ఈ మంగళవారం నాది

ఈ మంగళవారం సాయంత్రం ఓ కొత్త జీవన శైలి తలుపులు తట్టబోతున్నాను. ఆ శైలి గురించి గత దశాబ్దంగా తెలిసివున్నా కేవలం దానిపై మరింత సమాచారం తవ్వడం, వర్చ్యువలుగా ఆనందించడమే జరిగింది కానీ ప్రాక్టికలుగా ఎప్పుడూ పాల్గొనలేదు. రకరకాల కారణాల వల్ల ఇప్పుడు నిజ జీవితంలో ఆ లైంగిక విధానాలకు, ఆ లైంగిక జీవన శైలికి దాసోహం కావాలని నిర్ణయించుకున్నాను.

నేను అనుకున్నట్టుగా ఈ జీవితం కొనసాగితే నాకు ఆ పరంగా రెండో ఇన్నింగ్స్ మొదలయినట్లే. అయితే కొంతకాలం క్రితం ఎల్జిబిటీ సమావేశాలకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనుకున్నాను కానీ అలా జరగలేదు. మనం వంద అనుకుంటాం - అనుకున్నవన్నీ అవుతాయా ఏంటీ? లైట్ తీసుకోవాలి, మరో దాని వెంట పడాలి. ఈ బిడిఎస్సెం కూడా అలాగే ట్రై చెయ్యబోతున్నాను కానీ ఎంతవరకు కొసకు వెళ్ళుతుందో ఇప్పుడే చెప్పలేము కదా. ఒక విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఏదయినా ప్రయత్నించేవాడే విఫలుడవుతాడు. ఏమీ ప్రయత్నించని వాడికి విజయాలూ వుండవు, అపజయాలూ వుండవు.

ఏదేమయినా ఈ మంగళవారం సమావేశం ఉత్సాహంగానే వుంటుంది. అక్కడ జరిగేవి మాటలే తప్ప చేతలు వుండవు కానీ అందులో ఓ వెరయిటీ వుంది. ఆ కలయికకు కొంతమంది కింకీ స్త్రీలు కూడా వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో నాకు తెలుసు కాబట్టి వారి ప్రొఫయిల్ అంతా రిసెర్చ్ చేసేసా. అందులో వారి యొక్క ఫోటోలు కూడా చూసేసా. ఫోటోలు అంటే మామూలు ఫోటోలు కావులెండి ;) అలా వచ్చే వారిలో ఎవరయినా నచ్చితే నాకు మెంటర్ గా వుండమని కోరుతాను. అలా ఎవరయినా అంగీకరిస్తే నా చెయ్యి పట్టుకొని ఆ జీవన శైలిలోకి నడిపించుకువెళ్ళే బాధ్యత వారి మీదే పెట్టేస్తాను. మరింతగా నచ్చితే వారికి ఓ సబ్మిసివుగా దాసోహం అవుతాను. వాళ్ళూ నా ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే నా పప్పులుడుకుతాయిలెండి. చూద్దాం ఆ మీటింగ్ తుస్సుమంటుందో లేక బుస్సు బుస్సు మంటుందో.  

మొదటిసారి ఇలాంటి సమావేశానికి వస్తున్నాను అని వారికి సమాచారం ఇస్తే వారి నుండి వచ్చిన తిరుగు సమాచారం ఇదీ. దీని భావమేమి? నేనేమయినా వళ్ళు దగ్గరపెట్టుకొని వెళ్ళాలా ఏంటీ!  హ?!

The first time going to one of these is a little scary but you have nothing to fear. Everything is kept in public bounds. The conversation is a little out there but if you have any problem ask me or Steve and we will deal with any problem. Any other questions just ask....I am looking forward to meeting you.

7 comments:

 1. మీరు గే నా?

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  పట్టువదలని విక్రమార్కుడిలా ఈ ప్రశ్న పలు సార్లు అడుగుతున్నారుగా! సారీ అండీ, పొరపాటు నాదే, ఇంతవరకు మీ ప్రశ్నకి సమాధానం ఇచ్చే అవకాశం దొరకలేదు.

  అవును. నేను గే నే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేను బైసెక్సువల్ ను.

  ReplyDelete
 3. మియావ్October 3, 2010 at 11:17 AM

  బాగా బరితెగించావ్ శరత్ మైకేల్ స్కాట్ .

  ReplyDelete
 4. Any updates on this? a bit curious...

  ReplyDelete
 5. మా సమావేశం గత రాత్రే కదా జరిగింది. ఇవాళ వ్రాస్తాను.

  ReplyDelete
 6. ఏమయినా వర్కవుటు అయిందా గురూ గారూ..మా చెడ్డ ఇదిగా వుంది తెలుసుకోవాలనీ...

  ReplyDelete
 7. @kvsv
  చిన్న చిన్న ఫలితాలు కొన్ని వున్నాయి. అన్నీ వివరంగా రేపు వ్రాస్తాను. ఇవాళ కొద్దిగా తలనొప్పితో వున్నాను.

  ReplyDelete