ఈ ఫోటొ పంపించేవాడు!

ఓ మూడేళ్ళ క్రితం న్యూజెర్సీలో వుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ బెంచ్ మీద వున్న రోజులవి. మాలో ప్రవీణ్ అనే మిత్రుడు చాలా చిలిపి. ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టం. చామంది మగవారిని ఆడపేరుతో చాట్ చేస్తూ ఆడుకునేవాడు. అది పెద్ద విశేషం కాదనుకోండి. కానీ మావాడు కొన్ని రోజులు అలా ఏడిపించాక తన సెల్ ఫోను నంబర్ కూడా ఇచ్చి వెంటనే ఫోన్ చెయమనేవాడు. అవతలవారు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే మనవాడు ఆడగొంతుతో తియ్యగా మాట్లాడితే అవతలి వారు ఐసయిపోయేవారు.

అలా అప్పుడప్పుడూ వారితో స్త్రీ స్వరంతో మాట్లాడుతూవుండేవాడు. ఇంత హొయలు ఒలకబోస్తూ మాట్లాడుతున్న ఈ అమ్మాయి చూడ్డానికి ఇంకా ఎంత బావుంటుందో అని ఇతని ఫోటో తెగ అడిగేవారు . ఏడిపించీ, ఏడిపించీ, ఊరించి, ఊరించి చివరికి ఈ క్రింది ఫోటో పంపేవాడు. అలా ఈ ఫోటో బాగా గుర్తుండిపోయింది. కొన్ని రోజుల క్రితం ఎందుకో గూగుల్లో ఫోటోలు చెక్ చేస్తుంటే ఈ ఫోటో కనపడి ఆ రోజులు గుర్తుకువచ్చాయి.

కొద్దిరోజులయాక అతనూ మరో ఫ్రెండు ప్రసాద్ కలిసి నన్ను కూడా ట్రిక్ చేద్దామని చూసారు. ఒక ఆంటీ పేరుతో నాతో చాట్ చేసి కాస్సేపు నమ్మించినా కొద్దిసేపట్లో సంథింగ్ రాంగ్ అని వారిని కనిపెట్టేసాను కనుక సరిపోయింది. లేకపోతే వాళ్ళిద్దరూ నన్ను ఎంత ఆడుకునేవారొ - నన్ను హమాయకుడిని చేసేసి!

1 comment:

  1. హతవిధీ...చివరాకరికి ... మీరు అమాయకుడిని అనుకుంటున్నారా ...హూ...మీతో ప్రపంచముదురు [దేశముదురు లా అన్న మాట ] తీద్దామనుకుంటున్నాం...

    ReplyDelete