పోల్: ఇండియా పేరు మార్చేద్దాం

(ఈ పై ఫోటొ ఇండియా తదితర దేశాలవారికి అర్ధం కాకపోవచ్చు. ఇక్కడ స్కవుట్ పిల్లలు ఛారిటీ కోసమనుకుంటా చాక్లెట్లు అమ్ముతూ కనిపిస్తుంటారు.)

లిలితకళా తోరణాలకూ, రహదారులకూ లాంటి చిన్న చిన్న వాటికి రాజీవ్ పేరెట్టకుండా ఒకేసారి పెద్ద విషయానికే పేరు మార్చి ఇండియా/ఇటలీ మీది నా ప్రేమని నిరూపించదలచుకున్నాను. అలాగే ఇండియా దేశభక్తులూ, అభిమానులూ నేను త్వరలో పెట్టబోయే పోల్ లో పాల్గొని మీ దేశభక్తినీ, అభిమానాన్నీ చాటుకోండి. ఇండియా పేరు మార్చేసి ఏ పేరు పెడితే బావుంటుందో మీ అమూల్యాభిప్రాయన్ని ఇక్కడ సెలవివ్వండి.

నేను ఇవ్వబోయే లిస్టులో నాకు ఇటలీ, సోనియా, ఇందిర బాగా నచ్చాయి ఎందుకంటే ఇండియాతో రైమింగ్ బాగా కుదురుతోందని. ఇందిర అన్న పేరు కాస్త పాత వాసన కొడుతోంది కాబట్టి అది వదిలేసినా మిగతా రెండు పేర్లలో ఇటలీ, సోనియాలలో ఏ పేరు బావుందో అర్ధం కావట్లేదు. మీకు కూడా అలాంటి పరిస్థితే రావచ్చని పోల్ లో మల్టిపుల్ ఛాయిస్ ఇస్తున్నాను. ఓకే.

17 comments:

 1. well, one congress MP said (in parliament) india is indira and indira is india, way back. I guess, now it should be Soindirai (so- sonia, Indi-Indira, ra- rahul, rajiv, It-italy), lest it should be Indiraw.

  ReplyDelete
 2. కొత్తగా మార్చే పని లేదు. ముందుచూపుతో ముందే పెట్టుకున్నాము. Ind(ira)+(Son)ia అని.

  ReplyDelete
 3. యప్పే... అన్నీ సోనియమ్మగారి అత్తింటికే ఇచ్చేస్తే పుట్టింటికీ ఏమీ వెళ్లట్లేదని ఫీల్ అవరా...? ఈసారికి రాహుల్ అమ్మమ్మ గారో, లేదంటే తాత గారి పేరో చూసుకుందాం. అమ్మగారు కూడా బాగా ప్రసన్నం అవుతారు. ఏమంటారు....?

  ReplyDelete
 4. మీరు సూచించిన పేర్లు మా కే సి ర్ & వేర్పాటు దొంగలేవ్వరికి నచ్చలేదు. అందుకే మేము మాకు నచ్చిన పేర్ల లిస్టు పంపుతున్నాము.మీరు మేము చెప్పిన ఎ ఒక్క పేరు ఫైనల్ చెయ్యకపోతే కొత్తగా వచ్చిన విమలక్క లీడర్ గా ఉన్న మా సముస్టి కార్యకర్తలతో మీ శరత్ కాలం ను బాన్ చెయ్యాలని హుమన్ రైట్స్ లో కంప్లైంట్ చేస్తాం.మా లిస్టు ..తేలబాన్ దేశం, మావో రాజ్యం,ప్రభు రాజ్యం ,పశుపతి టూ తిరుపతి రాజ్యం,అభినవ తెలంగాణా గాంధి దేశం,నిజాం రాజ్యం , బాంచన్ దొరల రాజ్యం, ముక్కు గద్ద దేశం ,తాగుబోతుల రాజ్యం ,వసూళ్ళ దేశం,

  ReplyDelete
 5. modati roju & moti show is having some virus issues.. my system got infected... cud u please post a post. thanks

  ReplyDelete
 6. > కొత్తగా మార్చే పని లేదు. ముందుచూపుతో ముందే పెట్టుకున్నాము. Ind(ira)+(Son)ia
  good catch

  ReplyDelete
 7. హ హ. పైన సూర్య చెప్పింది బావుంది, అందుకని మార్చాల్సిన పని లేదు :)

  ReplyDelete
 8. సూర్య గారు - బాగా చెప్పారు

  ReplyDelete
 9. 'ఇండియానే ఇందిర - ఇందిరానే ఇండియా' అన్నది పాత స్లోగన్. 'ఇండియానే సోనియా - సోనియానే ఇండియా' అన్నది కొత్త స్లోగన్.

  India that is Bharat అన్న రాజ్యాంగాన్ని సవరించి India that is Sonia అని పెట్టాలి.

  ReplyDelete
 10. మీరు ప్రతి దాంట్లోనూ "పోల్" పెడతారా ?
  జాగర్త శరత్ గారు

  ReplyDelete
 11. ఈ పోలులో ఇప్పటివరకు సోనియా ఆధిక్యంలో వుంది. పేరు తెలియని, వ్యక్తి తెలియని రాహుల్ కాబోయే భార్య సమీప ప్రత్యర్ధిగా వున్నారు.

  @ Surya
  :)

  @ Kiran
  ?

  @ Appu bhaay
  !

  ReplyDelete
 12. @ కిరణ్
  మీరు అన్నది ఓరుగల్లు పిల్లాడు మరో టపాకు కామెంట్ వేసిన తరువాత అర్ధమయ్యింది. ఈ రోజుకి ఆల్రెడీ మూడు టపాలు వ్రాసాను కాబట్టి మరో టపా బావుండదేమో. మన ముగ్గురి కామెంట్లు చూసి అందరూ జాగ్రత్తపడతారని భావిస్తాను. ఓరుగల్లు పిల్లాడూ, మీరూ ఒకరేనా?

  @ అందరికీ ఒక సూచన:
  మొదటి రోజు, మొదటి షో బ్లాగులో వైరసులున్నాయంట. అది ఓపెన్ చేస్తే మీ (ఆఫీసు) సిస్టం లోకి వైరసులు జొరబడే ప్రమాదం వుంది. జాగ్రత్త.

  ReplyDelete
 13. అసలియన్నీ కాదుగానీ సోనియాభారతం అన్న పేరెలా ఉంది అంబట్లోకి అప్పడాలపిండిలా లేదా కాఫీలో అరటిపండులా?

  సూర్య :))))

  ReplyDelete