నిన్నటి షి.బ్లా.స సమావేశం వివరాలు ;)

నిన్న సాయంత్రం ఆఫీసు నుండి బయటకి వెళుతూ మా ఇంటికి ఫోను చేసి "ఇవాళ షిబ్లాస సమావేశం వుంది. రాత్రికి ఆలస్యంగా వస్తాను" అని చెప్పాను
"షిబ్లాస అంటే?"
"షికాగో బ్లాగర్ల సంఘం సమావేశం ఇక్కడే ఒక రెస్టారెంటులో వుందిలే"
"నేను నమ్మను"
"అలా నమ్మకపోతే ఎలా? ప్రవీణ్ మీద ఒట్టు"
"ప్రవీణ్ ఎవడు?"
"మీ అన్న" అని చెప్పేసి మరిన్ని ప్రశ్నలు రాకుండా ఠక్కున ఫోను పెట్టేసాను.

నిజానికి నేను వెళ్ళింది వేరే మీటప్పుకి. ఆ సమావేశానికి వెళుతున్నానని ఇంట్లో నిజం చెబితే ఇంటికెళ్ళాక నా తాట వలిచెయ్యకపోయినా ఎదవ నస మొదలవుతుంది. అబద్ధాలు ఎందుకులే చెప్పడం అని ఇంట్లో నిజాలు చెబితే అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకుంటోంది మా ఆవిడ. వెనుక నుంచి ఏనుగు నడిచెళ్ళినా సరే కానీ మా ఆవిడ ముందు నుండి చీమ కూడా దాటెళ్ళడానికి వీల్లేదన్నమాట.  అలా అయితే పని కాదని మనమూ అబద్ధాలు నేర్చుకున్నాం. అందుకే ఈ సారి చికాగో బ్లాగర్లని అడ్డుపెట్టుకున్నాను. హి హీ. ఎప్పుడన్నా దొరికిపోయామనుకోండి ఓ ఎదవ నవ్వు నవ్వి ఇకిలిస్తే సరిపోతుంది కదా.

సమావేశానికి 16 మంది వచ్చారు. అందులో 7.5 మంది ఆడవారే వున్నారు. అందులో ఇద్దరు బావున్నారు. అందులో ఒక అమ్మాయి చాలా బావుంది.  ఆమెతో వచ్చిన వ్యక్తి ఆడొ, మగో అర్ధం కాలేదు. క్రితం సారి కూడా ఆ వ్యక్తి వచ్చారు - అప్పుడూ అర్ధం కాలేదు కానీ చివర్లో ఆ శాల్తీ మగాళ్ళ టాయిలెట్టుకి వెళుతుంటే అప్పుడు మగ అని నిర్ధారించుకున్నాను. ఆ శాల్తీ రాగానే మా మీటప్ నిర్వాహకుడు వెల్కం మై బోయ్ అని ఆహ్వానిస్తే తోడుగా వచ్చిన ఆ అందమయిన అమ్మాయి నాట్ బోయ్. గర్ల్ అని సవరించడంతో మళ్ళీ నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 

ఇదేంటబ్బా, క్రితం సారి అంతకష్టపడి పరిశోధించి ఆ శాల్తీ మగవాడని ధృవపరచుకుంటే ఇప్పుడు ఆ వ్యక్తి పక్కనున్న అమ్మాయి ఆ శాల్తీని అమ్మాయి అని అంటుదేమిటా అని బుర్ర గోక్కున్నాను. ఆ శాల్తీమీద ఒక నజర్ వేసి వుంచాను. ఆ ఇద్దరు మిగతా కొంతమందితో కలిసి ఎదురుగ్గా వెరే బల్ల మీద కూర్చున్నారు. ఎంతసేపు పట్టిపట్టి చూసినా అది ఆడదో మగాడో అర్ధం కాలేదు. మరీ బుర్ర గోక్కుని గోక్కునీ ఇంటికి వెళితే మా ఆవిడకి అనుమానం వస్తుందని ఆ కార్యక్రమం ఆపివేసి నా పక్కనే కూర్చున్న సెక్సీ క్వీనుని అడిగాను.

అమ్మాయనుకుంటా అంది. ఓరి నీ మొఖం మండా, ఇన్ని రోజుల నుండి ఈ మీటింగులకి వస్తున్నావు కదే నీక్కూడా తెలియదా అని అర్జంటుగా మనస్సులో అనుకున్నా.
నా మనస్సులోని మాటలు ఆమెకి వినిపించినట్లున్నాయి "తనలో ఎక్కువ శాతం అమ్మాయనుకుంటా" అంది
హ?
"M2F" అంది.
అప్పుడు వెలిగింది నాకు
"తను చేంజ్ అవుతూవస్తోంది కానీ ఇప్పుడు ఎంత శాతం మారిందో తెలియదు కానీ ఇప్పుడు తనని మనం అమ్మాయిగా లెక్కవెయ్యొచ్చనుకుంటా" అంది.

ఈ సమావేశాలకి ట్రాన్సుజెండర్లు (లింగ మార్పిడి) కూడా రాచ్చుననే విషయం నేను బొత్తిగా మరచిపోయాను. అదీ విషయం. ఆ వ్యక్తిని మనస్సులోనే అభినందించాను. కొంతమంది పొరపాటు శరీరాల్లో పుడతారు కానీ అందులో చాలామంది అలాగే కొనసాగుతారు. ఆ వ్యక్తి తనకు నచ్చిన జెండర్ లోకి మారుతోంది. ఎంత గొప్ప విషయం! ఎంతమందికి వుంటుంది అలాంటి చొరవ, తెగింపు, ధైర్యం, ఓపికా? ఈ సారి మళ్ళీ కలిసినప్పుడు వ్యక్తిగతంగా అభినందిస్తాను.

క్రితం సారి ఓ సెక్సీ లేడీ వచ్చింది కానీ నన్ను బొత్తిగా పట్టించుకోలేదు అని వాపోయానా. ఈ సారి ఆమె నా పక్కనే కూర్చొని నా ఆలనా పాలనా చూసుకుంటూ ఎంతో చక్కగా నాతో కబుర్లాడింది :)  ఇంకో హైలైట్ ఏంటంటే ఆ TG తో వచ్చిన అందమయిన అమ్మాయి తన పై అందాలు ఫ్లాష్ చేసినట్లుంది కానీ నేను వేరే టేబుల్లో కూర్చొని ముచ్చట్లలో లీనమయిపోవడం వల్ల ఆ దృశ్యం మిస్సయ్యాను. ప్చ్. ఏదో చివర్లో కొద్దిగా కన్నులపండుగ అయ్యింది.  ఇహ మిగతా విశేషాలంటారా - క్రితం సారి లాంటివేలెండి. పెద్దల జోకులు, పెద్దల కబుర్లు, పెద్దల  కార్యక్రమాల గురించిన విశేషాలు.

11 comments:

 1. ఇంకో విషయం మరచిపోయాను. డ్రింక్ ఏమయినా కావాలా అని అడిగింది ఆ రెస్టారెంట్ సెర్వర్. బీర్ కావాలన్నాను. నీకు ఆల్కాహాల్ తాగే లీగల్ వయస్సు వుందా అని అడిగింది :( సిగ్గు, నవ్వు రెండూ వచ్చాయి నాకు :)

  ReplyDelete
 2. పాపం ఆవిడ కి కళ్ళు సరిగా కనిపించ్టం లేదేమో అన్నాయ్.. సరే కానీ... ఈ లింగ మార్పిడి అంటే ఆపరేషన్ చేయించుకున్న బాపతే కదా ?.. నాకైతే ఇలాంటి వాటిపై నమ్మకం లేదు.. పాపం సరైన పెంపకం, స్నేహుతులూ లేక అలాంటి లక్షణాలు అలవడి ఉంటాయి.. ఆపరేషన్ పేరుకే తప్ప వాళ్ళు నిజమైన ఆడవారి కింద లెక్క కాదు కదా.. పిల్లలు పుట్టరు... అంతా కృత్రిమం అనుకుంటా... ఇందులో ఏమైనా తేడా లు ఉంటే వివరించ గలరు..

  ReplyDelete
 3. >>నీకు ఆల్కాహాల్ తాగే లీగల్ వయస్సు వుందా అని అడిగింది
  అబ్బ చా! బ్లాగర్లు ఎంత మీబావ రచనలు చదివినా మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా ఏం చెప్పినా నమ్మడానికి :)

  ReplyDelete
 4. @కార్తీక్
  ఆమె ప్రశ్నకి నేనూ ఆశ్చర్యపోయాను.
  ఓ నాలుగులేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు మా బందువుల ఇంటికి వెళ్ళాను. వాళ్లింటికి వారికి తెలిసిన అందమయినా ఆంటీ ఒకరు వచ్చారు. నన్ను చూసి ఈ అబ్బాయి ఎవరూ అని అడిగింది. ఆమె బయటకి వెళ్ళాక అందరం తెగ నవ్వుకున్నాం.

  ReplyDelete
 5. @ కాయ
  మనకు అర్ధం కానివన్నీ పిచ్చివనే అపోహల్లోంచి మనం బయటకు రావాలి. మనని పెంచినవారు సరిగ్గా పెంచితే ప్రపంచంలోని వైరుధ్యాలని, వైవిధ్యాలని సవ్యంగా అర్ధం చేసుకోగలుగుతాము. లేకపోతే బావిలో కప్పలాగా మనకు తెలిసిందే సరి అయినది అనుకుంటాము.

  కొంతమందికి మనస్సు ఒక విధంగా శరీరం ఒక విధంగా వుంటుంది. అలాంటి వారు ఆయా వ్యతిరేక శరీరాల్లో ఇమడలేక జీవితాంతం చిత్రవధ అనుభవిస్తారు. అలాంటి వారు అలా జీవితాంతం మధనపడకుండా ఎంచక్కా లింగ మార్పిడి చికిత్సలు, సర్జెరీలు చేయించుకొని తమకు నచ్చినట్లుగా, తమ మనస్సుకు అనుకూలంగా బ్రతకడం సముచితం. అయితే ఈ మార్పిడిలు ఎంతవరకు పరిపూర్ణమయినవో నాకు అయిడియా లేదు గానీ చాలావరకు వారికి సంతృప్తినిస్తాయనే నేను విశ్వసిస్తున్నాను. సహజంగా వచ్చిన జెండర్ ల కంటే మార్పిడి జెండరులో కొన్ని లోటుపాట్లు వుండవచ్చు కానీ వారు అన్ని విధాలా మారిన జెందర్ క్రిందనే లెక్క - కేవలం పేరుకి మాత్రమే కాదు.

  వీలయితే వచ్చే మీటప్పులో అలా యువతిగా మారిన యువకుడిని వీడియో ఇంటర్యూ చేసి మీకు అందిస్తాను. TGల గురించి, వారి అభిప్రాయాల గురించి, వారి విజయాల గురించి, వారి ఆత్మ గౌరవం గురించి వారి మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు.

  ReplyDelete
 6. బావిలో కప్ప అని రెండో సారి..
  హార్డ్ వేర్ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు అనేది అంగీకరించ వచ్చు... కానీ సాఫ్ట్ వేర్ మనం ఎలా మలిస్తే అలా వస్తుంది.. అమ్మాయిని అమ్మాయిలా .. అబ్బాయిని అబ్బాయిలా పెంచగలిగితే సమస్యలు వస్తాయి అని నేను అనుకొవట్లేదు.. హార్డ్ వేర్ లోపాల వలన పుట్టిన వారి విషయం లో ఆపరేషన్లు సమంజసమే ..ఆ విషయం లో చికిత్స తప్ప ఏమీ చేయలేము ..
  అబ్బాయి అమ్మాయిగా మారాలి అనుకోవటం వింటుంటే తనలో మానసిక వత్తిడి మాత్రమే కారణం అని నా అభిప్రాయం.. అతనికేమైనా పీరియడ్లు వచ్చి డాక్టర్ కన్ ఫర్మ్ చేస్తే అమ్మాయిలా మారాలి అని డిసైడ్ అయ్యాడా ?... కేవలం ఇది మానసికం అంతే.. తనకి ఏది సరైందో తెలుసుకోలేక పోవటం అని నా లాజికల్ అనాలసిస్ ప్రకారం చెప్తున్నా... కాకపొతే ఒక సారి మనిషిలో సాఫ్ట్ వేర్ రూపం ఒక దశ కి చేరుకున్నాక మనం రీసెట్ చేయలేము.. అందుకని ... ఇలాంటి పరిస్తితి రాకుండా చుట్టూ ఉండేవాళ్ళు చూస్కోవాలి ... ఈ సమస్య ని కౌన్సెలింగ్ చేస్తూ సరి చేయవచ్చు అనుకుంటాను ..
  ఇక ఇలాంటి వారిలా మారటాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారో లేదో చెప్పాలి...

  నేనైతే ఖండిస్తున్నా...

  ReplyDelete
 7. "సమావేశానికి 16 మంది వచ్చారు. అందులో 7.5 మంది ఆడవారే వున్నారు....."

  అర్ధం అవ్వడానికి 3 ని:లు...నవ్వు ఆగడానికి 30 ని:లు పట్టింది.

  ReplyDelete
 8. @ కాయ
  ఎవరన్నా లింగమార్పిడి కావాలని వెళ్ళగానే డాక్టర్లు ఆపరేషన్ టేబిల్ ఎక్కించరు. దానికి చాలా తతంగం వుంటుంది. ముందు ఫిజీషియను ఒప్పుకోవాలి, తరువాత సైకియాట్రిస్ట్ ఈ శరీరంలో ఆపోజిట్ సెక్స్ వుందని ధృవీకరించాలి. మార్పుకి అనువైన పరిస్థితులు గట్రా ఆ మనిషిలో వున్నాయో లేవో డాక్టర్లు నిర్ధారిస్తారు. ఇది ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. అన్ని విషయాలు పరిశీలించాకనే దానికి అనుమతి ఇస్తారు.

  ఇహ ఇంతకన్నా ఎక్కువ వివరించడం నాకు సాధ్యం కాదు గానీ జెండర్ మార్చుకోవాలనుకునేవారు అలా ఎందుకు అనుకుంటారో, అందుకు దారితీసే బలీయమయిన పరిస్థితులు ఏంటో గూగులీకరించండి. వాళ్ళని మనసు మార్చుకొమ్మని అడక్కుండా వారిని ఆదరించేలా, అర్ధం చేసుకునేలా మన మనస్సులే విశాలం చేసుకుంటే బావుంటుంది కదా. నేను లింగమార్పిడులను సమర్ధిస్తాను. అలా ఎవరయినా సఫర్ అవుతున్నారని తెలిస్తే వారిని ఈ మార్పిడికై ప్రోత్సహిస్తాను. LGBTలో T అంటే ట్రాన్స్‌జెండర్స్ (TG)అనే అర్ధం.

  ReplyDelete
 9. devudooyy Sarath gaariki ive dorukuthaayento*

  ReplyDelete