ఎవరి భావాలు వారివి - ఎవరి వృత్తులు వారివి

ఈమధ్య బ్లాగుల్లో ఎక్కువగా ఎవరి భావాలు వారివి, మధ్యలో మీకేంటీ అనే ఉచిత డవిలాగు ఒహటే వినపడుతోంది. ఉచిత డవిలాగులంటే ఉచిత సలహాల్లాంటి డవిలాగులు అన్నమాట. కాస్త పెద్దరికం, కాస్త మధ్యవర్తిత్వం హడావిడిగా నిరూపించుకోవాలనుకునే వారు అలాంటి ఆకుకూ, పోకకూ అందని సలహాలు విసిరేస్తుంటారు. ఓ సలహా అలవోకంగా, ఆశువుగా విసిరేయడమే కానీ దానిని పాటిస్తే వచ్చే పరిణామాలూ, విపరిణామాలూ ఆలోచించే ఓపిక గానీ, తీరిక గానీ, ఆసక్తి గానీ వారికి వుండవు. కాస్సేపు వాళ్ళ సలహాను వినయంగా, భక్తి ప్రపత్తులతో స్వీకరిద్దాం. అలాంటప్పుడు ఎవరి వృత్తులు వారివే కదా. ఆ భావం ఆచరణాత్మకం అయితే ఎలా వుంటుందో ఓ దృశ్యం వేసుకుందామేం.

ఎవడో మన టవునులో ఏదో వీధిలో దొంగతనాలు చేస్తున్నాడయ్యా. నీకెందుకూ? నీ జోలికొచ్చాడా? నీ ఇంటికొచ్చాడా? నీ నట్టింటికొచ్చాడా? లేదు కదా. మరి ఖంగారు ఎందుకూ? ఎవరి వృత్తి వారిది.
 
ఎవడో హంతకుడు ఉన్మాదిగా మారి మన ఊర్లో (ఆడవారినే లెండి) సీరియల్ రేపు, హత్యలు చేస్తున్నాడు. మనకెందుకు ఉలుకు? మనం మొగాళ్ళమయితే మన జోలికి రాడు కదా. మనం సేఫ్. మన ఇంటికి వచ్చాడా? మన నట్టింటికి వచ్చాడా? అది వాడి వృత్తి ఏమో. ఇలా అనవసరమయిన విషయాలలో మనం కలగజేసుకోవడం ఏం బావుంటుంది చెప్పండి? 
 
మన వీధిలో అల్లరి పోరగాళ్ళు ఆడపిల్లలని వేధిస్తున్నారు. మన తల్లిని వేధించాడా? చెల్లిని వేధించాడా? లేదు కాదా. అది ఆ అబ్బాయిల వ్యాపకం. సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అన్నిట్లో మనం కలగజేసుకోవద్దండీ. ఎవరి టేస్టులు వారివీ.
 
మన పక్కింటి ఇల్లుని అద్దెకు తీసుకొని ముగ్గురు తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నట్లు మనకు అనుమానం వస్తుంది. తీవ్రవాదం వాడివృత్తి. వాడితో మనకెందుకు? వాడిపని వాడు చూసుకుంటాడు - మన పని మనం చూసుకుందాం. ఆ బాంబులను పరీక్షించడం కోసమని మనింటిమీదికి ఇంతవరకూ విసిరెయ్యలేదు కదా. ఖంగారెందుకు? రెండు మూడు వారాల తరువాత సిటీ లోపటికి వెళ్ళి ఎక్కడో పెట్టి వస్తాడవి కానీ మన నెత్తి మీదనే పెట్టిపోడు కదా?  
 
మన ఊరి స్మశానంలో ఓ ఇద్దరు మంత్రగాళ్ళు క్షుద్ర పూజలు నిర్వహిస్తూ చేతబడులూ గట్రా చేస్తున్నారని మనకు తెలుస్తుంది. మనకెందుకు చెప్పండి. వాళ్ళు ఇంతవరకు మననేమయినా చేసారా? లేదుకదా? మనమీద ఏవన్నా క్రియలు ప్రయోగించాడా లేదు కదా. వాడి వృత్తి, భుక్తి అదీ. పాపం వాడు కూడా బ్రతకాలి కదా. పైగా ఆ తాంత్రిక విద్యలు మన శత్రువు మీదనే ప్రయోగిస్తున్నాడేమో. సంతోషమే కదా. సర్వే జనా సుఖినోభవంతు.
 
మన ఊరి మసీదులో కొందరు తీవ్రవాదులు చేరి అమాయకులయిన ముస్లిం సోదరులకు మన దేశం మీద విషభవాలు నూరిపోస్తున్నారు. మనకెందుకులెండి. ఎవరి మతం వారిది, ఎవరి భావాలు వారివి. కాదనడానికి మనమెవరం?

మన ఊరి స్మశానంలో క్షుద్గురువులు తాత్రిక విద్యలు, వివిధ క్రియలు బోధిస్తున్నారు. అయినా మనకెందుకులెండి. మనకు అవి పడవు కాబట్టి మనమెలాగూ అటువెళ్ళం. కాస్త చూసీ చూడనట్టు తీసుకోవాలండీ ఇటువంటి విషయలనూ. ఏంటీ మా ఎదురింటాయన కూడా వెళుతున్నాడా ఆ పాఠాలకు? అయనతో నాకు బాగా గొడవలున్నాయే. ఎందుకు ఆ తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నాడంటారూ? నా మీద ఏ బాణామతో ప్రయోగించడు కదా. మన దేశంలో అందరికీ బాగా స్వేఛ్ఛ ఎక్కువయ్యిందండీ. లేకపోతే ఏంటండీ ఇలాంటి క్షుద్ర విద్యలు బహిరంగంగా బోధిస్తుంటే కూడా అందరూ మనకెందుకులే అని చూస్తూ ఊరుకుంటారా!?

18 comments:

  1. పాయింటే .. :D

    ReplyDelete
  2. హ హ, బాగుంది కానీ చిక్కేమిటంటే మీకు నచ్చిన విషయాలు అందరికీ నచ్చాలని లేదు. అలాగే నాకు నచ్చిన రంభ మీకు నచ్చాలని లేదు కదా... అప్పుడు పరిస్థితి ఏంటి?

    ReplyDelete
  3. బాగుంది.

    మరి సాయిబాబా విగ్రహం బూడిద రాలుస్తుంది, వినాయకుడు పాలు తాగుతున్నాడు లాంటి ప్రచారం చేసే వారిని కూడా వదలకూడదంటారా?

    ReplyDelete
  4. First they came for the Jews and I did not speak out - because I was not a Jew.

    Then they came for the communists
    and I did not speak out - because I was not a communist.

    Then they came for the trade unionists and I did not speak out -because I was not a trade unionist.

    Then they came for me - and by then there was no one left to speak out for me.

    --Martin Niemöller

    ReplyDelete
  5. @భాస్కర రామి రెడ్డి
    "నాకు నచ్చిన రంభ మీకు నచ్చాలని లేదు"

    కరక్టే! ఆయనకి మేనక నచ్చిందని ఎక్కడో చెప్పినట్టు గుర్తు.

    ReplyDelete
  6. ఆయనకు నచ్చేది ఇలియానా

    ReplyDelete
  7. భాస్కర రామి రెడ్డి, thanks for adding my blog into haaram.

    శరత్, మీకు కూడా !

    on Topic:
    మీ ఆలోచనకు పూర్తీ వ్యతిరేకిని. BUT ఆలోచింపే పాయింట్ రైజ్ చేసారు.

    ఆయనను ఎవరో ఏదో అన్నారని, సాయిబాబా మీద వెటకారం నాకు అసలు నచ్చలేదు. తిడుతూ కామెంట్స్ వ్రాసాను. పబ్లిష్ చేయలేదు.

    మనిషి తన ఇగో నిలబెట్టుకోవడానికి దేవుడిని కూడా హేళన చేయడానికి వెనుకాడరు అని అర్ధం అయ్యింది.

    ReplyDelete
  8. అయ్యా తమరు అంత బాధ పడవలసిన అవసరం ఎమీ లేదు. రాసిన ప్రతివాడి దగ్గర ఆ విద్యలు ఉంటే,చదివిన వారు వాటిని నమ్మిఉంటే యండమూరి తులసిదళం లో ఇంతకన్నా ఎక్కువ రాసి భయ పెట్టాడు. మొదట ఆయనని నిలదీయవలసినది. ఇక్కడ శర్మ గారు రాసింది క్షుద్రవిద్యలు ఎమీ గాదు, తాంత్రిక ఉపాసన అది తెలియకుండా రాస్తున్నరు.

    *నా మీద ఏ బాణామతో ప్రయోగించడు కదా. మన దేశంలో అందరికీ బాగా స్వేఛ్ఛ ఎక్కువయ్యిందండీ.*

    మీకంత సీన్ లేదు. ఊరికి నే కేనడాలో కుచొని మిమ్మల్ని మీరు చాలా ఊహించుకొంట్టున్నారు. మీపై బాణామతి చేయావలసిన అవసరం ఎమీటీ? ఎంతో ఆధునిక భావలుగల మీరు, సైన్స్ ని నమ్మే మీరు, నాస్తికులు అని చెప్పుకునే మీరు ఇలా బాణామతి నిజం గా ఉన్నది అనేవిధం గా ఎలా రాశారు. మీలాంటి వారు ముందుకు వచ్చి అసలికి నాపై మొదట ప్రయోగించు అని చాలేంజ్ చేయాలిగాని? ఎదో శర్మ గారిని ఇరుకున పెట్టాలనే ఉద్దేశం తో జీలానందం కొరకు రాసిన టపా ఇది.

    ReplyDelete
  9. అట్నుంచి ఇటుకు, ఇట్నించి అటుకు రెండు సార్లు చదివినా, ఇదేదో నామీద రాశారేమో అని డవుటోస్తోంది ;)

    btw, I agree with you completely.

    ఇవ్వాళ్ళ వేరే వాల్లని కెలికారు కదా అని మూసుకు కూర్చుంటే రేపు మనని కూడా కెలకొచ్చు. కాబట్టి నాతో గొంతు కలపండి

    ReplyDelete
  10. అన్నాయ్, మనతో పడనోడు మనమీద ఎదైన ప్రయోగం చేయడానికి ముందే ఆనికి విద్య నేర్పించినోనిమీద ఒక ప్రయోగం మనమే చేస్తే పోలా...? ఏమంటారు...?

    నచ్చనిది రంభ అయినప్పుడు నచ్చింది మేనకైనా, ఇలియానానైనా, జెనీలియానైనా, నయనతారైనా ఒక్కటే. ఏమంటారు రెడ్డిగారు....?

    I liked the comment by Weekend Politician.

    ReplyDelete
  11. వీభూది పై టపా నేను వేసుకుంటా అసైన్సులో పొద్దున్నే వచ్చేయండి.

    శరత్‌గారు ఈ మధ్య అదరగొడుతున్నారుగా

    ReplyDelete
  12. @ షాడో
    ఒక నాస్తికునిగా వాటినీ వదలకూడదంటాను కానీ సామాన్య జనాల్లో వాటికి ఆమోదం వుంది. మరీ ఒక్క సారే అన్ని వర్గాల మీద వ్యంగ్యంగా వ్రాస్తే మరీ అందరూ అనగా బూడిద పార్టీవారు, స్మశానం పార్టీ వారు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం మానివేసి నామీదకు వస్తారేమోనని జాగ్రత్త పడ్డా. అయినా ఆ విషయాన్ని తార తలమీదికి ఎక్కించుకుంటా అంటున్నారుగా. అక్కడ కాలక్షేపం చేద్దాం.
    @ వీకెండ్ పొలిటీషియన్
    సందర్భానికి తగ్గట్టుగా మీరు ఇచ్చిన కొటేషన్ బావుంది.
    @ సుదర్శన్, షాడో
    నాకు నచ్చేది అసిన్ :) పాత తరంలో రాధ. నాకు ఒక్క అందమే కాదు వ్యక్తిత్వం గట్రా గట్రా నచ్చాలి. ముఖ్యంగా తన పాదాలు కూడా నచ్చాలి.

    ReplyDelete
  13. @ డ్రీంస్
    నేను కూడా ఒఠ్థి బూడిద కోసం వారు అంతగా దిగజారుతారని అనుకోలేదు. మాకు అది ఆనందమే :)
    @ రమ/రామ
    నన్ను నేనుగా వ్రాసుకోలేదండీ. ఒక సగటు వ్యక్తి భావాలను ప్రస్ఫుటించాను.
    @ విట్ రియల్
    హ హ. మీలాంటి వారి గురించే. హమ్మా, అదో ఇదో చెప్పి నన్ను బుట్టలో వేద్దామనే. ఇప్పటివరకు నేను చేసిన బ్లాగు సేవ చాలు - ఇహ ఆ బాధ్యత మీ అందరిదే. ప్రస్థుతం పూర్తి స్థాయిలో కెలుకుడు కాకుండా ఏదో ఇలాంటి హాస్య, వ్యంగ్య టపాలు మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటూ బ్రతుకు జీవుడా అనుకుంటూ బ్లాగులోకంలో జీవిస్థాను :)

    ReplyDelete
  14. @ ఆకాశరామన్న
    :)
    @ భా రా రే
    ఇష్టం, అయిష్టం కాదు సంగతి ఇక్కడ. ఏది సమాజ హితానికి పనికి వస్తుందో, ఏది న్యాయమయిన హక్కులో, ఏవి సమాజాన్ని వెనక్కు కాకుండా ముందుకు తీసుకువెళతాయో అలా అలా అవి అవసరం సమాజానికి. ఒక లిబరల్ జడ్జి స్థానంలో వుండి మీరు ఈ ప్రశ్న వేసుకుంటే నేను ప్రస్థావించినవి అన్నీ వాళ్ళకి నచ్చాయి కాబట్టి సబబే అంటారా? నాకిష్టం అయితే నేను దోపిడీలూ, బలాత్కారాలు చేస్తూ పోయినా ఫర్వాలేదా? వ్యక్తి ఇష్టాన్ని బట్టి కాదు సార్ - సామాజిక స్పృహతో ఆలోచించాలి.

    ReplyDelete
  15. @ నరేశ్
    ప్రివెన్షన్ ఇస్ బెటర్ దేన్ క్యూర్ అంటావా :) అదే మరి ఆ పాఠాలు మొదలయితే అందరికీ ఇలాంటి క్షుద్ర అయిడియాలే వస్తాయి! ఎవరు ముందు, ఎవరు గొప్ప క్షుద్రుడు అయిపోతామా అని కొందరయినా స్మశానాలకి పరుగులు పెట్టవచ్చు.

    @ తార
    ఏం అదరగొట్టడం స్వామీ - కెలుకుడు సన్యాసం తీసుకొని నేను పక్కసైడుకి వుంటుంటే! మరి ఇదేంటీ అంటే ఏదో కొద్దికొద్దిగా సన్నాయి నొక్కులంతే. పొద్దుటే వస్తా కానీ వినోదం చూస్తా అంతే. నేను ఫైటింగు చెయ్యదలుచుకోలేదు బాబూ. మంట ఎగదోద్దామంటేనేమో నాకు పోటీగా అప్పూ భాయ్ తయారయ్యాడు.

    @ విట్ రియల్
    థేంక్స్

    ReplyDelete
  16. శరత్తన్నా!!
    ఏందీ.. "అందమొక్కటేగాదు వ్యక్తిత్వం గట్రా కూడా నచ్చాలి"
    అబ్బోవ్...ఇంకా
    "ముఖ్యంగా పాదాలు నచ్చాలి"
    మరి.. పారాణీ పట్టాలు వొద్దా? రిక్వైర్‌మెంట్ గట్టిగనే ఉందిగా..

    సరేలేగానీ మరి పెద్దైన తర్వాత స్వర్గంలో మేనకే గావాలి డ్యాన్సు చెయ్యడానికి అంచెప్పావుగా..

    కరెక్టేలే! విక్రమార్కుడు గూడా మేనకే మంచిడ్యాన్సరని తేల్చాడంటగదా ఇంద్రలోకంలో...

    ReplyDelete
  17. శరత్ సర్, వ్యంగ్యంలో మీకు మీరే సాటి :)

    ReplyDelete
  18. >>శరత్ సర్, వ్యంగ్యంలో మీకు మీరే సాటి :)

    yep...

    ReplyDelete