మంగళవారం 21 డిసెంబర్ 2010

జ్యొతి గారికి పుట్టిన రోజు సందర్భంగా ఓ విన్నపం

మీకు బ్లాగు టపాల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా ఎక్కువవుతున్నాయి. దయచేసి ఏ ఈమెయిల్లోనో మీ అభిమానులని శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరగలరు. ఈ శుభాకాంక్షల టపాలూ, కామెంట్లూ చూసి చూసి విసుగొస్తోంది.

మీ ఒక్కరనే కాదు - అందరూ కూడా ఈ శుభాకాంక్షలు ప్రైవేటుగా తెలుపుకొంటే బావుంటుందేమో ఆలోచించగలరు.

17 comments:

కొత్త పాళీ చెప్పారు...

I disagree with this proposal.
తిట్ల వ్యాఖ్యలకంటే శుభాకాంక్షల వ్యాఖ్యలు ఎంతో బెటరు.

జ్యోతి చెప్పారు...

శరత్ గారు,

మీ బ్లాగులో కొన్ని టపాలు,కామెంట్లు,మరికొన్ని బ్లాగుల్లో వచ్చే టపాలు,కామెంట్ల కంటే నా బ్లాగులో చెప్పే శుభాకాంక్షలు అసహ్యంగా, అభ్యంతరకరంగా ఉండవనుకుంటా.. ఐనా నా బ్లాగులో నేను విషెస్ చెప్పే బ్లాగర్లు నాకే కాక మరికొందరికి ఆత్మీయులు.అలా అని అందరికి బ్లాగుల్లో విషెస్ చెప్పను. బ్లాగులో చెప్పానంటే వాళ్లు ప్రత్యేకమైన వారు అన్నమాట. ఐనా నా బ్లాగులో ఏడాదిగా ఎవరికీ విషెస్ చెప్పడంలేదే. కాని ఇవాళ మా ప్రమదావనం సభ్యులు నాకు తెలీకుండా మొత్తం అగ్రిగేటర్లను కబ్జా చేసుకునే ప్లాన్ వేసినట్టున్నారు. :)

అజ్ఞాత చెప్పారు...

అన్నాయ్ నిజంగా ఇవన్నీచూసి విసుగొస్తుందా లేక నీకెవరూ చెప్పట్లేదని అసూయా !!.. మీ పుట్టినరోజు ఎపుడో కూడా చెప్పండి మీకు కూడా చెప్తారు. ఐనా మీరు విసుక్కోవలసిన అంశాలు ఇంకా వేరే చాలా ఉన్నాయ్ వాటి గురించి పట్టించుకోవడం బెటర్..

అజ్ఞాత చెప్పారు...

"ఈ శుభాకాంక్షల టపాలూ, కామెంట్లూ చూసి చూసి విసుగొస్తోంది."

ఇవి చూసి మీకుమాత్రమే లేదా ఇంకో నలుగురికి విసుగొస్తుందేమో కానీ మీ టపాలు కామెంట్లు చూసి విసుక్కునేవారు వందల్లో ఉంటారు. వాళ్ళకోసం మీరు బ్లాగ్ మూసేస్తారా ?

అజ్ఞాత చెప్పారు...

బాబాయ్, ఏదో పనిలేని పాపాయమ్మలు పంపు కాడ పాచి కబుర్లు సెప్పుకుంటాంటే... నువ్విట్టాగొచ్చి ఆల్లని కెలికితే... అళ్ళు బిందెలతో బాదుతారు.. జాగర్త ;)

mirchbajji చెప్పారు...

sarath gaariki durada ekkuve..., parledu baagaane gokinchukunnaaru.

నీహారిక చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

జ్యోతికి బ్లాగ్లోకంలో అందరూ కావల్సిన వాళ్ళే! అందుకే ప్రతి నెలా ఎన్నో పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటాయి. అలా బ్లాగ్లోకంలోకి వచ్చీ రాగానే వాళ్లనిపట్టుకుని సలహాలిచ్చి ఫోన్ నంబర్లిచ్చి కట్టేసుకుంటుంది. అందుకే ఇవాళ అగ్రిగేటర్లన్నీ జ్యోతి జ్యోతి అని భజన చేస్తున్నాయి కానీ అంత లేదు అక్కడ! ఒట్టి టైమ్ వేస్టు వ్యవహారం!ఇదంతా జ్యోతి ప్లానేలే!

lakshman చెప్పారు...

I am disagree with this post

a2zdreams చెప్పారు...

ఎవడి బ్లాగు వాడి ఇష్టం అని వాళ్ళ చేతే చెప్పించాలని ఈ టపా ప్లానా ?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ a2zdreams
:))

అభినందనలు. మీరు సరిగ్గా కనిపెట్టారు. చూస్తూ వుండండి ;)

Ramu S చెప్పారు...

సోదరా...
మీరు ఎప్పుడో దీన జనోద్ధరణ చేసిన అమ్మాయి గురించి గుర్తుంచుకుని మీరు ఏకంగా ఒక పోస్టు రాయవచ్చుగానీ...జ్యోతి గారి కి శుభాకాంక్షలు చెబితే మాత్రం చిరాకా? పాపాయమ్మలు, పాచి కబుర్లు.... లాంటి కామెంట్స్ ప్రోత్సహించకండి సార్.
రాము
apmediakaburlu.blogspot.com

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ రాము

జ్యోతి గారి గురించే అని కాదు. జెనెరలుగా కాపీ పేస్టు శుభాకాంక్షల వల్ల, టపాల వల్ల ఏం ప్రయోజనం వుంటుందని ఒక ప్రస్థావన అంతే - ఫత్వా ఏమీ కాదుగా ;)

ఒక్కరూ కూడా నాతో ఎకీభవించలేదు కాబట్టి నా ప్రస్థావనే పొరపాటు అయివుండవచ్చని అంగీకరిస్తున్నాను. అందుకే నేను కూడా మీ అందరిలాగా మారాను. ఇక నుండి నేనూ అందరికీ గ్రీటింగ్స్ అందిస్తాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

జ్యోతి గారికి జన్మదిన శుభాకాంక్షలు - ఈ ఏడాదికి కొద్దిగా ఆలస్యంగా - వచ్చే ఏడాదికి చాలా ముందుగా!

అజ్ఞాత చెప్పారు...

@@ ఈ ఏడాదికి కొద్దిగా ఆలస్యంగా
@@ - వచ్చే ఏడాదికి చాలా ముందుగా!

అన్నాయ్, క్యామెడీ అంటే ఇదీ ;) LOLz

విపి మీడియా కబుర్ల లక్ష్మన్ చెప్పారు...

@@ పాపాయమ్మలు, పాచి కబుర్లు....
@@ లాంటి కామెంట్స్ ప్రోత్సహించకండి సార్

అవ్ అన్నా!
మనం మాత్రం TV9 లో స్కాం లు చేసి జెమినిTV లో చేరిన సాయి అని నికార్సయిన దగుల్బాజీ కబుర్లు రాసుకుందాం.

swapna@kalalaprapancham చెప్పారు...

naku kuda anthaga nachhadu ila wishes posts pettadam, kani vallaki telisina vallaki wishes cheppalani blog lo uthsaha padutharu anduke nenu em dini mida em comment ivvanu. ayina valla blog valla ishtam kada, manam evvarimi. suppose naku evarina thelisina valla b'day ayi unte nenu kuda aa post lo wishes cheptanu kani special ga evariki b'day ano epudu post rayale.

kani feb lo matram thappakunda oka post pedutha b'day wishes okari mida. eppudo anukunna ila pettali ani. so ee okka post ki matram exception case pattinchukodam ledu miru kuda pattinchukovadde :)