అమెరికాలం: ఇండియా నుండి వచ్చి చూసాడే సింహం వంటీ పిల్లోడూ

ఈ ఒక్క టపా వ్రాసి ఈ సిరీస్ ముగిస్తాను. మళ్ళెప్పుడన్నా శరీర మర్ధన అనబడు ఆరోగ్య'క్రియ' (నాకెందుకో ఈమధ్యనే అన్నింటికీ చివర క్రియ తగిలించాలనిపిస్తోంది) గురించి వ్రాసుకుందాం.

నేను కెనడాలో వుంటూ యు ఎస్ లో ఉద్యోగం చేస్తున్న రోజులవి. అప్పుడు మా కంపెనీకి L1 వీసా మీద అనుకుంటా అవుట్ సోర్సింగ్ కంపెనీ నుండి కొంతమంది అబ్బాయిలు వచ్చారు. అందులో ఇద్దరు ముగ్గురికి కెనడా చూడాలని కుతూహలం వుండింది. ఓయ్యెస్ మీరు వీసా తెచ్చుకోండి, నేనున్నాను కదా కెనడా చూపించడానికి అన్నాను. మొత్తనికి ఒక అబ్బాయి కెనడా వీసా తీసుకొని ఒక వారాంతం మా ఇంటికి వచ్చేడు.

శనివారం ఉదయమే లేచి మా కుటుంబంతో సహా కలిసి టొరొంటో వెళ్ళాం. అక్కడ ఆ రోజు రాత్రి ఒక గెట్ టుగెదర్ కూడా వుండింది.  టొరొంటో వెళ్ళాక మా కుటుంబాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో వదిలిపెట్టి ఆ అబ్బాయిని తీసుకొని టొరొంటో మహా నగరం చూపించడానికి వెళ్ళాను. అక్కడి డవున్ టవునూ గట్రా గట్రా చూపించాను. అలా తిరిగి తిరిగి మేము కొద్దిగా అలసిపోయాక అతడిని "రిలాక్స్ కావడానికి బీర్ ఏమయినా తాగుదామా?" అని అడిగితే సరే అన్నాడు. అతడిని తోడ్కొని డవున్ టవునులో వున్న జాంజిబార్ కి తీసుకువెళ్ళాను. లోనికి వెళ్ళగానే మా వాడు కళ్ళు తేలేసాడు! ఎందుకంటారూ? 

అది న్యూడ్ బార్. చెప్పాపెట్టకుండా అంతటి ఊహించని ఆనందం సాక్షాత్కరింపజేస్తే మరి షాక్ తినరేంటీ? విభ్రముడై అతను వుండగా నెమ్మదిగా నడిపించుకువెళ్ళి స్టేజీ చక్కగా కనపడేలా కూర్చోబెట్టాను. అతను ఎంతో కష్టంగా మాటలు పెగల్చుకొని "ఏంటి సార్ ఇదీ" అన్నాడు. కనపడుతూనే వుందిగా ఎదురుగా అని సన్నగా నవ్వాను. "అస్సలు ఊహించలేదండీ ఇలాంటి షోలు నేను చూడగలుగుతాననీ. థాంక్యూ థాంక్యూ సార్" అంటూ నన్ను బహుధా ప్రశంసించాడు. నేను ఊ ఎంజాయ్ అని ప్రోత్సహించాను. అలా మూడు గంటలు చూసాక నాకు కొద్దిగా బోర్ కొట్టింది. మనవాడేమో బాగా లీనమై తాద్మాత్యం చెందుతూ చూస్తున్నాడు. ఇంక వెళదామా అంటే ఇంకొద్ది సేపు సార్ అని బ్రతిమలాడాడు. ఇంకో గంట వుండి మా గెట్ టుగెదర్   సమయం అవుతూ వుండటంతో మనవాడిని అక్కడినుండి బలవంతంగా లేవదీసుకువెళ్ళాను. అక్కడి నుండి వస్తున్నంత సేపూ ఆ షోని తాను ఎంత ఆనందిచాడో చెబుతూ ఊహించని ఆనందాన్ని తనకు కట్టబెట్టినందుకు నాకు బహుళంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

మా గెట్ టుగెదరులో అందరికీ అతడిని పరిచయం చేసాను. అతనికి టొరొంటో బాగా చూపించావా అని చాలామంది నన్ను అడిగారు. ఆహా అన్నాను. మొత్తం చూపించేసారా అని కొంతమంది ఆడకేడీసు అడిగారు. ఆహా, ఎంచక్కా అన్నాను అతని వైపు నవ్వుతూ చూస్తూ. అందరూ సరదాగా నవ్వారు. అతను సిగ్గుతో కుచించుకుపోయాడు.

అతను ఇండియాకు వెళ్ళిన తరువాత కూడా కొన్నేళ్ళపాటు కాంటాక్టులోనే వుంటూ వచ్చాడు. నా పట్ల చాలా కృతజ్ఞతతో మెలిగేవాడు. తనకు టొరోంటోలో జరిగిన అనుభవాన్ని, అనుభూతిని పదేపదే తలచుకొనేవాడు. అతని పెళ్ళి కార్డు కూడా ఈమెయిల్లో పంపించాడు. ఆ తరువాత సంసారంలో పడి బ్యుజీ అయిపోయినట్టున్నాడు - కాంటాక్ట్స్ తగ్గాయి. ఇప్పుడసలు కాంటాక్టులోనే లేడు.
 
అతని గురించి ఓ వెజ్జీ జోకు. అతను మా ఫర్ముకి వచ్చిన తొలిరోజుల్లో అతనిని తీసుకువెళ్ళి మా కాఫిటేరియా చూపించాను. అక్కడున్న ఒక ఆహార పదార్ధాన్ని చూపించి అదేంటని అడిగాడు. బఫెలో వింగ్స్ అన్నాను. ఛీ బఫెలో వింగ్స్ నేను తినను సార్ అన్నాడు. కాసేపు నాకు అతనెందుకు అలా అన్నాడో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక బాగా నవ్వి "బాబూ, వాటి పేరు మాత్రమే బఫెలో వింగ్స్ కానీ నిజానికి అవి చికెన్ వింగ్సే, ఖంగారుపడకు" అని వివరించాను. అలాంటి చికెన్ వింగ్స్ తయారు చెయ్యడంలో ఆ బఫెలో సిటీ ప్రసిద్ధి అనుకుంటా, అందుకనే వాటికి ఆ పేరు వచ్చినట్లుంది.

3 comments:

 1. మాకెప్పుడు చూపిస్తారో జాంజిబార్....

  ReplyDelete
 2. @kvsv: ఈ వీకెండ్‌లోపు టొరొంటో వస్తే నేను చూపిస్తా. వస్తారా....?

  ReplyDelete
 3. అన్నా, జాతకాల్ రాస్తే కెలుకుతావంట కదా?
  ఈ bossom era లో రాసుల గురించి ఏమంటావన్న :)

  http://blossomera.blogspot.com/2010/10/blog-post_1185.html

  ReplyDelete