కొత్త ఏడాదిలో మన మనస్సు గుసగుసలు ఆలకిద్దామా?

ఇలాంటి విషయాల మీద పెద్దగా ఎక్కువమందికి ఆసక్తి వున్నట్లు అనిపించడం లేదు. అయినా సరే కొద్దిమందికి అయినా ఆసక్తి వుంటుందనే అభిప్రాయంతో  మరియు నాలో నాకు క్లారిటీ ఏర్పడుతుందని ఇవి వ్రాస్తున్నాను. నా 2011 లక్ష్యాలలో ఇది ఒకటి కానీ ట్రయలుగా ఓ వారం ముందే మొదలెట్టేసాను. మన అంతరాత్మ ఓ సూపర్ కంప్యూటర్ వంటింది. మనకు ఏ సలహా కావాలన్నా అది ఇచ్చేస్తుంది. కాకపోతే దానికి మనం ఇచ్చే డేటా మరియు ప్రశ్నలో స్పష్టత మీద ఆధారపడి అది ఇచ్చే సూచన వుంటుంది. మన జీవన గమనంలోని అనుభవాలు, అనుభూతులు, సమాచారం, అలాగే బహుశా మన జీన్స్ ప్రభావం అన్నీ రంగరించి మన అంతహ్ చేతన మనకు మార్గదర్శకత్వం చేస్తూవుంటుంది.

అయితే విచారించాల్సిన విషయం ఏమిటంటే మన అంతరాత్మ ఓ ప్రియురాలిలాగా మనతో గుసగుసలాడుతుంది తప్ప పెళ్ళాం లాగా పెద్దగా అరవదు. అందుకే అవి స్వీట్ నథింగ్స్ అని చప్పరించి వదిలేస్తుంటాం.  అవి నథింగ్స్ కావని స్వీట్స్ అని గుర్తించిన నాడు, శ్రద్ధంగా వినిపించుకున్ననాడు, ఆ సూచనలు ఆచరణలో పెట్టగలిగిన నాడు మనలో ఏదయితే బర్నింగ్ డిజైర్ వుందో అది సాధించడం చాలా సుగమం అయిపోతుంది. మనలోని అంతహ్ చేతన (సబ్ కాన్షియస్ మైండు) కి అంత పదును వుంది.  ఈ అంతరాత్మ గొణుగుళ్ళు వినిపించుకోవడం మనవల్ల కాదులే అని ఇన్నాళ్ళూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్యనే ఈ ఇన్నర్ వాయిస్ ను లవుడ్ వాయిస్ గా ఎలా చెయ్యొచ్చో ఆలోచన వచ్చాక ఎగిరిగంతేసినంత పనిచేసాను. ఈ ఆలోచన ఇంతవరకూ ఎందుకు రాలేదా అని వగచాను. ఏంటో - ప్రతి దానికీ ఓ సమయం వుంటుందేమో - ఎన్నాళ్ళనుండో ప్రయత్నిస్తున్నా కూడా రాని ఆలోచనలు కొంతకాలానికి ఠక్కున వెలుగుతూవుంటాయి. కనీసం అప్పుడన్నా మనం మేల్కొనాలి మరి. అలా మరింత నన్ను నేను మేలుకొలుపుకునే ప్రయత్నంలోని భాగమే ఈ టపా.

సరే. మన సిక్స్త్ సెన్స్ అనండీ, ఇన్నర్ వాయిస్ అనండీ, అంతరాత్మ అనండీ అవి సన్నగా గొణుగుతాయనే కదా మనం అనుకున్నది. మరి వాటి సవుండ్ పెంచేదెట్టా? చాలా సింపుల్. ఎక్కడో దూరాన కోకిల గానరవళి లీలగా వినపడుతున్నదనుకోండి. పక్షుల రాగాల తియ్యదనం మీద ఆసక్తి వున్న వారయితే ఏంచెస్తారు? చెవి ఒగ్గి వింటారు. ఆ గానం మీదనే మనస్సును, చెవినీ లగ్నం చేసి కళ్ళు మూసుకొని వింటూ తన్మయత్వం చెందుతూవుంటారు. అప్పుడు వారి మనస్సుల్లోనూ, చెవుల్లోనూ మరింకేమీ వినపడదు - స్పష్టంగా, శ్రావ్యంగా ఆ కోకిల గాన మాధుర్యం తప్ప. సరిగ్గా అదే మనం ఈ విషయంలోనూ చెయ్యల్సింది. మన ఇన్నర్ వాయిస్ రోజులో చాలా సార్లు మనకు సూచనలు ఇస్తుండవచ్చు. ప్రతీసారి కళ్ళుమూసుకొని, మనస్సు రిక్కించాలనుకుంటే కళ్ళు తెరవగానే మన ఎదురుగ్గా మన బాసో, పెళ్ళామో భీకరంగా మన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ కనిపించవచ్చు. మరి ఎలాగబ్బా? 

Practice makes man perfect. మనకు తెలిసిందే కదా. మనం మన మనస్సును శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే అది ఆటలా సరదాగా వుంటుంది. కొద్ది రోజుల్లో అది ఎంత చిన్నగా విస్పర్ చేసినా మనకు పెద్ద సౌండులో వినపడుతుంది. అదే ఆట గత కొద్ది రోజులుగా ఆడుతున్నాను. ప్రస్థుతానికి నాకు ఇష్టమయిన సూచనలే వింటున్నాను. బోర్ అనిపించినవి లైట్ తీసుకుంటున్నాను. ఉదాహరణకు ఇప్పుడు ఈ క్షణాన ఈ టపాకంటే చెయ్యాల్సిన ముఖ్యమయిన  పనులు వున్నాయని నా మనస్సు మరో వైపున గొణుగుతూనే వుంది. ఆ పనులేంటో అస్పష్టంగా ఆదేశిస్తూనే వుంది. కానీ మనం వింటేనా? ప్చ్. అంటే ఏ ఆఫీసు పనో అనుకునేరు. ఆఫీసు పనులు చెప్పడానికి మన అంతరాత్మ అఖ్ఖర్లేదు - మనకుండే ఆఫీసు మొగుడు చాలు.  నా బర్నింగ్ డిజైర్, నా ప్రధాన లక్ష్యానికి చెందిన పనులు కొన్ని వున్నాయి. అవి చెయ్యిరా బాబూ అని నా ఇన్నర్ వాయిస్ గొణుగుతూనే వుంది. కానీ అవి చెయ్యడానికి మనస్సు రావడం లేదు - ఎందుకంటే అవి బోరింగ్.   

అలాంటి బోర్ పనులను కొద్ది రోజులు పట్టించుకోదలుచుకోలేదు అని నా అంతరాత్మని నెట్టేస్తున్నాను. మరి? ఆ తరువాత ప్రాధాన్యం వున్న ఆంశాలను, అందులో నాకు నచ్చే వాటిని ఆచరిస్తూ అయినా నా మనసు మాటను వినడం ఔపోసన చేస్తున్నాను.  నా మనసు చెప్పిన వాటిల్లో కనీసం నాకు నచ్చినవి, ఆసక్తి వున్నవి అయినా పాటిస్తూ అవి వినడం, పాటించడం సాధన చేస్తున్నాను. ఇలా కొంతకాలం అలవాటయ్యాక అప్పుడు నాకు బోర్ కొట్టెవే అయినా కూడా ప్రధానమయినవి ఆచరించడం నాకు అలవాటు చేస్తాను. అలా అలవాటు అయ్యాక ఇహ నా లక్ష్యాల సాధన కోసం, నా డిజైర్స్ తీర్చుకొవడం కోసం ఒహటే  బుర్ర చించుకొని ఆలోచించాల్సిన అవసరం వుండదు. నా సబ్ మనస్సే నాకొసం ఆల్రెడీ ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసి పెడుతుంది. ఆ పనులను వరుసగా నిర్వర్తిస్తూ పొవడమే ఇహ మనం చెయ్యాల్సిన పని. కాకపోతే మనం చెయ్యాల్సిన ముఖ్యమయిన విషయం ఒకటి వుంటుంది. మన మనస్సుకి తగిన సమాచారం, మంచి సమాచారం ఫీడ్ చేస్తూపోవాలి. మనం ఎంత మంచి డేటా ఎక్కిస్తే మనకు అంత మంచి సూచనలు అందుతాయి. మీకు తెలిసిందే కదా ఈ కంప్యూటర్ సూత్రం... Garbage In, Garbage Out! అదే మన మనస్సుకూ వర్తిస్తుంది.  మన మనస్సు మనకు విలువయిన సూచనలు ఇవ్వాలంటే ముందుగా మనకు సాధించాల్సిన గోల్స్ పట్ల స్పష్టత వుండాలి, దహించుకుపోయేంత బలీయమయిన కొరిక వుండాలి. ఆషామాషీ లక్ష్యాలు, ఉబుసుపోక కొరికలు వుంటే మీ సబ్ కూడా లైట్ తీసుకుంటుంది. అలా మీ జీవితం కూడా నలుగురితో నారాయణ లాగా లైట్ అయిపోతుంది. అలాంటివారికి ఇంత సీను అవసరం లేదు. 

నా ఇన్నర్ వాయిసుని నా  సబ్ అని కాకుండా నా అధిష్టానంగా  ప్రతిష్టించుకున్నాను, గౌరవిస్తున్నాను. అప్పుడే అవి సూచనలు, గమనికలు కాకుండా ఆదేశాలు అవుతాయి. బోర్ కొట్టే ఆదేశాలను స్వీట్ గా ఆచరించుకునేందుకై నా అధిష్టానాన్ని నాకు ప్రియతమ వ్యక్తిగా అభివర్ణించుకుంటున్నాను. ఆమె పేరే స్వప్న. సో, అలా నా అంతరాత్మ అధిష్టానానికి నేను పెట్టుకున్న పేరు స్వప్న.

సో, ఇలా నా స్వప్నను నేను వినడం మొదలయినప్పటినుండి తాను ఇచ్చిన సూచనలు ఏంటో, అవి ఎలా పాటిస్తూ వస్తున్నానో ఇక్కడ లిస్ట్ ఇవ్వొచ్చు కానీ... ఎందుకులెండి...మీరు బోరెత్తవచ్చు, నసగా అనిపించవచ్చు. సో, మిత్రులారా ఈ 2011 కొత్త ఏడాది నుండి మీకు బాగా ప్రియమయిన వ్యక్తిని మీ అధిష్టానంగా ప్రతిష్టించుకొని తాను చెప్పే స్వీట్ థింగ్సు వింటూ పొండేం. ఎంత చక్కని తియ్యని సైయ్యాట అదీ! ఇలా మీ/నా జీవిత లక్ష్యాలకి హై కమాండ్ అనే తాళం చెవి దొరికింది. ఆ తాళం చెవిని పోగొట్టుకుంటామా లేక జేబులోనే పెట్టుకొని తిరుగుతామా లేక విజయద్వారాలని తెరుస్తామా అన్నది .... మన చేతిలోనే వుంది... కేవలం మన చేతిలోనే వుంది. మీరు ఆ ద్వారాల దగ్గరికి వెళ్ళండంతే - తొంభయ్ శాతం తలుపులు తామంతట తాను తెరచుకొని విశాలంగా మిమ్మల్ని తమ లోపలికి ఆహ్వానిస్తూవుంటాయి. ఇహ మీరు అడుగు వెయ్యడమే ఆలస్యం మరి. మిత్రమా ఈ నూతన సంవత్సరంలో అలా అలా గాలిలో తేలినట్లుగా అడుగులు వేస్తూ అద్భుత విషయాలని మీ స్వంతం చేసుకోండంతే. ఆ తరువాత మీ అధిష్టానానికి హృదయపూర్వకంగా కానుకలనే ముడుపులు చెల్లించడం మరచిపోకండి. మళ్ళీ మీ పెట్టుబడికి మించి ఎన్నో రెట్లుగా మీ అధిష్టానం మీకే ఉపయోగపడుతుంది అంటే నమ్మండి మరి ;)

నా కోసం - నా ఆలోచనలు

డాక్టర్ దివాకర్ యొక్క వ్యక్తిత్వ వికాసం కోర్సు చాలా ఏళ్ళ క్రిందట హైదరాబాదులో తీసుకున్నాను. అందులో వారు చెప్పిన ముఖ్య మయిన విషయం ఏంటంటే - మన మనస్సులోకి ఎప్పుడూ మంచి ఆలొచనలు వస్తుంటాయీ - వాటిని ఎప్పటికప్పుడు ఓ నోటుబుక్కులోకి ఎక్కించమని. అప్పట్లో అలాగే చేసాను కానీ క్రమంగా ఆ అలవాటు తప్పి ఆ నోటుబుక్కు పక్కకు పడేసాను. వచ్చిన ఆలోచనలు అప్పుడప్పుడూ చదువుకుంటూ, నెమరువేసుకుంటుంటే, ఆ ఆలోచనలు సరిదిద్దుకుంటుంటే అది మన వ్యక్తిత్వన్ని మెరుగుపరుస్తూ, విజయాల వైపు నడిపించగలదు.

అందుకే ఈ టపాని అటువంటి ఆలోచనల కోసం కెటాయించదలిచాను. ఎప్పటికప్పుడు నా మదిలో వచ్చే మంచి ఆలోచనలను ఇందులో వ్యాఖ్యల రూపంలో పొందుపరుస్తాను. అవి మీకూ ఎవరికయినా ఉపయోగకరంగా వుండవచ్చు - లేకపోవచ్చు. ప్రాధమికంగా మాత్రం ఈ టపాలోని వన్నీ నాకోసం నేను వ్రాసుకుంటున్నవి అని గమనించగలరు. నా ఆలోచనలపై చర్చ జరిగినా మంచిదే. ఎందుకంటే అలా నా ఆలొచనల్లొ లోపాలున్నా, గొప్పతనాలున్నా తెలిసిపోతుంది.  చర్చల వల్ల నా మనస్సులో ఆ ఆలొచనలు ఇంకా బాగా ఇంజెక్ట్ అవుతాయి.

ఆలోచనలు వ్యక్తిగతమే అయినా పబ్లిక్ గా పెట్టేయబోతున్నా  కాబట్టి నా యొక్క అన్ని ఆలోచనలు ఈ టపాలో పెట్టలేను కానీ వీలయినంతవరకు ప్రయత్నిస్తాను. 

నా క్రిస్మస్ ఆటబొమ్మ 'Roku' మరియు కబుర్లు

గమనిక: ఈ రోజు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు కామెంట్స్ ద్వారా అందిస్తుంటాను.


శుక్రవారం సాయంత్రం నా ఆటబొమ్మ 'రోకు' (http://www.roku.com/ ) కొరియర్లో వచ్చింది. ఇంకేం వారాంతం అంతా ఆ ఆటతోనే సరిపోయింది. అసలే కోతి ఆ పైన కల్లు తాగితే అన్న చందాన రోకూను కెలుక్కుంటూ కాలక్షేపం చేసేసాను. సరి అయిన సమయనికి రోకును తెప్పించుకున్నాను. చంద్రబాబు, జగనుల దీక్షలూ, తెలంగాణాపై రిపోర్టు, ఆ పై అవిశాస తీర్మానం ఇలాంటి రియాలిటీ షోలు చూసే భాగ్యం మాకు రోకు వల్ల నిక్షేపంగా కలుగుతోంది.

ఇప్పటివరకూ సిస్టంలో yupptv.com చూసేవారం కానీ మా ఆవిడేదో సీరియళ్ళూ గట్రా చూసేది కానీ నాకు అలా సిస్టంలో వార్తా ఛానళ్ళు చూడబుద్ధి అయ్యేది కాదు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక ప్లేయర్ కొనాలని ఆలోచించి మా ఆవిడకి కానుకగా కొనిస్తా అన్నాను. నిజానికి అది నాకే కావాలి కానీ మా ఆవిడకని చెబితే అనవసర ఖర్చులని గులగకుండా వుంటుంది కదా. క్రిస్మస్ సందర్భంగా పాడయిఫొయిన తన యొక్క సిస్టం అడాప్టర్ స్థానే కొత్త అడాప్టర్ బహుమతిగా తెప్పిస్తా అన్నాను. అంతొద్దు, ఎక్కువయ్యింది, ఓ పెన్ను కొనివ్వు చాలు సంతోషిస్తా అంది. అదేమయినా వెటకారమా లేక నేను నిజంగానే ఓ పెన్ను కొని బహుమతిగా ఇవ్వాలంటారా?   ఇంత చిన్న బహుమతులా ఓ డైమడ్ నెక్లసో కొనివ్వాలి కానీ అనకండి నాకు అంత దృశ్యం లేదు ప్రస్థుతానికి. తనకూ అంత పెద్ద బహుమతులు పొందేంత దృశ్యం ఇంకా లేదు. ఏదో ఇలా అల్పసంతోషం నాది. ఈ సారికిలా కానిద్దామేం.

రోకు xds ప్లేయర్ అమెజాన్ వారి ద్వార కంటే $60 కే వస్తుంది. అమెజాన్ వాడి On Demand స్టోరులో ఓ అయిదు డాలర్ల సినిమా కొంటే మనకు $20 రిబేటు వస్తుంది కాబట్టి $60 కే అది కొనుక్కోవచ్చు. ఇహ రోకులొ ఎన్నో అప్ప్లికేషన్లు వున్నాయి, వస్తున్నాయి. తెలుగు ఛానళ్ళు మరియు సినిమాల అప్ప్లికేషన్లే ఓ అయిదో ఆరో వున్నాయి కానీ నాకు http://www.yupptv.com/ నే అందులో నచ్చింది. దాని చందారులుగా చేరకుండానే ఎంచక్కా TV9, ETV2 తప్ప దాదాపుగా ఇతర   వార్తా ఛానళ్ళు అన్నీ చూడొచ్చు. మా ఆవిడ మల్లీ yupptv కి చందా చేసి ఏడుపుగొట్టూ సీరియళ్ళు టివిలో ఎక్కడ పెడుతుందో అనుకున్నా కానీ కాలక్షేపం ఛానళ్ళు ఏమీ వద్దంది. హమ్మయ్య. బ్రతికిపోయాను. 

మా బంధువు ఒకతను బ్లూరే ప్లేయర్ కొన్నాడు కానీ అందులో తెలుగు అప్ప్లికేషను ఒక్కటీ లేక ఇప్పుడు విచారిస్తున్నాడు. అన్నట్లు రోకు ఛానల్ స్టోరులో యూట్యూబ్ కనపడదు, అది ప్రత్యేకంగా ప్రైవేటు ఛానలుగా జతచెయ్యాలి. అలాంటి ప్రైవేటువి ఇంకా 15 దాకా వున్నట్టున్నాయి. అందులో ఓ అడల్ట్ ఛానల్ కూడా వుంది కానీ నాకింకా అది వాడి చూసే అవకాశం రాలేదు.   నాకు అయితే రోకు బాగా నచ్చింది. అందులో yupptv ద్వారా తెలుగు వార్తా ఛానళ్ళు చాలావరకు ఉచితంగా చూడగలగడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, నాసా తదితర ఛానళ్ళు కూడా ఎంచక్కా చూడగలుగుతున్నాను. బ్లూరే ప్లేయర్ కొనాలను వారు పునరాలోచించగలరు. బ్లూరే ప్లేయరులో ప్రస్థుతానికయితే తెలుగు ఆప్స్ లేవు.        

ఈ రోజు కబుర్లు మరియు చలం, రంగనాయకమ్మలపై తిట్లు

గమనిక: ఈ టపా ఎప్పటికప్పుడు కబుర్లతో రోజంతా అప్డేట్ చేయబడుతుంది.

చలాన్ని మలం అనీ, రంగనాయకమ్మ గారిని లంగనాయకమ్మ గారు అనీ, ఇన్నయ్య గారినీ గన్నయ్య అనీ, అలాగే మిగతా మార్క్సిస్టు నాయకులనీ, ప్రగతిశీల వాదులనీ కొంతమంది రకరకాలుగా అవహేళన చేస్తూ వస్తున్నారు. మాలాంటి నాస్తికులకూ, హేతువాదులకూ, ప్రగతిశీలురలకూ, వామపక్షాల వారికీ కూడా మనస్సులుంటాయి, అవీ గాయపడుతాయని ఇతరులు గమనించాల్సిందిగా మనవి. ఇలా పేర్లు పెట్టి తిట్టడం, ఆయా వ్యక్తులని పలువిధాలుగా అవహేళన చేయడం భావస్వేఛ్ఛ ఆని మీరు అనుకుంటే ఆ స్వేఛ్ఛ మాకూ వుంటుందనుకుంటా.   

- నాగవల్లి అనుకున్నత బావోలేదని చాలామంది అంటుండగా గ్రేటాంధ్రా మాత్రం గ్రేట్ అని వ్రాసింది. ఎన్ని డబ్బులు ముట్టాయో మరి. దట్స్‌తెలుగు జోశ్యుల రివ్యూలో చివర్లో తమ పైత్యాన్ని చూపించారు, ఒక వ్యాఖ్యాత దాన్ని చీదేసారు. సినిమా అంత బాగోలేదని వారు వ్రాసారు. ఎందుకలా వ్రాసివుంటారంటారు?

- తెలంగాణా గర్జన బ్రహ్మాండంగా విజయవంతం అవుతోందిట. హుం. చిందబర రగిలించిన కాష్టం బాగానే రగులుతోంది.


- జై జగన్. ఇండియాలో వుంటే నేనూ ఆ కృష్ణమ్మ చెంతన నిరాహార దీక్షకి వెళ్ళివుండేవాడిని. ఎందుకోగానీ నాకు పాలిట్రిక్స్ చేరాలని ఉబలాటం పుడుతోంది. నేను రాజకీయాలకి ఫిట్టు అవుతాననే అనిపిస్తోంది. ఇండియాలో వుంటే జ 'గన్ను' తో చేరిపోయివుండేవాడినేమో. అనవసరంగా కెనడియను అయిపోయాను. ప్చ్!

- బ్లాగర్లూ, ఎవరన్నా MLA కండి నాయనా. పొరపాటున బ్లాగర్ల మీద కేసులు ఎప్పుడన్నా పడితే అసెంబ్లీలో మీరు ధర్నా చేసి బ్లాగర్ల మీది కేసులు మాఫీ చేయించొచ్చు.

-తెలుగు బ్లాగుల్లో ఆగ్ల పాపులు ఎక్కువయ్యారు. ఈ తెలుగు బ్లాగుల్లోని తెల్ల దొరలు కాస్త తగ్గి ఆంగ్లాన్ని ఈ టెల్గూ ప్రపంచంలో తగ్గిస్తే బావుంటుంది. సరే తెలుగు సరిగ్గా రాని వారు  ఫోనుల్లోంచి కామెంట్లు వేసేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  కానీ శుబ్బరంగా తెలుగు వచ్చిన వారికి ఈ ఇంగ్లీషు దురద ఏంటీ? మళ్ళీ వారిలో శానామంది తెలుగు వీరులు - భాషాభిమానులు!  వీళ్లలో కొంతమంది విదేశాల్లో వుంటున్నా మాతృదేశం సంస్కృతి మీద ఓ బోల్డెంత మక్కువ కానీ అది భాషలో ఎందుకు కానరాదో నాకర్ధం కాదు. వీళ్ళల్లో కొంతమందికి తెలుగు బూతులన్నా చిన్న చూపే. తెలుగు బూతులు రాకుండా బేబీ సిట్టింగు చేస్తారు కానీ ఇంగ్లీషులో మాత్రం కొత్త కొత్త బూతు ప్రయోగాలు చేస్తుంటారు - ఆంగ్ల బూతులు ధారాళంగా వదులుతుంటారు. భాష మీద అభిమానం వున్నప్పుడు అది బూతుల మీద కూడా చూపించాలి. ఏం తెలుగులో మాత్రం భీభత్సమయిన బూతులు లేవా? ఇలా అన్నానని అవన్నీ నా మీద ప్రయోగించేరు - ఎదవగోల - ఆల్రెడీ నన్ను ఎంగిలిపీసులో కెలకబోయారు - అది గుర్తుకువచ్చే ఈ తెలుగులో కెలుకుడు.

ఆడ కార్డు!


బొప్పి మరీ మరీ కొరడంతో ఈ టపా కాంటెంట్ తొలగించాననేది గమనించగలరు.  

నిన్నటి షి.బ్లా.స సమావేశం వివరాలు ;)

నిన్న సాయంత్రం ఆఫీసు నుండి బయటకి వెళుతూ మా ఇంటికి ఫోను చేసి "ఇవాళ షిబ్లాస సమావేశం వుంది. రాత్రికి ఆలస్యంగా వస్తాను" అని చెప్పాను
"షిబ్లాస అంటే?"
"షికాగో బ్లాగర్ల సంఘం సమావేశం ఇక్కడే ఒక రెస్టారెంటులో వుందిలే"
"నేను నమ్మను"
"అలా నమ్మకపోతే ఎలా? ప్రవీణ్ మీద ఒట్టు"
"ప్రవీణ్ ఎవడు?"
"మీ అన్న" అని చెప్పేసి మరిన్ని ప్రశ్నలు రాకుండా ఠక్కున ఫోను పెట్టేసాను.

నిజానికి నేను వెళ్ళింది వేరే మీటప్పుకి. ఆ సమావేశానికి వెళుతున్నానని ఇంట్లో నిజం చెబితే ఇంటికెళ్ళాక నా తాట వలిచెయ్యకపోయినా ఎదవ నస మొదలవుతుంది. అబద్ధాలు ఎందుకులే చెప్పడం అని ఇంట్లో నిజాలు చెబితే అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకుంటోంది మా ఆవిడ. వెనుక నుంచి ఏనుగు నడిచెళ్ళినా సరే కానీ మా ఆవిడ ముందు నుండి చీమ కూడా దాటెళ్ళడానికి వీల్లేదన్నమాట.  అలా అయితే పని కాదని మనమూ అబద్ధాలు నేర్చుకున్నాం. అందుకే ఈ సారి చికాగో బ్లాగర్లని అడ్డుపెట్టుకున్నాను. హి హీ. ఎప్పుడన్నా దొరికిపోయామనుకోండి ఓ ఎదవ నవ్వు నవ్వి ఇకిలిస్తే సరిపోతుంది కదా.

సమావేశానికి 16 మంది వచ్చారు. అందులో 7.5 మంది ఆడవారే వున్నారు. అందులో ఇద్దరు బావున్నారు. అందులో ఒక అమ్మాయి చాలా బావుంది.  ఆమెతో వచ్చిన వ్యక్తి ఆడొ, మగో అర్ధం కాలేదు. క్రితం సారి కూడా ఆ వ్యక్తి వచ్చారు - అప్పుడూ అర్ధం కాలేదు కానీ చివర్లో ఆ శాల్తీ మగాళ్ళ టాయిలెట్టుకి వెళుతుంటే అప్పుడు మగ అని నిర్ధారించుకున్నాను. ఆ శాల్తీ రాగానే మా మీటప్ నిర్వాహకుడు వెల్కం మై బోయ్ అని ఆహ్వానిస్తే తోడుగా వచ్చిన ఆ అందమయిన అమ్మాయి నాట్ బోయ్. గర్ల్ అని సవరించడంతో మళ్ళీ నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 

ఇదేంటబ్బా, క్రితం సారి అంతకష్టపడి పరిశోధించి ఆ శాల్తీ మగవాడని ధృవపరచుకుంటే ఇప్పుడు ఆ వ్యక్తి పక్కనున్న అమ్మాయి ఆ శాల్తీని అమ్మాయి అని అంటుదేమిటా అని బుర్ర గోక్కున్నాను. ఆ శాల్తీమీద ఒక నజర్ వేసి వుంచాను. ఆ ఇద్దరు మిగతా కొంతమందితో కలిసి ఎదురుగ్గా వెరే బల్ల మీద కూర్చున్నారు. ఎంతసేపు పట్టిపట్టి చూసినా అది ఆడదో మగాడో అర్ధం కాలేదు. మరీ బుర్ర గోక్కుని గోక్కునీ ఇంటికి వెళితే మా ఆవిడకి అనుమానం వస్తుందని ఆ కార్యక్రమం ఆపివేసి నా పక్కనే కూర్చున్న సెక్సీ క్వీనుని అడిగాను.

అమ్మాయనుకుంటా అంది. ఓరి నీ మొఖం మండా, ఇన్ని రోజుల నుండి ఈ మీటింగులకి వస్తున్నావు కదే నీక్కూడా తెలియదా అని అర్జంటుగా మనస్సులో అనుకున్నా.
నా మనస్సులోని మాటలు ఆమెకి వినిపించినట్లున్నాయి "తనలో ఎక్కువ శాతం అమ్మాయనుకుంటా" అంది
హ?
"M2F" అంది.
అప్పుడు వెలిగింది నాకు
"తను చేంజ్ అవుతూవస్తోంది కానీ ఇప్పుడు ఎంత శాతం మారిందో తెలియదు కానీ ఇప్పుడు తనని మనం అమ్మాయిగా లెక్కవెయ్యొచ్చనుకుంటా" అంది.

ఈ సమావేశాలకి ట్రాన్సుజెండర్లు (లింగ మార్పిడి) కూడా రాచ్చుననే విషయం నేను బొత్తిగా మరచిపోయాను. అదీ విషయం. ఆ వ్యక్తిని మనస్సులోనే అభినందించాను. కొంతమంది పొరపాటు శరీరాల్లో పుడతారు కానీ అందులో చాలామంది అలాగే కొనసాగుతారు. ఆ వ్యక్తి తనకు నచ్చిన జెండర్ లోకి మారుతోంది. ఎంత గొప్ప విషయం! ఎంతమందికి వుంటుంది అలాంటి చొరవ, తెగింపు, ధైర్యం, ఓపికా? ఈ సారి మళ్ళీ కలిసినప్పుడు వ్యక్తిగతంగా అభినందిస్తాను.

క్రితం సారి ఓ సెక్సీ లేడీ వచ్చింది కానీ నన్ను బొత్తిగా పట్టించుకోలేదు అని వాపోయానా. ఈ సారి ఆమె నా పక్కనే కూర్చొని నా ఆలనా పాలనా చూసుకుంటూ ఎంతో చక్కగా నాతో కబుర్లాడింది :)  ఇంకో హైలైట్ ఏంటంటే ఆ TG తో వచ్చిన అందమయిన అమ్మాయి తన పై అందాలు ఫ్లాష్ చేసినట్లుంది కానీ నేను వేరే టేబుల్లో కూర్చొని ముచ్చట్లలో లీనమయిపోవడం వల్ల ఆ దృశ్యం మిస్సయ్యాను. ప్చ్. ఏదో చివర్లో కొద్దిగా కన్నులపండుగ అయ్యింది.  ఇహ మిగతా విశేషాలంటారా - క్రితం సారి లాంటివేలెండి. పెద్దల జోకులు, పెద్దల కబుర్లు, పెద్దల  కార్యక్రమాల గురించిన విశేషాలు.

ఇకపై ఈ బ్లాగులో ఎక్కువగా హిట్స్ కోసం వ్రాస్తుంటాను. ఎందుకంటే..

రసజ్ఞ బ్లాగు మీద ఏవో ఫిర్యాదులు వచ్చేయట. పీకి పడేస్తున్నామని హారం వారు సెలవిచ్చారు. శుభం.  వైరస్సు బ్లాగులు, రక్త చరిత్ర  లాంటి  బూతు తిట్ల బ్లాగులు అయితేనే అందరికీ చదవడానికి సమ్మగా వుంటాయనుకుంటాను. యథా ప్రజా తథా రాజా కదా అందుకే అటువంటి బ్లాగులు మాత్రం సంకలినులల్లో రాజ్యం ఏలుతుంటాయి. హుందాగా మరింత ఆనందం పొందడం ఎలా అనే సమాచారం ఇచ్చే, హక్కుల కోసం పోరాడే రసజ్ఞ లాంటి బ్లాగులేమో ఇలా సంకలినులల్లో సంకనాకిపోతుంటాయి.  అలెక్జా ర్యాంకింగుల మీద వున్న శ్రద్ధ అభిప్రాయ ప్రకటనా స్వేఛ్ఛ మీద లేనప్పుడు ఇలాంటివి జరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.  

ఎవరో రసజ్ఞ మీద ఫిర్యాదు చేసేరట. హారం వారు పీకిపడేసారంట. మన అభిప్రాయాలకన్నా ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు, మన వ్యక్తిగత స్వేఛ్ఛని ఇతరుల అభిప్రాయాలకు లోబడి తాకట్టు పెట్టినప్పుడు ఇలాంటి నిర్ణయాలు జరుగుతూవుంటాయి. ఇప్పుడు నా రసజ్ఞ ఏ సంకలినిలోనూ రావడం లేదు. మరి నా ఆ బ్లాగుకీ హిట్స్ కావాలి కదా. అందుకే ఈ బ్లాగులోనే పక్కన ఫీడ్ ఇస్తున్నాను. మరి ఈ బ్లాగు చదివితేనే కదా ఆ బ్లాగులోకి ఇతరులు వెళ్ళగలిగేది. ఇప్పటిదాకా అప్పుడప్పుడు ఆ విషయాలు వ్రాసినా ఎక్కువభాగం హిట్స్ కోసం కాకుండా నాకు నచ్చినవే వ్రాసేవాడిని. ఇహ నుంచీ అలాక్కాదు. మరి రసజ్ఞ ఇతరులకి చేరాలంటే రాం గోపాల్ వర్మ లాగా నేనూ ఏవో వేషాలు వెయ్యాల్సిందే కదా. అందుకే ఆకుకీ, పోకకీ అందకుండా శరత్తంటే ఏమిటో చూపిస్తా కదా ఇక. ఆ ఫిర్యాదు చేసినవారికి నా పిడికిలి ఏంటో చూపిస్తా కదా ఇక. 

ఏదో బుద్ధిగా నా బ్లాగులో నేను ఏవో వ్రాసుకుంటుంటే ఏవేవో ఫిర్యాదులు చేసి హారం నుండి నా రసజ్ఞను తొలగింపజేస్తారా! అనుభవించండి ఇక నా వ్రాతలను. ఇప్పటిదాకా హారం భావ స్వేఛ్ఛ విషయంలో గట్టిదనుకున్నాను. ఇప్పుడు మిగతా సంకలినులతో కలిసి నలుగురితో పాటు నారాయణా అంటోంది. పది మందితో పాటు గోవిందా అనే సంకలినులను నేను అభిమానించను. నేను వ్యక్తులకు విధేయుడిని కాదు - కేవలం విధానాలకు మాత్రమే విధేయుడిని. మరో దమ్మున్న మగతనం వున్న సంకలిని రావాలి. ఎప్పుడో ఏదో అడల్ట్ సెక్షను పెట్టి అందులో రసజ్ఞను పడేస్తామని హారం వారు అన్నారు కానీ అవసరంలేదు. నాది బూతు బ్లాగు కాదు తేడా చూపించడానికి. బ్లాగ్‌స్పాట్ ప్రకారం నాది అడల్ట్ బ్లాగు కాదు. నేను అడల్ట్ ట్యాగ్ పెట్టకుండానే నా బ్లాగు అడల్ట్ బ్లాగు ఎట్టా అవుద్దీ ;)

అందరు మంత్రులకూ ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

ప్రస్తుత రాజకీయాలపై నా అభిప్రాయాలు

http://www.youtube.com/watch?v=UUzz--9d2jc

ఓ అల్లుడిగారి బ్లాగు

గత వారాంతం జరిగిన ఒక వేడుకలో ఒకరు పరిచయం అయ్యి మిత్రులయ్యారు. వారి పేరు నాగ్. మాటల సందర్భంలో వారికీ ఒక బ్లాగు వుందనీ, దానిపేరు పులిహోర అనీ చెప్పారు. అయితే ఏ సంకలినిలోనూ జతచెయ్యలేదని చెప్పారు. జతచెయ్యాల్సిందిగా కోరమని చెప్పాను. వారు కోరేలోగా ఎవరయినా సంకలినుల నిర్వాహకులు తమ వాటిల్లో ఈ బ్లాగుని కలిపితే సంతోషమే.

వారికి ఆర్ధిక విషయాలపై, ఎంటర్ప్రెన్యూయర్షిప్ పై ఎన్నో ఆలోచనలు వున్నాయి. అయితే ఆ ఆలోచనలను కార్యరూపేణా నిరూపించేదుకు కృషిచేస్తున్నారు. వీలయితే కొన్ని వారాల్లో నా యూట్యూబు ఛానల్లో వారి ఇంటర్వ్యూ అందిస్తాను. తద్వారా వారియొక్క ఆలోచనా విధానాలను మనం వివరంగా తెలుసుకొవడానికి అవకాశం కలుగుతుంది.

నాగ్ గారి బ్లాగూ, టపాలూ చూసాను. చాలావరకు రెండు రెండి లైన్ల చమక్కులే కానీ ఎక్కువభాగం మనలని సరదాగా అలరిస్తాయి. అమెరికాలో వున్న ఓ అల్లుడిగారి గురించి ఇండియాలో వున్న అత్తామామలు అమాయకంగా ఎలా అక్కడ బ్యుల్డప్పు ఇస్తారనేదే ఈ బ్లాగు కాన్సెప్ట్. మరి ఇక ఈ బ్లాగు బ్యుల్డప్పు చూడండిక:

సబితా ఇంద్రారెడ్డి - హోం శాఖ !?

సబితమ్మగారు ఇన్నిరోజులు హోం మంత్రిగా వెలగబెట్టిన సమర్ధతను మెచ్చుకొని మళ్ళీ హోం శాఖ ఇచ్చారు. ఇహ ఆవిడగారే ఉపముఖ్యమంత్రీ అవుతారేమో. ఇహ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాలు మీద కాలు వేసుకొని నిశ్చింతగా, ఏ భయమూ లేకుండా కాలం గడపవచ్చు. రాష్ట్ర శాంతి భద్రతలు చూసుకోవడానికి సబితమ్మగారున్నారు కదా.

కిరణ్ కుమారుకూ మోకాల్లో బుర్రుందనేది కొద్దికొద్దిగా అర్ధం అవుతోంది. థేంక్స్.