ఓ అల్లుడిగారి బ్లాగు

గత వారాంతం జరిగిన ఒక వేడుకలో ఒకరు పరిచయం అయ్యి మిత్రులయ్యారు. వారి పేరు నాగ్. మాటల సందర్భంలో వారికీ ఒక బ్లాగు వుందనీ, దానిపేరు పులిహోర అనీ చెప్పారు. అయితే ఏ సంకలినిలోనూ జతచెయ్యలేదని చెప్పారు. జతచెయ్యాల్సిందిగా కోరమని చెప్పాను. వారు కోరేలోగా ఎవరయినా సంకలినుల నిర్వాహకులు తమ వాటిల్లో ఈ బ్లాగుని కలిపితే సంతోషమే.

వారికి ఆర్ధిక విషయాలపై, ఎంటర్ప్రెన్యూయర్షిప్ పై ఎన్నో ఆలోచనలు వున్నాయి. అయితే ఆ ఆలోచనలను కార్యరూపేణా నిరూపించేదుకు కృషిచేస్తున్నారు. వీలయితే కొన్ని వారాల్లో నా యూట్యూబు ఛానల్లో వారి ఇంటర్వ్యూ అందిస్తాను. తద్వారా వారియొక్క ఆలోచనా విధానాలను మనం వివరంగా తెలుసుకొవడానికి అవకాశం కలుగుతుంది.

నాగ్ గారి బ్లాగూ, టపాలూ చూసాను. చాలావరకు రెండు రెండి లైన్ల చమక్కులే కానీ ఎక్కువభాగం మనలని సరదాగా అలరిస్తాయి. అమెరికాలో వున్న ఓ అల్లుడిగారి గురించి ఇండియాలో వున్న అత్తామామలు అమాయకంగా ఎలా అక్కడ బ్యుల్డప్పు ఇస్తారనేదే ఈ బ్లాగు కాన్సెప్ట్. మరి ఇక ఈ బ్లాగు బ్యుల్డప్పు చూడండిక:

10 comments:

  1. మన నాగ పెసాదా ?

    ReplyDelete
  2. ఆ బ్లాగ్ 2001 నుంచీ రాస్తున్నారు
    కానీ 2009 నుంచీ బ్లాగర్

    హిహిహి

    ReplyDelete
  3. మంచి అల్లుడు గారిని పరిచయం చేసారు
    థాంక్స్ శరత్ btw మీరూ అలాంటి అల్లుడేనా

    ReplyDelete
  4. అల్లుడి గారి మీద జోకులు సూపర్.. ఇప్పటి దాకా అత్తల మీద, భార్యల మీద మాత్రమే జోకులు విన్నాను. ఇలా అల్లుడి మీద ఇంతలా విరుచుకు పడటం ఎప్పుడూ చూడలేదు. :-)

    నాకు బాగా నచ్చినవి..
    అల్లుడుగారు పెద్దలు కుదిర్చిన సంబందాలంటేనే ఇష్టపడతారు
    [కట్నం కావలి కదా]

    అల్లుడుగారికి బాసే సారీ చెప్తారంట!
    [మనోఢు చెప్పెది మొదట సారి అర్దం కాదు కదా]

    అల్లుడుగారు ఇప్పటికీ చాల గ్లామర్ - అమ్మాయిలు ఒకటే వెంట పడతారు
    [సేల్స్ గర్ల్స్]

    ReplyDelete
  5. http://ipulihora.blogspot.com/2010/12/writer.html

    శాశ్త్రి గారు మీ కోసం

    ReplyDelete
  6. అజ్ఞాతా
    బాగుంది కంప్లిమేంట్
    మీరు బూర గారని నా అనుమానం

    ReplyDelete
  7. @ అజ్ఞాత/నాగ్
    బావుంది మన అప్పూ భాయ్ మీద మీ సెటైరు :))

    ఇంతకీ అప్పూ అనుమానానికి (మీ ప్రోయిల్ తేదీ, బ్లాగు చరిత్ర) మీరు జవాబు ఇచ్చారు కాదు.

    ReplyDelete
  8. @ అప్పి
    బూర కాదు ఏం కాదులే గానీ మా ఫ్రెండ్ నాగ్ (పులిహోర బ్లాగ్) ఆ కామెంట్ వేసి వుంటారు.

    ReplyDelete
  9. ఏ జోకులు 2001 నుంచే చుప్తున్నా కాని బ్లొగ్ మాత్రం 2009 start చేసా - మీ follers ఇంత technically strong(చిలిపి) అనుకొలా

    ReplyDelete
  10. బ్లాగ్ కనపడితే DNA టెస్ట్ చేయకుండా వదలను అండీ

    ReplyDelete