బ్లాగుల కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నా!

ఇదో నిద్రరాని, పొద్దుపోని టపా. బాగోలేకపోతే బాగోలేదని చెప్పకండి.

ఇంతకుముందే బ్లాగుల్లో ఎవరో  ఖలేజాని కకావికలు చేసి వ్రాసిన సమీక్ష చూసాను. ఎవరిదంటే ఏం చెప్పనూ, ఓ బోలెడంత మంది వ్రాస్తున్నారు. అందులో ఓ మాట నచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్ బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడంట. సంతోషం. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అదేంటని అడగరేం. టైటిల్లోనే మీకు తెలిసిపోయిందనుకుంటా.

ఈమధ్య బాడీ లాంగ్వేజుల నస కాస్త తక్కువయ్యింది కానీ ఆ మధ్య ప్రతీ అడ్డమయిన హీరో కూడా ఫలానా సినిమా కోసం ఓ బ్రహ్మాండంగా బాడీ లాంగ్వేజ్ మారుస్తున్నానని ఓ తెగ ఊదరకొట్టేవారు. అబ్బో ఎంత మార్చాడో అని సినిమాకి వెళితే కుప్పిగంతులు తప్ప, ఓ ఊగిపోవడం తప్ప వేరే ఏమీ వుండేది కాదు.

ఛత్ బాడీ లాంగ్వేజీలు ఒఖ్ఖ సినిమావోళ్ళకేనా బ్లాగర్లకు వద్దా అనేసి అనిపించి ఆ అన్యాయాన్ని వెంటనే ఖండించాను. అప్పుడు నా నాలుక కొంచెం కరచుకున్నాను. ఫర్వాలేదు - మీరు సంతాపాలు తెలుపొచ్చు. ఎలాగయినా తెలుగు బ్లాగర్ల ఇజ్జత్ కాపాడాలనీ, బ్లాగుల్లో బాడీ లాంగ్వేజీ మొదలుపెట్టి సమస్త బ్లాగర్లకీ రోలు మోడలుగా అయిపోవాలనీ కంకణం కట్టేసా.

కంకణం అయితే కట్టుకున్నాను కానీ నిద్రమత్తులో వ్రాస్తున్నందువల్ల మాంఛి ఈడియాలు ఏమీ రావడం లేదు. అయినా దీనికోసం నేనొక్కడినే ఎందుకు కష్టపడాలని అనిపించింది. అందుకే కంకణం కట్టుకునే బాధ్యత నాదీనూ, సలహాలు ఇచ్చే బాధ్యత మీదీనూ. సరే, ఇక నిద్రొస్తోంది, బ్లాగుసేవ రేపు మళ్ళీ చేసుకుంటా కానీ అందాకా ఈ కంకణం గోడకు వున్న సీలకు తగిలిస్తా. శుభరాత్రి.

9 comments:

 1. maa bloggers andhariki "meere roll model"

  ReplyDelete
 2. ఇదో నిద్రరాని, పొద్దుపోని టపా. బాగోలేకపోతే బాగోలేదని చెప్పకండి.

  ఆటికేదో మిగిలినవన్నీ లోక కళ్యానానికి అర్జంటుగా అవసరమై రాసినట్టు .. ఇంకా మాట్లాడితే అసలు బ్లాగులు రాసే వాల్లందరం చేసే పని అదే కదా .. :D

  ఇలాంటీ మీమాంసలేమీ పెట్టుకోకుండా రాసేయండీ .. అంతే.

  ReplyDelete
 3. హ్మ్,
  ఎప్పటి నుండి మొదలుపెడుతున్నారు ఫోటో/వీడియో బ్లాగు?

  ఐనా అసలు బాడీ లాంగ్వేజ్ అంత తేలిగ్గా ఎలా మార్చేస్తారో?

  ReplyDelete
 4. ఒక్క బాడి లాంగ్వేజ్ ఎం ఖర్మ బాడి కుడ మారిస్తే అంటే ఎ సిక్స్ పకో అయితే బాగుంటుందేమో ఒక్క సారి ఆలోచించండి. ఎలాగు అవ్వేవో మీటింగ్ లకు పోతున్నరుగా . అక్కడ అమ్మయిలను, వయసయిపోయిన అంటి లను ఓ చూపు చూడాలిగా ఏమంటావు శరతన్న

  ReplyDelete
 5. telugu cinema hero la laaga kakunda.. marchuthanu anna mata marchakundaa.. marchalanukunnadi marchi.. mana blog lokaniki role model aipoindi...

  ReplyDelete
 6. @ జగ్గంపేట
  రోల్ మోడల్ అయితే ఫర్వాలేదు కానీ (రుబ్బు)రోలు మోడల్ కాకుంటే చాలు.
  @ ఆకాశరామన్న
  ఏదయినా మకతికగా వ్రాస్తే జనాలు తిడతారేమోనని ముజాచ(ముందు జాగ్రత్త చర్య) అదీ.
  @ తిరు
  చాలామంది మీలాగే నేను నా వీడియో బ్లాగుల గురించి అన్నాననుకొని పొరపడి నేను చెప్పదలచుకున్నది క్యాచ్ చెయ్యలేదనుకుంటా. నేనన్నది మామూలు బ్లాగుల గురించే. అదెలా అన్నది మరోసారి వివరిస్తా.

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  మనం వాళ్ళని ఓ చూపు చూసినా చూడకపోయినా వాళ్ళ 'చూపులు' తట్టుకునేంత ఫిట్‌నెస్ అయినా మనకుండాలి కదా. అలాగే చేద్దాం.
  @ కమల్
  ఎలా మార్చింది మార్చకుండా ఎలా మారుస్తానో మళ్ళీ చెబుతాగా. ఎందుకంటే నేను సరిగా అడక్కపోవడంతో ఎవరూ తగిన సలహాలు విసిరెయ్యలేకపోయారు.
  @ డ్రీమ్స్
  అలా అన్నారూ, నాకు నచ్చిందీ.

  ReplyDelete
 8. కంకణం కట్టుకున్నది మీరు మాకేటి దూ... మీరే కానీయండి ఆ మార్పులేవో..హీ హీ :)

  ReplyDelete