అల్లరి నరేశ్ నటన చూస్తే మీకు నవ్వు వస్తుందా?

నాకయితే రాదు. కమెడియన్ అంటే అతన్ని చూడగానే లేదా అతడిని తలచుకోగానే మన మదిలో నవ్వులు పూయాలి. నాకయితే ఈ నరేశ్ కమెడియనుగా అనిపించడు. ఏదో సుడి వుండి (సరదాకు అంటున్నాను) సినిమాలు కాస్తోకూస్తో హిట్టవుతూ బండి లాగించేస్తున్నాడు. అతని నటన అయితే బాగానే విమర్శకుల ప్రశంసలు పొందుతూనేవుంది. ఈమధ్యే ఒక సమీక్షలో చూసాను. అల్లరి నరేశ్ మంచి టైమింగ్ వున్న కామెడీ హీరో అని వ్రాసారు.

నేనయితే ఇతని సినిమాలు చూస్తున్నప్పుడు, ఇతని నటన చూస్తున్నప్పుడు చంకల్లో చక్కిలిగింతలు పెట్టుకుంటూ చూస్తుంటాను. మరి మిగతావారందరికీ ఈ నరేశ్ కామెడీ హీరోలా ఎలా అనిపిస్తున్నాడో నాకర్ధం కాకుండా వుంది. ఏంటీ, అల్లరి నరేశ్ నటన కామెడీగా వుండదంటున్నావా అని మీరు నన్ను విచిత్రంగా చూడటం లేదు కదా!

మీదీ నాలాంటి అభిప్రాయమేనా లేక అతను నిజంగా తన నటనతో నవ్వులు పూయిస్తాడా? కామెడీ చాలా బాగా చేస్తాడు అని సినిమా చూస్తున్నప్పుడు నా మనస్సుకి ఎంత సర్దిచెబుదామన్నా విని చావదు - పైగా మొరాయిస్తుంది. హ్మ్.

20 comments:

 1. అతని కామెడీ సినిమాలు చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు.
  ఉదాహరణకి ఈ టపాలో సీమశాస్త్రి సమీక్ష చూడచ్చు.
  కానీ అతను విభిన్నంగా చేసిన మూడు సినిమాల్లో (నేను, గమ్యం, ఇంకోటి అదేదో ఎక్స్‌ప్రెస్ - క్రైం థ్రిల్లర్ సినిమా) అతని నటన చూసి మంచి ప్రతిభ ఉన్న నటుడు అనిపించింది.

  ReplyDelete
 2. @ కొత్తపాళీ
  అవునండీ, ప్రతిభ వున్న నటుడే, ఏదో వ్రాయడం మరుస్తున్నానూ, టపా పరిపూర్ణంగా లేదూ అనుకుంటూనే వున్నా. మీరు సవరించారు. అతని మీద నాకు గౌరవ భావమూ వుంది. మీరు ప్రస్థావించిన సినిమాల్లో కొన్ని చూసాను. తనకు ఇరానియన్ సినిమాలు బాగా నచ్చుతాయని తాను సక్సెస్ కాకముందు చెప్పుకువచ్చాడు. అలాంటి సినిమాలు చెయ్యాలని వుంది అని చెప్పాడప్పట్లో.

  సార్, మీ సినిమాల రివ్యూలు మీరు ఇచ్చిన లింకులో చూసాను. మిగతా సినిమాల విషయంలో ఏకీభవిస్తాను కానీ చందమామ బాలేదంటే మాత్రం నేనొప్పుకోనంతే. ఆ.

  మీ బ్లాగు సంకలినిల్లో రాదు కాబట్టి దానిని దర్శించడం అలా అలా పక్కసైడుకి అయిపోవస్తూవుంది.

  ReplyDelete
 3. He is one of the best hero now.

  బెస్ట్ యాక్టర్ గా, క్రియేటివ్ దర్శకులకు అందుబాటులో వుండే హీరోగా వృద్ధి చెందుతున్నాడు.

  ReplyDelete
 4. అల్లరి నరేశ్ మంచి కామెడి నటుడా కాదా అనే విషయము పక్కన పెడితే, అతని సినిమా ఇండియన్ స్టోరులో కనపడితే మాత్రము కొంచెము కూడా భయపడకుండా తీసుకొస్తాను. కనీసము చూడబుల్ గా ఉంటుంది.

  తెలియకుండా ఎన్నో తెలుగు సినిమాలు (అగ్ర హీరోలుగా విఖా్యతి గాంచినవారితో సహా) తెచ్చుకుని వీరగా సుత్తి వేయించుకుని పది నిమిషాలు తరువాత ఆపేసిన అనుభవము మరి.

  నా తెలుగ సినిమా రెంటింగ్ Algorithm:

  if ( Bala or Pavan Kalyan )
  "Run Run"

  else if (son or brother or some relation of Somebody)
  "sprint as fast as you can"

  /* I am a senior NTR fan */
  elseif (Jr. NTR or Nagarjuna & favorable reviews)
  "Conditionally Get"

  else if (Brahmanandam )
  "Sure"

  else if (Allari Naresh or Rajendra Prasad)
  "Just get it"


  ఈ మధ్యనే బ్లాగులు చదవటము వలను ఈ Algorithm కి సంబంధించిన Exceptions పట్టుకో గలుగుతున్నాను. జీవితము ప్రశాంతముగా ఉంటున్నది.

  ReplyDelete
 5. అల్లరి నరేష్ పిచ్చ తోపు...అతనిది కమెడియన్ కామెడీ కాదు .. హీరో కామెడీ... కూల్ గా పని చేసుకు పోతాడు ...

  ReplyDelete
 6. నేను కూడా యాంకీ తో ఏకీభవిస్తాను. ఓవర్ యాక్షన్ ఉండే సినిమాలకన్నా నరేష్ వి బెటర్.
  నవ్వు రాకున్నా, నవ్వడానికి ట్రై చెయ్యొచ్చు.

  ReplyDelete
 7. ఈ కాయెవరో కాని కరెష్ట్ గా చెప్పారు

  ReplyDelete
 8. >>else if (son or brother or some relation of Somebody)
  "sprint as fast as you can"
  అల్లరి నరేశ్ ఇ.వి.వి. కొడుకు కదూ?

  ReplyDelete
 9. @ చివరి అజ్ఞాత,
  చిట్టచివరి else if మిగతా వాటన్నిటినీ ట్రంప్ చేస్తుందని తెలియదా? :)

  @ శరత్, మీకు చందమామ ఎందుకు నచ్చిందో పూర్తి నిడివి టపాలో విశదంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని విన్నవిస్తున్నాం అధ్యక్షా

  ReplyDelete
 10. మరీ సో called సూపర్ హీరోస్ లాగా.. రెండేళ్ళకి ఒక రాడ్డు సినిమా కాకుండా..ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాడు..
  అందులో రెండు మూడు మినిమం గారంటీ సినేమాలున్టై.. చికాకొస్తే ఆలోచిన్చక్కర్లేకుండా అల్లరి నరేష్ సినిమాకి వెళ్లిపోవచ్చు. అతడు హాస్య నటుడు కాదు.. నటుడు అంతే.. కొత్త పాళీ గారు అన్నట్టు అతడు నటించిన విబిన్న చిత్రాలు కూడా లేక పోలేదు. వాటిల్లో నరేష్ నటన అభినందనీయం. అయితే ఎక్కువ మోతాదు సినిమాలు హాస్య చిత్రాలు.. మరి మీకు ఇన్ని సినిమాల్లో ఒక్క జోకు కి కూడా నవ్వు రాక పోవడం ఆశ్చర్యమే.. ;)

  ReplyDelete
 11. ఇప్పుడున్న నటులలో మంచి టైమింగున్న అతికొద్దిమందిలో నరేశ్ ఒకడు అనడంలో సందేహంలేదు. మిగిలినవారు కోట, రాజేంద్రప్రసాద్, కృష్ణభగవాన్, సునీల్, కోవైసరళ, కొంతవరకు ఆలీ. ఇప్పుడొచ్చే సంభాషణాహాస్యానికి నవ్వుమొహంకన్నా టైమింగే కావాలి. అది అల్లరైనా, గమ్యమైనా, త్రివిక్రం సినిమాలైనా కామెడీ డైలాగులు పేలడానికి అదే కారణం.

  ఒకప్పుడు బ్రహ్మానందం టైమింగ్ బాగుండేదిగానీ, గత పదేళ్ళుగా నాలుగైదు సినిమాలు (అతడు, గమ్యం, ఇంకా ??) అవే అతి, రొటీన్ హావభావాలు, రొటీన్ అరుపుల డైలాగ్ డెలివరీ (నే చస్తాను బాబోయ్, నేన్చస్తా. అహా! నా గన్నెక్కడా? బావెక్కడా? నే చస్తాను బాబోయ్, నేన్చస్తా). ఆయన మొహము చూడంగానే నాకయితే నవ్వురాదు. ఇంక మీకెవ్వరిని చూస్తే (ఇప్పుడున్న తెలుగు కామెడీ నటులు) వెంటనే నవ్వొస్తుంది? బ్రహ్మీ అభిమానులూ నాపై దాడి చేస్తారేమో! నే పోతా! నే పోతా!

  ReplyDelete
 12. కాయ గారితో ఏకీభవిస్తున్నాను. నేను కూడా అల్లరి నరేష్ సినిమాలకు ఫ్యాన్‌ను. అతని నటన వగైరాలు పక్కన పెడితే, అతని సినిమాలు చూడగలిగే విధంగా ఉంటాయి. మిగతా హీరోల్లా కాకుండా, సంవత్సరానికి నాలుగైదు సినిమాల్లో నటిస్తాడు కాబట్టి, మరో అడ్వాంటేజ్.

  మీకు వీలైతే మరోసారి అతను నటించిన బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు, అత్తిలి సత్తిబాబు LKG, మా అల్లుడు వెరీగుడ్డు సినిమాలు చూడండి.

  ReplyDelete
 13. నాకయితే నచ్చుతాయి. అల్లరి నరేష్ ఉంటే సినిమా హాయిగా చూడొచ్చు అనిపిస్తుంది. మనకున్న హీరోలందరికన్నా నరేష్ ఎంతో బెటర్. నీట్‌గా హాయిగా నటిస్తాడు.అతని ముఖకవళికలు, హావభావల్లో ఉండే చురుకుదనం, టైమింగ్ నాకు ఇష్టం. పైన యాంకీగారు చెప్పినట్టి నరేష్ అయితే just get it . గమ్యం, సుందరకాండ (సినిమా పరమ చెత్త గానీ నరేష్ నచ్చాడు), బ్లేడుబాబ్జీ, శంభో శివ శంభో అన్నీ బానే ఉంటాయి.

  ReplyDelete
 14. నిజమే నాకూ అతని నటన చూసి నవ్వురాదు, కొందరు పెద్ద హీరోలు, బాబుల పేరుతో మనపై రుద్దబడిన వారసుల నటనను చూసేప్పుడు వచ్చే నవ్వు అస్సలు రాదు ఎందుకంటే నరేశ్ బాగానే నటిస్తాడు. ఇతను కమెడియన్ కాదు హీరో ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. చూడగానే నవ్వొచ్చే బ్రహ్మం లాంటి వాళ్ళు హీరో గా నిలదొక్కుకోలేరు ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మనకు నవ్వే వస్తుంది కాబట్టి. అతని సినిమాలు మీరు బహుశా మొదట్లో ఎక్కువ చూసి ఉండచ్చు. మా అల్లుడు వెరీగుడ్ నుండి వచ్చిన సినిమాలు కాస్త బాగానే ఉన్నాయి అనిపించుకుంటాయ్. పైన లిస్ట్ లో ఇచ్చిన సినిమాలు ప్రయత్నించండి కాకపోతే మీ లాజికల్ బ్రెయిన్ ని లాకర్ లో పెట్టేసుకుని చూస్తే సినిమాని హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు.

  ReplyDelete
 15. అల్లరి నరేశ్ మీద అందరి అభిప్రాయాలు చూస్తే ముచ్చటేస్తోంది. అతగాడి మీద ఒక్కరూ నెగెటివుగా వ్రాయలేదు - నేను తప్ప - అంటే జనాల్లో నరేశ్ ఎంత ప్రీతిపాత్రుడయ్యాడో అర్ధం అయ్యింది.

  నాకెందుకు నవ్వురాదో ఇప్పుడు అర్ధమయ్యింది. అతనిని హాస్యనటుడిగా భావిస్తూ ఎక్కువ హాస్యాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా మీలో కొందరు సూచించినట్లుగా నరేశును ఒక నటుడిగా మాత్రమే భావిస్తుంటే గనుక అప్పుడు అతను చేసే కామెడీ నచ్చవచ్చు. ఆల్ రైట్ ఇహనుంచీ అదే స్ట్రాటజీ ఫాలో అవుదాం.

  స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. యాంకీ గారి ఆల్గొరిథం ఇంకా పూర్తిగా చదవలేదు, చదువుతా, చదువుతా :))

  ReplyDelete
 16. మీలొ నాకు నచ్చే లక్షణాల్లొ ఇది కూడా ఒకటి. వెంటనే మీ యొక్క అభిప్రయాన్ని మార్చుకుని అతన్ని అభినందించడం... అభినందనీయం ....

  ReplyDelete
 17. మీరే కరక్ట్..కామెడీ సినిమాల్లో అతను పండిస్తున్నదేమీ లేదు..ఐ మీన్ ఆయన వల్ల పుట్టిన కామిడీ ఏమీ వుండట్లా...కానీ ఆయనంటే నాకు ఎందుకో ఇష్టం... చూడబుల్గా వుంటాడు..

  ReplyDelete
 18. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇమేజ్ చట్రానికి దూరంగా ఉంటూ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్న ఏకైక హీరో అల్లరి నరేష్. 2008లో అనుకుంటా... నరేష్ ని ఇంటర్వ్యూ చేశాను. చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. త్వరలో నా బ్లాగులో ఆ ఇంటర్వ్యూ పెడతాను. నరేష్ సినిమాల్లో బ్లేడుబాబ్జీ నా ఫేవరెట్.

  ReplyDelete
 19. @ అజ్ఞాత
  నా వ్యక్తిత్వాన్ని మీరు శ్రద్ధగా గమనిస్తున్నారని అర్ధమయ్యి సంతోషంగా వుంది.

  @ kvsv
  హమ్మయ్య. నాకో సమర్ధకులు దొరికారు - మరీ వంటరి వాడిని కాకుండా :)

  @ బాలు
  అల్లరి నరేశ్ కి సక్సెస్ రాకముందే వచ్చిన ఒక ఇంటర్వ్యూ చదివాను. అతని అభిప్రాయాలు నచ్చాయి. అప్పట్లో విలన్ వేషాలకి కూడా సిద్ధపడ్డారు. మీరు అతని గురించి చెప్పిన మాటల ద్వారా వారి వ్యక్తిత్వం సరాసరి తెలిసింది. సంతోషం. మీరు చేసిన ఇంటర్యూ కోసం చూస్తుంటాను.

  ReplyDelete
 20. నాకు కూడా అల్లరి నరేష్ నటన నవ్వు పుట్టించదు. కాకపోతే నా అభిప్రాయం లో అతడిది కాదు తప్పు. నాసిరకం కామెడీ రాసే / తీసే రచయత / దర్శకులది లోపం. నరేష్ ప్రజ్ఞ కల నటుడే .. కాకపొతే జంధ్యాల లాంటి దర్శకులు ఏరి ?

  ReplyDelete