నేను మేధావినెట్లయిత?

సాయంత్రం పనిలేక నా ఎడమ(కాలు) మోకాలును గోకుతుంటే ఓ ధర్మసందేహం వచ్చి పడింది. నేను మేధావిని కానా, అవునా అనీనూ. ఓ అనుమానం అంటూ వచ్చాక దానిని పెనుభూతం చెయ్యకపోతే నా కుడికాలి మోకాలు ఊరుకోదుకదా. అలాగే చేసిందీ. మరి మేధావిని అనిపించుకోవడానికి నాకేం అర్హతలు వున్నాయో నా కోడి మెదడుకు వున్న లేశ మాత్రం తార్కిక జ్ఞానంతో ఏమాత్రం అభిజాత్యాలు లేకుండా విశ్లేషణ ప్రారంభించాను.

ముందు ఓ మేధావికి వుండే లక్షణాలు ఏంటో ఓ లిస్టెసా.

1. గొప్పగొప్ప పుస్తకాలు చదవవలయును. ఇంతవరకు అందరు మేధవులు ప్రస్థావించే ఆల్కమిస్టో లేక అయాన్ రాండో ఇంతవరకూ చదవలేదు. యండమూరిని చదివినందువల్ల ఆ అయాను ఆయన కాదనీ, ఆమె అనీ మా గొప్ప GK మాత్రం వచ్చేసింది. మన లెవలుకి అదే గొప్ప అనుకొనీ మరీ గొప్ప గొప్ప పుస్తకాలు చదివితే బుర్రలో ఒత్తొత్తుగవుతుందనీ మానేసా. అసలే మనం చదివే సంస్కృత సాహిత్యం వేరాయె. అలాంటి నన్ను మేధావి అని పేర్కొనడానికి ఏ మేధావి అయినా ముందుకు వస్తాడా ఏంటీ!
 
2. గొప్ప గొప్ప సినిమాలు చూసి అవసరం వున్నా లేకపోయినా ఉదహరించవలయును. మనకు ఆ ఆ అలాంటి వీడియోలు చూట్టానికే సమయం సరిపోవడం లేదు. ఇంకా మా గొప్ప సినిమాలు ఏం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను మేధావిగా డిక్లేర్ చేసుకుంటే మిగతా మేధావులంతా గింజుకు ఛస్తారు కాదో.
 
3. చిరుగడ్డం అయినా వుండాలి.  AP media రాము గారిలా చిరుగడ్డం అయినా పెంచుదామంటే అది తెల్లగడ్డం అయేలా వుంది. మా ఆవిడ నా బుర్రకి రంగెయ్యడానికి ఓకే అంటుంది కానీ పిల్లి గడ్డానికీ రంగెయ్యమంటే పీకి పడేస్తుందెమోనని భయం. మనకేమో ఇతరులకి కలరింగ్ కొట్టడం తెలుసుకానీ స్వంత బుర్రకాయకి రంగు పెడెయ్యడం తెలియదాయె.    
 
4. తెల్లజుట్టు: ఇదివరకులా కాకుండా ఈకాలంలో అందరూ రంగేసుకుంటున్నారు కాబట్టి అలా గుర్తించడం కష్టమే. పోనీ అలా కానిచ్చేద్దామన్నా ఏదో అక్కడక్కడ కొద్దిగా తప్ప నా జుట్టు తెల్లబడలేదు. జుట్టు తెల్లబడుతుంటే నెమ్మదిగా మేధావినవుతున్నాని సంబరం అవుతుంటుంది కానీ మా ఆవిడకి నామీద అసూయ. అందుకే నన్ను బరబరా బాత్‌రూమికి లాక్కువెళ్ళి వున్న రెండు తెల్లెంట్రుకలకు కూడా రంగేస్తుంది. నేను నా మేధావితనమంతా రంగుపాలవుతోంది అని లబలబలాడినా వినిపించుకుంటుంది కాదు :( సొ, అలా కూడా నాకు మేధావి నయ్యే అవకాశం మిస్సవుతోంది.    
 
సోడాబుడ్డి కళ్ళద్దాలు: అందుకు నాకు సైటు వుండి అర్హత వుంది కానీ మా ఆవిడ పడనిస్తుందా ఏమిటీ? ఆ సోడాబుడ్డి కళ్ళద్దాలన్నా వుండాలి నేనన్నా వుండాలి, ఏది కావాలో తేల్చుకో అని ఛాలెంజులు చెయ్యదూ. మరి నాకేమో నిజం చెప్పే ధైర్యం లేదాయె. నిజం నిష్టూరమే కాకుండా ఏ అప్పడాలకర్రకో ఇష్టం అయిపోగలదు. ఈ బ్రతుక్కి అంత రిస్క్ అవసరమా చెప్పండి? అందుకే నాకు ఆ ఛాయిసూ లేదు.

ప్రస్తుతానికి ఇంకా వేరే మేధావి లక్షణాలు గుర్తుకురావడంలేదు. ఇంకేమన్నా వుంటే మీరే గుర్తుకుచెయ్యండేం. ఎనీ వే, మొత్తానికి నేను మేధావిని ఎంత మాత్రమూ కాదని డిసైడు చేసేసా. మీకు ఓ సినీ సామెత తెలుసనుకుంటాను - నన్ను కవిని కాదన్నవాడిని రాయొచ్చుకు కొడతా అనెది. ఇప్పుడు అర్జంటుగా మనకు రాళ్ళెక్కడ దొరుకుతాయి కానీ మరో రకంగా అడ్జస్టు అయిపోదాము. కామెంట్లు, ఇంకా అజ్ఞాత కామెంట్లు సెడ్డ సీపు కాబట్టి నేను కవిని కాదన్నవాడిని కామెంటిచ్చుకొని కొడతా అని ఆ సినీ సామెతకి సవరణ చేసేద్దాం. అలాగే నన్ను మేధావి అన్న వాడిని కామెంటిచ్చుకొని కొడతా మరి.   

అన్నట్లు మేతావుల జోలికి ఈ టపాలో వెళ్ళలేదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

7 comments:

 1. మీరు మేధావి వి ఏంటి? తొక్కలొది.... అనవసరంగా "మేధావి" అన్న బిరుదు కోసం మీ స్థాయి ని దిగజార్చుకోకండి.... "మేధావి" are patented names of KCR, Kodanda Ram and batch....

  ReplyDelete
 2. మీరు మేదావే అని నా నమ్మకం ఎందు కంటే మా లాంటి చిరు మేదావులు మిమల్ని ఫాలో అవుతుండడం వల్ల..

  ReplyDelete
 3. మీ ఆవిడ తో డీల్ చేస్తున్నారు కాబట్టి మేధావి వర్గమేమో....

  ReplyDelete
 4. మీరు మేతావే సందేహం లేదు, కాదన్నవాడిని కత్తితో పొడుస్తా

  ReplyDelete
 5. మేధావి లక్షణం తెల్లజుట్టు కాదు, బట్టతల!

  ReplyDelete