ఆదివారం 31 అక్టోబర్ 2010

కామెంటేస్తారా లేక...కెలికెయ్యమంటారా?

ఇవాళ హాలోవీన్ రోజు. ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ పిల్లలు కొండొకచో పెద్దలూ భయంకరమయిన, విచిత్రమయిన వేషధారణలతో ఇల్లిల్లూ తిరిగి చాక్లెట్లు  మొదలయినవి అడుక్కోవడం  ఈరోజు రివాజు. ఇంతకుముందే మా అమ్మలుతో కలిసి ఇంటింటికీ తిరిగి క్యాండీలు అడుక్కొని వచ్చాను. మా పాప డెవిల్ వేషం వేసుకున్నది దీనికోసం. బాడీగార్డుగా తనతో వచ్చినందుకుగాను వచ్చిన ట్రీటులల్లో నాలుగో భాగం నాకేనని ముందుగానే అమ్మలుతో పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నాను.

బ్లాగు బ్లాగు తిరిగి కామెంట్లు అడుక్కునేంత ఓపిక లేదుకాబట్టి మీ అందరినీ ఈ టపాలో వ్యాఖ్యలు అడుక్కుంటున్నాను. ఈ టపాలో మీరు కామెంటు వెయ్యలేదో ... కెలికెయ్యబడుతారు జాగ్రత్త!

ఈ టపాకి సంబంధించని చిన్న గమనిక: నా సిస్టం లో ఒక ఫైలు వైరసుతో ఇంఫెక్ట్ అయ్యి ట్రోజెన్ హార్సుగా వ్యవహరించి నా హాట్మెయిల్ అడ్రసు బుక్కులో వున్న ఈమెయిల్ ఐడిలు అన్నింటికీ స్పాం ఈమెయిల్ పంపించింది. అలాంటి ఈమెయిల్ నానుండి అందుకున్న బ్లాగర్ల అసౌకర్యానికి చింతిస్తున్నాను.

8 comments:

నీహారిక చెప్పారు...

Happy Haloveen day.

..nagarjuna.. చెప్పారు...

బాబ్బాబు...మీరు అంతపని సెయ్యకండి...నేను కామెంటేత్తాన్నా....

ఎనానిమస్సు చెప్పారు...

హహహ!!

మనం ఫస్ట్ టైం అమ్రీకా వొచ్చినప్పుడు, ఇట్టాగే బుడ్డోల్లొచ్చి ట్రిక్ అర్ ట్రీట్ అని వాల్ల కలెక్షన్ బాక్స్ ముందుకు చాపారు.

మనకేటి తెల్సు...చాకిలేట్లిస్తున్నారేమో అనుకుని, టాంక్స్ చెప్పి ఓ నాల్గు చాకిలేట్లు తీసుకున్నా.... పాపం! వాలు నన్నో హలోవీన్ డెవిల్ని చూసినట్టు చూసి బయపడి పారిపోయారు :) :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నీహారిక
థేంక్స్ :)
@ నాగార్జున
అలా అన్నారు, బావుంది. లేకపోతేనా...
@ ఎనానిమస్సు
హ హ హ. నేను కెనడాకి మొదట్లో వచ్చినప్పుడు పిల్లలు వేషాలేసుకొని వచ్చి అడిగితే నాకేమీ అర్ధం కాక పంపించేసాను కానీ మీలాగా చాక్లెట్లు ఎత్తెయ్యాలనే మహత్తరమయిన ఆలోచన నాకు రాలేదు. ప్చ్. నా అదృష్టం బావుండి ఆ పిల్లకాయలు మరీ దడిపించే వేషాలు వేసుకురాలేదు గానీ లేకపోతే తలుపు తెరిచిన వెంటనే న గుండె ఆగి వుండేది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

లేటెస్టు న్యూసూ:
1. రాత్రి మా చాక్లెట్ల పంపకాలలో తెలంగాణా - సమైక్యాంధ్రా అంత గొడవలు వచ్చి అమ్మలూ, నేనూ బాగా కొట్లాడుకున్నాం. నా ప్రతిపక్షం అయిన మా ఆవిడ కూడా తనకు తోడురాగా ఇద్దరూ కలిసి నన్ను దుప్పటి కప్పి మరీ కుమ్మేసారు. అందులో మా పెద్దమ్మాయి హస్తం కూడా వుందో లేదో ఇంకా తేలలేదు.

2. రాత్రి ఈ పోస్టు వేసాక ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎవరో గట్టిగా తలుపు కొట్టారు - కాలింగ్ బెల్లు కొట్టకుండా. మా కమ్యూనిటీలో 7 గంటల వరకే చాక్లెట్లు అడుక్కుంటారు. పీక్ హోల్ (దాని పేరు అదేనా?) నుండి చూస్తే బయట నల్లగా తప్ప ఏం కనిపించలేదు. దాంతో వచ్చింది దొరో, దొంగో తెలియక జాగ్రత్త కోసమని అకస్మాత్తుగా తలుపు తెరిచేసరికి బయటవున్నవారు ఉలిక్కిపడటం తో లోన వున్న నేనూ ఉలిక్కిపడ్డాను. ట్రిక్ అండ్ ట్రీటు కోసం ఇద్దరు పెద్ద పిల్లలు వచ్చారు. అందులో వున్న అమ్మాయి నన్ను దడిపించడం ఏమోగాని నన్ను చూసి ఆమే బాగా దడుచుకుంది - నేను ఒకేసారి తలుపు తెరవడమో.

nelabaludu చెప్పారు...

మా లాంటి అమాయకులపై,, ఏంటి సారు.. మీ దౌర్జన్యం కామేంటని, కెలకటమని :) :)

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఏంటి ఈ పోస్టుకు ఇయ్యేనా కామెంట్లు :(

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నెలబాలుడు
కామెంటేసి తప్పించుకున్నారు. సరే.
@ భా రా రే
మరే. ఈ బ్లాగులోకానికి మరీ నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయిందండీ.