తెలుగుబాట నుండి మరిన్ని జ్ఞాపకాలు

తెలుగు బాటలో 'భూమిక' సత్యవతిని గారిని కూడా కలిసాను. వారి ఫోటోలు చూసి వుండటం వల్ల తేలిగ్గానే గుర్తించాను. ఇద్దరం ఒక్క నిమిషం తప్ప ఎక్కువగా మాట్లాడుకునే తీరిక దొరకలేదు. సమయమే వుంటే పలు విషయాల మీద వారి స్త్రీవాద అభిప్రాయాలు తెలుసుకొనివుండేవాడిని.

Sujata గారిని కూడా కలిసాను. నేను వారిని చూసి వారు అనుకోలేదు. కొందరి రచనలు చదివినప్పుడు వారిమీద ఒకలాంటి  ఊహాదృశ్యం  ఏర్పడుతుంది.  Sujata గారి  రచనలు  చదివినప్పుడు  వారి  రచనలు  చాలా  సరళంగా అనిపించి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించి వారు కూడా అలాగే ఊదితే గాలికి ఎగిరిపోయేలా బక్క పలుచగా వుంటారేమో అనిపించింది. కానీ వారు అందుకు వ్యతిరేకంగా వున్నారు.  మేము ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడుకోలేకపోయాము. నేను  మా  కుటుంబ  వేడుకకి  పిలిస్తే  వారు కనీసం రిప్లయ్ కూడా ఇవ్వలేదేమిటా వారి మీద కొంత నిరసన వుండింది కానీ వారు అందుకు గాను సారీ చెప్పారు.  

వేదాంత, భక్తి టపాలు వ్రాసే కదిరి సురేశ్ గారికి హలో మాత్రం చెప్పగలిగాను. సమయం వుంటే కాస్సేపు మాట్లాడివుండేవాడిని. ఇనగంటి రవిచంద్ర వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. వారితో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయాను.

ఇంకొక బ్లాగర్ని కలిసాను కానీ వారి పేరు మొన్నటిదాకా గుర్తుకువుంది కానీ ఇప్పుడు మరచిపోయాను. అప్పుడొకసారి వారు హైదరాబాద్ ఆడవారు బీర్లు తాగిన వీడియో పోస్టు చేస్తే వారితో నాకు బ్లాగ్యుద్ధం జరిగింది. వారు ఈ బాటలో తారసపడతారని ఏమాత్రం అనుకోలేదు. నేను వచ్చానని తెలిసి సంతోషంగా హలో చెబుతూ దగ్గరికి వచ్చారు.  మనం శత్రువులం కదా ఇలా హలోలిచ్చుకుంటే బావుండదేమో అని సరదాగా అంటూ హలో ఇచ్చాను. దానిదేముందండీ, బ్లాగ్గొడవలు బ్లాగుల్లోనే అనగా వారి స్పోర్టివ్‌నెస్ చూసి నాకు ముచ్చటేసింది. అక్కడానూ మరియు పివి జ్ఞానభూమి వద్దానూ నాతో కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగారు.

ఇంకా ఈ బాటలో చక్రవర్తి దంపతులను కూడా కలిసాను. వారి గురించి టపా త్వరలో వ్రాస్తాను. ఇంకా AP మీడియా  రాముగారు  కూడా కలిసారు. నిజానికి  వారు  అంతకుముందే  వారిని  జర్నలిజం  కాలేజిలో కలుసుకున్నాను. ఆ విశేషాలతో టపా ఎప్పుడో మొదలెట్టాను కానీ ఇంకా పూర్తిచెయ్యలేదు.   వీరే కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక బ్లాగర్ నన్ను ఇండియా వచ్చినప్పటినుండీ కలవడానికి శతవిధాలా ప్రయత్నీంచి చివరికి నేను ఇండియా నుండి తిరిగివచ్చే రోజున ఓ మూడు నిమిషాలు మాత్రం కలవగలిగారు. వారి గురించి ఒక పోస్టులో వ్రాస్తాను. ఇలా వీరినీ కవర్ చేస్తే ఇండియాలో కలిసిన బ్లాగర్ల విశేషాలు అయిపోతాయి. 

ఇంకా  ఎవరితోనయినా  ప్రత్యేకంగా  మాట్లాడివున్నా, పరిచయం  అయినా  మరిచిపోయినందుకు మన్నించగలరు.    నాగను కూడా కలిసాను కానీ వారిని ఆల్రెడీ మరొక టపాలో కవర్ చేసాను.      

3 comments:

  1. బహుశా ఆ బ్లాగరు పేరు కట్టా విజయ్ అనుకుంటా. నేను బ్లాగింగు మొదలెట్టిన కొత్తలో వర్డుప్రెస్సు బ్లాగులు మాత్రమే చూడగలిగేవాడిని. అప్పుడు ఆయన మీరు చెప్పిన పోస్టు రాసినట్టు గుర్తు. అది కాకుండా తెలంగాణా మీద ఆయన రాసిన పోస్టు మంచి గుర్తింపు పొందింది.
    నేను రాసిన ఒక టపా ఆయనకి మెయిలులో ఎవరొ పంపితే నచ్చి తన బ్లాగులో పెట్టుకున్నారు, అందువల్ల గుర్తు !

    ReplyDelete
  2. శరత్ గారు,

    ఇదేం బాగాలేదండి, మా ఇంటికి వచ్చి వెళ్ళమంటే, రాకుండా, మరో పోస్టు వేస్తానంటారా.. ఇది సహించను. మీరు మళ్ళీ తిరిగి ఇండియా రావలసిందే, అప్పుడు మా ఇంటికి రావలసిందే.. ఆ!!

    ReplyDelete
  3. @ క్రిష్ణ
    అవునండీ. తను కట్టా విజయ్. థేంక్స్.

    @ చక్రవర్తి
    :)

    మిగతా విశేషాలతో బాటుగా మీ ఇంటికి ఎందుకు రాలేకపోయానో వ్రాయడం కూడా ఆ పోస్టు వ్రాయబోవడానికి ఒక కారణం.

    ReplyDelete