మంగళవారం 30 నవంబర్ 2010

పుస్తకాలు పంచుకుందామా?

సుజాత గారి అనైతికం అనే టపా వ్యాఖ్యల్లో యండమూరి పుస్తకాల గురించి కల్పనా రెంటాల గారు ఆసక్తి కనపరచినప్పుడు తన దగ్గర వున్న యండమూరి పుస్తకాలు వారికి పంపించడానికి KumarN సిద్ధపడ్డారు. అప్పుడు నాకు కల్పన గారి మీద అసూయగా అనిపించింది. నాక్కూడా అలా ఎవరయినా పుస్తకాలు ఆఫర్ చేస్తే తెప్పించుకొని కమ్మగా చదివేసుకునివుండేవాడిని కదా అనుకున్నాను. నాకు ఆ పుస్తకాలు KumarN ఆఫర్ చెయ్యనందుకు నా మనస్సులో కుళ్ళుకున్నాను.

కొన్నినెలల క్రితం ఇండియా వెళ్ళబోయేముందు ఇండియాలో ఏం పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటే బావుంటుందేంటి అని ఓ టపా వేసాను. సహృదయులు కొంతమంది చక్కటి పుస్తకాలు కొన్ని సూచించారు. ఇండియానుండి తిరిగివచ్చాక మళ్ళీ నేను ఆ పుస్తకాల ఊసే ఎత్తలేదు. ఎందుకంటే వారందరూ నన్ను తిట్టేస్తారనీ. ఎందుకంటే అంత బ్యుల్డప్పు ఇచ్చి అక్కడ క్షణం తీరిక లేక ఒక్క పుస్తకం కూడా కొనుక్కురాలేదని తెలిస్తే పుస్తక ప్రియులు థూ అని తిడతారేమోనని భయమేసింది.   

ఇక్కడ నుండి తెలుగుపుస్తకాలు కొందామంటేనేమో అదేదేదో వెబ్ సైటు నుండి తెప్పించుకోవాలంటే బాగానే ఖర్చు అవుతుంది. అలాక్కాకుండా మనం చదివి 'వదిలేసిన' పుస్తకాలూ, మనం ఆబ్సొలేట్ అనుకున్న పుస్తకాలపై ఇతరులకు ఆసక్తీ, అవసరం వుండవచ్చు. అందువల్ల అలాంటి పుస్తకాలు మనలో మనం షేర్ చేసుకుంటే పోలా? ప్రతి ఏడాదీ ఇంట్లో ఎక్కువ స్థలం లేక ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు కొన్నయినా చెత్తకుప్పలో పడేస్తుంటాను. అలా కొన్ని చలం పుస్తకాలు కూడా అవతల పారేసాను. ఏవో కొన్ని వారు వ్రాసిన నాటకాలు నాకు అంతగా నచ్చలేదు. బోర్ అనిపించాయి మరి.    అలా కాకుండా ఆ పుస్తకాల లిస్టు నా బ్లాగు ద్వారా తెలిపి ఎవరికయినా ఆ పుస్తకాల పట్ల ఆసక్తి వుందంటే పోస్ట్ చేస్తాను. ఆ లిస్టు ఒకటి రెండు రోజుల్లో పెడతాను.

అలాగే మీదగ్గర అలా పంచుకోదగ్గ పుస్తకాలు ఏమన్నా వున్న నాకుగానీ, ఇక్కడగానీ తెలియజేస్తే నాకు ఆసక్తివున్నవి పంపించమని కోరుతాను. అలాగే ఇతరులు కూడా కోరవచ్చును. ఫస్ట్ ప్రెఫరెన్స్ మాత్రం నాకే. ఆ. నేను US లో వుంటున్నందువలన యు ఎస్, కెనడాలలో వుంటున్నవారికి మాత్రమే నేను పంపించగలను అలాగే ఇక్కడ వుంటున్న వారి నుండి మాత్రమే నేను కోరగలను. ఇదేవిధంగా ఇండియాలోనూ, AP లోనూ, వివిధ జిల్లాలు, నగరాల్లోనూ మీరు కోరితే ఆయా ప్రాంతాలలో వుండేవారు స్పదించడం వల్ల మీరందరూ పరస్పరం ఎంచక్కా పుస్తకాల మార్పిడి చేసుకోవచ్చును. ప్రాంతీయవాదులయితే ఆయా ప్రాంతాల వారినుండి మాత్రమే ఇచ్చిపుచ్చుకోవచ్చును. ఏమంటారు? 


11 comments:

a2zdreams చెప్పారు...

ఈ ఐడియా ఏదో బాగుంది ..DVD sharing అయితే బాగుండేది ఏమో ?

అజ్ఞాత చెప్పారు...

ni bonda..
edo oka post daily veyanide niku tinnadi aragada ??

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ డ్రీంస్
సినిమా వీడియోలా బుక్ వీడియోలా? సినిమా వీడియోలయితే ఓ డాలరు పెడితే వస్తాయి కదా.
@ అజ్ఞాత
కాలం అరగక.

Apparao Sastri చెప్పారు...

>>>కాలం అరగక.
తిన్నది అరగక
కాలం కదలక
అని అనాలి అన్యా


పుస్తకాల మార్పిడి
వస్తు మార్పిడి ...తరువాత
$#$ మార్పిడి

ఎన్ని మార్పులు చేస్కోవాలి ????

కొత్త పాళీ చెప్పారు...

Difficult to work out.
USPS had eliminated the previously existing inexpensive methods to mail books. You must use either first class mail or better to mail books within US now. An average book weighs at least a pound - fo which mailing charges are about $2.50.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అప్పూ భాయ్

ఆ మార్పిడిలు ఎలాగూ కుదరడం లేదు కాబట్టే కనీసం పుస్తకాలన్నా స్వాప్ చేసుకుని తృప్తి పడదామనే.

@ కొత్తపాళీ
కొన్ని పుస్తకాలు కలిపి పోస్ట్ చేస్తే ఫలితం కొద్దిగానయినా వుంటుందా అన్నది చూడాల్సివుంది. పోస్టులో అనే కాకుండా ఓ ఇద్దరు బ్లాగర్లు కలుస్తున్నారంటే చాలు పుస్తక మార్పిడి చేసుకోవడం బాగుండగలదు. ఇలా పుస్తకాలకోసమయినా బ్లాగర్లం కలుస్తామేమో కదా. అదే కాకుండా ఉదాహరణకి మీ దగ్గరి నుండి ఎవరయినా షికాగో వస్తున్నట్లు తెలిస్తే మీకు అనవసరమయిన పుస్తకాలు నాకు పంపించవచ్చు. జస్ట్ ఉదాహరణ - అంతేనండోయ్. మీ పుస్తకాల మీద కన్నుపడిందనుకోకండి :)) ఇలా పుస్తక మార్పిడికి వీలయినన్ని అవకాశాలూ, సావకాశాలూ పరిశీలించాలి.

ఎనానిమస్సు చెప్పారు...

>>>కాలం అరగక

అలాగే book crossing కాదేమో..
cross booking ఏమో ;) dressing లాగా

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ఎనానిమస్సు
మీ క్రాస్ డ్రెస్సింగ్ భావం అర్ధమయ్యింది :)

అయితే బుక్ క్రాసింగు వల్ల క్రాస్ బుకింగూ అయే అవకాశాలూ వుంటాయి. ఉదాహరణకి ఎవరన్నా నేను వ్రాసిన నవలలు పంపించమని అడిగారనుకోండీ - అడ్డంగా బుక్కయే అవకాశాలు వుంటాయి మరి.

kvsv చెప్పారు...

@కాలం అరగక....త్రివిక్రమ్ లెవెల్లో వుంది గురూజీ మీ జవాబు..హ్యాట్సాఫ్..

కొత్త పాళీ చెప్పారు...

Actually a better solution is to induce your local library to stock Telugu books. The public Library in Houston not only stocks a lot of Telugu books, but periodically sets up a desk at the Hindu Temple there on weekends for patrons to check out books - now, that is amazing customer service!

ఆ.సౌమ్య చెప్పారు...

very good idea.... వర్క్ అవుట్ అవ్వడం కష్టమేమో, కానీ ప్రయత్నిస్తే తప్పులేదుగా.