కొంత కాలం పంథా మారుస్తున్నాను

ఈమధ్య వివాదాలలో తల దూర్చి తల కాస్త బొప్పికట్టింది. అది అలవాటయిన బొప్పి అయితే అంటే బూతు తిట్లు, విమర్శలు, బోడి సలహాలు లాంటివి అయితే మనకు ఎప్పటినుండో అలవాటయినవే అయినందువల్ల నో ప్రాబ్లెం. అయితే ఈ హడావిడుల వల్ల నాకు ఇంకో సమస్య వస్తోంది. నా కొత్త జీవన సరళికి తగినంత సమయం కెటాయించలేకపోతున్నాను. అలాగే ఇవి కాలక్షేపం కోసమని కూడా ఎత్తుకున్నా కాలక్షేపం ఏమోగానీ నా వున్న తీరిక సమయం హరించుకుపోతోంది. మా అధరం గ్రూపు మీద కూడా శ్రద్ధపోయి అది చతికిల పడుతోంది. నా ఫోకస్ తగినంతగా ఆ ఆయా విషయాలపై మరింతగా మళ్ళించేందుకై కొంత ఇటు ఫోకస్ తగ్గించాల్సివుంది. సాధారణ టపాలు వ్రాస్తూనేవుంటా అనుకోండి.
 
కొంతకాలం అయితే వివాదాలు తలకు ఎత్తుకోకున్నా జరుగుతున్న వివాదాలలో కాస్తో కూస్తో పాల్గొంటూ గాలి ఎగదోస్తూనేవుంటా అనుకోండి. అందువల్ల కొన్ని రీసెంట్ టపాలు తీసేసి డ్రాఫ్టులుగా సేవ్ చేసివుంచాను. ఇదేదో తోకముడిచిన వ్యవహారమని ఎక్కువమంది అపోహపడితే మళ్ళీ వాటిని బయటకి తీస్తాను. అయినా గాలికి పోయే కంపను నేను మాత్రమే తగిలించుకోవాల్సిన అవసరం ఏముంది. అయినా నేనేమన్నా బ్లాగులోకానికి మూల పురుషుడినా - మూలశంక పురుషుడిని కానీ ;)   కదా :)    ట్రయల్ గా ఇలా కొంతకాలం చూసి మళ్ళీ నా ధోరణిని సమీక్షించుకుంటాను. 

9 comments:

 1. ఇంకో విషయం - బ్లాగింగ్ వ్యసనాన్ని కొంత తగ్గించుకొని మరొక వైపు ఫోకస్ చేసే ధోరణిలో భాగంగా నా బ్లాగుకి వున్న కొన్ని తోకలు కట్ చేస్తున్నాను. అందులో భాగంగా ప్రస్థుతానికి అజ్ఞాతలు కామెంట్స్ వేసే సౌకర్యం తీసివేసాను. ముందు ముందు అన్నీ కాదు గానీ కొన్ని సంకలినుల్లోంచి తొలగిపోయే ఆలోచన కూడా వస్తోంది. చూద్దాం.

  బ్లాగులు వ్రాసుకుంటే ఏమొస్తుందండీ? మహా అయితే హిట్లు, తిట్లు వస్తాయి. కొంచెం కాలక్షేపం. అదే ఫోకస్ నాకు ఇష్టమయిన వాటి మీద పెడితే పుణ్యమూ, పురుషార్ధమూనూ. అయితే నాకు ఇష్టం వున్న రంగాలలో శ్రద్ధ పెట్టలేని వేళల్లో మాత్రం నా కాలక్షేపానికి బ్లాగులే ముఖ్యంగా శరణ్యం. అందువల్ల నా మానస్సుకి స్ట్రెస్ ఇవ్వని, నా మనస్సుని ఇంట్లో వున్నప్పుడు కూడా ఆక్యుపై చేసుకోని విధంగా మాత్రమే వ్రాద్దామనుకుంటున్నాను.

  ReplyDelete
 2. :)

  టపా కన్నా వ్యాఖ్య బాగుంది

  ReplyDelete
 3. Appreciate that! ;)

  you are a man with guts. you shouldnt be cowed down by crap anonymous comments.

  happy blogging!

  ReplyDelete
 4. aaaaaaaaaaaa miru vellipothe elaga? bloggers lo thelisina vallu mire. miru vellipothe nenu oppukonu :(

  ReplyDelete
 5. @ డ్రీంస్, బారారే
  ధన్యవాదాలు
  @ గీతాచార్య
  హ హ. అప్పుడప్పుడు అసలు కంటే కొసరే బావుంటుంది కదూ.
  @ విట్ రియల్
  ధన్యవాదాలు.
  ఎనానిమస్ కామెంట్లు 10 ఏళ్ళనుండీ ఎన్నో ఎదుర్కొని రాటుదేలిపోయాను లెండి. పదేళ్ళ క్రితమే నెట్ లో నవల్స్ పెట్టాను, ఆ తరువాత యూట్యూబ్ వీడియోలు, ఇప్పుడు బ్లాగులు. అన్నిట్లోనూ నేను ఎత్తిన ఆంశాలు వివాదాస్పదమే అయివుండటంతో ఎన్నో రకాల కామెంట్లు వస్తుండేవి.
  @ అప్పారావ్
  :)

  ReplyDelete
 6. @ స్వప్న
  ప్రస్థుతానికి అయితే బ్లాగుల నుండి ఏమీ నిష్క్రమించడం లేదు లెండి. కొద్దిగా ఫోకస్ తగ్గిస్తున్నా. ఇప్పటిదాకా కొందరితో కెలుక్కొని మరీ యుద్ధాలు చేసేవాడిని. ఇకనుండీ ఆ యుద్ధాలలో నేను వీలయినంతవరకు ప్రత్యక్షంగా పాల్గొనక సైడుపక్కనుండి సరదాగా చూస్తుంటాను. అంటే ఇప్పుడు ఒంగోలు శ్రీను, ఆకాశరామన్న, బ్లాగ్వీక్షణం లో కొన్ని చర్చలూ, వివాదాలూ నడుస్తున్నాయి కదా. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇకనుండీ 'తెలంగాణా తల్లులను చెరచడం ఎలా' అన్నటువంటి పోస్టులు వచ్చినా, 'నరబలులు చేయడం ఇలా' అన్నటువంటి పోస్టులు వచ్చినా మిగతా చాలా మంది వలె గాలికిపోయే కంపను నేను ఇంకా తగిలించుకోవడం ఎందుకులే అనేసి ఇంకెవరయినా తగిలించుకుంటే మాత్రం చూస్తూ కాలక్షేపం చేస్తుంటానన్నమాట. దానినే లౌక్యంగా జీవించడం అని అంటారన్నమాట.

  ReplyDelete