700 మీటర్ల లోతున 70 రోజులుగా చిక్కుపడ్డ 33 మంది చిలియన్ మైనర్లు రేపు బయటకి వస్తున్నారోచ్!

దాదాపుగా ఓ 70 రోజుల క్రితం 700 మీటర్ల లోతున 33 మంది చిలియన్ మైనర్లు చిక్కుపడ్డారు. వారి ఆచూకి చిన్న బోరు ద్వారా 17 రోజుల తరువాత పైన ఉన్న వారికి తెలిసింది. అప్పటినుండీ వారిని రక్షించడానికి, పైకి తీసుకురావడానికి  అన్ని ప్రయత్నాలు జరుగుతూవున్నాయి. వారి ఆచూకీ తెలిసిన దగ్గరినుండీ ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖవార్తగా వస్తోంది. ఇండియాలో జాతీయ పత్రికలు ఏమయినా ఈ న్యూసును పట్టించుకున్నాయో లేదో గానీ ఇంత ముఖ్యమయిన వార్తను అన్ని రోజులుగానూ ఏ ఒక్క తెలుగు పత్రికా అంతగా పట్టించుకున్నట్లు లేదు. ఏ రోజయినా అరకొర సైడు వార్తగా ఎందులోనయినా వచ్చివుండవచ్చు.  నేనూ ఈ డెవెలప్‌మెంటులను శ్రద్ధగా అనుసరిస్తూ వస్తున్నాను.  

రెండు మూడు సన్నటి బోరు గొట్టాల ద్వారా ఇన్నిరోజులు వారికి ఆహారమూ, మందులూ, ఇతర అవసరమయిన వస్తువులూ సన్నటి కంటెయినర్లలో పెట్టి అందిస్తూ వస్తున్నారు. వారు పట్టేంత చేస్తున్న రంధ్రం మొన్ననే వారిని చేరింది. ఆ హోలులో వున్న మట్టి కూలకుండా ఈ రోజు వరకూ గట్టి చేసారు. వారిని పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక వెడల్పాటి గొట్టం తయారు చేసారు. దానికి ఫినిక్స్ అని పేరు పెట్టారు. ఇవాళ ట్రయల్ రన్స్ చేస్తే అది చక్కగా కిందికీ పైకీ వెళ్ళొచ్చింది. అందుకే ఇక రేపటినుండీ ఆ మైనర్లను పైకి తీసుకురావడం మొదలుపెడతారు. 

ఈ సంఘటణను ఇన్ని రోజులుగా  ఫాలో చేస్తుంటే ఒక సాహసవంతమయిన రియాలిటీ షో చూస్తున్నట్లుగా వుంది. వారికి తీసురావడానికి చేసిన రంధ్రం ఆ మైనర్లను చేరిందనగానే నాకూ చాలా సంతోషమయ్యింది. మరి ఎవరు ముందుగా బయటకి వస్తారయ్యా అని అడిగితే అందరూ మేము వెనకే వస్తామని త్యాగాలు చేస్తున్నరంట. ఎంత చక్కటి విషయం అది, కదా. ఆ 33 మందీ క్షేమంగా బయటకి వస్తారని ఆశిద్దాము.

క్రింద BBC లింక్ ఇస్తున్నాను. దాని అడుగుకి వెలితే దీనికి సంబంధించిన లింకులు వుంటాయి. వివరాలు తెలుసుకోండి. ఈ చక్కటి వార్తను మీరూ అనుసరించండి.

10 comments:

 1. This is important news and you exactly pointed Indian regional media. Also I got a nasty thought, what if it happens in India?

  ReplyDelete
 2. @ ట్రూలీ
  మీరన్న విషయం అసలు నేను ఈ టపాలో ప్రస్థావిద్దామని అనుకొనీ మరిచిపోయాను. యు ఎస్ లోనూ, చైనాలోనూ, చిలీ లోనూ ఇన్ని రోజులు, ఇంత లోతున కాకపోయినా గని కార్మికులు చిక్కుబడిపోయినట్లుగా తరచూ వార్తలు వింటుంటాం. అదే మరి ఇండియాలో అన్ని గనులున్నాయే ఎప్పుడూ ఇలాంటి వార్తలు నేను అయితే వినలేదేంటి చెప్మా? రక్షించడం సంగతి అటుంచి అసలు ఇటువంటి సంఘటనలు ఇండియాలో ఎందుకు జరగవో మణుగూరు మైన్సులో అండర్ మేనేజరుగా పనిచేసిన మా చిన్న బావని అయినా తెలుసుకోవాలి.

  ఇలాంటివి ఇండియాలో జరిగినట్లు మీకేమయినా తెలుసా? లేకపోతే జరిగినా బయటికి తీసేంత దృశ్యం లేదు కాబట్టి వార్తనూ, వారినీ సమాధి చేసేస్తారా?!

  ReplyDelete
 3. ఇదే India లో జరిగుంటే, ఈ విషయం బయటకు తెలిసేలోపు, వీళ్ళే ఒక చిన్న బాంబ్ జారవిడిచి, కుటుంబానికో 2లక్షలిచ్చి, అంతా hushup చేసేసేవాళ్ళు.

  ఇన్నిరోజులు అందులో చిక్కుకున్నవాళ్ళ మానసిక స్థితి ఎలా వుందో! If you just put yourself in that situation hypothetically, its really scary.

  ReplyDelete
 4. @ వాసు
  బయటి ప్రపంచంతో సంబంధం లేక, తమ పరిస్థితి ఏమవుతుందో తెలియని, చీకటి మొదటి 17 రోజులూ వారికి చాలా దుర్భరంగా గడిచింది. బయటి ప్రపంచం వారితో కాంటాక్ట్ అయ్యాక చిలియన్ గవర్నమెంటూ, ఆ గని కంపెనీ వారి గురించి చాలా చక్కటి శ్రద్ధలు తీసుకున్నాయి. వారిలో మానసిక స్థైర్యం పెంపొందిచేలా, బోరు కొట్టకుండా పలు ఏర్పాట్లు చేసాయి.

  ReplyDelete
 5. ఈ వార్త చదివాక కొన్ని రోజులు ఫాలో అయినాను. ఏదో వెబ్సైటు లో మంచి ఫొటోస్ వాళ్ళావి వాళ్ళ బంధువులవి చూశాను. మీరన్నట్లు ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. మన ఇండియా లో ఇంత పెద్ద సంఘటనలు లు అయినట్లు ఎక్కడా గుర్తు లేదు. బోరుబావుల్లో పిల్లలు పాడడం వాళ్ళను రక్షించే ప్రయత్నాలు మాత్రం మనం మీడియాలో చూశాను., ఎప్పుడో చిన్నప్పుడు కాలా పత్తర్ అనుకుంటా అమితాబ్, శశికపూర్ సినిమా చూశా మైన లో చిక్కుకపోయిన వాళ్ళను రక్షించడం, బాగుంటుంది మీరు చుడండి.

  ReplyDelete
 6. గని కార్మికులు ఎంపైర్ స్టేట్ బ్యుల్డింగు కంటే చాలా ఎక్కువ లోతులో దాదాపు బుర్జ్ దుబాయ్ అంత లోతులో వున్నారంట.

  http://www.cnn.com/2010/WORLD/americas/08/26/graphic.chile.mine/index.html

  ReplyDelete
 7. Please check Mahabir collery incident happened in 1989.

  http://www.metacafe.com/watch/3395029/saga_of_mahabir_part_1/

  http://www.metacafe.com/watch/3397200/saga_of_mahabir_part_2/

  My collegemate Sridhar was part of the rescue operation.


  @Vasu - Check following link before commenting about our INDIA.

  http://punjabnewsline.com/content/sikh-engineer-offers-his-services-save-33-chilean-miners/23896

  ---Bhaskar

  ReplyDelete
 8. సంతోషం, కానీ వాళ్ళసలెలా చిక్కుకుపోయారు?

  ReplyDelete
 9. @Bhaskar,
  I stand corrected. అక్కడక్కడా మహానుభావులింకా వున్నారు. లేరని నేనను. కానీ, మీరు చెప్పిన ఒక్ఖ సందర్భానికి, కనీసం 10వేల నిర్లక్ష్యాపూరిత సంఘటనలు జరిగాయి కదా, ఆ బాధలోనుండె నేను వ్రాసింది.

  ReplyDelete