డాన్ శరత్

నిన్న మధ్యాహ్నం నా నస భరించలేక డాన్ శ్రీను సినిమా ముందు పడేసింది మా ఆవిడ. నోరుమూసుకొని సినిమా అసాంతమూ చూసాను. సినిమా ఫన్నీగా బాగానే వుందిగా. శ్రియ అందాలు కూడా బావున్నయ్. విమర్శకులు రివ్యూలల్లో ఏవో చాలా ఈకలు పీకేసినట్టున్నారు కానీ ఓ ఎంటర్టైన్మెంటు సినిమాకి ఇంతకంటే ఏం కావాలేంటీ?

సినిమా చూసాక డాన్ శ్రీను నాకు పూనాడు. మన వీరత్వం ఇంకెవరి మీద ప్రదర్శిస్తామేంటి? వికటాట్టహాసం చేసుకుంటూ మా ఆవిడ బుర్ర తినేసాను. అనవసరంగా ఈ సినిమా చూపించేనని మా ఆవిడ నాలుక్కరచుకుంది.

4 comments:

 1. ఈ సినిమాకు సినిమా రివ్యూలు పాజిటివ్ గా వుండి వుంటే, సినిమా లో ఏమి లేకుండా అలా ఎందుకు వ్రాసారు అని మీ టపా వుండేది :)

  ReplyDelete
 2. మరి డాన్ శరత్ పోస్టు లు ఎప్పటనుండీ మొదలు?

  ReplyDelete
 3. @ a2zdreams
  అంతేనంటారా :) అలా ఏమీ లేదండీ. వున్నది వున్నట్లుగా సమీక్ష చేస్తే ఎందుకు మెచ్చుకోం?

  @ రిషి
  నేను డా(దా)నత్వం ప్రదర్శించేది ఇంట్లోనే లెండి. అవన్నీ బయటకి ఏం చెబుతాం - చెప్పాలని వున్నా కూడా ;)

  ReplyDelete
 4. naku don seenu thega nachhesindi full funny movie

  ReplyDelete