వార్తలు - వ్యాఖ్యలు

బ్యాంకులకు ఇళ్ళు వదిలెయ్యడం అన్నది మా ఇల్లినాయ్ రాష్ట్రానికి కూడా బాగానే పాకిందట. శుభం.

అతి గొప్ప సూపర్ కంప్యూటర్ టైటిల్ యు ఎస్ నుండి చైనాకి వెళ్ళింది. ఆశ్చర్యం ఏముంది? రేపో మాపో ఆ టైటిల్ ఇండియాకీ దక్కుతుంది. అన్నట్టు ఇండియా సూపర్ కంప్యూటరుని పూణేలో నేను దర్శించాను.

మాల్దీవ్సు లో ఒక విదేశీ జంటకు పెళ్ళిచేస్తూ నిర్వాహకుడు ఆ జంటకి తెలియని భాషలొ మంత్రాల్లాంటివి చదువుతూ మీకు పుట్టబోయే సంతానం బాస్టర్డ్స్ కానూ అనీ ఇంకా చాలా చాలా తిడుతూ దీవించేడంట. ఇప్పుడు దానిపై మాల్దీవులలో పెద్ద దుమారం చెలరేగుతోంది. మాల్దీవియన్స్ అంతా ఆ పెళ్ళి పూజారిని తిట్టేస్తున్నారు - తమ దేశానికి తలవంపులు తెచ్చినందుకుగాను.
http://www.bbc.co.uk/news/world-south-asia-11644328

ఆ మధ్య చదివిన విషయం ఒకటి గుర్తుకువుంది. యు ఎస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడు 10% ఉద్యోగాలని తొలగించే సూచనలు వున్నాయంట. బ్యాంకు ఉద్యోగస్తులూ జాగ్రత్త.


వాహనాల జాతకం మీద శర్మ గారు పోస్టు వేసారు కానీ చదవలేదు. హ్మ్. ఇలా అన్నింటికీ జాతకాలుంటాయంటే నా చెప్పుల జాతకం ఏంటో తెలుసుకొవాలి. అసలే వచ్చేది హార్ష్ వింటర్. ఐసుమీద చెప్పు జారిందనుకోండి నా జాతకానికి ఎసరు వస్తుంది.

డ్రీంస్ మొదలయిన వారి కథనాలను వింటుంటే ఆరెంజ్ పాటలు ఓ రేంజులో వున్నట్లున్నయ్యే. అన్నీ కూడా హీరో సోలో సాంగ్సేనుట.

తన్‌హాయి 34 వ భాగం వేసారు కల్పన గారు కానీ ఇంతవరకు నేను ఒక్క భాగమూ చదవలేదు. సోషల్ నవల్స్ మీద ఆసక్తి బొత్తిగా తగ్గింది నాకు. ఆ నవల పేరుకి అర్ధం చెప్పమంటే ఇంతవరకూ కల్పన గారు చెప్పలేదు నాకు. అఫ్సర్ గారిని ఆ అర్ధం అడుక్కోమన్నారు!  మా నాన్న హిందీ పండిట్/లెక్చరర్. అందుకే హిందీలో పరమ శుంఠని నేను.

రోజంతా సరికొత్త వార్తలతో వ్యాఖ్యలతో ఈ టపాని తాజీకరిస్తుంటాను (సరి అయిన పదమేనా ఇది?).

పోల్: ఇండియా పేరు మార్చేద్దాం

(ఈ పై ఫోటొ ఇండియా తదితర దేశాలవారికి అర్ధం కాకపోవచ్చు. ఇక్కడ స్కవుట్ పిల్లలు ఛారిటీ కోసమనుకుంటా చాక్లెట్లు అమ్ముతూ కనిపిస్తుంటారు.)

లిలితకళా తోరణాలకూ, రహదారులకూ లాంటి చిన్న చిన్న వాటికి రాజీవ్ పేరెట్టకుండా ఒకేసారి పెద్ద విషయానికే పేరు మార్చి ఇండియా/ఇటలీ మీది నా ప్రేమని నిరూపించదలచుకున్నాను. అలాగే ఇండియా దేశభక్తులూ, అభిమానులూ నేను త్వరలో పెట్టబోయే పోల్ లో పాల్గొని మీ దేశభక్తినీ, అభిమానాన్నీ చాటుకోండి. ఇండియా పేరు మార్చేసి ఏ పేరు పెడితే బావుంటుందో మీ అమూల్యాభిప్రాయన్ని ఇక్కడ సెలవివ్వండి.

నేను ఇవ్వబోయే లిస్టులో నాకు ఇటలీ, సోనియా, ఇందిర బాగా నచ్చాయి ఎందుకంటే ఇండియాతో రైమింగ్ బాగా కుదురుతోందని. ఇందిర అన్న పేరు కాస్త పాత వాసన కొడుతోంది కాబట్టి అది వదిలేసినా మిగతా రెండు పేర్లలో ఇటలీ, సోనియాలలో ఏ పేరు బావుందో అర్ధం కావట్లేదు. మీకు కూడా అలాంటి పరిస్థితే రావచ్చని పోల్ లో మల్టిపుల్ ఛాయిస్ ఇస్తున్నాను. ఓకే.

కూడలిపై బ్లాగుబడి!కూడలి మీద బ్లాగుబడి చెయ్యాలనుకుంటున్నాను. అప్పుడెప్పుడో రెండు, మూడు సార్లు నా బ్లాగులని కూడలి నుండి పీకేసారు. నా రసజ్ఞ బ్లాగుని చేర్చుకొమ్మంటే తిరస్కరించారు. అందుకే కూడలి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు వీజీ మెథడ్ బ్లాగుబడి అని ఈమధ్యనే నాకు అర్ధం అయ్యింది. మరి ఇలాంటి బ్లాగ్ కర్మలూ, క్రియలూ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క బ్లాగునయినా బలి ఇవ్వాలి కదా. అందుకే ఒక బకరా బ్లాగుని సూచించండి. నా బ్లాగుని వదిలేసెయ్యండి మహాప్రభో అని ఎవరయినా వేడుకుంటే గనుక వారి బ్లాగు నా బ్లాక్ లిస్టులోంచి తీసేస్తాను. ఇది సక్సెస్ అయితే గనుక అప్పుడు మరో అగ్రిగేటర్ వెనకాల పడతాను.

ట్యాంక్‌బండ్ మీద ఏ బ్లాగరు విగ్రహం పెడితే బావుంటుందేమిటి?

అమెరికాలం: ఇండియా నుండి వచ్చి చూసాడే సింహం వంటీ పిల్లోడూ

ఈ ఒక్క టపా వ్రాసి ఈ సిరీస్ ముగిస్తాను. మళ్ళెప్పుడన్నా శరీర మర్ధన అనబడు ఆరోగ్య'క్రియ' (నాకెందుకో ఈమధ్యనే అన్నింటికీ చివర క్రియ తగిలించాలనిపిస్తోంది) గురించి వ్రాసుకుందాం.

నేను కెనడాలో వుంటూ యు ఎస్ లో ఉద్యోగం చేస్తున్న రోజులవి. అప్పుడు మా కంపెనీకి L1 వీసా మీద అనుకుంటా అవుట్ సోర్సింగ్ కంపెనీ నుండి కొంతమంది అబ్బాయిలు వచ్చారు. అందులో ఇద్దరు ముగ్గురికి కెనడా చూడాలని కుతూహలం వుండింది. ఓయ్యెస్ మీరు వీసా తెచ్చుకోండి, నేనున్నాను కదా కెనడా చూపించడానికి అన్నాను. మొత్తనికి ఒక అబ్బాయి కెనడా వీసా తీసుకొని ఒక వారాంతం మా ఇంటికి వచ్చేడు.

శనివారం ఉదయమే లేచి మా కుటుంబంతో సహా కలిసి టొరొంటో వెళ్ళాం. అక్కడ ఆ రోజు రాత్రి ఒక గెట్ టుగెదర్ కూడా వుండింది.  టొరొంటో వెళ్ళాక మా కుటుంబాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో వదిలిపెట్టి ఆ అబ్బాయిని తీసుకొని టొరొంటో మహా నగరం చూపించడానికి వెళ్ళాను. అక్కడి డవున్ టవునూ గట్రా గట్రా చూపించాను. అలా తిరిగి తిరిగి మేము కొద్దిగా అలసిపోయాక అతడిని "రిలాక్స్ కావడానికి బీర్ ఏమయినా తాగుదామా?" అని అడిగితే సరే అన్నాడు. అతడిని తోడ్కొని డవున్ టవునులో వున్న జాంజిబార్ కి తీసుకువెళ్ళాను. లోనికి వెళ్ళగానే మా వాడు కళ్ళు తేలేసాడు! ఎందుకంటారూ? 

అది న్యూడ్ బార్. చెప్పాపెట్టకుండా అంతటి ఊహించని ఆనందం సాక్షాత్కరింపజేస్తే మరి షాక్ తినరేంటీ? విభ్రముడై అతను వుండగా నెమ్మదిగా నడిపించుకువెళ్ళి స్టేజీ చక్కగా కనపడేలా కూర్చోబెట్టాను. అతను ఎంతో కష్టంగా మాటలు పెగల్చుకొని "ఏంటి సార్ ఇదీ" అన్నాడు. కనపడుతూనే వుందిగా ఎదురుగా అని సన్నగా నవ్వాను. "అస్సలు ఊహించలేదండీ ఇలాంటి షోలు నేను చూడగలుగుతాననీ. థాంక్యూ థాంక్యూ సార్" అంటూ నన్ను బహుధా ప్రశంసించాడు. నేను ఊ ఎంజాయ్ అని ప్రోత్సహించాను. అలా మూడు గంటలు చూసాక నాకు కొద్దిగా బోర్ కొట్టింది. మనవాడేమో బాగా లీనమై తాద్మాత్యం చెందుతూ చూస్తున్నాడు. ఇంక వెళదామా అంటే ఇంకొద్ది సేపు సార్ అని బ్రతిమలాడాడు. ఇంకో గంట వుండి మా గెట్ టుగెదర్   సమయం అవుతూ వుండటంతో మనవాడిని అక్కడినుండి బలవంతంగా లేవదీసుకువెళ్ళాను. అక్కడి నుండి వస్తున్నంత సేపూ ఆ షోని తాను ఎంత ఆనందిచాడో చెబుతూ ఊహించని ఆనందాన్ని తనకు కట్టబెట్టినందుకు నాకు బహుళంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

మా గెట్ టుగెదరులో అందరికీ అతడిని పరిచయం చేసాను. అతనికి టొరొంటో బాగా చూపించావా అని చాలామంది నన్ను అడిగారు. ఆహా అన్నాను. మొత్తం చూపించేసారా అని కొంతమంది ఆడకేడీసు అడిగారు. ఆహా, ఎంచక్కా అన్నాను అతని వైపు నవ్వుతూ చూస్తూ. అందరూ సరదాగా నవ్వారు. అతను సిగ్గుతో కుచించుకుపోయాడు.

అతను ఇండియాకు వెళ్ళిన తరువాత కూడా కొన్నేళ్ళపాటు కాంటాక్టులోనే వుంటూ వచ్చాడు. నా పట్ల చాలా కృతజ్ఞతతో మెలిగేవాడు. తనకు టొరోంటోలో జరిగిన అనుభవాన్ని, అనుభూతిని పదేపదే తలచుకొనేవాడు. అతని పెళ్ళి కార్డు కూడా ఈమెయిల్లో పంపించాడు. ఆ తరువాత సంసారంలో పడి బ్యుజీ అయిపోయినట్టున్నాడు - కాంటాక్ట్స్ తగ్గాయి. ఇప్పుడసలు కాంటాక్టులోనే లేడు.
 
అతని గురించి ఓ వెజ్జీ జోకు. అతను మా ఫర్ముకి వచ్చిన తొలిరోజుల్లో అతనిని తీసుకువెళ్ళి మా కాఫిటేరియా చూపించాను. అక్కడున్న ఒక ఆహార పదార్ధాన్ని చూపించి అదేంటని అడిగాడు. బఫెలో వింగ్స్ అన్నాను. ఛీ బఫెలో వింగ్స్ నేను తినను సార్ అన్నాడు. కాసేపు నాకు అతనెందుకు అలా అన్నాడో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక బాగా నవ్వి "బాబూ, వాటి పేరు మాత్రమే బఫెలో వింగ్స్ కానీ నిజానికి అవి చికెన్ వింగ్సే, ఖంగారుపడకు" అని వివరించాను. అలాంటి చికెన్ వింగ్స్ తయారు చెయ్యడంలో ఆ బఫెలో సిటీ ప్రసిద్ధి అనుకుంటా, అందుకనే వాటికి ఆ పేరు వచ్చినట్లుంది.

ఎవరి భావాలు వారివి - ఎవరి వృత్తులు వారివి

ఈమధ్య బ్లాగుల్లో ఎక్కువగా ఎవరి భావాలు వారివి, మధ్యలో మీకేంటీ అనే ఉచిత డవిలాగు ఒహటే వినపడుతోంది. ఉచిత డవిలాగులంటే ఉచిత సలహాల్లాంటి డవిలాగులు అన్నమాట. కాస్త పెద్దరికం, కాస్త మధ్యవర్తిత్వం హడావిడిగా నిరూపించుకోవాలనుకునే వారు అలాంటి ఆకుకూ, పోకకూ అందని సలహాలు విసిరేస్తుంటారు. ఓ సలహా అలవోకంగా, ఆశువుగా విసిరేయడమే కానీ దానిని పాటిస్తే వచ్చే పరిణామాలూ, విపరిణామాలూ ఆలోచించే ఓపిక గానీ, తీరిక గానీ, ఆసక్తి గానీ వారికి వుండవు. కాస్సేపు వాళ్ళ సలహాను వినయంగా, భక్తి ప్రపత్తులతో స్వీకరిద్దాం. అలాంటప్పుడు ఎవరి వృత్తులు వారివే కదా. ఆ భావం ఆచరణాత్మకం అయితే ఎలా వుంటుందో ఓ దృశ్యం వేసుకుందామేం.

ఎవడో మన టవునులో ఏదో వీధిలో దొంగతనాలు చేస్తున్నాడయ్యా. నీకెందుకూ? నీ జోలికొచ్చాడా? నీ ఇంటికొచ్చాడా? నీ నట్టింటికొచ్చాడా? లేదు కదా. మరి ఖంగారు ఎందుకూ? ఎవరి వృత్తి వారిది.
 
ఎవడో హంతకుడు ఉన్మాదిగా మారి మన ఊర్లో (ఆడవారినే లెండి) సీరియల్ రేపు, హత్యలు చేస్తున్నాడు. మనకెందుకు ఉలుకు? మనం మొగాళ్ళమయితే మన జోలికి రాడు కదా. మనం సేఫ్. మన ఇంటికి వచ్చాడా? మన నట్టింటికి వచ్చాడా? అది వాడి వృత్తి ఏమో. ఇలా అనవసరమయిన విషయాలలో మనం కలగజేసుకోవడం ఏం బావుంటుంది చెప్పండి? 
 
మన వీధిలో అల్లరి పోరగాళ్ళు ఆడపిల్లలని వేధిస్తున్నారు. మన తల్లిని వేధించాడా? చెల్లిని వేధించాడా? లేదు కాదా. అది ఆ అబ్బాయిల వ్యాపకం. సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అన్నిట్లో మనం కలగజేసుకోవద్దండీ. ఎవరి టేస్టులు వారివీ.
 
మన పక్కింటి ఇల్లుని అద్దెకు తీసుకొని ముగ్గురు తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నట్లు మనకు అనుమానం వస్తుంది. తీవ్రవాదం వాడివృత్తి. వాడితో మనకెందుకు? వాడిపని వాడు చూసుకుంటాడు - మన పని మనం చూసుకుందాం. ఆ బాంబులను పరీక్షించడం కోసమని మనింటిమీదికి ఇంతవరకూ విసిరెయ్యలేదు కదా. ఖంగారెందుకు? రెండు మూడు వారాల తరువాత సిటీ లోపటికి వెళ్ళి ఎక్కడో పెట్టి వస్తాడవి కానీ మన నెత్తి మీదనే పెట్టిపోడు కదా?  
 
మన ఊరి స్మశానంలో ఓ ఇద్దరు మంత్రగాళ్ళు క్షుద్ర పూజలు నిర్వహిస్తూ చేతబడులూ గట్రా చేస్తున్నారని మనకు తెలుస్తుంది. మనకెందుకు చెప్పండి. వాళ్ళు ఇంతవరకు మననేమయినా చేసారా? లేదుకదా? మనమీద ఏవన్నా క్రియలు ప్రయోగించాడా లేదు కదా. వాడి వృత్తి, భుక్తి అదీ. పాపం వాడు కూడా బ్రతకాలి కదా. పైగా ఆ తాంత్రిక విద్యలు మన శత్రువు మీదనే ప్రయోగిస్తున్నాడేమో. సంతోషమే కదా. సర్వే జనా సుఖినోభవంతు.
 
మన ఊరి మసీదులో కొందరు తీవ్రవాదులు చేరి అమాయకులయిన ముస్లిం సోదరులకు మన దేశం మీద విషభవాలు నూరిపోస్తున్నారు. మనకెందుకులెండి. ఎవరి మతం వారిది, ఎవరి భావాలు వారివి. కాదనడానికి మనమెవరం?

మన ఊరి స్మశానంలో క్షుద్గురువులు తాత్రిక విద్యలు, వివిధ క్రియలు బోధిస్తున్నారు. అయినా మనకెందుకులెండి. మనకు అవి పడవు కాబట్టి మనమెలాగూ అటువెళ్ళం. కాస్త చూసీ చూడనట్టు తీసుకోవాలండీ ఇటువంటి విషయలనూ. ఏంటీ మా ఎదురింటాయన కూడా వెళుతున్నాడా ఆ పాఠాలకు? అయనతో నాకు బాగా గొడవలున్నాయే. ఎందుకు ఆ తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నాడంటారూ? నా మీద ఏ బాణామతో ప్రయోగించడు కదా. మన దేశంలో అందరికీ బాగా స్వేఛ్ఛ ఎక్కువయ్యిందండీ. లేకపోతే ఏంటండీ ఇలాంటి క్షుద్ర విద్యలు బహిరంగంగా బోధిస్తుంటే కూడా అందరూ మనకెందుకులే అని చూస్తూ ఊరుకుంటారా!?

విమానం ఎక్కేముందు ఇంధనం సరిపడేంత వుందో లేదో తనిఖీ చేసుకోండి!!

ఖర్చులని తగ్గించుకోవడం కోసం తక్కువ ఇంధనాన్ని వాడాల్సిందిగా పైలట్లను కోరుతున్నాయిట యు ఎస్ విమాన సంస్థలు. మరీ ఎక్కువ ఇంధనం ఇస్తే ఎక్కడ పారబొస్తాడో అని విమానం వెళ్ళేటప్పుడు బొటాబొటి ఇంధనం మాత్రమే ఇస్తున్నారంట! ఈ పరిస్థితి ఇలాగే వుంటే ముందు ముందు విమానం ఎక్కేటప్పుడు ఇంధనం ఎంతుంది బాబూ, సరిపోతుందా లేక మధ్యలో ముంచేస్తావా అని పైలటును కనుక్కొని ఎక్కాల్సివుంటుంది మనం. క్రింది లింకులో క్రింద కామెంట్లు కూడా వుంటాయి - అవి కూడా చూడండి.

కొంత కాలం పంథా మారుస్తున్నాను

ఈమధ్య వివాదాలలో తల దూర్చి తల కాస్త బొప్పికట్టింది. అది అలవాటయిన బొప్పి అయితే అంటే బూతు తిట్లు, విమర్శలు, బోడి సలహాలు లాంటివి అయితే మనకు ఎప్పటినుండో అలవాటయినవే అయినందువల్ల నో ప్రాబ్లెం. అయితే ఈ హడావిడుల వల్ల నాకు ఇంకో సమస్య వస్తోంది. నా కొత్త జీవన సరళికి తగినంత సమయం కెటాయించలేకపోతున్నాను. అలాగే ఇవి కాలక్షేపం కోసమని కూడా ఎత్తుకున్నా కాలక్షేపం ఏమోగానీ నా వున్న తీరిక సమయం హరించుకుపోతోంది. మా అధరం గ్రూపు మీద కూడా శ్రద్ధపోయి అది చతికిల పడుతోంది. నా ఫోకస్ తగినంతగా ఆ ఆయా విషయాలపై మరింతగా మళ్ళించేందుకై కొంత ఇటు ఫోకస్ తగ్గించాల్సివుంది. సాధారణ టపాలు వ్రాస్తూనేవుంటా అనుకోండి.
 
కొంతకాలం అయితే వివాదాలు తలకు ఎత్తుకోకున్నా జరుగుతున్న వివాదాలలో కాస్తో కూస్తో పాల్గొంటూ గాలి ఎగదోస్తూనేవుంటా అనుకోండి. అందువల్ల కొన్ని రీసెంట్ టపాలు తీసేసి డ్రాఫ్టులుగా సేవ్ చేసివుంచాను. ఇదేదో తోకముడిచిన వ్యవహారమని ఎక్కువమంది అపోహపడితే మళ్ళీ వాటిని బయటకి తీస్తాను. అయినా గాలికి పోయే కంపను నేను మాత్రమే తగిలించుకోవాల్సిన అవసరం ఏముంది. అయినా నేనేమన్నా బ్లాగులోకానికి మూల పురుషుడినా - మూలశంక పురుషుడిని కానీ ;)   కదా :)    ట్రయల్ గా ఇలా కొంతకాలం చూసి మళ్ళీ నా ధోరణిని సమీక్షించుకుంటాను. 

చీటింగ్ చిలియన్!

చిలియన్ గని కార్మికుల రక్షణను శ్రద్ధగా చూసిన వారందరికీ ఈ విషయం తెలిసేవుంటుంది. ఆ గని కార్మికులలో జానీ అనే అతను కూడా వున్నాడు. వాళ్ళింకా భూమిలోపలే చిక్కుబడివున్నప్పుడు గని కార్మికుల కుటుంబీకులు అంతా కలిసి వారి క్షేమం కోసం ప్రార్ధనల్లాంటి విజిల్స్ చేసారు. అక్కడ కుటుంబీకులు వారి కుటుంబసభ్యుని పేరు ఉచ్చరించాల్సివుంటుంది. అలా ఉచ్చరిస్తున్నప్పుడు ఒకరికి ఒకరు తెలియని ఇద్దరు స్త్రీలు జానీ పేరు ఉఛ్ఛరించారు. ఊప్స్!

అలా బయటపడింది అయ్యగారి అసలు వ్యవహారం. మనవాడు పెద్దిల్లు, చిన్నిల్లు ఒకరికొకరికి తెలియకుండా లాగించేస్తున్నాడన్నమాట! దాంతో అసలు భార్యకి మండుకొచ్చింది. మరి మండాక ఊరికే ఊరుకుంటుందా ఏమిటీ? కొత్తామె, పాతేమె ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా అరిచేసుకున్నారు, పోట్లాడుకున్నారు. ఆమె అయినా వుండాలి లేక తనయినా వుండాలి అని అసలు భార్య పాతాళంలో ఇరుక్కున్న మొగుడి బేజా ఉత్తరాలతో  ఫ్రై చేయనారంభించింది. మనవాడు ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదాయె అనుకున్నాడు పాపం. 

అది సరే గానీ అందరికీ సస్పెన్స్ ఇప్పుడొచ్చింది. ఒక్కొక్క మైనర్ భూమి మీదికి చేరగానే ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతించారు. జానీ యొక్క ప్రియురాలు వస్తే నేను రానని అతని భార్య మొండికేసింది. అందువల్ల అతడిని భూమి పైకి ఆహ్వానించడానికి ప్రియురాలు వస్తుందా లేక భార్య వస్తుందా అని లైవ్ ఫీడ్ చూస్తున్న అందరికీ యమ సస్పెన్సూ. మొత్తమ్మీద ఒక యువతి మాత్రం వచ్చి జానీ బయటకి రాగానే కౌగలించుకుని ముద్దులు పెడుతూ సంతోషించింది. ఆ యువతి ఎవరా అని అందరికీ సస్పెన్స్! తేలిందేమిటంటే ఆ యువతి అతని యొక్క ప్రియురాలు/రెండో పెళ్ళాం.

పాపం ఇప్పుడు ఆ జానీని ఈ ఇద్దరూ కలిసి భూమి మీద కూడా సుఖం లేకుండా చేస్తున్నారేమో. ఆ గొడవలు భరించలేక భూమిలోనే వున్నా బావుండునని అతగాడు అనుకుంటున్నా ఆశ్చర్యం లేదు.  

Johnny Barrios Rojas' rescue was among the most anticipated – if only to see who would be there to greet him.

No. 21 of the men pulled from the collapsed mine, Barrios gained notoriety as the man who had two women at Camp Hope – his wife of 28 years, Marta Salinas, and his mistress of four, Susana Valenzuela.

Salinas apparently knew nothing of the affair until the two women ran into each other amid the tents pitched by family members anxiously holding vigil – and a very public spat ensued.

The 50-year-old Barrios looked around sheepishly Wednesday as he emerged from the rescue tube that elevated him to the Earth's surface, peering through dark glasses as mining officials in red shirts applauded loudly.

Behind him, smiling widely and waiting for him to notice her stood Valenzuela. When he didn't, the round-faced strawberry blonde walked around to face Barrios and gave him a long kiss and hug, weeping into the shoulder of his jumpsuit as he whispered into her ear.

వందనాలు వందనాలు చిలియన్ ప్రెసిడెంట్ నీకు వందనాలూ

మేము 33 మందిమీ క్షేమంగా వున్నామని మైనర్ల నుండి అందిన తొలి సమాచారాన్ని ప్రదర్శిస్తున్న చిలియన్ ప్రెసిడెంట్   సెబాస్టియన్ పినేరా

నిన్నటి నుండీ అప్పుడప్పుడయినా చిలీ బొగ్గు కార్మికుల రక్షణ చర్యలని టివి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూనేవున్నాను. వారిని బయటకి తీసే కార్యక్రమం మొదలయిన దగ్గరి నుండీ ప్రెసిడెంటూ, అతని భార్యానూ ఆ ప్రదేశంలోనే వేచివున్నారు. కొన్ని గంటల తరువాత ఒక్కొక్కరూ బయటపడుతుండగా ప్రతి ఒక్కరినీ బయట ప్రపంచానికి ఆహ్వానిస్తూ కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఇద్దరిలో ఒకరయినా అక్కడ వేచివున్నారు.
 
చిలియన్ ప్రధమ జంట

ఇప్పటికి 19 మందిని బయటకి తీసారు. ఇంకా 14 మంది వున్నారు. అందరినీ బయటకి తీసేదాకా అధ్యక్ష జంట అక్కడేవుండి   అందరూ బయటకి వచ్చాక ఈ రోజు చిలీ ప్రజలందరితో కలిసి ఘనంగా ఉత్సవాలు చేసుకుంటారట.  రాత్రి మరి కొద్ది సేపు ఏమయినా విశ్రాంతి తీసుకున్నారేమో నాకు తెలియదు కానీ బయటకి వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడినీ వారు పలకరించారని సమాచారం.  ఇంకో విషయమూ గమనించాను. వారి పక్కనే పెద్దగా రక్షణ కూడా లేదు. వారి పక్కనే నిన్న ఒక్క పోలీసు ఆఫీసరు కనపడ్డాడు కానీ ఇవాళ అయితే అతను కూడా లేడు.

ఒక్కొక్క మైనరు బయటకు వచ్చి తన ఆత్మీయులనూ, ప్రధమ జంటనూ, ఇతరులనూ కలుసుంటున్న సన్నివేశాలు చూస్తుంటే ఇంత దూరంలో వున్న నా కన్నులే చెమ్మగిల్లుతున్నాయంటే ఆ మైనర్ల, కుటుంబ సభ్యుల, చిలియన్ల భావోద్వేగాలు ఎలా వుంటుండొచ్చో మనం ఊహించొచ్చు.

ఇతగాడే బయటకి వచ్చే మొదటివాడు!

చిలియన్ బంగారం గని కూలిపోయి 700 మీటర్ల అడుగున 70 రోజులుగా చిక్కుకున్న 33 మంది గని కార్మికులను బయటకి తియ్యడం కొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. వారిలో 31 ఏళ్ళ ఫ్లోరెన్సియో అవలాస్ ను ముందుగా బయటకి తియ్యబోతున్నారు.

http://news.blogs.cnn.com/2010/10/12/workers-begin-to-rescue-trapped-chilean-miners/?hpt=T1&iref=BN1

నా టపా వచ్చేముందు మీకేమయినా దుశ్శకునాలు కనిపిస్తుంటాయా?

ఇప్పుడే దేవన గారి అరటితొక్క ఇంటలిజెన్స్ టపా చదివాను. అది చదివాక నా మదిలో చాలా సందేహాలు. అంటే దేవన గురించో, వారి టపా గురించో కాదులెండి. నా టపాల గురించి. సందేహం అంటూ అచ్చాక అది తీర్చుకోకపోతే పెనుభూతమయ్యి నిద్రలో భయపెడుతుంది కదా.

నా టపా బ్లాగులోకంలోకి వచ్చేముందు మీకు శకునాలూ, సూచనలూ ఏమయినా కనిపిస్తాయా అని తెలుసుకోవాలనివుంది. ఎందుకంటే అలా కనపడ్డాయనుకోండి అవి చూసి ముందే మీరు నా టపా కనీసం సంకలినిలల్లో టాపులోనయినా చూడకుండా వుండాలని ఏ బాత్రూముకో, చాయ్ తాగడానికో, సిగరెట్టుకో వెళ్ళివస్తుంటారేమోనని నాకు యమ సంశయంగా వుంది మరి. అంచేతా మీరు ఆ దుశ్శకునాలూ, దుస్సూచనలూ, దుస్.... గట్రా గట్రాలూ అవన్నీ మీరందరూ కంపైల్ చేసి ఇస్తే నోటు చేసుకొని ఒక్కక్క దానికీ గ్రహశాంతి చేయిస్తా. అవసరమయితే తిరుతారా 'కుంపటి' సహాయం అయినా తీసుకుంటాను. అలా నా బ్లాగుకి హిట్స్ పెంచుకుందామనీ నా అత్యాశ. హిట్స్ వస్తే ఏమొస్తుందీ అని నన్నడక్కండి. అలెక్సా ర్యాంకింగు ఎంచక్కా పెంచుకోవచ్చు. అది పెంచుకుంటే ఏమవుద్దీ అంటారా - నేను అల్పసంతోషినని మీకు తెలియదూ. 

మీకు గోచరించే ఆ దుశ్శకునాలు ఈ క్రిందివి కూడా అయివుండవచ్చు:

మీ సిస్టం హ్యాంగ్ కావడం లేదా అప్పటిదకా విసిగిస్తున్నదల్లా ఏ సమస్యలూ లేకుండా హయిగా పనిచేయడం, మీ ప్రమేయం లేకుండానే మీ సిస్టంలో ఆ ఆ చిత్రాలు కనిపించడం, ఏ కారణంలేకుండానే ఎప్పుడో ఏడాది క్రిందట అడిగిన చీర కొనిపెట్టలేదని అర్జంటుగా గుర్తుకువచ్చి మీ ఆవిడ మీ మీద అప్పడాల కర్ర విసరడం, చక్కగా ఆడుకుంటున్న మీ పాప గయ్యిమని రోదించడం, మీ కుక్క తన తోకని నిటారుగా వుంచడం, పేపరోడు పేపరును మీ ముఖాన్నే విసిరికొట్టడం, మీరు ఆఫీసులో వుంటే అర్జంటు బోరు మీటింగుకి వెళ్ళాల్సిరావడం, మీ అభిమాన హీరో సినిమా ఫ్లాపని ఎవరో జఫ్ఫా బ్లాగరు వ్రాసిన టపాని చదవాల్సి రావడం, టివిలో ఏ ఛానలూ రాక కేవలం సాక్షి ఛానలో, రాజ్ ఛానలో మాత్రమే రావడం, టివిల్లో ఏడుగొట్టు సీరియళ్ళకి బదులుగా హాయిగా నవ్వించే సీరియల్ మొదలవడం ఇలాంటివి ఎన్నో వుండవచ్చు. హమ్మా, అన్నీ నాతోనే చెప్పించాలనే. మిగతావి మీరు చెప్పండేం.

700 మీటర్ల లోతున 70 రోజులుగా చిక్కుపడ్డ 33 మంది చిలియన్ మైనర్లు రేపు బయటకి వస్తున్నారోచ్!

దాదాపుగా ఓ 70 రోజుల క్రితం 700 మీటర్ల లోతున 33 మంది చిలియన్ మైనర్లు చిక్కుపడ్డారు. వారి ఆచూకి చిన్న బోరు ద్వారా 17 రోజుల తరువాత పైన ఉన్న వారికి తెలిసింది. అప్పటినుండీ వారిని రక్షించడానికి, పైకి తీసుకురావడానికి  అన్ని ప్రయత్నాలు జరుగుతూవున్నాయి. వారి ఆచూకీ తెలిసిన దగ్గరినుండీ ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖవార్తగా వస్తోంది. ఇండియాలో జాతీయ పత్రికలు ఏమయినా ఈ న్యూసును పట్టించుకున్నాయో లేదో గానీ ఇంత ముఖ్యమయిన వార్తను అన్ని రోజులుగానూ ఏ ఒక్క తెలుగు పత్రికా అంతగా పట్టించుకున్నట్లు లేదు. ఏ రోజయినా అరకొర సైడు వార్తగా ఎందులోనయినా వచ్చివుండవచ్చు.  నేనూ ఈ డెవెలప్‌మెంటులను శ్రద్ధగా అనుసరిస్తూ వస్తున్నాను.  

రెండు మూడు సన్నటి బోరు గొట్టాల ద్వారా ఇన్నిరోజులు వారికి ఆహారమూ, మందులూ, ఇతర అవసరమయిన వస్తువులూ సన్నటి కంటెయినర్లలో పెట్టి అందిస్తూ వస్తున్నారు. వారు పట్టేంత చేస్తున్న రంధ్రం మొన్ననే వారిని చేరింది. ఆ హోలులో వున్న మట్టి కూలకుండా ఈ రోజు వరకూ గట్టి చేసారు. వారిని పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక వెడల్పాటి గొట్టం తయారు చేసారు. దానికి ఫినిక్స్ అని పేరు పెట్టారు. ఇవాళ ట్రయల్ రన్స్ చేస్తే అది చక్కగా కిందికీ పైకీ వెళ్ళొచ్చింది. అందుకే ఇక రేపటినుండీ ఆ మైనర్లను పైకి తీసుకురావడం మొదలుపెడతారు. 

ఈ సంఘటణను ఇన్ని రోజులుగా  ఫాలో చేస్తుంటే ఒక సాహసవంతమయిన రియాలిటీ షో చూస్తున్నట్లుగా వుంది. వారికి తీసురావడానికి చేసిన రంధ్రం ఆ మైనర్లను చేరిందనగానే నాకూ చాలా సంతోషమయ్యింది. మరి ఎవరు ముందుగా బయటకి వస్తారయ్యా అని అడిగితే అందరూ మేము వెనకే వస్తామని త్యాగాలు చేస్తున్నరంట. ఎంత చక్కటి విషయం అది, కదా. ఆ 33 మందీ క్షేమంగా బయటకి వస్తారని ఆశిద్దాము.

క్రింద BBC లింక్ ఇస్తున్నాను. దాని అడుగుకి వెలితే దీనికి సంబంధించిన లింకులు వుంటాయి. వివరాలు తెలుసుకోండి. ఈ చక్కటి వార్తను మీరూ అనుసరించండి.

అతి తెలివి అమెరికా పోలీసులు

ఒక ఇంట్లోకి బందిపోటు దొంగలు ప్రవేశించారని పోలీసులకు తెలుస్తుంది. ఆ ఇంట్లో వారికి ఇద్దరు అందమయిన అమ్మాయిలు వున్నారని కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. అప్పుడు పోలీసులు ఏం చెయ్యాలని భావిస్తాం? ఒక కాలేజీలోకి ఒక గన్‌మాన్ ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నాడని పోలీసులకు సమాచారం అందుతుంది. అప్పుడు సాధారణంగా పోలీసులు ఏం చేస్తారని భావిస్తామేం?

మామూలుగా అయితే పోలీసులు లోపలికి వెళ్ళి బందిపోట్లనీ, హంతకులనీ ఎదుర్కుంటారని భావిస్తాం. అబ్బే, మా దగ్గర అలా చేయడం సమర్ధత కాదు. ఆ బందిపోట్లకు కనపడకుండా ఆ ఇల్లు చుట్టూ పోలీసులని మోహరించి ఒక పెరిమీటర్ ఏర్పాటు చేస్తారు. ఓ బైనాక్యులర్ తీసుకొని ఇంటి బయట ఏం జరుగుతోందని గమనిస్తుంటారు. ఇంటి బయట ఏమీ హడావిడిలేదనుకోండి ఆ బందిపోట్లూ, ఆ ఇంటివాళ్ళూ, ఆ టెనేజీ అమ్మాయిలూ సరదాగా పేకాట ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటారని, అందువల్ల తొందరేమీ లేదని భావిస్తూ గంటలు, గంటలు చూయింగ్ నములుతూ, లోటెడు కప్పుల్లో కాఫీ తాగుతూ బయట చుట్టూ వున్న పోలీసులు కాలక్షేపం చేస్తారు.    

ఈలోగా ఆ దుండగులు తాపీగా, తీరిగ్గా ఆ ఇంటిపెద్దను చావబాది, ఎంచక్కా తల్లినీ, 17 ఏళ్ళ పెద్దమ్మాయినీ, 11 ఏళ్ళ చిన్నమ్మాయినీ రేప్ చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు బ్రతికివుంటే సాక్ష్యలు గట్రా వుంటాయి ఎలా అని ఆ దుండగులు సిగరెట్లు తాగుతూ ఆలోచిస్తారు.  ఇంట్లో వున్న కిరసనాయిలో, పెట్రోలో అప్పటికీ బ్రతికివున్న వారి ముగ్గురి మీదా చల్లి ఆ సిగరెట్లు నవ్వుకుంటూ వారిమీదికి విసిరేసి ఇంట్లో దొరికిన డబ్బులు, నగానట్రా తీసుకొని ఆ ఇంటివారి పోష్ కారులో బయటపడుతారు.  కొద్దిదూరం వెళ్ళాక పోలీసులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనపడుతారు కదా, ఇహ తప్పించుకోలేక ఆ పోలీసు కార్లకి తమ కారుని గుద్ది వెళ్ళాలనుకుంటారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చేసి గొప్ప ఘనకార్యం చేసామని చంకలు గుద్దుకుంటారు. ఇదండీ ఇక్కడి పోలీసుల ప్రతిభ.   

ఇహ ఏ దుండగుడో ఓ కాలేజీకి వెళ్ళి అక్కడి విద్యార్ధులని పిట్టలు కాల్చినట్లు కాలుస్తున్నాడంటే వెంటనె ఆ కాలేజీలోకి వెళ్ళి ఆ దుండగుడిని ఎదుర్కుంటే సమర్ధత ఎలా అవుద్దీ. ఎంచక్కా ఆ కాలేజీ చుట్టూ పెరిమీటర్ ఏర్పాటు చేసి తమకంటే పెద్ద పోలీసుల కోసం ఎదురుచూస్తుంటారు. మరి ఆ ఘనత వహించిన సెషల్ పోలీసులు పక్క సందులోనే వుండరు కదా, వాళ్ళు ఓ అరగంట తరువాత ఆయాసంగా వచ్చి లోపలికి వెళ్ళి ఆ దుండగుడిని కాల్చేస్తారు. ఈ లోగా మనవాడు ఎంచక్కా ఇంకో ఎనభయి మందిని కాల్చి చంపివుంటాడు.  

ఈ సంఘటన దాదాపు ఓ పదేళ్ళ క్రితం కొలరాడాలోని కొలంబైన్ స్కూలులో జరిగింది. తరువాత తాపీగా పోలీసులు నాలిక కొరుక్కొని వాళ్ళ విధానలు సమీక్షిస్తామన్నారు. సరేలే అలానన్నా ఈ దేశ పోలీసులు తమ విధానాలని సమీక్షించుకున్నారేమో అనుకున్నాను. అంతత్వరగా విధానాలు మారితే అమెరికా ఎందుకవుతుంది? ఎన్ని చర్చలు జరగాలీ, ఎన్ని మీటింగులు జరగాలీ. ఇండియాలోనేమో అలసత్వం, అవినీతి, లంచగొండితనం వల్ల పనులు లేటవుతే ఇక్కడేమో పనికిరాని మీటింగులూ, చర్చలూ, ప్రజాభిప్రాయ సేకరణలతో కాలం హరించుకుపోతుంది.

ఇక ఆ రేపులు,దహనాల సంగతి చూద్దాం. 2007లో ఇద్దరు మాజీ నేరస్థులకు డబ్బు ఇబ్బంది ఏర్పడి ఎవరినయినా దోచుకుందామని ఆలోచిస్తుంటే తల్లితండ్రులతో షాపింగు చేస్తున్న 11 ఏళ్ళ అమ్మాయి అందులో ఒకడికి నచ్చుతుంది. వారిని ఫాలో అయిపోయి వాళ్ళ ఇల్లు ఎక్కడ వుందో కనుక్కుంటారు. ఆ అర్ధరాత్రి వచ్చి కింద హాల్లో టివి చూస్తూ పడుకున్న తండ్రిని ఆ నిద్రలోనే బలంగా కర్రలాంటి దానితో బాదితే అతను అక్కడే స్పృహతప్పిపోతాడు. ఇద్దరూ పైన బెడ్ రూములలోకి వెళ్ళి తల్లినీ, అమ్మాయిలనీ మంచానికి కట్టేసి డబ్బుల కోసం ఇల్లంతా వెతుకుతారు కానీ ఎక్కువగా దొరకవు. దాంతో ప్లాన్ మార్చేస్తారు. తెల్లవారి బ్యాంకు సమయం అయేంతవరకూ వాళ్ళిద్దరూ బీర్లు తాగుతూ కాలక్షేపం చేసి తల్లిని తీసుకొని ఒకడు బ్యాంకుకి వెళ్ళి బయట నిలబడతాడు. తల్లి లోపటికి వెళ్ళి 15,000 డాలర్లు డ్రా చేస్తూ బయటవున్న దుండగుడికి అనుమానం రాకుండా టెల్లరుతో నెమ్మదిగా పరిస్థితి   వివరిస్తుంది. అదంతా కూడా సిసిటివిలో పడింది. ఆమె బ్యాంకు నుండి  బయటకి వెళ్ళే లోపుగానే   ఆ టెల్లర్ పోలీసులకి ఫోన్ చేసి పరిస్థితి తెలియజేస్తుంది.  వీళ్ళిద్దరూ బ్యాంకుకి వెళ్ళి వచ్చేలోపుగానే    ఇంట్లో వున్న వాడు అందులోని చిన్నమ్మాయిని బలాత్కారం చేసేస్తాడు. చిత్రం: బ్యాంక్ టెల్లరుకి తల్లి సమాచారం ఇస్తున్న దృశ్యం.

బ్యాంకు టెల్లరు ద్వారా విషయం తెలిసిన వెంటనే పోలీసులు వెళ్ళి ఇంటిచుట్టూ పెరిమీటర్ ఏర్పాటుచేసి ఆ ఇంటిని దూరం నుండి గమనిస్తుంటారు. ఇంటి బయట రేపులు గట్రా ఏమీ జరుగుతుండకపోవడంతో ఊపిరిపీల్చుకుని హాయిగా అలాగే కాలక్షేపం చేస్తుంటారు. ఈలొగా తాపీగా అ ఇద్దరూ ఆ ముగ్గురినీ పలు మార్లు రేపులు చేసి వారు బ్రతికివుండగానే పెట్రోలు చల్లి తగలబెట్టి బయటకి వచ్చి ఆ ఇంటివాళ్ళ కారులో వెళుతూ రెండు పోలీసు కార్లకి గుద్ది దొరికిపోతారు. ఈలోగా ఇల్లు మంటల్లో చిక్కుకుంటుంది. కింద వున్న తండ్రికి మెలకువ వచ్చి గాయాలతో, రక్తం కారుతుండగా పాక్కుంటూ, పాక్కుంటూ పక్కింటికి వెళ్ళి వారి సహాయం తీసుకుంటాడు.

వారిద్దరి మీద విచారణ జరిగి గతవారమే ఒకనికి శిక్షపడింది. మరొకడిని ఇంకా విచారిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం పై తండ్రి కోర్టులో కేసు వేస్తున్నాడు కానీ ఇప్పటికీ సిగ్గు లేకుండా తాము సరిగానే వ్యవరించామని ఆ పోలీసు పెద్దలు సమర్ధించుకుంటున్నారు.

గమనిక: అందరు అమెరికా పోలీసులూ ఇలాంటివారే అన్నది నా ఉద్దేశ్యం కాదు. ఈ సంఘటణల్లోని పోలీసులు మాత్రం అతితెలివితో ప్రవర్తించారనేది నా అభిప్రాయం.

నేను మేధావినెట్లయిత?

సాయంత్రం పనిలేక నా ఎడమ(కాలు) మోకాలును గోకుతుంటే ఓ ధర్మసందేహం వచ్చి పడింది. నేను మేధావిని కానా, అవునా అనీనూ. ఓ అనుమానం అంటూ వచ్చాక దానిని పెనుభూతం చెయ్యకపోతే నా కుడికాలి మోకాలు ఊరుకోదుకదా. అలాగే చేసిందీ. మరి మేధావిని అనిపించుకోవడానికి నాకేం అర్హతలు వున్నాయో నా కోడి మెదడుకు వున్న లేశ మాత్రం తార్కిక జ్ఞానంతో ఏమాత్రం అభిజాత్యాలు లేకుండా విశ్లేషణ ప్రారంభించాను.

ముందు ఓ మేధావికి వుండే లక్షణాలు ఏంటో ఓ లిస్టెసా.

1. గొప్పగొప్ప పుస్తకాలు చదవవలయును. ఇంతవరకు అందరు మేధవులు ప్రస్థావించే ఆల్కమిస్టో లేక అయాన్ రాండో ఇంతవరకూ చదవలేదు. యండమూరిని చదివినందువల్ల ఆ అయాను ఆయన కాదనీ, ఆమె అనీ మా గొప్ప GK మాత్రం వచ్చేసింది. మన లెవలుకి అదే గొప్ప అనుకొనీ మరీ గొప్ప గొప్ప పుస్తకాలు చదివితే బుర్రలో ఒత్తొత్తుగవుతుందనీ మానేసా. అసలే మనం చదివే సంస్కృత సాహిత్యం వేరాయె. అలాంటి నన్ను మేధావి అని పేర్కొనడానికి ఏ మేధావి అయినా ముందుకు వస్తాడా ఏంటీ!
 
2. గొప్ప గొప్ప సినిమాలు చూసి అవసరం వున్నా లేకపోయినా ఉదహరించవలయును. మనకు ఆ ఆ అలాంటి వీడియోలు చూట్టానికే సమయం సరిపోవడం లేదు. ఇంకా మా గొప్ప సినిమాలు ఏం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను మేధావిగా డిక్లేర్ చేసుకుంటే మిగతా మేధావులంతా గింజుకు ఛస్తారు కాదో.
 
3. చిరుగడ్డం అయినా వుండాలి.  AP media రాము గారిలా చిరుగడ్డం అయినా పెంచుదామంటే అది తెల్లగడ్డం అయేలా వుంది. మా ఆవిడ నా బుర్రకి రంగెయ్యడానికి ఓకే అంటుంది కానీ పిల్లి గడ్డానికీ రంగెయ్యమంటే పీకి పడేస్తుందెమోనని భయం. మనకేమో ఇతరులకి కలరింగ్ కొట్టడం తెలుసుకానీ స్వంత బుర్రకాయకి రంగు పెడెయ్యడం తెలియదాయె.    
 
4. తెల్లజుట్టు: ఇదివరకులా కాకుండా ఈకాలంలో అందరూ రంగేసుకుంటున్నారు కాబట్టి అలా గుర్తించడం కష్టమే. పోనీ అలా కానిచ్చేద్దామన్నా ఏదో అక్కడక్కడ కొద్దిగా తప్ప నా జుట్టు తెల్లబడలేదు. జుట్టు తెల్లబడుతుంటే నెమ్మదిగా మేధావినవుతున్నాని సంబరం అవుతుంటుంది కానీ మా ఆవిడకి నామీద అసూయ. అందుకే నన్ను బరబరా బాత్‌రూమికి లాక్కువెళ్ళి వున్న రెండు తెల్లెంట్రుకలకు కూడా రంగేస్తుంది. నేను నా మేధావితనమంతా రంగుపాలవుతోంది అని లబలబలాడినా వినిపించుకుంటుంది కాదు :( సొ, అలా కూడా నాకు మేధావి నయ్యే అవకాశం మిస్సవుతోంది.    
 
సోడాబుడ్డి కళ్ళద్దాలు: అందుకు నాకు సైటు వుండి అర్హత వుంది కానీ మా ఆవిడ పడనిస్తుందా ఏమిటీ? ఆ సోడాబుడ్డి కళ్ళద్దాలన్నా వుండాలి నేనన్నా వుండాలి, ఏది కావాలో తేల్చుకో అని ఛాలెంజులు చెయ్యదూ. మరి నాకేమో నిజం చెప్పే ధైర్యం లేదాయె. నిజం నిష్టూరమే కాకుండా ఏ అప్పడాలకర్రకో ఇష్టం అయిపోగలదు. ఈ బ్రతుక్కి అంత రిస్క్ అవసరమా చెప్పండి? అందుకే నాకు ఆ ఛాయిసూ లేదు.

ప్రస్తుతానికి ఇంకా వేరే మేధావి లక్షణాలు గుర్తుకురావడంలేదు. ఇంకేమన్నా వుంటే మీరే గుర్తుకుచెయ్యండేం. ఎనీ వే, మొత్తానికి నేను మేధావిని ఎంత మాత్రమూ కాదని డిసైడు చేసేసా. మీకు ఓ సినీ సామెత తెలుసనుకుంటాను - నన్ను కవిని కాదన్నవాడిని రాయొచ్చుకు కొడతా అనెది. ఇప్పుడు అర్జంటుగా మనకు రాళ్ళెక్కడ దొరుకుతాయి కానీ మరో రకంగా అడ్జస్టు అయిపోదాము. కామెంట్లు, ఇంకా అజ్ఞాత కామెంట్లు సెడ్డ సీపు కాబట్టి నేను కవిని కాదన్నవాడిని కామెంటిచ్చుకొని కొడతా అని ఆ సినీ సామెతకి సవరణ చేసేద్దాం. అలాగే నన్ను మేధావి అన్న వాడిని కామెంటిచ్చుకొని కొడతా మరి.   

అన్నట్లు మేతావుల జోలికి ఈ టపాలో వెళ్ళలేదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

బ్లాగుల కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నా!

ఇదో నిద్రరాని, పొద్దుపోని టపా. బాగోలేకపోతే బాగోలేదని చెప్పకండి.

ఇంతకుముందే బ్లాగుల్లో ఎవరో  ఖలేజాని కకావికలు చేసి వ్రాసిన సమీక్ష చూసాను. ఎవరిదంటే ఏం చెప్పనూ, ఓ బోలెడంత మంది వ్రాస్తున్నారు. అందులో ఓ మాట నచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్ బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడంట. సంతోషం. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అదేంటని అడగరేం. టైటిల్లోనే మీకు తెలిసిపోయిందనుకుంటా.

ఈమధ్య బాడీ లాంగ్వేజుల నస కాస్త తక్కువయ్యింది కానీ ఆ మధ్య ప్రతీ అడ్డమయిన హీరో కూడా ఫలానా సినిమా కోసం ఓ బ్రహ్మాండంగా బాడీ లాంగ్వేజ్ మారుస్తున్నానని ఓ తెగ ఊదరకొట్టేవారు. అబ్బో ఎంత మార్చాడో అని సినిమాకి వెళితే కుప్పిగంతులు తప్ప, ఓ ఊగిపోవడం తప్ప వేరే ఏమీ వుండేది కాదు.

ఛత్ బాడీ లాంగ్వేజీలు ఒఖ్ఖ సినిమావోళ్ళకేనా బ్లాగర్లకు వద్దా అనేసి అనిపించి ఆ అన్యాయాన్ని వెంటనే ఖండించాను. అప్పుడు నా నాలుక కొంచెం కరచుకున్నాను. ఫర్వాలేదు - మీరు సంతాపాలు తెలుపొచ్చు. ఎలాగయినా తెలుగు బ్లాగర్ల ఇజ్జత్ కాపాడాలనీ, బ్లాగుల్లో బాడీ లాంగ్వేజీ మొదలుపెట్టి సమస్త బ్లాగర్లకీ రోలు మోడలుగా అయిపోవాలనీ కంకణం కట్టేసా.

కంకణం అయితే కట్టుకున్నాను కానీ నిద్రమత్తులో వ్రాస్తున్నందువల్ల మాంఛి ఈడియాలు ఏమీ రావడం లేదు. అయినా దీనికోసం నేనొక్కడినే ఎందుకు కష్టపడాలని అనిపించింది. అందుకే కంకణం కట్టుకునే బాధ్యత నాదీనూ, సలహాలు ఇచ్చే బాధ్యత మీదీనూ. సరే, ఇక నిద్రొస్తోంది, బ్లాగుసేవ రేపు మళ్ళీ చేసుకుంటా కానీ అందాకా ఈ కంకణం గోడకు వున్న సీలకు తగిలిస్తా. శుభరాత్రి.

ఫన్నీ ఫణిబాబు గారు

ఇండియాలో తెలుగు నడక కార్యక్రమానికి ఫణిబాబు గారు వస్తారని నాకు ముందే AP మీడియా రాము గారు చెప్పారు. వారు ఆ కార్యక్రమానికి రావడం, రాము గారితోనూ, ఇతరులతో మాట్లాడుతుండటం అప్పుడు గమనిస్తూనే వున్నాను కానీ వారితో మాట్లాడటానికి తీరిక దొరకలేదు.

నడక అంతా అయిపోయిన తరువాత పివి జ్ఞానభూమి వద్ద సన్న వర్షం పడుతుంటే ఫణి గారూ, మా అల్లుడు రవీ ఒక దగ్గర షెల్టర్ తీసుకున్నారు. వారిని నేను గుర్తించాను కానీ వారు నన్ను గుర్తించారో లేదో అని నా గురించి వారికి చెప్పమని సైగల ద్వారా రవికి చెప్పాను. అప్పుడు వారు నాకేసి నవ్వుతూ చూసి ఆల్రెడీ గుర్తుపట్టానన్నట్లుగా సైగ చేసారు. తరువాత వారితో మాట్లాడటానికి సమయం చిక్కింది. మీరు ఏమనుకోకండీ - సరదాగా అంటున్నాను - మీరు పెద్ద పెద్ద విషయాలు వ్రాస్తారు - చూడటానికి పిట్టంత వున్నారే అని అన్నారు. అందరూ ఇలా అనుకుంటారనే 'పేరు గొప్ప - ఊరు దిబ్బ' అనే టపా వ్రాసాను. అయితే ఆ టపా వారు చదవనట్లున్నారు. పిట్ట కొంచెం - కూత ఘనం టైపు లెండి మనం అని సరదాగా అన్నాను.  

నిజానికి వారి ఫోటో నేను చూసి, గంభీరంగా పెట్టిన ఫేసూ చూసీ, చాలా భారీ విగ్రహం అని తలచి వారేదో ఆర్మీలో కల్నల్ గా పనిచేసి రిటైరయిన వారిలా వుంటారేమో అనుకున్నాను. అంతలేదు - అంత భారీ విగ్రహం కాదు :) ఆ విషయం అప్పుడే చెప్పి కౌంటర్ ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదు :)) అందుకే ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నాను!

అలా మేమిద్దరమూ ఆ సన్నటి వానలోనే తడుస్తూ బ్లాగాభిరామాయణం మాట్లాడుకున్నాం.  ఆ మాటల్లోనే వారు నెలకొల్పిన ఇంటింటికీ పుస్తకాలు అందించే పుస్తకాలయం మరియి వెబ్‌సైటు గురించి తెలిపారు. వారు పూణేలో వుంటారు కాబట్టి అది పూణే తెలుగు వాస్తవ్యులకు మాత్రమే ఉపయోగకరంగా వుంటుంది. నెలకు కొంత రుసుము కడితే ఎప్పుడూ రెండు పుస్తకాలు పోస్టులో తెప్పించుకుంటూ, ఇచ్చివేయవచ్చు. సైటులోకి వెళ్ళి దానికోసం సభ్యత్వం తీసుకోవడమూ, అలాగే తదుపరి మీకు ఏం పుస్తకాలు కావాలో సూచించడమూ చేయవచ్చు. ఎవరయినా పూణే వాస్తవ్యులు కనుక ఇది చదువుతున్నట్లయితే ఆ  సౌకర్యాన్ని ఉపయోగించుకోవడంపై ఆలోచించగలరు. 

వివరాలు: 
Phone: +91 9325508220

ఆ తరువాత ఆ చినుకుల్లో మేమందరం వేడివేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సుజాత గారు  "ఈ నడక కోసం పూణే అంత దూరం నుండి ఫణి బాబు గారు వచ్చారు" అని అంటే నేను సప్త సముద్రాలు దాటి వచ్చాను దీని కోసం అని ఫణి గారితో నేను పోటీ పడ్డాను. అవును కదా, మీరే ఎక్కువ దూరం నుండి వచ్చారు కదూ అన్నారు సుజాత గారు. అయితే ఫణిబాబుగారు ఆ నడక కోసం ప్రత్యేకంగా పూణే నుండి వస్తే నేనేమో ఎలాగూ ఇండియా వచ్చాను కాబట్టి పాల్గొనగలిగాను. సో, ఫణిబాబు గారే గ్రేట్ కదా.

ఖలేజా ఫస్ట్ రిపోర్ట్

... గ్రేట్ ఆంధ్రాలో వచ్చింది. నిజమో కాదో గానీ స్టొరీ లైన్ కొంతవరకు అవతార్ లా వుంది.
 
http://greatandhra.com/ganews/viewnews.php?id=24078&cat=1&scat=4

వీవెనుడి నవ్వందం

నవ్వు + అందం = నవ్వందం - సువర్ణ దీర్ఘ సంధి.
నిజానికి 'స'వర్ణదీర్ఘ సంధి వుంటుంది కానీ 'సు'వర్ణదీర్ఘ సంధి అంటూవుండదు. 8,9 తరగతుల్లో సంధులు చెప్పమంటే పొరపాటున మా క్లాసుమేటు పేరు సువర్ణ కలిపి అలా చెబితే క్లాసు అంతా ఘొల్లున నవ్వేది. సంధుల మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రతీదాన్నీ సువర్ణదీర్ఘ సంధి అంటుంటాను. పైది కూడా అలాంటిదే. 

సరే అసలు విషయానికి వద్దాం. కూడలి నిర్వాహకులు వీవెన్ అందరికీ సుపరిచితమే కదా. వారి ఫోటో తొలిసారి ఏదో పత్రికలో చూసాననుకుంటా. ఆ ఫోటో అంత బావోలేదు. ఆదిమ మానవుడికి దగ్గర్లో వున్నారు ఆ ఫోటోలో. ఆ తరువాత కూడా వేరే ఫోటో లేనట్లు అదే ఫోటో మళ్ళీ పత్రికల్లో రిపీట్ అయ్యింది. ఈ-తెలుగు గ్రూపు ఫోటోల్లో చూస్తుండేవాడిని కానీ గుంపులో గొవిందాలాగా వుండేవారు.

కొంతకాలం తరువాత ఒకసారి వారికి ఫోను చేసి మాట్లాడాను. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లుగా ముక్తసరిగా, పొడిపొడిగా మాట్లాడారు. కూడలి నిర్వాహకులు కదా బాగానే అనర్గళంగా మాట్లాడుతారేమో అనుకున్న నాకు అసంతృప్తి కలిగింది. అలా మాట్లాడేవారితో ఎక్కువసేపు ఏం మాట్లాడుతాం. మాట్లాడాల్సింది మాట్లాడి ఫోన్ పెట్టేసాను. కొన్ని సార్లు మామధ్య ఈమెయిళ్ళు నడిచినా అవికూడా క్లుప్తంగానే వుంటుండేవి. 

ఇండియాలో జరిగిన తెలుగుబాట కార్యక్రమంలో వారిని కలిసే అవకాశం దొరికింది. బాగానే వున్నారే, ఫోటోల్లో అలా పడ్డారేంటీ అనుకున్నాను. ఈ-తెలుగు వారి కొత్త తెల్ల టీషర్ట్ వేసుకొని వున్నారు కాబట్టి కూడా ఫోటోల్లోకంటే చక్కగా అనిపించారు. వారిది ఫోటోజెనిక్ ఫేస్ అయ్యుండకపోవచ్చు అని అనుకున్నాను. వారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆ కార్యక్రమంలో అక్కడక్కడా క్లుప్తంగానే  మాట్లాడుకోగలిగినా ఆ కాస్సేపూ చక్కగా మాట్లాడుకున్నాం.   వారి నవ్వు నచ్చింది నాకు. చక్కగా నవ్వుతారు వారు. అంటే వారు నవ్వితే వచ్చే ధ్వని బావుంటుంది. వారితో ఎక్కువసేపు మాట్లాడ లేకపోయాను కాబట్టి, వేరే విశేషాలు ఏమీ లేవు కాబట్టి వారి గురించి ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను. 

తలనొప్పిగా వుంది బాస్

నిన్న సాయంత్రం ఒక  మీటప్ కి వెళ్ళాను. అక్కడ సెర్వర్ డ్రింక్స్ ఏమయినా కావాలా అని అడిగితే ఫ్రూట్ జ్యూస్ ఏమున్నాయి అని అడిగాను. నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి నాకేసి విచిత్రంగా చూసినట్లు అనిపించింది. ఓ, అలా పళ్ళ రసాలు తాగడం ఈ మీటింగుల్లో సభ్యత కాదేమోనని ఎందుకయినా మంచిదని ఓ హనికెన్ బీర్ అర్డర్ చేసాను. అది తాగినప్పుడు బాగానే వుంది కానీ ఇంటికి వచ్చాక తలనొప్పి పట్టుకుంది.

ఇదివరలో గజతాగుబోతును కాకపోయినా చిరుతాగుబోతుగా వుండేవాడిని. ఇప్పుడు బీర్ కూడా హరాయించుకోలేకపోతున్నానా అనిపిస్తోంది. బహుశా నేను వాడే మెడిసిన్ కీ, ఆల్కాహాలుకీ పడక తలనొప్పి వచ్చి వుంటుంది. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరం కాకపోయినా వాడకపోవడం మంచిది అని సూచన వుంటుంది.

ఇంకా తలనొప్పి పూర్తిగా తగ్గలేదు కానీ నెమ్మదిగా తగ్గుతున్నట్లుంది. ఇవాళ జయ, మధు మరియు సుమంత్ మాట్లాడి వారి వ్యవహారం సెటిల్ చెయ్యాల్సివుంది కానీ ఈ తలనొప్పితో వాళ్లతో ఏం మాట్లాడగలను? అసలే మా సుమంత్ చెప్పిందే చెప్పి, సాగదీసి, సాగదీసి బేజా ఫ్రై చేస్తాడు. ఇవాళ ఒక ప్రత్యేకమయిన టపా వ్రాయాల్సివుంది కానీ అదీ వాయిదా వేస్తాను.

నాది మామూలు తలనొప్పేకానీ నాకేం సంతాప సందేశాలు పంపించకండి, ఏం.

ఆ కథ ఈ మలుపు తిరిగింది

రియాలిటీ బ్లాగింగ్ ఈ సమస్య మీద చేస్తూ ఎప్పటికప్పుడు మీకు తాజా వివరాలు అందిస్తూవుంటాను.

ముందు ఇది చదవండి, తరువాత ఇది చదవండి.

జయ భర్త పేరు మధు అనుకుందాం. నిన్న మధు నాకు ఇండియా నుండి ఫోన్ చేసాడు. అతని దగ్గరి నుండి ఫోన్ రావడం ఊహించలేదు నేను. తను నాకు ఫోను చెయ్యడం ఇదే ప్రధమం.  తన బావమరిది మరణించాడు కదా, దాని గురించి అయివుంటుంది అనుకున్నాను కానీ కాదు. సుమంతుతో విసిగిపోయాననీ, వాళ్ళిద్దరూ బయట యధేఛ్ఛగా తిరుగుతుంటే పరువు మంట కలుస్తున్నదనీ, ఇంతవరకూ ఆగాను కానీ ఇక ఓపిక పట్టననీ చెప్పుకువచ్చాడు. అతడి పరువునూ బజారుకి ఈడుస్తాననీ ఇంకా ఏవేవో చెప్పుకువచ్చాడు. 2GB ల ఫోను మాటలు రికార్డు చేసాననీ అవన్నీ బయటపెట్టి సర్వ నాశనం చేస్తాననీ చెప్పాడు. చివరి సారిగా మీతో ఈ ప్రయత్నం చేస్తున్నాననీ ఇప్పుడు కూడా ఇక వినకపోతే తాను చచ్చినా బ్రతికినా అవన్నీ బయటపెట్టే ఏర్పాట్లు చేసాననీ చెప్పాడు. భార్య జయతో కూడా మాట్లాడించాడు. సమస్యలు ఉధృతమవుతున్నాయి కనుక సుమంతుని ఇక కలవద్దని చెప్పమంది. అసలే తమ్ముడు చనిపోయిన బాధలో వుంటే మళ్ళీ ఈ సమస్యలు భరించలేను అంది. సుమంతుతో మాట్లాడి చెబుతానని, అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాననీ చెప్పాను.
 
ఇవాళ సుమంతుతో మాట్లాడాను. మధు బెదిరింపులన్నీ చెబుతూ నీకు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అయ్యే పరిస్థితి వుందని హెచ్చరించాను. మధు అలా చేస్తే నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటా అని డాంబికాలు పలికినా నెమ్మదిగా పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో జయ విడాకులు తీసుకొని ఆ ఇంట్లోంచి బయటపడటమే ఉత్తమమని చెబితే అతను కూడా కన్విన్స్ అయ్యాడు. తమని మధుని అర్ధం చేసుకోవాల్సిందిగా వీలయినంతవరకు ఒప్పించమనీ, అది కుదరకపోతే అతనితో జయ విడాకులు తీసుకోవడమే దారి అని నాకు చెప్పాడు.

మధు మనస్సు ఎందుకు ఇంతగా అకస్మాత్తుగా విరిగిందో చెప్పాడు. శ్రీను భౌతిక కాయాన్ని మేము వచ్చేంతవరకు ఆగకుండా 12 గంటలలోపే మధు దహనం చేయించాడని, వస్తూ, వస్తూ ఎన్నిసార్లు ఫోను చేసినా మధు ఎత్తలేదనీ చెప్పాడు. అక్కడికి వెళ్ళాక శవదహనం వాళ్ళకోసం ఆపనందుకు మధుతో గొడవపడ్డాడంట. శ్రీను చివరి ఘడియల్లో ఎంతో సహాయం చేసాననీ, దగ్గర వుండి చూసుకున్నా అనీ, మధు ఏ విధంగానూ సహాయపడలేదనీ, అతని వల్ల ఇప్పుడు దహనం ముందు మిత్రుడిని చూసుకోకుండా అయ్యిందని నా దగ్గర వాపోయాడు.

మళ్ళీ మధుకి ఫోన్ చేసి సుమంత్ స్టాండ్ చెప్పాను. సుమంతుకి ఏది వీలయితే అది చేసుకొమ్మనమని చెప్పాడు. తాను మాత్రం తగ్గేది లేదన్నాడు. అంతదూరం ఈ కొట్లాటలు, గొడవలు ఎందుకుగానీ వారిద్దరినీ కొద్దిగా అర్ధం చేసుకొని వదిలెయ్యండీ అని చెప్పాగానీ ససేమిరా కుదరదన్నాడు. మరి జయ మీకు విడాకులు ఇస్తే ఓకేనా అని అడిగాను. విడాకులు కావాలంటే ఇస్తాననీ, అదే పద్ధతిగా వుంటుందని అన్నాడు. సుమంత్ మీద అంత ఇష్టం వున్నప్పుడు జయ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పాడు. 

జయతో మాట్లాడాను. మొగుడూ, లవరూ ఇద్దరూ తగ్గేట్లుగా లేరనీ, సమస్యలు ఉధృతమయేటట్లు వున్నాయనీ ఇద్దరం అవగాహనకు వచ్చాం. అలాంటప్పుడు తను పద్ధతిగా విడాకులు తీసుకొని బయటకి వెళ్ళడమే ఉత్తమమని చెప్పాను. అంత ధైర్యం తాను చెయ్యలేనన్నది. పిరికివారికి ప్రేమించే హక్కు వుండదన్నాను. తాను పిరికిదానినే అని తన ఇబ్బందులు చెప్పుకువచ్చింది. తను బయటకి వస్తే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయనీ, సుమంత్ కుటుంబం, అతని ఇద్దరు ఆడపిల్లలూ ఇబ్బందులు పడతారనీ చెప్పింది. ఇప్పుడు తమ్ముడు శ్రీను యొక్క ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల బాధ్యత కూడా తన మీదే పడ్డదనీ చెప్పింది. అలాగే తన ఇద్దరు అబ్బాయిలు కూడా ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఇంతమందికి ఇబ్బంది పెట్టి, ఈ వయసులో అంత సాహసం చేయలేననీ, తన ఆరోగ్యం కూడా బావుండటం లేదనీ, దానికి బదులుగా సుమంత్ మీద వున్న తన ప్రేమని చంపేసుకుంటాననీ చెప్పింది. 

తాను భర్తతో ఎందుకు నాకు ఫోన్ చేయించిందో కూడా చెప్పింది. కొన్ని నెలల క్రితం ఆమెతో ఫోనులో నేను మాట్లాడినప్పుడు ఇటు భర్త వినకా, అటు లవరూ వినకా ఈ మనోవేదనతో చావాలనిపిస్తోందని చెప్పుకువచ్చింది.  మరీ పరిస్థితి అంత దూరం వెళితే నాకు చెప్పకుండా ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పి మాట తీసుకున్నాను. ఆ మాట ఇప్పుడు గుర్తుకుచేసి అందుకే మీతో మాట్లాడాలనుకున్నాననీ, పరిస్థితులు బాగా విషమించాయనీ,  ఇప్పుడు సుమంతు నేను విడిపోవాల్సిందేననీ,  మీ ఫ్రెండు మీరు చెబితే వింటాడనీ, ఎలాగయినా సుమంతుని ఇక తనతో కాంటాక్ట్స్ పెట్టుకోకుండా కన్విన్స్ చేయమనీ ప్రాధేయపూర్వకంగా చెప్పింది.

రేపు సుమంతుకి ఫోన్ చేసి, పరిస్థితిని అంతా అర్ధం చేయించి ఇక మీకు దూరంగా వుండమని, మీ ప్రేమని దూరం చేసుకొమ్మని వీలయినంతగా కన్విన్స్ చేస్తాననీ జయకు హామీ ఇచ్చాను. రేపు సుమంతుతో మాట్లాడి మళ్ళీ అప్‌డేట్ ఇస్తా అన్నాను.

పిరికివారికి ప్రేమించే హక్కు లేదు. ఆ సంగతి జయ బాగానే అర్ధం చేసుకున్నది కాబట్టి ఇక సుమంతుకి కూడా నచ్చజెప్పి వారిద్దరిని దూరం చెయ్యడమే నా ముందున్న కర్తవ్యం. మరి నేను చెప్పింది వింటాడా వినడా, విన్నా ఎన్ని రోజులు వింటాడు, వినకపోతే తదుపరి పర్యవసనాలు ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం. మీకు ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ ఇస్తూనేవుంటాను.  

ఓ మిత్రుడి మరణం

తను కుర్రాడుగా వున్నప్పటి నుండీ అతను పరిచయం. వాళ్ళక్కయ్య పెళ్ళికి వారి ఊరు వెళ్ళాం. అక్కడ పరిచయం. తన చిన్నక్కని నా మిత్రుడొకడు ప్రేమిస్తుండేవాడు. వాళ్ళ ప్రేమకి ఇతను సహకరిస్తూవుండేవాడు. సూర్యాపేటకి వచ్చినప్పుడల్లా ఇతను నన్ను కలుస్తుండటంతో మా మధ్య మంచి స్నేహం కుదిరింది. వాళ్ళ అక్క పెళ్ళి మా స్నేహితునితో కాకుండా వేరే అతనితో జరిగిపోవడంతో మా స్నేహంలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నేను పై చదువుల కోసమని పూణే వెళ్లడం, ఆ తరువాత కెనడా వచ్చేయడంతో ఆ తరువాత అతనిని కలవలేదు.

అతని పేరు శ్రీనివాసు. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు శ్రీనివాస్ కలిసాడని నా మిత్రుడు చెప్పాడు. అప్పుడతను ఖమ్మంలో వుంటుండేవాడు. ఖమ్మం వెళ్ళినప్పుడు ముగ్గురం అక్కడ కలుసుకొన్నాం. ఎంతో పెద్దయిపోయాడు తను. అప్పట్లో కుర్రాడిలా వుండేవాడు. ఇప్పుడు చూస్తే పెద్ద శరీరం, బట్టతల, ముదురు మొఖం, దర్జా, డాబుసరీ, ఓ కొత్త కారూనూ. అతడిని చూసి అతనేనని నమ్మలేకపోయాను. రియల్ ఎస్టేటులో వున్నాడంట, బాగా సంపాదించానని చెప్పాడు. చాలా కాలం తరువాత కలిసాము కాబట్టి చాలా సంతోషంగా పాత రోజులను గుర్తుకుతెచ్చుకున్నాము.  

అయితే తరువాత మాటల ద్వారా తెలిసిందేమిటంటే డబ్బుతో పాటూ చెక్కెర వ్యాధి కూడా బాగానే కూడబెట్టాడని. నాకు వాటి అంకెలు సరిగ్గా తెలియవు కానీ 450 అనుకుంటా. దానికోసం రోజూ ఇంజెక్షన్లు వేసుకుంటానని చెప్పాడు. మాకంటే చిన్నవాడికి ఈ ఇబ్బంది ఏమిటా అనుకున్నాను. పార్టీలో మందు బాగానే లాగించాడు. ఆరోగ్యానికి మంచిది కాదు కదా అంటే అది అదే, ఇది ఇదే అన్నాడు. హ్మ్ అనుకున్నాను.  ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇద్దరు కూతుర్లని మాకు పరిచయం చేసాడు. పిల్లలు ఇద్దరూ ముద్దుగా వున్నారు. వారిద్దరికీ చాలా చక్కటి పేర్లు పెట్టాడు. శర్మిష్ఠ అనుకుంటా పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు గుర్తుకులేదు. అప్పట్లో నేను నవలలు వ్రాసేవాడిని కాబట్టి పేర్లు భలే బావున్నాయని, నా నవలల్లో వాడొచ్చని నోట్ చేసుకున్నాను.    అప్పుడు వాళ్ళు 6, 7 తరగతులు చదువుతున్నారనుకుంటాను. 

ఇండియా నుండి నేను తిరిగివచ్చాక శ్రీను గురించి సుమంత్ అప్‌డేట్స్ ఇస్తూవుండేవాడు. తను సూర్యాపేటకే ఇల్లు మార్చాడనీ, రియల్ ఎస్టేటులో దివాళా తీసాడనీ, అప్పుల పాలయ్యాడనీ, మందు తాగడం ఎక్కువయ్యిందనీ తెలుస్తుండేది. నాలుగేళ్ళ తరువాత మొన్నటిసారి మళ్ళీ ఇండియా వెళ్ళాను కదా. సూర్యాపేటకి ఒక రోజు వెళ్ళాను. సుమంత్ సమస్య ఒకటి మాట్లాడటానికి శ్రీను ఇంటికే వెళ్ళాము. శ్రీను బయటకి వెళ్ళాడంట. అతని భార్య వుంది. ఆమెతో కొన్ని సార్లు ఫోనులో మాట్లాడినా చూడటం అదే ప్రధమం. జయ అప్పటికే అక్కడికి వచ్చేసి వుంది. అక్కడ నేను వెలగబెట్టిన పెద్దరికం మీరు చదివేవుంటారు. చదవకపోతే ఇక్కడ చదవండి.
 
అ రోజు రాఖీ రోజు. శ్రీను భార్య నాకు రాఖీ కట్టాలనుకుంటోంది కానీ తటపటాయిస్తోందని జయ చెప్పింది. నేను నాస్తికుడిని కాబట్టి ఈ సాంప్రదాయాలు నాకు ఇష్టం వుండకపోవచ్చునని వారి సందేహం. మా ఇంట్లో మాకు ఆ ఆచారం లేదు. నాకూ ధర్మసంకటమే ఎదురాయింది కానీ ఫర్వాలేదు అని చెప్పాను. ఆమె వచ్చి నాకూ, సుమంతుకీ రాఖీ కట్టింది. ఆ విధంగా ఆమెతొ నాకు చెల్లిలాంటి అనుబంధం ఏర్పడింది. మొదటినుండీ ఆమె ముఖంలో దైన్యాన్ని గమనిస్తూనే వున్నాను. తమ కుటుంబం, భర్తా అలా అయిపోతుంటే విచారం వుండదా మరి. ఎలా ఆమె సమస్యలని దూరం చేయాలో నాకు అంత అర్ధం కాలేదు కానీ ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలని అనిపించింది. 
 
శ్రీనివాస్ తరువాత మాకు బయట కలిసాడు. మనిషి దుక్కలా అలాగే వున్నాడు. ఇంత తాగుతున్నా, అంత శుగర్ వ్యాధీ, అన్నన్ని అప్పులు వున్నా మనిషి బాగానే నిభాయించుకువస్తున్నాడే అనుకున్నాను. శ్రీనుకీ, మా దూరపు చుట్టమయిన ఒక ఫ్రెండుకీ ఒక అడ్డా వుందిట. పొద్దున లేస్తే రాత్రి పడుకునేవరకు తాగడమే వారిద్దరి రోజువారీ ముఖ్యకర్తవ్యం అట. శ్రీను కాస్త తొణక్కుండా వున్నాడు కానీ మా చుట్టం ఓ ఊగిపోతూ నామీద ఎనలేని ఆప్యాయతా, గౌరవం కుమ్మరించాడు.   శ్రీనుని టవునుకు దూరంగా పచ్చని చేల మధ్యకు తీసుకువెళ్ళి ముచ్చటించాము. ఎలాగోలా అందరం కలిసి కొంత డబ్బు సర్దుబాటు చేస్తామనీ, ఆ డబ్బుతో అతని ఆర్ధిక సమస్యలనుండి ఎలాగ బయటపడేస్తామో చెప్పాము. మందు తాగడం తగ్గించి ఇకనయినా కుటుంబం పట్లా, ఎదిగిన పిల్లల పట్లా శ్రద్ధ చూపమని కోరాము. నేను సుమంత్ కొసమని తెచ్చిన జానీ వాకర్ విస్కీ తను గటగటా తాగేస్తూ సరే అన్నాడు!
 
అప్పుడు మాతో అమ్మలు కూడా వుంది. తనను చక్కగా ఆడించాడు. కథలూ, కబుర్లూ చెప్పాడు. పెసరకాయలు కావాలంటే చేనులోకి వెళ్ళి తెంపుకొనివచ్చి గింజలు వలిచి అమ్మలుకి తినిపించాడు. మళ్ళీ తనకి హితబోధ చేసి, అతనిని ఇంటి దగ్గర దింపేసి వీడ్కోలు తీసుకున్నాము. సుమంత్, నేను కలిసి అతనిని ఆ కష్టాలలోని ఎలా బయటపడెయ్యాలో స్కెచ్ వేసాము. ఇహనయినా తాగుడు తగ్గించి కుంటుంబం మీద శ్రద్ధపెడితే సహాయం చెయ్యొచ్చు కానీ ఇచ్చిన డబ్బులు మళ్ళీ తాగుడికే పెడితే ఎలాగబ్బా అనుకున్నాము. అలా కాకుండా డబ్బులు సరాసరి అప్పుల వాళ్ళకే ఇవ్వాలని అనుకున్నాము. అలా అలా అతని మంచికోసం కొన్ని వ్యూహాలు పన్నాము. 
 
నేను US కి వచ్చాక శ్రీనుకి చేస్తున్న సహాయ కార్యక్రమాలపై సుమంత్ నాకు అప్డేట్ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని ఇద్దరం సంతోషపడ్డాము.  కొన్ని వారాలుగా సుమంత్ కి ఫోను చెయ్యలేకపోయాను. శ్రీను నిన్న మరణించేడని ఇవాళ సుమత్ ఫోన్ చేసి చెప్పాడు. తాగుడు వ్యసనం మరియు హెచ్చు డయాబెటిస్ వల్ల ఆరోగ్యం విషమించిందంట. కామినేని హాస్పిటలుకి తీసుకువెళ్ళినా మా మిత్రుడు దక్కలేదంట. ఇప్పుడు అతని భార్యా, పిల్లల సంగతి ఎలానో ఏమో. అప్పులు తప్ప ఏమీ మిగిలించలేదు. డబ్బులు వెనకేసేబదులు తాగుడు వ్యసనంతో డబ్బులు ముందేసాడు. పెద్దమ్మాయి హైదరాబాదులో హాస్టల్లో వుండి ఇంటర్ మొదటి ఏడు చదువుతోంది. చిన్నమ్మాయి 10వ తరగతి అనుకుంటాను.    
 
మా మిత్రుడి మరణంపై రొటీన్ సంతాప వ్యాఖ్యలు వద్దు కానీ ఏదయినా ఇంకా చర్చించాలనుకుంటే వ్యాఖ్యానించండి.

నేను ముందుగా చూసే వెబ్‌సైట్లు

మీరు ఏ వరుసలో వెబ్‌సైట్లు చూస్తారో మీరు కూడా చెప్పండేం. నేను ఏవయినా మంచివి మిస్సయితే మీనుండి తెలుసుకుంటాను. నేను అయితే సాధారణంగా హాట్‌మెయిల్ ఓపెన్ చేసి ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకుంటాను. నా పర్సనల్ సిస్టంలో అయితే హారం సంకలిని హోం పేజీగా వుంటుంది కాబట్టి ముందు అది ప్రత్యక్షం అవుతుంది. కానీ అది పక్కన పెట్టేసి మెయిల్స్ చూసుకొని మళ్ళీ హారంకి వస్తాను. ఆసక్తి, తీరిక వుంటే అప్పుడే హారం వ్యాఖ్యలని కూడా చూస్తాను.

ఆ తరువాత గ్రేట్ఆంధ్రా. అది అంత గొప్ప సైటు కాదుగానీ తెలుగులో అంతకంటే వేరే పోర్టల్ నాకు నచ్చదు కాబట్టి అందులొనే నాకు నచ్చినవి ఏరుకొని చూస్తుంటాను. ఆ తరువాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, CNN, BBC, Toronto Star వార్తల సైట్లు చూస్తాను. ఇవన్నీ అయిపోయాక కూడా తీరిక వుంటే మరియు నేను ఇంటిదగ్గరే వుంటే నాకు నచ్చే ఆ, ఆ టైపు సైట్లు కొన్ని చూస్తాను.   

ఇహ మీ లిస్టు చెప్పండి మరి.

ఈ మంగళవారం నాది

ఈ మంగళవారం సాయంత్రం ఓ కొత్త జీవన శైలి తలుపులు తట్టబోతున్నాను. ఆ శైలి గురించి గత దశాబ్దంగా తెలిసివున్నా కేవలం దానిపై మరింత సమాచారం తవ్వడం, వర్చ్యువలుగా ఆనందించడమే జరిగింది కానీ ప్రాక్టికలుగా ఎప్పుడూ పాల్గొనలేదు. రకరకాల కారణాల వల్ల ఇప్పుడు నిజ జీవితంలో ఆ లైంగిక విధానాలకు, ఆ లైంగిక జీవన శైలికి దాసోహం కావాలని నిర్ణయించుకున్నాను.

నేను అనుకున్నట్టుగా ఈ జీవితం కొనసాగితే నాకు ఆ పరంగా రెండో ఇన్నింగ్స్ మొదలయినట్లే. అయితే కొంతకాలం క్రితం ఎల్జిబిటీ సమావేశాలకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనుకున్నాను కానీ అలా జరగలేదు. మనం వంద అనుకుంటాం - అనుకున్నవన్నీ అవుతాయా ఏంటీ? లైట్ తీసుకోవాలి, మరో దాని వెంట పడాలి. ఈ బిడిఎస్సెం కూడా అలాగే ట్రై చెయ్యబోతున్నాను కానీ ఎంతవరకు కొసకు వెళ్ళుతుందో ఇప్పుడే చెప్పలేము కదా. ఒక విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఏదయినా ప్రయత్నించేవాడే విఫలుడవుతాడు. ఏమీ ప్రయత్నించని వాడికి విజయాలూ వుండవు, అపజయాలూ వుండవు.

ఏదేమయినా ఈ మంగళవారం సమావేశం ఉత్సాహంగానే వుంటుంది. అక్కడ జరిగేవి మాటలే తప్ప చేతలు వుండవు కానీ అందులో ఓ వెరయిటీ వుంది. ఆ కలయికకు కొంతమంది కింకీ స్త్రీలు కూడా వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో నాకు తెలుసు కాబట్టి వారి ప్రొఫయిల్ అంతా రిసెర్చ్ చేసేసా. అందులో వారి యొక్క ఫోటోలు కూడా చూసేసా. ఫోటోలు అంటే మామూలు ఫోటోలు కావులెండి ;) అలా వచ్చే వారిలో ఎవరయినా నచ్చితే నాకు మెంటర్ గా వుండమని కోరుతాను. అలా ఎవరయినా అంగీకరిస్తే నా చెయ్యి పట్టుకొని ఆ జీవన శైలిలోకి నడిపించుకువెళ్ళే బాధ్యత వారి మీదే పెట్టేస్తాను. మరింతగా నచ్చితే వారికి ఓ సబ్మిసివుగా దాసోహం అవుతాను. వాళ్ళూ నా ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే నా పప్పులుడుకుతాయిలెండి. చూద్దాం ఆ మీటింగ్ తుస్సుమంటుందో లేక బుస్సు బుస్సు మంటుందో.  

మొదటిసారి ఇలాంటి సమావేశానికి వస్తున్నాను అని వారికి సమాచారం ఇస్తే వారి నుండి వచ్చిన తిరుగు సమాచారం ఇదీ. దీని భావమేమి? నేనేమయినా వళ్ళు దగ్గరపెట్టుకొని వెళ్ళాలా ఏంటీ!  హ?!

The first time going to one of these is a little scary but you have nothing to fear. Everything is kept in public bounds. The conversation is a little out there but if you have any problem ask me or Steve and we will deal with any problem. Any other questions just ask....I am looking forward to meeting you.

తరువాత ... ఇలా జరుగుతుందేమో!

రామ జన్మ భూమి విషయంలో హైకోర్టు తీర్పు ప్రకారం లేదా సుప్రీ కోర్టుకు వెళ్ళినా కూడా ఇదే తీర్పుని సమర్ధించిందనుకోండి. అప్పుడేం జరుగుతుంది? భారత దేశంలోకెల్లా ఉత్తమమయిన రామాలయం హిందువులు కట్టేస్తారు. ముస్లిం దేశాలలోకెల్లా మంచి మస్జిద్‌ను ముస్లిములు కట్టిస్తారు. ఇహ అటువైపు నిహారీలు మాంఛి ఆశ్రమాన్ని కట్టించుకుంటారు. అందరూ సోదర భావంతో మెలగుతూ ఎవరి ప్రార్ధనలు వాళ్ళు చేసుకుంటారు. కదూ.

అలా అని నేననుకోను. ఒకవైపు మస్జిదులో అల్లాహో అక్బర్ అని ప్రార్ధనలు వినపడుతుంటాయి. మరో వైపు రాముడిని స్తుతిస్తూ భజనలు జరుగుతూవుంటాయి. ఇక నిహరీల ఆశ్రమంలో ఏవన్నా పూజలు జరుగుతూ వేద మంత్రాలు పఠిస్తుండవచ్చు. అల్లా ప్రార్ధనలు విని హిందువులకు, రెండు చెవుల్లో జోరీగల్లాగా ఒక వైపు రాముని భజనలు మరో వైపు పూజా మంత్రాలు వినపడి ముస్లిములూ ఆగ్రహం తెచ్చుకుంటారు. అలా శబ్దాలు వినపడకుండా వుండటానికి అవేమయినా సౌండు ప్రూఫ్ భవనాలా ఏంటీ?

అసలు ఆ గుడులు,మస్జిదులూ కట్టేటెప్పుడే లేదా భూమిని పంచేటప్పుడే ఎన్ని సమస్యలు వస్తాయో. ఇక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇహ ఎకరాల గురించి తన్నులాట కాకుండా ఇంచుల గురించి తన్నులాటలు జరగవచ్చు. స్థలం హద్దులు దాటి పక్కకు వచ్చారని చెప్పి వాళ్ళో వీళ్ళొ కెలుక్కోకమానరు. అలా చిన్న మనస్పర్ధలు పెద్దగా అవుతూ మళ్ళీ అప్పుడు మతకలహాలకు దారితియ్యవచ్చు. అలాంటి స్థితిలో ఏమాత్రం ప్రశాంతంగా ఆ ప్రార్ధనా మందిరాల్లో ప్రజలు గడుపుతారనేది ఆసక్తికరమయిన విషయమే.

ఇప్పటికిప్పటికి మత కలహాలు జరగకుండా నీళ్ళూ జల్లే తీర్పు ఇచ్చి జడ్జిలు తమ బాధ్యత తీర్చేసుకున్నారు కానీ అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదని మంచో చెడో ఎవరికో ఒకరికి ఆ స్థలం పూర్తిగా చెందేట్టుగా తీర్పు ఇస్తే బావుండేదేమో. నిరాశా వాదంతో ఆలోచిస్తే ఇదీ సీను. ఆశావాదంతో ఆలోచిస్తే ఈ తీర్పు వచ్చినప్పుడు అయితే ఎలాగా సంయమనంతో వున్నారో అలాగే అందరూ భాయి భాయి అని సుహృద్భావంతో మెలగుతారేమో. చూద్దాం.

BBC: Tamil star's blockbuster set to break box office record

India's priciest film is released

ఈ క్రింది సైటుకి వెళ్ళి మధ్యలోని ఎంటర్టైన్మెంట్ సెక్షన్ చూడండి లేదా క్రింద వున్న మరో లింక్ క్లిక్ చెయ్యండి.
http://www.bbc.co.uk/news/


http://www.bbc.co.uk/news/world-south-asia-11454565

మరీ మూడుముక్కలేనా?

రామ జన్మభూమి తీర్పు చూసాక అసంతృప్తి కలిగింది. కొద్దిగానయినా లౌకికతత్వం లేదే అందులో. హెచ్చు సంఖ్యలో వున్న హిందువులు రెండు ముక్కలూ, మైనారిటీ ముస్లిములూ ఒక ముక్కా పంచుకుంటే న్యాయం జరిగినట్టేనా? మరి మిగతా వారి సంగతేంటి? కిరస్తానీయుల మాటేమిటి? వారికో ముక్క పడేస్తే బావుండేది  కదా. ఇలా ఇలా హిందువులూ, ముస్లిములూ భాయీ, భాయీ అని పక్కపక్కనే గుడులూ, మసీదులూ కట్టుకుంటూపోతే అది లౌకికతత్వం ఎలా అవుతుందేమిటీ? వాటితో పాటూ చర్చిలూ, బుద్ధ, జైన మందిరాలూ కడితేనే కదా సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసేదీ? ఆయా మతాల సంగతి ఆ మతాల వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ సంగతులు నాస్తికుడివి నీకెందుకయ్యా అంటున్నారా? వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా కదా.

ఆ అయోధ్య భూమిని కోర్టు ఏ మతానికీ ఇవ్వకుండా ఎంచక్కా ఏ స్కూలుకో, హాస్పిటలుకో లేక గ్రంధాలయానికో, క్రికెట్టు కోర్టుకో ఇచ్చేస్తుందేమోనని ఒక లౌకిక భావాలున్న వ్యక్తిగా దింపుడుగళ్ళం ఆశ పడ్డాను లెండి. అది జరగలేదు సరే. మూడు ముక్కలు చేసి ఇచ్చారు. కొంతలో కొంత అది బాగానే వుంది. కానీ... మైనారిటీల్లో మైనారిటీలయిన పౌరహక్కులవారికీ, హేతు(టు)వాదులకూ, దళితవాదులకూ మరియు నాబోటి నాస్తిక మతాల వారి సంగతేంటి? మాకొద్దా భూమి? మా మనోభావాలు మనోభావాలు కావా ఏంటీ? ఇంకొన్ని ముక్కలు చేసి మాకూ కొన్ని ముక్కలు పడేస్తే మేమూ నోరుమూసుకొని ఇలా భౌ భౌమనకుండా పండగచేసుకునేవారం కదా. ఇప్పుడు చెప్పండి ఆ తీర్పులో ఎంత లౌకికతత్వం వుందో? మా భూమి మాకిస్తే మా అమరవీరులకు ఓ స్థూపమో, ఓ వేదికో, ఓ అంబేడ్కర్ విగ్రహమో, నాస్తిక సువార్త సభలకు ఓ ప్రాంగణమో నిర్మించుకునేవారం కదా. అటు ముస్లిముల, ఇటు హిందువుల మధ్య చేరి ఏ గొడవలూ రాకుండా చూసుకునేవారం కదా. మరి కోర్టు విశాలమయిన, ఉన్నతమయిన తీర్పు ఇచ్చింది అంటే మమ్మల్నెలా నమ్మమంటారూ?   

సరే ఈ వాదులందరినీ పక్కకుపెడదాం. మరి తెలంగాణా సంగతేంటి? మా తెలంగాణాకి 42% కాపోయినా ఓ 4% ముక్క అయినా ఇచ్చారా? మరీ మోకాలుకీ, బోడిగుండుకీ ముడేస్తున్నావు, తెలంగాణా వారికి అక్కడ స్థలం ఎందుకు చెప్పు అంటున్నారు మీరు. అవునా. అంటే అయోధ్య రాముడిని చూడటానికి ఆంద్రవాళ్ళు మాత్రమే వెళతారా? తెలంగాణా వాళ్ళు వెళ్ళరా? అక్కడ తెలంగానా వాళ్లు ఎవరూ తరతరాలుగా నివసించడం లేదా? వాళ్ళంతా ఎవరు - మావాళ్ళే. మరి మాజాగ మాకు కావాలా వద్దా? ఏదో గింత ముక్క పడేస్తే అందులో అక్కడికి వచ్చే తెలంగాణా యాత్రికుల కోసం లాడ్జి కట్టిస్తాము.  అందులో మూడు గదులు పార్టీ ఆఫీసుకు, తలో రెండు గదులు కేసీఅరుకి, విజయశాంతికీ, తలో ఒక గది కేటీఆరుకీ, కవితమ్మకీ, హరీశ్రావుకీ కెటాయించి మిగిలిన గదులేమన్నా వుంటే యాత్రికులకు కెటాయిస్తాము కదా. 

మరి ఎస్సీ, ఎస్టీ వర్గాల సంగతేంటి? వారికి చట్టబద్దంగా అన్నింటిలోనూ రిజర్వేషను వున్నప్పుడు ఇందులో మాత్రం ఎందుకు మినహాయింపూ?   మీ ప్రశ్న నాకు అర్ధమయ్యింది. హిందువులూ, ముస్లిములూ అందులోకక్షిదారులు కాబట్టి ముక్కలిచ్చారని. వాళ్ళు ఆ భూమి ఎవరిదో చెప్పండి మహాప్రభో అని కోర్టుని వేడుకున్నారు అంతే కానీ ఇలా ముక్కలు చేసివ్వమని ఏనాడయినా, ఎక్కడయినా కోరారా? సరే కోర్టు ఏదో ఒక అడుగు ముందుకువేసి ఎవరి మనస్సూ నొప్పించకుండా అలాంటి తీర్పు ఇచ్చింది. బాగానే వుంది కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి పైన లిస్టు ఇచ్చిన వారందరికీ తలా ఓ ముక్క ఇచ్చేస్తే కోర్టు సొమ్మేం పోయేదో. అందుకే ఆ తీర్పుని నేను ఖండిస్తున్నాను. అ తీర్పులో లైకికతత్వం అన్నది మేడిపండు వంటిదేననని ఈ సందర్భంగా మీ అందరికీ వినయంగా విన్నవించుకుంటున్నాను.