నా టపా వచ్చేముందు మీకేమయినా దుశ్శకునాలు కనిపిస్తుంటాయా?

ఇప్పుడే దేవన గారి అరటితొక్క ఇంటలిజెన్స్ టపా చదివాను. అది చదివాక నా మదిలో చాలా సందేహాలు. అంటే దేవన గురించో, వారి టపా గురించో కాదులెండి. నా టపాల గురించి. సందేహం అంటూ అచ్చాక అది తీర్చుకోకపోతే పెనుభూతమయ్యి నిద్రలో భయపెడుతుంది కదా.

నా టపా బ్లాగులోకంలోకి వచ్చేముందు మీకు శకునాలూ, సూచనలూ ఏమయినా కనిపిస్తాయా అని తెలుసుకోవాలనివుంది. ఎందుకంటే అలా కనపడ్డాయనుకోండి అవి చూసి ముందే మీరు నా టపా కనీసం సంకలినిలల్లో టాపులోనయినా చూడకుండా వుండాలని ఏ బాత్రూముకో, చాయ్ తాగడానికో, సిగరెట్టుకో వెళ్ళివస్తుంటారేమోనని నాకు యమ సంశయంగా వుంది మరి. అంచేతా మీరు ఆ దుశ్శకునాలూ, దుస్సూచనలూ, దుస్.... గట్రా గట్రాలూ అవన్నీ మీరందరూ కంపైల్ చేసి ఇస్తే నోటు చేసుకొని ఒక్కక్క దానికీ గ్రహశాంతి చేయిస్తా. అవసరమయితే తిరుతారా 'కుంపటి' సహాయం అయినా తీసుకుంటాను. అలా నా బ్లాగుకి హిట్స్ పెంచుకుందామనీ నా అత్యాశ. హిట్స్ వస్తే ఏమొస్తుందీ అని నన్నడక్కండి. అలెక్సా ర్యాంకింగు ఎంచక్కా పెంచుకోవచ్చు. అది పెంచుకుంటే ఏమవుద్దీ అంటారా - నేను అల్పసంతోషినని మీకు తెలియదూ. 

మీకు గోచరించే ఆ దుశ్శకునాలు ఈ క్రిందివి కూడా అయివుండవచ్చు:

మీ సిస్టం హ్యాంగ్ కావడం లేదా అప్పటిదకా విసిగిస్తున్నదల్లా ఏ సమస్యలూ లేకుండా హయిగా పనిచేయడం, మీ ప్రమేయం లేకుండానే మీ సిస్టంలో ఆ ఆ చిత్రాలు కనిపించడం, ఏ కారణంలేకుండానే ఎప్పుడో ఏడాది క్రిందట అడిగిన చీర కొనిపెట్టలేదని అర్జంటుగా గుర్తుకువచ్చి మీ ఆవిడ మీ మీద అప్పడాల కర్ర విసరడం, చక్కగా ఆడుకుంటున్న మీ పాప గయ్యిమని రోదించడం, మీ కుక్క తన తోకని నిటారుగా వుంచడం, పేపరోడు పేపరును మీ ముఖాన్నే విసిరికొట్టడం, మీరు ఆఫీసులో వుంటే అర్జంటు బోరు మీటింగుకి వెళ్ళాల్సిరావడం, మీ అభిమాన హీరో సినిమా ఫ్లాపని ఎవరో జఫ్ఫా బ్లాగరు వ్రాసిన టపాని చదవాల్సి రావడం, టివిలో ఏ ఛానలూ రాక కేవలం సాక్షి ఛానలో, రాజ్ ఛానలో మాత్రమే రావడం, టివిల్లో ఏడుగొట్టు సీరియళ్ళకి బదులుగా హాయిగా నవ్వించే సీరియల్ మొదలవడం ఇలాంటివి ఎన్నో వుండవచ్చు. హమ్మా, అన్నీ నాతోనే చెప్పించాలనే. మిగతావి మీరు చెప్పండేం.

14 comments:

 1. అప్పుడప్పుడు భూమి కంపిస్తున్దేమోనని నా అనుమానం. అది ఇప్పుడు తీరిపోయింది. తిరుతారా 'కుంపటి' అంటే ఏమిటో కొంచెం చెప్తారా? హిట్స్ పెంచుకోవడం కూడా ఒక బ్లాగానందం అనుకుంట. కాని నాకు మొత్తం చదివాక తలనొప్పి వస్తుందేమోనని ఆలోచిస్తున్న.........................

  ReplyDelete
 2. హు.. ఇద్దరిని ఏకారు ఈ టపాలో. ఊరికే ఉండలేరా? వాళ్ళిద్దరూ ఎప్పుడైనా మీజోలికొచ్చారా? ఎందుకు అనవసరంగా కెలుకుతారు? అందరికీ సెక్సు పిచ్చే ఉండదు కదా. మీలాగే ఒకాయనకి గ్రహాల పిచ్చి, రెండోఆయనకి గొప్పల పిచ్చి. ఈ టపాచదివితే మాత్రం అక్కడే ఆగిన ఆడ బ్లాగర్లు చదివిన చిరాకుని మించి చిరాకొచ్చింది.

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  మీరు అన్న ఒకరు అర్ధమయ్యారు కానీ మరొకరు అర్ధం కాలేదు, ఎనీ వే, నేను కెలికింది వారిని కాదు మహా ప్రభో. మగధీర, ఖలేజాలలో వున్న ఓ సన్నివేశం గురించి పేరడీగా వ్రాసాను. కుంపటి మా వాళ్ళదే కదా అని సరదాగా వాడేసా. అంతే.

  ReplyDelete
 4. @ భవానీ
  అంత సీనుందన్నమాట నా టపాలకి. తిరు, తార కలిసి అసైన్సు బ్లాగులో 'కుంపటి' అనే సీక్రెట్ గ్రూపు ప్రారంభించబోతున్నట్లు వెళ్ళడించారు. అందులో అసైన్సును ఉపయోగించి ఎన్నో పరిశోధనలూ, ప్రయోగాలూ జరుతాయ్ట. అయితే అందులో చేరిన సభ్యులనే కుంపటిలో వేసి బొగ్గులుగా చేసి వాడబోతున్నారని కర్ణ పిశాచి చెబితే విని ఝడుసుకొని అందులో చేరే ఆలోచన అర్జంటుగా మానుకున్నాను. హిట్స్ పెంచుకోవడం ఏమో గానీ తిట్స్ పెంచుకునే బ్లాగానందం నాలాంటి వారికి వుంటుంది.

  @ హరేక్రిష్ణ
  :)

  ReplyDelete
 5. దుర్వాసన వస్తుంది

  ReplyDelete
 6. పోస్టుకి ముందు శకునాలను ఆబ్సర్వు చేసేంత టైమెక్కడిస్తున్నారండీ. నేను హారం లోకి వచ్చేసరికి మీరు బోణీ కొట్టేస్తున్నారు. నేను ఆఫీసునుంచి బయలుదేరాక కూడా మీ టపాలు పడుతూంటాయి అప్పుడప్పుడు. అదేంటో, ఇంతసేపూ బాగా పని చేసిన బ్రౌసర్ మీకు కమెంటు పెట్టాలనుకోగానే మొరాయించింది. ఇది దేనికి సంకేతమంటారూ...?

  ReplyDelete
 7. ఎందుకు లేవండీ....నేన మా ప్రాజెక్టు గైడును తేలిక తీసుకుంటున్నానని మా స్నేహితులు దొబ్బుతుంటారు...నాకు పశ్చాత్త్తాపం వచ్చేస్తుంది...ఎందుకురా ఈ యెదవ బరుకు అనిపిస్తుంది...ఎదో ఒక పోస్టు చూసి సన్యాసం పుచ్చుకవాలనిపిస్తుంది ;)

  ReplyDelete
 8. నేను చెబుదామనుకున్నది నరేష్ చెప్పేశారు. ఇంకా శకునాలు చూసే అవకాశం ఎక్కడుందీ? అదలా ఉండగా టపా చదివేసిన తరవాత మాత్రం కళ్ళు బైర్లు కమ్మడం, అప్పుడప్పుడూ మైండు బ్లాంకవ్వడం లాంటి సూచనలు కనిపిస్తున్నాయి.

  ఐనా మీ జెనెరల్ నాలెడ్జి పెంచుకోవాలి శరత్. శకునాలకీ గ్రహాలకీ ఏమీ సంబంధం లేదు.

  P.S. Your humor quotient has increased tremendously in recent times. Enjoyed it.

  ReplyDelete
 9. :)

  హుఁ, మొత్తానికి బైటెట్టేశారన్నమాట.
  కుంపట్లో చేరుంటే ఇలాంటి డౌట్లొచ్చేవే కావు, పైగా ఇంకో వంద విద్యలు నేర్చుకునే వారు! ప్చ్!
  పోన్లెండి కుంచెవటి లోనైనా చేరండి :)

  ఇక్కడెవరో మా గురూగార్కి గొప్పల పిచ్చన్నారు :(
  బోల్డన్ని పేరు తెలీని విద్యలు నేర్చుకున్న మా గురూగార్కి గొప్పల పిచ్చా, ఆఁయ్ :(

  ReplyDelete
 10. ఏమనుకున్నారు మరి? మీ టపాల గొప్పతనము వివరించడము నా వల్ల కావట్లేదు. నిన్న మొత్తం చదివాకా వ్యాఖ్య రాయకుండా ఉండలేక రాసేసాన, తరువాత చూడండి నా system ఆగిపోయింది. ఏమైందో తెలియదు. ఒకపక్క office work ఉంది. ఒకటే phone మీద phoneలు. ఇంకేముంది పొద్దున్నే BOSS గారి తిట్లు వేయించుకుని వచ్చా. ఏమి టపాలండి. ఒకసారి వ్యాక్య రాసినందుకే ఇలా ఐతే ఆహా మీ(టపా) ఘనత నేను వివరించలేను.దీని గురించి ఒక టపా రాద్దామని అనుకున్న ఇకపై మీ టపా ఓపెన్ చేసే ముందు అందరిని చాల జాగ్రత్తగా ఉండమని. ఏమంటారు??????

  ReplyDelete
 11. @ భవాని
  నా టపాలంటే ఏదో కొద్దిగా ఎఫెక్టు వుంటుందనుకున్నా కానీ మరీ అంత ప్రాశస్త్యం వుందని నాకే తెలియదు సుమండీ. ఏం ఫరవాలేదు - మీ టపా మీరు వ్రాసేయ్యండి. నాతో సహా మీకు ఎవరు అడ్డమొస్తారో చూస్తాను.

  @ అజ్ఞాత
  మరీ అంత దుర్వాసన వస్తోందేమిటీ? అయితే ముక్కుకి క్లిప్పు పెట్టేసుకొండయితేనూ.

  ReplyDelete
 12. @ కొత్తపాళీ
  శకునాలకీ, గ్రహాలకీ సంబంధం లేదంటే నాకు ఒకటి గుర్తుకువచ్చింది. టొరొంటోలో వున్నప్పుడు నా ఫోటో వున్న బాసు/ట్రెయిను పాస్ ఒక మిత్రుడు అప్పుడప్పుడు తీసుకువెళ్ళేవాడు. అంత ధైర్యం ఏమిట్రా, నా ఫోటో నువ్వూ వేరు కదా, గుర్తు పట్టరా అంటే ఈ తెల్లోళ్ళకి మన దేశీలంతా ఒక్కలాగానే కనిపిస్తారు లేవోయ్ అనేవోడు. అలాగే నాస్తికుడిని నాకు ఆ తేడా ఏం తెలుస్తుంది చెప్పండి :))

  ReplyDelete