మీ అందరికీ కాపీ & పేస్టు దీపావళి శుభాకాంక్షలు!

ఏదయినా పండగో, పబ్బమో, జాతీయ వేడుకో వచ్చినప్పుడు సంకలినులని చూస్తున్నప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. అన్నీ శుభాకాంక్షల టపాలు, అన్నీ శుభాకాంక్షల వ్యాఖ్యలు. ఇలాంటి రొటీన్ గ్రీటింగ్స్ ఎవరిని ఆనందపరుస్తాయో నాకయితే అర్ధం కాదు. వీటిల్లో చాలావరకు కాపీ & పేస్టు గ్రీటింగులే వుంటాయి. వాటిల్లో ఓ వ్యక్తిగత అనుబంధమో, ఆప్యాయతానొ వుండవు. ఎంతమందికి గ్రీటింగ్స్ పేస్టు చేస్తే అంత ఆనందం కొందరికి లభిస్తుంది. ఇంత ఆనందం అవసరమా అని నాకనిపిస్తుంది.

తమకు నచ్చిన వారికో, మెచ్చిన వారికో ఈమెయిల్ ఇస్తే సరిపోయేదానికి బ్లాగుల్లో అందరూ ఇంతగా హడావిడి చెయ్యడం అవసరం అనుకోను. ఈ వేడుకల విశేషాలో, స్మృతులో, ముచ్చట్లో పంచుకోవడం బావుంటుంది కానీ ఇలాంటి పడికట్టు పదాల శుభాకాంక్షలు ఏం ప్రయోజనం కలిగిస్తున్నాయో ఒకసారి తరచి చూసుకుందామా?

ఏమయినప్పటికీ మీరూ మీ కుటుంబం ఎంచక్కా దీపావళి గడుపుకోవాలని, గడుపుకుంటున్నారనీ ఆశిస్తూ ఈ కాపీ, పేస్టు శుభాకాంక్షలని ముగిస్తాను మరి.

12 comments:

  1. భలే వారే ! బ్లాగు ముఖంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పుకోవద్దంటే ఎలా ?

    ReplyDelete
  2. కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డునాకినట్టుంది మీ పద్దతి

    ReplyDelete
  3. @ a2zdreams
    భలే వారే ! బ్లాగు ముఖంగా నా అభిప్రాయం చెప్పుకోవద్దంటే ఎలా :)
    @ శ్రీను
    ఎలా నాకకూడదో తెలియజెప్పడానికి నాకి చూపించాల్సివుంటుంది అప్పుడప్పుడు ;)
    @ మినెర్వా
    గుడ్ :)

    ReplyDelete
  4. andukega ila andariki bore koduthadane pics unte post chesi sidebar lo wishes chepta, okavela pics kuda lekapothe sidebar lo only pandaga shubhakanshalu ani pettestha , I am so smart kada ;)

    ReplyDelete
  5. కరక్టే అనుకోండి. మరీ శుభాకాంక్షలు మాత్రమే కాకుండా, ఓ నాలుగు ముక్కలు రాసి పోస్తే చేస్తే బావుంటుంది.

    ReplyDelete
  6. అందుకే నేను శుభాకాంక్షలతో పాటు ఓ నాలుగు ముక్కల కవిత కూడా వ్రాసాను.

    శ్రీవాసుకి

    ReplyDelete
  7. శరతన్న,ఏందీ మా బ్లాగు మీద సీత కన్ను ఎసావు

    ReplyDelete
  8. అన్నాయ్... నాను..తవిటినాయుడిని ...ఇక్కడ జనాలు వైటింగ్ సేసేత్తన్నారు... రెండ్రోజులు అయిపోనాది ..శెనారం,ఆదారం టపాలకి సెలవిచ్చెసినావేటి? కూతంత బేగా టపా ఎట్టేయ్..అసలే ఈరోజు మా బాసు పని ఒగ్గేసినాడు...నాకు తెగ బోరింగ్ కొట్టేతినాది..

    ReplyDelete
  9. @శ్యాం
    తవిటినాయుడంటే? ఏ సినిమాలోని క్యారెక్టరేంటీ? ఒకటి రెండు వారాల్లో మళ్ళీ మాంఛి మజా అయిన టపాలు వేసుకుందాములే.

    ReplyDelete
  10. క్షమించు అన్నాయ్.. నా ప్రశ్న కు సమాధానమిస్తూ మీరడిగిన ప్రశ్న నేను గమనించలేదు. "తవిటినాయుడు" అనేది ఒక సినిమా లో పాత్ర కాదు. శ్రీకాకుళం లేదా తూర్పు ప్రాంతంలో విరివి గా వినిపించే ఒక పేరు. శ్రీకాకుళం మాండలీకం లో మాట్లాడే ప్రయత్నంలో ఆ పేరు ని ఉపయోగించాను. ఒకానొక సందర్భంలో "భా.రా.రె" గారికి కూడా ఈ పదప్రయోగం అర్ధంకాలేదు. (మా పర్సనల్ మైల్స్ లో)...మీకర్ధం కావడానికి చిన్న కామెడి సంభాషణ... (ఎలా వ్రాసానో అలాగే చదవండి)
    ప్ర:- నీ పేరేటి?
    స:- తవిటినాయుడు.
    ప్ర:- ఊరేటి?
    స:- ఇజ్నగరం,పాల్కొండ,పార్వతీపురం,పలాస,కాశీబుగ్గ దాటిన తర్వాత ఎనుపొచ్చె గరివిడి.
    ప్ర:- మీ అయ్య పేరేటి?
    స:- తవిట్రాజు
    ప్ర:-మీ అమ్మ పేరేటి?
    స:- మా యం పేరు తవిటి. మా యక్క పేరు పెద్ద్తవిటి,యన్న పేరు సిమ్మాచలం, సెల్లి పేరు సింతవిటి...సాలా (హిందీ,ఉర్దూ కాదు)..మరేటైనా కావాలా?

    ఈ మాండలీకాన్ని కీ.శే. కల్పనా రాయ్ హిట్లర్, ప్రేమించుకుందాం రా సినిమాల్లో ప్రయోగించిండం మీరు చూడొచ్చు.

    ReplyDelete