ఆ కథ ఈ మలుపు తిరిగింది

రియాలిటీ బ్లాగింగ్ ఈ సమస్య మీద చేస్తూ ఎప్పటికప్పుడు మీకు తాజా వివరాలు అందిస్తూవుంటాను.

ముందు ఇది చదవండి, తరువాత ఇది చదవండి.

జయ భర్త పేరు మధు అనుకుందాం. నిన్న మధు నాకు ఇండియా నుండి ఫోన్ చేసాడు. అతని దగ్గరి నుండి ఫోన్ రావడం ఊహించలేదు నేను. తను నాకు ఫోను చెయ్యడం ఇదే ప్రధమం.  తన బావమరిది మరణించాడు కదా, దాని గురించి అయివుంటుంది అనుకున్నాను కానీ కాదు. సుమంతుతో విసిగిపోయాననీ, వాళ్ళిద్దరూ బయట యధేఛ్ఛగా తిరుగుతుంటే పరువు మంట కలుస్తున్నదనీ, ఇంతవరకూ ఆగాను కానీ ఇక ఓపిక పట్టననీ చెప్పుకువచ్చాడు. అతడి పరువునూ బజారుకి ఈడుస్తాననీ ఇంకా ఏవేవో చెప్పుకువచ్చాడు. 2GB ల ఫోను మాటలు రికార్డు చేసాననీ అవన్నీ బయటపెట్టి సర్వ నాశనం చేస్తాననీ చెప్పాడు. చివరి సారిగా మీతో ఈ ప్రయత్నం చేస్తున్నాననీ ఇప్పుడు కూడా ఇక వినకపోతే తాను చచ్చినా బ్రతికినా అవన్నీ బయటపెట్టే ఏర్పాట్లు చేసాననీ చెప్పాడు. భార్య జయతో కూడా మాట్లాడించాడు. సమస్యలు ఉధృతమవుతున్నాయి కనుక సుమంతుని ఇక కలవద్దని చెప్పమంది. అసలే తమ్ముడు చనిపోయిన బాధలో వుంటే మళ్ళీ ఈ సమస్యలు భరించలేను అంది. సుమంతుతో మాట్లాడి చెబుతానని, అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాననీ చెప్పాను.
 
ఇవాళ సుమంతుతో మాట్లాడాను. మధు బెదిరింపులన్నీ చెబుతూ నీకు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అయ్యే పరిస్థితి వుందని హెచ్చరించాను. మధు అలా చేస్తే నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటా అని డాంబికాలు పలికినా నెమ్మదిగా పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో జయ విడాకులు తీసుకొని ఆ ఇంట్లోంచి బయటపడటమే ఉత్తమమని చెబితే అతను కూడా కన్విన్స్ అయ్యాడు. తమని మధుని అర్ధం చేసుకోవాల్సిందిగా వీలయినంతవరకు ఒప్పించమనీ, అది కుదరకపోతే అతనితో జయ విడాకులు తీసుకోవడమే దారి అని నాకు చెప్పాడు.

మధు మనస్సు ఎందుకు ఇంతగా అకస్మాత్తుగా విరిగిందో చెప్పాడు. శ్రీను భౌతిక కాయాన్ని మేము వచ్చేంతవరకు ఆగకుండా 12 గంటలలోపే మధు దహనం చేయించాడని, వస్తూ, వస్తూ ఎన్నిసార్లు ఫోను చేసినా మధు ఎత్తలేదనీ చెప్పాడు. అక్కడికి వెళ్ళాక శవదహనం వాళ్ళకోసం ఆపనందుకు మధుతో గొడవపడ్డాడంట. శ్రీను చివరి ఘడియల్లో ఎంతో సహాయం చేసాననీ, దగ్గర వుండి చూసుకున్నా అనీ, మధు ఏ విధంగానూ సహాయపడలేదనీ, అతని వల్ల ఇప్పుడు దహనం ముందు మిత్రుడిని చూసుకోకుండా అయ్యిందని నా దగ్గర వాపోయాడు.

మళ్ళీ మధుకి ఫోన్ చేసి సుమంత్ స్టాండ్ చెప్పాను. సుమంతుకి ఏది వీలయితే అది చేసుకొమ్మనమని చెప్పాడు. తాను మాత్రం తగ్గేది లేదన్నాడు. అంతదూరం ఈ కొట్లాటలు, గొడవలు ఎందుకుగానీ వారిద్దరినీ కొద్దిగా అర్ధం చేసుకొని వదిలెయ్యండీ అని చెప్పాగానీ ససేమిరా కుదరదన్నాడు. మరి జయ మీకు విడాకులు ఇస్తే ఓకేనా అని అడిగాను. విడాకులు కావాలంటే ఇస్తాననీ, అదే పద్ధతిగా వుంటుందని అన్నాడు. సుమంత్ మీద అంత ఇష్టం వున్నప్పుడు జయ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పాడు. 

జయతో మాట్లాడాను. మొగుడూ, లవరూ ఇద్దరూ తగ్గేట్లుగా లేరనీ, సమస్యలు ఉధృతమయేటట్లు వున్నాయనీ ఇద్దరం అవగాహనకు వచ్చాం. అలాంటప్పుడు తను పద్ధతిగా విడాకులు తీసుకొని బయటకి వెళ్ళడమే ఉత్తమమని చెప్పాను. అంత ధైర్యం తాను చెయ్యలేనన్నది. పిరికివారికి ప్రేమించే హక్కు వుండదన్నాను. తాను పిరికిదానినే అని తన ఇబ్బందులు చెప్పుకువచ్చింది. తను బయటకి వస్తే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయనీ, సుమంత్ కుటుంబం, అతని ఇద్దరు ఆడపిల్లలూ ఇబ్బందులు పడతారనీ చెప్పింది. ఇప్పుడు తమ్ముడు శ్రీను యొక్క ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల బాధ్యత కూడా తన మీదే పడ్డదనీ చెప్పింది. అలాగే తన ఇద్దరు అబ్బాయిలు కూడా ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఇంతమందికి ఇబ్బంది పెట్టి, ఈ వయసులో అంత సాహసం చేయలేననీ, తన ఆరోగ్యం కూడా బావుండటం లేదనీ, దానికి బదులుగా సుమంత్ మీద వున్న తన ప్రేమని చంపేసుకుంటాననీ చెప్పింది. 

తాను భర్తతో ఎందుకు నాకు ఫోన్ చేయించిందో కూడా చెప్పింది. కొన్ని నెలల క్రితం ఆమెతో ఫోనులో నేను మాట్లాడినప్పుడు ఇటు భర్త వినకా, అటు లవరూ వినకా ఈ మనోవేదనతో చావాలనిపిస్తోందని చెప్పుకువచ్చింది.  మరీ పరిస్థితి అంత దూరం వెళితే నాకు చెప్పకుండా ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పి మాట తీసుకున్నాను. ఆ మాట ఇప్పుడు గుర్తుకుచేసి అందుకే మీతో మాట్లాడాలనుకున్నాననీ, పరిస్థితులు బాగా విషమించాయనీ,  ఇప్పుడు సుమంతు నేను విడిపోవాల్సిందేననీ,  మీ ఫ్రెండు మీరు చెబితే వింటాడనీ, ఎలాగయినా సుమంతుని ఇక తనతో కాంటాక్ట్స్ పెట్టుకోకుండా కన్విన్స్ చేయమనీ ప్రాధేయపూర్వకంగా చెప్పింది.

రేపు సుమంతుకి ఫోన్ చేసి, పరిస్థితిని అంతా అర్ధం చేయించి ఇక మీకు దూరంగా వుండమని, మీ ప్రేమని దూరం చేసుకొమ్మని వీలయినంతగా కన్విన్స్ చేస్తాననీ జయకు హామీ ఇచ్చాను. రేపు సుమంతుతో మాట్లాడి మళ్ళీ అప్‌డేట్ ఇస్తా అన్నాను.

పిరికివారికి ప్రేమించే హక్కు లేదు. ఆ సంగతి జయ బాగానే అర్ధం చేసుకున్నది కాబట్టి ఇక సుమంతుకి కూడా నచ్చజెప్పి వారిద్దరిని దూరం చెయ్యడమే నా ముందున్న కర్తవ్యం. మరి నేను చెప్పింది వింటాడా వినడా, విన్నా ఎన్ని రోజులు వింటాడు, వినకపోతే తదుపరి పర్యవసనాలు ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం. మీకు ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ ఇస్తూనేవుంటాను.  

5 comments:

 1. Jaya, Madhu reality ki vacharu finally.

  Jaya di pirikitanam kaadu, ala rechagottakandi amenu. Finally she is sorting out the priorities in her life. Pillalatho patu responsibility kuda vastundi kada. I hope she will be strong to do her part in raising them. Ikkada naligedi aa Jaya gaare. Mi friend anta love cheste ameni konchem manassanthi ga unchagaligithe bagundu.

  miru people ni baga influence cheyyagalaru. Please forgiving me to say this to you, but I hope you use it for the greater good than trying to satisfy your friends needs that effect peoples lives severely.

  ReplyDelete
 2. ఇదంతా కథ అనిపిస్తుంది.. !!@#$%$

  అంత పిరికిది ఇంత పనిచేసింది అంటే తనని పట్టించుకునే వారు లేరు అన్నట్ట్లు... ఇప్పుడు ఐనా పిల్లలు కనిపించి ఆగిపోయింది.. లేక పోతే పిల్లలు సమాజం లో వెలి వెయబడరా ? నువ్వే పెద్ద కామ పిశాచివి ... నీ సలహాలతో కాపురాలు కూల్చొద్దు.. నా జీవితం నా ఇష్టం కంటే.. నా కుటుంబం అని బాధ్యత బాగుంటుందేమో ? అయినా నల్గొండ ఇలా ఉంటుందని అనుకోలేదు ..

  ReplyDelete
 3. ఆపరా నాయనా సుత్తి

  ReplyDelete
 4. శరత్ అన్నాయ్... పై కాయ నేను కాదు... ఇంకెవరో ..హన్నా.. హాయిగా ఉందీ అనుకుంటే .. వీడికి పేరు లేక నా పేరె పెట్టుకుంటాడా.

  ReplyDelete
 5. @ జాబిలి
  ఫ్రెండ్ యొక్క స్వార్ధం అని కాకుండా ప్రేమకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా అలాంటి సలహాలు ఇస్తుంటాను. ఎలాగయితేనేం మొత్తానికి వారి అనుబంధానికి అడ్డుకట్ట పడబోతున్నట్లుగానే వుంది కాబట్టి మీరు ఆశించినట్లే జరుగుతుండవచ్చు. మీరు కూడా సూచించినట్లే ఇహ ఆమెను మనశ్శాంతిగా వుండనిమ్మని సూచిస్తాను. ప్రయత్నలోపం లేకుండా బాగానే కృషి చేసాము ఇద్దరమూ కానీ అవి ఫలితం ఇవ్వకపోతే ఇకనయినా వెనక్కి వెళ్ళాలి కదా అని జయ నాతో అంది.

  నేను విన్నా వినకపోయినా ఎదుటి వారి సలహాలు, సూచనలు ఆశిస్తూనేవుంటాను. అందుకని ఇకముందు అయినా నిస్సనకోచంగా మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి.

  @ కాయ(లు)
  కొంచెం అనుమానం వచ్చింది కానీ ఏమోలే అనుకున్నా. హ్మ్. ప్రొఫయిల్ లేని పేర్లకు కూడా మళ్ళీ కాపీలా! బావుంది.

  ReplyDelete