తరువాత ... ఇలా జరుగుతుందేమో!

రామ జన్మ భూమి విషయంలో హైకోర్టు తీర్పు ప్రకారం లేదా సుప్రీ కోర్టుకు వెళ్ళినా కూడా ఇదే తీర్పుని సమర్ధించిందనుకోండి. అప్పుడేం జరుగుతుంది? భారత దేశంలోకెల్లా ఉత్తమమయిన రామాలయం హిందువులు కట్టేస్తారు. ముస్లిం దేశాలలోకెల్లా మంచి మస్జిద్‌ను ముస్లిములు కట్టిస్తారు. ఇహ అటువైపు నిహారీలు మాంఛి ఆశ్రమాన్ని కట్టించుకుంటారు. అందరూ సోదర భావంతో మెలగుతూ ఎవరి ప్రార్ధనలు వాళ్ళు చేసుకుంటారు. కదూ.

అలా అని నేననుకోను. ఒకవైపు మస్జిదులో అల్లాహో అక్బర్ అని ప్రార్ధనలు వినపడుతుంటాయి. మరో వైపు రాముడిని స్తుతిస్తూ భజనలు జరుగుతూవుంటాయి. ఇక నిహరీల ఆశ్రమంలో ఏవన్నా పూజలు జరుగుతూ వేద మంత్రాలు పఠిస్తుండవచ్చు. అల్లా ప్రార్ధనలు విని హిందువులకు, రెండు చెవుల్లో జోరీగల్లాగా ఒక వైపు రాముని భజనలు మరో వైపు పూజా మంత్రాలు వినపడి ముస్లిములూ ఆగ్రహం తెచ్చుకుంటారు. అలా శబ్దాలు వినపడకుండా వుండటానికి అవేమయినా సౌండు ప్రూఫ్ భవనాలా ఏంటీ?

అసలు ఆ గుడులు,మస్జిదులూ కట్టేటెప్పుడే లేదా భూమిని పంచేటప్పుడే ఎన్ని సమస్యలు వస్తాయో. ఇక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇహ ఎకరాల గురించి తన్నులాట కాకుండా ఇంచుల గురించి తన్నులాటలు జరగవచ్చు. స్థలం హద్దులు దాటి పక్కకు వచ్చారని చెప్పి వాళ్ళో వీళ్ళొ కెలుక్కోకమానరు. అలా చిన్న మనస్పర్ధలు పెద్దగా అవుతూ మళ్ళీ అప్పుడు మతకలహాలకు దారితియ్యవచ్చు. అలాంటి స్థితిలో ఏమాత్రం ప్రశాంతంగా ఆ ప్రార్ధనా మందిరాల్లో ప్రజలు గడుపుతారనేది ఆసక్తికరమయిన విషయమే.

ఇప్పటికిప్పటికి మత కలహాలు జరగకుండా నీళ్ళూ జల్లే తీర్పు ఇచ్చి జడ్జిలు తమ బాధ్యత తీర్చేసుకున్నారు కానీ అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదని మంచో చెడో ఎవరికో ఒకరికి ఆ స్థలం పూర్తిగా చెందేట్టుగా తీర్పు ఇస్తే బావుండేదేమో. నిరాశా వాదంతో ఆలోచిస్తే ఇదీ సీను. ఆశావాదంతో ఆలోచిస్తే ఈ తీర్పు వచ్చినప్పుడు అయితే ఎలాగా సంయమనంతో వున్నారో అలాగే అందరూ భాయి భాయి అని సుహృద్భావంతో మెలగుతారేమో. చూద్దాం.

4 comments:

  1. Meeru Gay ah ... ?

    ReplyDelete
  2. మీరన్నట్టు, మూడూ కట్టిన తరువాత, ఓ మూడు పెద్ద తాళం కప్పలూ ప్రభుత్వమే కొని వేసేస్తే సరి. పరమతమూ, సమ్మతమనుకునే స్థాయికి మన దేశం వచ్చాక తప్పక తీయిద్దాం. అంటే, ఓ రెండు, మూడు, నాలుగు, ఐదు వందల సంవత్సరాల తరవాత అన్నమాట. మసీదు, ఆలయం ప్రక్క ప్రక్కనే వుండటం, మన భాగ్యనగరం లో ఇప్పుడూ చూడొచ్చు, కానీ మాట చాంధసమే తమ అస్తిత్వం అనుకునే భక్త పరమాణువులు ఉన్న చోట కొంచం కష్టమే మరి.

    ReplyDelete
  3. అలా అని ఎందుకనుకుంటారు. నిన్ననే పేపర్ లో చదివా కంచి లోననుకుంట. మన టెంపుల్ పక్కనే మాజిద్ ఉందట. ఉదయమే ఇక్కడ సుప్రబతఃమ్ అక్కడ నమాజ్ లో ఎంచక్కా వినిపిస్తాయత. పీతాదిపతి గారే బాగుంది అని రాసారు. అల ఉండొచ్చేమో?

    ReplyDelete
  4. శరత్ గారు .చక్కగానే ఊహించారు .ఐక్యత తో మెలిగితే మన గుడి- మసీదు ప్రపంచానికి ఆదర్శం కావచ్చు

    ReplyDelete