సోమవారం 27 సెప్టెంబర్ 2010

హారంలో నాకు బాగా నచ్చేదేమిటీ?

మీకు హారం సంకలినిలో ఏమిటి బాగా నచ్చుతుందో ముందు మీరే చెప్పండి చూద్దాం. మాలికలో మెచ్చేదేమిటి, హారంలో నచ్చేదేమిటి అని అప్పుడెప్పుడో ఒక టపా వ్రాయాలనుకుంటే ఇప్పటికి తీరింది.


అందులో ముందుగా నేను చూసేది ప్రధానపేజీలో కుడివైపుకు వుండే 'ఎక్కువగా చదివిన టపాలు' సెక్షన్. అందులో మన టపా ఏదయినా వుంటే కాస్త సంతృప్తి. అందులో ఎవరెవరి టపాలు అలా టాప్ రేంజిలోకి వెళ్ళాయో చూసుకొని అందులో ఏవయినా మిస్సయితే ఇది ఎందుకు మిస్సయ్యానబ్బా అని చదివేస్తాను. లేకపోతే నేను పెద్ద పట్టించుకోదగ్గ టపా కాదని వదిలేసిన టపా ఆ లిస్టులోకి వెళితే ఈ టపాలో ఇంతగా ఏముందబ్బా అని ఆ టపా తెరిచి చూస్తుంటాను. ఇలాంటి సెక్షన్ మరే తెలుగు సంకలినిలోనూ లేదనుకుంటాను.

నాకు నచ్చే మరో సెక్షన్ 'వీటిని ఓ లుక్కెయ్యండి' అనేది. నాకు గుర్తుకువున్నంతవరకు ఈ సెక్షనుని కొత్తపాళీగారి సూచనను అనుసరించి పెట్టారు. ఇందులో నిర్వాహకులకు నచ్చి మరియు అంతగా ప్రజాదరణ పొందని టపాలను అక్కడ ఇస్తారు. అందులో నాకు ఆసక్తికరమయినవి ఏవయినా వున్నాయా అని చూస్తుంటాను. కొన్ని కొన్ని నేను అస్సలు గమనించని టపాలు అక్కడ ప్రత్యక్షం అయితే హర్రె ఈ టపా ఎప్పుడు వచ్చిందబ్బా అని ఆశ్చర్యపడి అది చదివేస్తుంటాను. 

అయితే ఈ సెక్షనుతో ఒక చిన్న ఇబ్బంది వుంది. కాళిదాసు కవిత్వం కొంతా - మన చాదస్తం కొంతా అన్నట్టు నిర్వహకులు ఎన్నిక చేసిన కొన్ని టపాలలో వారి చాదస్తమూ కనపడుతూవుంటుంది. వారికి జ్యోతిష్యం మీద గట్రా ఆసక్తి వుంది కాబట్టి అలాంటి అభూతకల్పనలు వున్న టపాలు కూడా అక్కడ ప్రత్యక్షమవుతూవుంటాయి. కొన్ని కొన్ని టపాలు చూసి వీటిలో ఏం ప్రత్యేకత వుండి ఇక్కడ పెట్టేరబ్బా అని తల గోక్కుంటూవుంటాను. లోకో భిన్నరుచి కాబట్టి వారికి నచ్చినవన్నీ మనకు నచ్చాలని లేదు కాబట్టి అందులో మనకు ఇష్టమయినవే చూసుకోవాల్సివుంటుంది. ఇలాంటి సెక్షన్ కూడా మరే తెలుగు సంకలినిలోనూ లేదనుకుంటాను. 

17 comments:

కాయ చెప్పారు...

ఐతే ?

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

>> అయితే ఈ సెక్షనుతో ఒక చిన్న ఇబ్బంది వుంది. కాళిదాసు కవిత్వం కొంతా - మన చాదస్తం కొంతా అన్నట్టు నిర్వహకులు ఎన్నిక చేసిన కొన్ని టపాలలో వారి చాదస్తమూ కనపడుతూవుంటుంది. వారికి జ్యోతిష్యం మీద గట్రా ఆసక్తి వుంది కాబట్టి అలాంటి అభూతకల్పనలు వున్న టపాలు కూడా అక్కడ ప్రత్యక్షమవుతూవుంటాయి. కొన్ని కొన్ని టపాలు చూసి వీటిలో ఏం ప్రత్యేకత వుండి ఇక్కడ పెట్టేరబ్బా అని తల గోక్కుంటూవుంటాను. లోకో భిన్నరుచి కాబట్టి వారికి నచ్చినవన్నీ మనకు నచ్చాలని లేదు కాబట్టి అందులో మనకు ఇష్టమయినవే చూసుకోవాల్సివుంటుంది.

హ హా శరత్.. అయితే నేను రోజూ కూర్చొని, మన బ్లాగర్లు వ్రాసే వందపైన బ్లాగులన్నీ చదివి నాకు నచ్చినవి సెలెక్ట్ చేస్తున్నానంటారా? :-)

ఈ సెక్షన్ లో మొదట్లో అతి తక్కువగా చదివిన వ్యాసాలను చూపేవాడిని.అంటే కనీసం ముగ్గరన్నా చదివిన వ్యాసాలను. కానీ కొద్దిరోజులు గమనించడం వల్ల తేలిందేమిటంటే అందులో వస్తున్నవి ఏమాత్రం నాణ్యతలేనివి లేదా ఒకటో రెండో లైన్లు వ్రాసిన టపాలని అర్థమయింది. ఆ కారణంగా ఇప్పుడు మీరు చూస్తున్న వీటినీ ఓ లుక్కెయ్యండి లో వచ్చేవి టాప్ 10 నుండి 20 వరకు వున్నవి.

nagarjuna చెప్పారు...

నేను కామెంట్ల కోసం హారం చుస్తున్నా....ఇదివరకు మాలికలో చటుక్కున పడిపోయేవి కామెంట్లు...ఈ మధ్య ఎందుకో కామెంటు రాసాక కనపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది...బ్లాగులు ఎక్కువైనందుకు కాబోలు. ఇంకో విషయం ఏ బ్లాగరు ఎన్ని కామెంట్లు రాసాడొ చూపించడం. ఇది కుడా హారంకు ప్రత్యేకం.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కాయ
?

@ భా రా రే
హ హ. మీరు కష్టపడి ఆ లిస్టు ఇస్తున్నారనుకున్నానే! హిట్స్ తో సంబంధం లేకుండా మీకు చక్కగా అనిపించినవి సూచించగలిగితే బావుండేది కానీ దానికి సమయం పడుతుంది కదా.

@ నాగార్జున
నిజమే. ఏ బ్లాగరు ఎన్ని కామెంట్లు వ్రాసారో తెలియడమే కాకుండా ఎంచక్కా ఆ బ్లాగరు వ్రాసిన అన్ని వ్యాఖ్యలనూ చూడవచ్చు.

కొత్త పాళీ చెప్పారు...

Interesting.

హారంలోని ఫీచర్స్ గురించి నేను ఎలాంటి సూచనలూ ఇచ్చిన గుర్తు లేదు. దాని క్రెడిటంతా నిర్మాతలు/నిర్వాహకులదే.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కొత్తపాళీ
నాకయితే మీరు ఆ సలహా ఇచ్చినట్లూ, భా రా రే పాజిటివ్గా స్పందించినట్లూ గుర్తుకువుంది. మీరు ఇద్దరూ కాదంటే ఇహ నా మైండు బ్యూటిఫుల్లు అనుకోవాల్సివస్తుంది - ఆధారాల కోసం తవ్వేంత ఓపిక లేదు కాబట్టి :)

బై ద వే, మీ బ్లాగులో వ్యాఖ్యలు ఎత్తేసినట్లున్నారు/తీసేసినట్లున్నారు?

తృప్తి చెప్పారు...

అరె హారం లో వ్యాకరణం లో ఒక పద్య పాదం ఇస్తే అది ఏ ఛందస్సు అని చెప్తుంది.. ఇదేదో నా పదవ తరగతి టైం లో వచ్చుంటే ఎంత బావుండేది. హాయి గా mobile లో download చేసుకొని ఎలాగోలా copy కొట్టేదాన్ని

ఆ.సౌమ్య చెప్పారు...

హారంలో నాకు బాగా నచ్చినవి కూడా "ఎక్కువగా చదివిన టపాలు" "వీటినీ ఓ లుక్కేయండి" ఈ రెండూ చాలా కొత్తగా బావున్నాయి.

అసలు వీటన్నిటిని పక్కకు తొసేట్టుగా ఛందస్సు పెట్టేసారుగా....అది మాత్రం నిజంగా ఓ అద్భుతం, హేట్స్ ఆఫ్ టు భ.రా.రె!

krishna చెప్పారు...

అదే కాకుండా కామెంట్లు , టపాలు పాతవి కూడా కనిపిస్తాయి కదా! కొన్ని అగ్రిగేటర్లలో అయితే ట్రాఫిక్ అక్కువ అయితే మన టపా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. హారం లో పేజీల చొప్పున వుంటాయి కాబట్టి పర్లేదు. ఇంకా నాకు బాగా నచ్చినది చెబితే రెడ్డిగారు కర్ర పట్టుకుని నా వెనక పడతారేమో ? డిలీటు అయ్యిన కామెంట్లు కూడా దొరికే ఒకే ఒక చోటు మన హారం ;)

సుజాత చెప్పారు...

ఒకరు రాసిన వ్యాఖ్యలన్నీ ఒకటే చోట చూడగలగడం ఇక్కడ బావుంటుంది. ఛందస్సు..వీటిమీదా ఒక లుక్కేయండి..బావుంటాయి హారంలో! బిజీగా ఉండి చూడలేకపోయిన పాత టపాలు దొరకడం కూడా సూపరు!

కొత్త పాళీ చెప్పారు...

ఒక వ్యాఖ్యాత వేర్వేరు బ్లాగుల్లో రాసిన వ్యాఖ్యలన్నీ ఒకే చోట చూసుకోగలిగిన సదుపాయం మొదట జల్లెడలో వచ్చింది. ఎందువల్లనో మొత్తమ్మీద జల్లెడ ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు.

@ శరత్, నేను నాబ్లాగులో కబుర్లు క్రమంతప్పకుండ రాస్తున్న రోజుల్లో ప్రతీ కబుర్లలోనూ ఒక బ్లాగుకి దారి చూపించి "ఓ లుక్కెయ్యండి" అని లంకె పెట్టేవాణ్ణి. అంతమాత్రం చేత ఆ పదబంధం నా పేటెంటు కాదు. హారంలో అలా టైటిలు పెట్టుకోడం భారారె గారి స్వంత ఆలోచనే.
నా బ్లాగులో వ్యాఖ్యల లంకె తెరిచే ఉన్నది. ముఖపత్రంలో ఐతే, టపా శీర్షికపక్కనే నల్లరంగులో ఒక డయలాగ్ పెట్టెలాగా ఉండి, ఇన్నికామెంట్లున్నాయి అని చూపిస్తుంది చూడండి, దానిమీద నొక్కితే కామెంట్ల పేజీ తెరుచుకుంటుంది. ఒక టపాలోకి వెళ్తే యథావిధిగా టపా చివర post a comment అని లంకె ఉంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నాగార్జున

"ఇదివరకు మాలికలో చటుక్కున పడిపోయేవి కామెంట్లు...ఈ మధ్య ఎందుకో కామెంటు రాసాక కనపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది...బ్లాగులు ఎక్కువైనందుకు కాబోలు."

ఆ సమస్య బ్లాగులు ఎక్కువైనందుకు కాదనుకుంటాను...నిర్వాహకులు ఎక్కువైనందువల్ల అయివుండవచ్చు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ తృప్తి, సౌమ్య, సుజాత
నాకు పద్యాలు గిద్యాలు, ఛందస్సులు జాంతానై కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత తెలియలేదు. నాకు సంధుల్లో సువర్ణ దీర్ఘ సంధి ఒక్కటే తెలుసు. 8,9 చదివేరోజుల్లో సువర్ణ అనే అమ్మాయి మా క్లాసుమేటు. అందుకే ఆ పేరు గుర్తుండిపోయింది.

@ క్రిష్ణ
హ హ.

మీరు బ్లాగుల్లో ఎక్కువగా కనపడటం లేదేంటీ? పెళ్లయిపోయిందా ఏంటీ అప్పుడే!

@ కొత్తపాళి
నేను నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను - అబద్ధం చెప్పను :)

మీరు చెప్పింది కాదులెండి కానీ ఈ చక్కని విషయాన్ని ఇక వదిలేద్దాం :)

ఓకెకే. మీ బ్లాగులో కామెంట్లు పైనే పక్కనే వున్నాయన్నమాట. ఇప్పుడే చూసాను.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

నాగార్జునా, అవును హారం కామెంట్ కౌంట్ చూపిస్తుంది. అలాగే టపాల కౌంట్ కూడా.

సౌమ్య, మీకు ఛందస్సు నచ్చిందన్నందుకు నాకు భలే ఆనందంగా వుంది. మొత్తానికి నాకు ఒక్కరన్నా కష్టమర్ దొరికారు :-)

కృష్ణ, నిజంగానే కర్రెత్తుకొస్తా నువ్వు డిలీట్ చేసినవి కూడా దొరుకుతాయని లొల్లి లొల్లి చేస్తే :))

తృప్తి, thanks :))

సుజాత, హారంలో ఛందస్సు కు మీరుకూడా కష్టమర్లేనా అయితే?

కొత్తపాళీ గారూ, మీ సూచన తోనే ఓ లుక్కేయండి పెట్టానండి :-). thanks for the idea.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

శరత్, సువర్ణానికి శరత్చంద్రిక కలిస్తే ఇంకేమైనా వుందా? :))

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కొత్తపాళీ
హ హా. చూసారా! నేనే గెలిచాను :)) చెబితే వినరు కదా.

కొత్త పాళీ చెప్పారు...

హుమ్మ్ నాకు మతిమరుపు ఎక్కువవుతోందని తేలింది! సరే కానివ్వండి.