ఈ రోజునుండీ నా స్వేఛ్ఛకి సంకెళ్ళు!

గత మూడు నెలలుగా అస్ఖలిత(?!) బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ (పెళ్ళాం ఊరెళ్ళింది కాబట్టి) అపరిమిత స్వేఛ్ఛను అనుభవిస్తున్న నాకు ఇవాల్టి నుండీ ఆ స్వేఛ్ఛ దూరం కాబోతున్నది. స్వేఛ్ఛ అంటే ఏదో ఇక్కడ రాచకార్యాలు వెలగబెట్టానని కాదులెండి. ఎక్కడ దురదపెట్టినప్పుడు అక్కడ తటపటాయింపు లేకుండా గోక్కోవడం లాంటివి నా దృష్టిలో స్వేఛ్ఛ క్రిందికి వస్తాయి. మిగతా స్వేఛ్ఛలు మీరూహించుకోండేం - ఇక్కడ చెబితే బావుండదు. అవేకాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చినన్నిసార్లు పండటం, తినడం, నెట్టు చూసినా అడిగేవారులేకపోవడమే అసలయిన విశ్రాంతి కాదూ. అంతటి విశ్రాంతి మళ్ళీ ఎప్పుడో.  మా వాళ్ళు వచ్చినాక కూడా అలాగే వుంటానంటే ఊరుకుంటారా? ఎద్దుని గనుక ముల్లుగర్రతో పొడిచినట్లు పొడవరూ! 

అదేంటీ ఇండియా వెళ్ళినప్పుడు అంతా కలిసే వున్నారుగా అని సందేహపడకండి. పెళ్ళి ఏర్పాటలో తలమునకలవుతూ మా ఆవిడ వాళ్ళ అక్కయ్య ఇంట్లోనే వుండిపోయింది. నేను మా (అమ్మ గారి) ఇంట్లో వుండిపోయి ఇండియాలో కూడా ఎంచక్కా స్వేఛ్ఛ అనుభవించేసా. 

అదేంటీ మీరందరూ కొన్ని వారాల క్రిందటే యు ఎస్ కు వచ్చేసారు కదా అని హాశ్చర్యపోకండి. అప్పుడు వచ్చింది మా పెద్దమ్మాయీ, నేనూను. మా పెద్దమ్మాయి అంతర్ముఖి కాబట్టి తాను ఇంట్లో వున్నా లేనట్టే. తాను నిశ్శబ్దంగా, అలికిడి లేకుండా, ఇంట్లో వున్నా లేనట్టుగానే వుంటుంది కాబట్టి తనతో నా విశ్రాంతికి వచ్చిన సమస్యేమీలేదు. ఆరోగ్య పరీక్షలు, డెంటలు సర్జెరీలు పూర్తిచేసుకోవడం కోసం మా ఆవిడ ఇండియాలోనే వుండిపోయింది.  మా వాళ్ళు ఇద్దరూ అనగా మా అమ్మలు మరియు మా ఆవిడానూ చేతుల్లో సంకెళ్ళు పట్టుకొని ఇంకొద్ది నిమిషాల్లో  ల్యాండ్ అవబోతున్నారు :(     నన్ను ఓదార్చండి మరి!

12 comments:

  1. పెరుగన్నం రెడీ చేశారా

    ReplyDelete
  2. @ శ్రీనివాస్
    ఈ పెరుగన్నం కథా కమీశూ ఏంటబ్బా? ఏ సినిమాలోనయినా వచ్చిందా ఏంటీ? కొద్ది రోజుల క్రితం మరో బ్లాగులో కూడా ఇలాంటి డైలాగ్ మీరే వేసినట్లున్నారు. నాకేమో మరీ ఎక్కువ సినిమాలు చూడక జికే తక్కువయ్యింది.

    ఇంట్లో చల్లన్నం, పెరుగూ వుంది. కలిపేసుకుంటే పెరుగన్నం అదే అవుద్దిలెండి.

    ReplyDelete
  3. నేను మీ కోసం ఓదార్పు యాత్ర మొదలు పెడతాను సుమా :)

    ReplyDelete
  4. శ్రీనివాస్ బ్లాగ్ లో ఓదార్పు యాత్ర సూపర్ హిట్ అయ్యిందని
    మీ ఎజెండా ని మరిచి మరీ ఓదార్పు యాత్ర చేయడాన్ని నిరసిస్తున్నాం

    ReplyDelete
  5. అంతర్ముఖి అని చెప్పి చెప్పి తప్పు చేస్తున్నారు ..అదేదో దోషం లా.. నీ లోకం నీదే.. పాపం ఆ పాప ఎంత ఒంటరి తనం ఫీల్ అవుతుందో.. ఇంట్లో ఉన్నా లెనట్టే నా .. ఏం పద్దతి ఇది.. తను మూడీ గా ఉంటే అది పోగొట్టే పని చేయాలి కానీ.. ఇలా నేనేం చేయలేను అన్నట్ట్లు చెప్తావా

    ReplyDelete
  6. Ammayya.. Maaku inka freedom.. :)

    Mi ammalu ki, Anitha gaariki na Hearty Welcome ani cheppandi.

    ReplyDelete
  7. @ నెలబాలుడు
    సంతోషం. ఒదార్పు ఈమెయిల్లో ఇచ్చి, డబ్బులు మాత్రం వెస్టర్న్ యూనియను ద్వారా పంపించండేం.

    @ హరే క్రిష్ణ
    హర్రే, నిజమే కదూ. నా అసలు ఎజెండా మరచి అక్కడ ఓదార్పుకి బయల్దేరతా అంటున్నానేంటీ నేనూ. నా ఎజెండాలో కొద్దిగా ప్రోగ్రెస్ వుంది లెండి. మరచిపోలేదింకానూ.

    @ ప్రమిద
    అలా అన్నారు బావుంది. నాకు శానా ఓదార్పు కలిగింది.

    ReplyDelete
  8. అయ్యో పాపం. దసరా వరకు అక్కడే వుండమని ఏదో ఒక వంకతో చెప్పకపోయారా...?

    ReplyDelete
  9. ఓదార్పు ఎందుకండీ!!! హాయిగా ఇకనుండి మీకు దురదపుడితే మీ ఆవిడ గోక్కుంటారులెండి:):)హ్యాపీ హ్యాపీ డేస్ కదా!

    ReplyDelete
  10. @ కాయ
    మీరు అపోహల్లో వున్నారు. మా పెద్దమ్మాయికి సంబంధించిన క్రింది టపాలు చదవగలరు.

    http://swapnaraagaleena.blogspot.com/2010/01/1_22.html

    http://swapnaraagaleena.blogspot.com/2010/01/1_24.html

    http://swapnaraagaleena.blogspot.com/2010/01/2_25.html

    http://swapnaraagaleena.blogspot.com/2010/01/3_26.html

    http://swapnaraagaleena.blogspot.com/2010/01/3_26.html

    ReplyDelete
  11. @జాబిల్లి
    నేను ఇంటి సమయాన్ని ఎక్కువగా బ్లాగులు వ్రాయడానికి వృధా చేయనండీ, నేను వృధా చేసే సమయం వేరేవుంది అందువల్ల మీకు నానుండి ఫ్రీడం ఏమీ దొరకదు :))

    మీ ఆహ్వానం వారికి తెలియజేస్తాను.

    @ నరేశ్
    మా అమ్మలు స్కూల్ పోతుందని వర్రీ కానీ లేకపోతే అలాగే అని వుందును :)

    @ సృజన

    మీ ఆవిడ గోకుతారు కదా అంటారేమో అనుకున్నా గోక్కూంటారు కదా అన్నారు. సూపరూ. దాంపత్యం అంటే అలా వుండాలి కదా :) ప్రస్తుతానికి ఆల్ హ్యాపీసేనండీ. కొన్నాళ్ళ విరహం కదా.

    ReplyDelete