏదో ఆషామాషాగా బ్యాంక్ బ్యాలన్స్ అంటే మన సబ్ మైండ్ స్వీకరించదు. మన సబ్ మన ఆలోచనలను స్వీకరించాలంటే చాలా స్పష్టంగా మన లక్ష్యాలను నిర్దేశించాలి. అప్పుడు మాత్రమే వాటిని ఆదేశాలుగా మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని అందుకు తగ్గట్టుగా సంసిద్ధం అవుతుంది - మనల్నీ సంసిద్ధం చేస్తుంది.

  మీరూ చెప్పండి - ఎంత బ్యాంక్ బ్యాలన్స్ టార్గెట్ పెట్టుకుంటే బావుంటుందంటారో. ఏ కార్ కొనమంటారో, ఏ క్రూయిజ్ ట్రిప్ వెళితే బావుంటుందో. ఈ ఆర్ధిక లక్ష్యాలన్నీ అనిత కోసం. నాకు డబ్బు, విలాసాల మీద అంత వ్యామోహం లేదు. చాలా తృప్తిగా జీవిస్తాను. కానీ ఇంట్లో ఆడది ఆనందిస్తేనే కదా మనకూ ఆనందం.

  ReplyDelete
 10. 2011 ఆర్ధిక లక్ష్యం: $50,000 లేదా రూ. 25,00,000. ఈ మొత్తం డబ్బు అన్ని ఖర్చులని మినహాయించి బ్యాంక్ బ్యాలెన్స్, పెట్టుబడులు, బంగారం లాంటి తదితర రూపాల్లో వుండవచ్చును.

  2011 దాతృత్వ లక్ష్యం: కీర్తి చదువుల కోసం నెలా నెలా పంపిస్తున్నది నెలకి $50 నుండి $100 కి పెంచాలి. సామాజిక సేవ చేస్తున్న కొన్ని సంస్థలకు కొద్ది మొత్తంలో విరాళాలు అందించాలి.

  ReplyDelete
 11. నా నోట్స్ నుండి ( 21-05-1998)
  విజయ సోపానంలో చివరికి వుండేది కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో మనం విజయం సాధించాలంటే మనకు కావాల్సింది, వుండాల్సింది సహనం. కేవలం సహనం.

  ReplyDelete
 12. ఆర్ధిక లక్ష్యానికి అర్ధం ఏమిటంటే నిర్దేశించిన లక్ష్యానికి మించి ఒక్క పైసా కూడా ఆదా చేయకపోవడం అన్నమాట. అంతకు మించి ఏమాత్రం మిగలనివ్వను. మిగిలినా వుండనివ్వను. పొరపాటున ఏమయినా డబ్బులు మిగిలితే ఎంచక్కా వృధాచేస్తాను/ ఆనందిస్తాను.

  ReplyDelete
 13. యాభైవేలా...
  సబ్ మైండ్ దిమ్మతిరిగే టార్గెట్స్ పెట్టి మళ్ళీ సంవత్సరం చివర్లో ఇంకో టపా వేద్దామనా? ఇద్దరుపిల్లల్తో అంత మిగిలిద్దామని టార్గెట్ పెట్టారంటే, నా సబ్ మైండ్ బ్లాంక్ అయ్యింది.

  ReplyDelete
 14. 2011 ఆరోగ్య లక్ష్యాలు:
  - ట్రైగ్లిసరాయిడ్స్ 200 లోపుకి తగ్గించడం.
  - HDL, LDL లు కంట్రోల్లో ఉంచడం.
  - బరువు 50 - 52 కిలోల మధ్య ఉంచడం.
  - వ్యాయాయం, సెల్ఫ్ హిప్నాటిజం( ధ్యానం) కలిపి రోజుకి కనీసం రెండు గంటలు చేయడం.
  - ఆథ్లెటిక్ బాడీ వైపుగా కృషి చేయడం.
  - ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు వినియోగం పెంచడం, సమతుల ఆహారం కోసం కృషి చెయ్యడం.

  ReplyDelete
 15. @ పండు
  నెలకి $4,000 లు పక్కన పెడెయ్యగలిగితే అది ఏడాదీ దాదాపుగా $50,000 అయిపోతుంది. అదేమంత మరీ పెద్ద టార్గెట్ కాదే. నేను ప్రస్థుతానికి ఏడాదికి $10,000 సేవ్ చేస్తున్నాను. మా కుంటుంబంతో సహా ఇండియా వెళ్ళి రాకుండా వుంటే ఇంకో $10,000 పొదుపు చేసివుండేవాడిని. యు ఎస్ లోని మన దేశీలు చాలామంది తెలుగువారు ఆ మాత్రం సేవింగ్స్ చేస్తుంటారనే నా నమ్మకం. నా దృష్టిలో అది సాధారణమయిన టార్గెట్. ఇంకా ఇంతేనా అని జనాలు నవ్వుతారేమో అనుకున్నా. ఆ మాత్రం టార్గెట్లు సాధించకపోతే మనమూ, మన లక్ష్యాలు అంటూ ఈ హైరానా అవసరం అంటారా చెప్పండి.

  ReplyDelete
 16. నా 2011 లక్ష్యాలను అన్నింటినీ క్రోడీకరించి అందరికీ కనపడేట్లుగా, ఎప్పుడూ గుర్తుండేలా, ఎప్పుడూ మా ఇంట్లో అందరికీ, మా ఇంటికి వచ్చిన అందరికీ గుర్తు చేసేలా లివింగ్ రూము గదిలో గోడ మీద అతికించదలిచాను. ఇలా అందరికీ తెలిసినప్పుడే అందరూ చర్చిస్తుంటారు, గుర్తు చేస్తుంటారు, అడుగుతుంటారు, కెలుకుతుంటారు. అలా మన గోల్స్ మీద మనకు నిబద్ధత ఏర్పడుతుంది. పుస్తకంలో వ్రాసుకొని పక్కకు పడేస్తే మళ్ళీ 2012 జనవరిలో తెరుస్తామంతే. అప్పుడు ఇహ మనకి మిగిలేవి ఆ కాగితం లక్ష్యాలే.

  ReplyDelete
 17. @ పండు
  ప్రతి పక్షం రోజులకు ఒకసారి నా ఆర్ధిక లక్ష్యాలని ఎంతవరకు సాధిస్తున్నా అనేదానిని వెల్లడిస్తూనేవుంటాను. మీరే చూద్దురు గానీ.

  ReplyDelete
 18. మరీ వివరాల్లోకి నేనెళ్ళను గాని, కొంత 401Kలో పెడుతున్నాని చెప్పినట్లు గుర్తు. $100K జీతంతో నేనేసిన లెఖ్ఖ్హ ప్రకారం, 6% 401K లోపెడితే, Illinoisలో state tax వుంటుందికాబట్టి, ఆ అమౌంట్ చూడగానే, మరినెనో!! అని బుర్రగోక్కోవడం మొదలెట్టా. మీరు మిగిలించగలిగితే, సూపరో సూపర్. మాకెలాగూ చెప్తూనే వుంటారు(ఇప్పటి హామీల ప్రకారం) కాబట్టి, ఫాలో అయిపోవడమే.

  ReplyDelete
 19. 2011 వినోద లక్ష్యాలు
  - క్రూయిజ్ విహార యాత్రకి వెళ్ళడం
  - అనిత కోసం కొత్త, రెండవ కారు కొనడం
  - అమ్మలుని, అనితని వేసవి సెలవుల్లో ఆస్ట్రేలియా (అనిత తమ్ముడి వద్దకు) పంపించడం.

  ReplyDelete
 20. ఎడాదికి 50K సేవింగ్స్ టార్గెట్ పెట్టారంటే శరత్ గారు ఎంత సంపాదిస్తున్నారొ. శరత్ గారు మీ ఉద్యోగం చూసి నాకు అప్పుడప్పుడు ఈర్ష్య కలుగుతుందండీ:-)

  తెల్లారి 3 నాలుగు కి కూడా కామెంట్స్ అప్రూవ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు పడుకుంటారు అసలు. :D

  ReplyDelete
 21. @ మంచు
  ప్రష్తుతం అంత మిగిలించేంతగా సంపాదించట్లేదండీ. ఆ మాత్రం మిగిలించడానికై ఇహనైనా సంపాదించాల్సివుంటుంది. నా యు ఎస్ మిత్రులు, బంధువుల్లో చాలామంది ఆ మాత్రం మిగులుస్తున్నారు మరి. మేమే చాలా వెనకబడ్డాం. ఉత్తమ మానవుడు అవకాశాలని సృష్టించుకుంటాడు. మధ్యముడు వున్న అవకాశాలను ఉపయొగించుకుంటాడు. కనీసం మధ్యముడిని అయినా అవాలనే నా అభిలాష. ఇప్పటివరకూ చాలా విశ్రాంతి తీసుకున్నాను. ఇక ముందు నాకు వున్నది ఆర్ధిక యుద్ధమే.

  రాత్రి బాత్ రూం బ్రేక్ తీసుకున్న తరువాత బ్లాగు బ్రేక్ కూడా తీసుకుంటా :)

  ReplyDelete
 22. సాంఘిక లక్ష్యాలు:
  - బి డి ఎస్ ఎం గురించి బ్లాగుల ద్వారానూ, వీడియోల ద్వారానూ విస్తృత ప్రచారం, అవగాహన కలిగించడం.

  కుటుంబ లక్ష్యాలు:
  - మా అమ్మగారిని US సందర్శనకు తీసురావడం. పదేళ్ళ క్రితం మా నాన్నగారు జరిగిపోయాక కెనడాకి వచ్చి ఏడాది వుంది. అపుడు యు ఎస్ కూడా వచ్చి వెళ్ళింది. అప్పటి నుండీ మళ్ళీ మా దగ్గరికి తీసుకురావడం కుదరలేదు.

  ReplyDelete
 23. మీకు హవుస్ లొన్ ఎమీ లేదా?

  ReplyDelete
 24. @ఈ ఆర్ధిక లక్ష్యాలన్నీ అనిత కోసం.
  idi premE kadA!!!!!!
  mee (ఆరెంజ్) కథలు prEma lEdantunnAyi? :)

  -Mauli

  ReplyDelete
 25. so you are ready to listen to your inner voice and become rich :)

  -Mauli

  ReplyDelete
 26. శరతన్నా,

  %50,000 సేవింగ్స్ 401 (k) కాకుండాన, కలిపా? ఇద్దరు పిల్లలంటె మీ social, meical, state tax, federal, vehicle insurance అన్నీకలిపి కనీసం $35-$40,000 అవుతాయి. ఆ పైన ఇంటి కర్చులు నెలకు కనీసం $4000. ఆ పైన క్రూఇజ్ కి, australia కి , etc..ఇంకో $15,000. మీ జీతం కనీసం $150,000 - $170,000 ఉండాలి. అవునా?

  ReplyDelete
 27. @ మంచు
  లేదండి. మాది కిరాయి ఇల్లు

  @ మౌళి
  ప్రేమ వున్నా వుండకపోయినా బాధ్యత అంటూ వుంటుంది కదా :)

  అవునండీ. ఒక్క డబ్బు సంపాదనకే కాదండీ. అన్ని విషయాల కొసం గానూ ఇన్నర్ వాయిస్ జాగ్రాత్తగా ఆలకించడం, ఆచరించడం సాధన చేస్తున్నాను. ఉదాహరణకు $50,000 టార్గెట్ సెలవిచ్చింది నా ఇన్నర్ వాయిసే :)

  ReplyDelete
 28. @ అజ్ఞాత @ 29 డిసెంబర్ 2010 11:36 సా
  401K కలిపేనండి. మా ఖర్చులు $3000 లోనే సర్దుకుంటున్నాం. నా లేటేస్ట్ పోస్ట్ చూడండి. అందులో వివరాలు ఇచ్చాను. మరీ ఎక్కువ సంపాదించకున్నా ట్యాక్స్ తక్కువపడేలా చేసుకోవడం ద్వారా కూడా ఎక్కువ మిగిలించుకోవచ్చు. అలా కొన్ని మార్గాలు వున్నాయి. నా జీతం ప్రస్థుతం మీరు అనుకున్నత ఎక్కువగా ఏమీ లేదు. మిగిలించాలంటే, పొదుపుచెయ్యాలంటే, సంపాదించాలంటే జీతం పెరగడం ఒక్కటే కాకుండా ఇంకా ఇతర మార్గాలు కూడా వున్నాయి.

  ReplyDelete
 29. నా నోట్స్ నుండి (14-05-98)

  ఆర్ధిక లక్ష్యాలు:
  - నా జీవితంలో 500 కోట్ల రూపాయలు సంపాదించాలి
  - రెండేళ్ళ లోగా 50 లక్షలు సంపాదించాలి
  - ఏడాదిలోగా 16 లక్షలు సంపాదించాలి
  - 6 నెలలలోగా 4 లక్షలు సంపాదించాలి

  ఇవన్నీ అప్పుడు ఇలా నోటుబుక్కులో వ్రాసేసి అలా పక్కన పెట్టేయడం వల్ల కామోసు పెద్దగా నా లక్ష్యాలు ఫలించినట్లు లేదు :)

  ReplyDelete
 30. నా నోట్స్ నుండి:
  (15-04-98)
  Nothing succeeds like success!

  (16-04-98)
  Just do it!

  ఏమీ కంగారు లేకుండా ఏ రోజు పని ఆ రోజు చేసేస్తూవుంటే సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలవు. తాపీగా పని చేసుకు వెళ్ళవచ్చు.

  ReplyDelete
 31. నా నోట్స్ నుండి (16-04-98):
  సాధారణ విజయాలని మాత్రమే ఊహించకు. అద్భుతమయిన విజయాలపట్ల ఆలొచనతో వుండు.

  ReplyDelete
 32. నా నోట్స్ నుండి (21-05-98):
  లక్ష్యం దారిలో గడప రాకముందే ఓటమి అంగీకరించకు. నీవు నడుస్తూ వుంటే తలుపులు వాటంతట అవే తెరచుకుంటాయి. 10% తలుపులు కాస్త తొయ్యాలి. 1% తలుపులు తొయ్యడానికి మాత్రం నిజంగా కష్టపడాలి.

  "తట్టనిదే తెరచుకోదు" - జీసస్ క్రీస్ట్

  ReplyDelete
 33. నా నోట్స్ నుండి (21-05-98):

  'Patience' is equivalent to all other personality traits!

  ReplyDelete
 34. ఇప్పుడే వచ్చిన ఆలోచన. శృంగార విషయాలపై సమాచారం, హక్కుల సమాచారం, మసాలా మొదలయిన విషయాలతో ఒక వెబ్ సైట్ ప్రారంభించబోతున్నాను. రసజ్ఞ లోని కాంటెంట్ మరియు కాలం లోని సరసమయిన విషయాలకు బోలెడంత ఆదరణ వుంటుందని అర్ధమయ్యింది. ప్రకటనలు ఆ సైటుకి ఎలా తేవడం అన్నది మీతో కూడా ఆలోచిస్తాను. బ్లాగుల్లో ఆ విషయాలు వ్రాసుకుంటే కొద్ది మందికే చేరుతోంది.

  ReplyDelete
 35. బాగున్నాయి మీ ఆలోచనలు. చాలానే చేసేరే. ఏమిటీ సవత్సరానికి 50k దాస్తారా. ఢాం... పడిపోయా ఇక్కడ. అసలు ఎలా కుదురుతుంది అండీ. మళ్ళీ పైగా క్రూస్ లు, కొత్త కారు... మీరేమన్నా అరబ్ దేశం లో వున్నారా? అమెరికాలో నండీ బాబు. ఎనీ వే గుడ్ లక్.

  ReplyDelete
 36. @ భావన
  ఏంటీ ఈమధ్య కనపడతం లేదు. అజ్ఞాత వాసం చేస్తున్నారా?

  అనుకున్నవి కొన్ని అనుకున్నట్టుగా జరిగితే అవన్నీ నాకు ఏమీ సమస్య కావు కానీ చూడాలి. ప్రయత్నలోపం లేకుండా కృషిచేస్తాను.

  ReplyDelete
 37. జనవరి తరువాత ఆలోచనలకి విశ్రాంతిని ఇచ్చారా? లేక ఏమి ఆలోచించలేకపోతున్నారా?

  మీ ఆలోచనలు, కుటుంబం పట్ల మీరు చూపించే బాధ్యతాయుతమైన ప్రేమ నాకు చాలా నచ్చాయి.

  ReplyDelete
 38. @ రమణి
  ఎలాగూ నా ఆలోచనలు టపాలుగా టపటపా వచ్చేస్తున్నయ్ కదా అని ఈ టపా మీద శీతకన్నేసాను. మధ్యమధ్యలో వ్యవధి ఇస్తుంటే ఇంకా మంచి ఆలోచనలు వస్తుంటయ్ కదా అన్నది కూడా ఓ కారణం. మళ్ళీ గుర్తు చేసారు. సంతోషం.

  ReplyDelete