సోమవారం 16 ఆగస్టు 2010

భూమిక సత్యవతి గారికి బహిరంగ లేఖ

సత్యవతి గారూ,

మీరు 'భూమిక' స్త్రీవాద పత్రికను నడుపుతూ మీరు స్త్రీల అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు. అభినందనలు.

స్వలింగ సంపర్కుల గురించి కొంతకాలం క్రితం మీ పత్రికలో ఒక అనువాద వ్యాసం ప్రచురింపబడింది. అయితే లెస్బియన్ హక్కుల మీద మీ వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకోవాలని వుంది. స్త్రీల కొరకు చేస్తున్న మీ కృషిలో అవి కూడా భాగమేనా? ఆడ ఆడ సంపర్కం నేరపూరితం కాదనే విషయన్ని మీరు అంగీకరిస్తారా? స్త్రీల మధ్య వివాహం విషయంలో మీ స్టాండ్ ఏమిటో ఒక LGBT కార్యకర్తగా నేను తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. అలాగే స్త్రీల లైంగిక స్వేఛ్ఛ, స్త్రీల లైంగిక హక్కుల విషయంలో మీ అభిప్రాయం వెల్లడిస్తే సంతోషిస్తాను.

దయచేసి స్పందించగలరు.

10 comments:

అజ్ఞాత చెప్పారు...

ఆమధ్య ఒక సారి పురుషులకు స్రీల అవసరం లేకుండా ఏ రూపం లో ఉన్న బొమ్మ కావాలంటె అదీ కొనుకొని సుఖించవచ్చు. అది అచ్చు అటువంటి ఫీలీంగె ఇస్తాయి అని రాశారు. ఆడవారి విషయం లో చాలా ముందు ఉన్నారు వారికి ఆకర్షణియ మైన వైబ్రేటర్లు ఇప్పుడు మార్కేట్లొ లభిస్తున్నాయి.ఎలాగు రానున్న రోజుల్లో మనం కోరుకున్న్ విధంగా జీవితం ఉండదు కనుక ఎవరి డబ్బును వారు బాగా తిని,తాగి ఖర్చు చేసుకోవచ్చు. అభిప్రాయాలు తెలుసు కొనే లోపే ఎన్నొ మార్పులకు గురి కావోచ్చు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

బొమ్మలు ఎంతైనా అంత ఫీలింగ్ ఇవ్వవు - ఎందుకంటే వాటికి ఫీలింగ్స్ వుండవు కదా. కాకపోతే హస్తప్రయోగం కన్నా మంచి అనుభూతి ఇస్తుండవచ్చంతే. ఫీలింగ్స్ కూడా వున్న రోబోట్ బొమ్మలు వస్తే అప్పుడు చెప్పలేం. అలాంటి బొమ్మలు, వైబ్రేటర్లూ, ఇతర ఉపకరణాలూ వుండే షాపులకి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాను కానీ ఏమీ కొనను. దంపతుల మధ్య శృంగారం ఉద్దీపన చేయడానికి కూడా కొన్ని ఉపకరణాలు వుంటాయక్కడ. అలాంటి అడల్ట్ టాయ్ షాపులను చూసి రావడం అన్నది చక్కటి థ్రిల్ కలిగిస్తుంది. అందరూ ఒక సారయినా అలాంటివి దర్శించి వస్తే బావుంటుంది.

snkr చెప్పారు...

ఒక ప్రఖ్యాత స్వలింగ కార్యకర్త గా స్వలింగులకు ఓ గుర్తింపుకై బ్లాగులో రాజీలేని పోరాటాన్ని కొన సాగిస్తున్నారు. అభినందనలు.

దారిద్ర్యరేక దిగువున రెండు పూటలా తిండికి నోచుకోని 456మిలియన్ల భారతీయులు వున్నారని ప్రపంచ బ్యాంక్ లెక్కగట్టిన నేపథ్యంలో మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమిటని తెలుసుకొనగోరుచున్నాము. స్వలింగులకోసం చేస్తున్న కృషిలో దారిద్ర్య నిర్మూలన ఓ భాగమేనా? కూటికోసం పోరాడటం నేరపూరితం కాదని మీరంగీకరిస్తారా? దారిద్ర్య నిర్మూలన, లైంగిక విశృంఖల స్వేచ్చ, ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది అనేవిషయంలో మీస్టాండ్ ఓ భారతీయుడిగా, ఓ బ్లాగు చదువరిగా తెలుసుకోగోరుతున్నాను. అలాగే దారిద్ర్య రేఖ దిగువన వున్న నిర్భాగ్యులతో పాటు మందేశంలో బాలకార్మికుల మీద విషయంలో మీ అమూల్య అభిప్రాయాలు తెలుసుకోగోరుతున్నాను.

మహత్తరమైన మీ ఉద్యమంలో సమిధలు కావడానికి విద్యార్థులు, దళిత, వియోదళిత, సామ్యవాద, సనాతన, చాందస, మత,కుల వర్గాల వారు తమ భావజాలాలకు అతీతంగా బారులు తీరాలని ఆశిస్తాను. మీరు నిర్మొహమాటస్థులని భావించి ఇలా అడుగుతున్నాను, దయచేసి అన్యథా భావించవలదని మీ అభిమానిగా నా మనవి/విన్నపం.

ప్రేమిక చెప్పారు...

నమస్తే శరత్ గారూ.... నా అసలు పేరు ప్రేమిక కాదు.. ప్రేమిక అంటే ప్రేమించే వాళ్లు అని ఆడ కావచ్చు మగ కావచ్చు... నేను అబ్బాయినే... మీ పోరాటానికి సదా నా అభినందనలు.......

శరత్ 'కాలమ్' చెప్పారు...

@snkr
మీ ప్రశ్నలను అస్తమానం పోచుకోలు కబుర్లు చెప్పేవారిని అడిగితే బావుంటుంది. దారిద్ర్య నిర్మూలన ముఖ్యమా, ఈ కబుర్లూ, కాకరకాయలు ముఖ్యమా అని వారిని నిలదీయండి. అంతో ఇంతో మానవ హక్కులకోసం, అభ్యుదయం కోసం కృషి చేస్తున్నా కాబట్టి మీ ప్రశ్నలకు నేను అర్హుడిని కాదు.

@ ప్రేమిక
ధన్యవాదాలు. మీలాంటి కొంతమంది అయినా ప్రోత్సహిస్తే ఉత్సాహంగా వుంటుంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

సత్యవతి గారు ఈ టపాను చూడలేదో, చూసి కూడా ఇంకా స్పందించడం లేదో తెలియడం లేదు. సత్యవతి గారికి ఈ టపా గురించి ఒక ఈమెయిల్ పంపుదాం. నా దగ్గర వారి ఈమెయిల్ ఐడి వుండాలి కానీ దొరకడం లేదు. ఎవరి దగ్గరనయినా వుంటే దయచేసి నాకు తెలియజేయగలరు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

హమ్మయ్య. కొండవీటి సత్యవతి గారి ఈమెయిల్ ఐడి దొరికింది లెండి. ఈ టపా గురించి వారికి ఈమెయిల్ ఇచ్చాను. వేచి చూద్దాం.

snkr చెప్పారు...

//మీ ప్రశ్నలను అస్తమానం పోచుకోలు కబుర్లు చెప్పేవారిని అడిగితే బావుంటుంది.//

మీతో పాటు ఇంకా ఎవరైనా వున్నారా? వాళ్ళూ చూసే వుంటారు లెండి, స్పందిస్తారని ఆశిద్దాం.
మీ వ్యూహాత్మ స్పందన నిరాశ, నిస్పృహ లను కలిగించింది. :)

Satyavati చెప్పారు...

శరత్ కుమార్ గారూ
నమస్కారం.
మీ బహిరంగ లేఖ చూసాను.
నేను గత సంవత్సరం ఆగష్ట్ భూమికలో మీరు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన అంశం మీద సంపాదకీయం రాసాను.మీ ప్రశ్నలకు అందులో సమాధానాలున్నయి.

అభినందనలతో
సత్యవతి కొండవీటి

......సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్‌, లెస్బియన్స్‌ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు, ముంబయ్‌, కలకత్తాలో కూడా ఇలాంటి ర్యాలీలు జరిగాయి. మొట్ట మొదటి సారి పెద్ద సంఖ్యలో వీరు ప్రదర్శనల్లో పాల్గొని నినాదాలతో కదం తొక్కారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 377 రద్దుచేయాలని, రద్దు చేయకూడదనే వాదనలు జరుగుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతీయ మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌) మొత్తం ఈ తీర్పుకు అనుకూలంగా స్పందించడంతో పాటు మొదటి పేజీల్లో పతాక శీర్షిక కథనాలను ప్రచురించాయి. పాజిటివ్‌ దృష్టిికోణంతో ఆర్టికల్స్‌ ప్రచురిస్తున్నాయి. దీనివల్ల జరిగిన మేలు ఏమిటంటే -ఇంతకాలం-మొదటి దశలో వున్న హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ పట్ల ప్రజల్లో వున్న 'స్టిగ్మా' లాంటిది ఈ అంశంలోనూ మెల్లగా కరగడం మొదలైంది. ఒక ఆరోగ్య కరమైన చర్చకు ఇది తెరతీసింది.
అయితే మత నాయకులు, సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇది భారతీయ సంస్కృతి కాదని, దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని గగ్గోలు పెడుతున్నారు. సుప్రీమ్‌ కోర్టులో ఈ తీర్పును నిలిపివేయాలంటూ అప్పీల్‌ కూడా చేసారు. అయితే సుప్రీమ్‌ కోర్టు స్టే ఇవ్వలేదు. ఒక వ్యక్తి హోమోగానో, లెస్బియన్‌గానో వుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమౌతుంది? వారి వారి పుట్టుకతో భిన్న లైంగిక ధోరణులను కలిగి వుండే వ్యక్తులు నేరస్థులు ఎలా అవుతారు? వారి భిన్నమైన లైంగికత వల్ల వారు మొత్తంగా నేరం చేసినట్లు సెక్షన్ 377 కింద కేసులు బుక్‌ చేయడం లేదా చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ ఈ రోజున ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అంతే కాకుండా భారతీయ కుటుంబాల నాశనం అంటూ జరిగితే అది పురుషుల హింసాయుత ప్రవృత్తులవల్లే జరుగుతుంది. ఇటీవల కాలంలో స్త్రీల పట్ల పెరిగిపోతున్న హింసా ధోరణులు, తాగుడు, కుటుంబ హింస, కట్నం హత్యలు, పిల్లలపై దాడులు వీటిని గురించి మాట్లాడని వారంతా ఇపుడు సంస్కృతి పేరుతో 'గే'ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. స్త్రీలపై అమలవుతున్న భయానక హింస భారతీయ సంస్కృతిలో భాగమా? దీన్ని మన సంస్కృతికి వ్యతిరేకమని వీళ్ళు ఎందుకు మాట్లాడరు? భారతీయ సంస్కృతికి, కుటుంబానికి, వివాహ వ్యవస్థకి ముప్పు వాటిల్లబోయేది పురుషుల ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణుల వల్లనే తప్ప తమ మానాన తాము బతికే ''ఎల్‌జిబిటి''ల వల్ల కాదు అనేది స్పష్టం.
ఇటీవల ఒక సర్వే ప్రకారం 10% మంది భిన్న లైంగిక ధోరణులను కలిగివున్నారని, వీరినెవ్వరూ తయారు చెయ్యలేదని, వీరంతా పుట్టుకతోనే, బయలాజికల్‌గా ఈ ధోరణులను కల్గి వున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు హాస్టల్స్‌లో వుండేటపుడు 'గే' లుగా తయారవుతారని, కౌన్సిలింగుద్వారాను, సైకియాట్రిక్‌ చికిత్స ద్వారాను వీరిని నయం చేయవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. అయితే 'గే'లుగా బతికే పురుషులు స్త్రీలతో లైంగిక సంబంధాలని ఇష్టపడరని, అలాగే లెస్బియన్‌లుగా బతికే స్త్రీలు పురుష సంపర్కాన్ని ఒప్పుకోరనేది కూడా విదితమే. సైకియాట్రిక్‌ కౌన్సిలింగుద్వారా వీరిని నయం చేయవచ్చనే వాదం పై విధంగా వీగిపోతుంది.
ఢిల్లీ హైకోర్టు 377 మీ ఇచ్చిన తీర్పు 'గే' హక్కులపై ఒక విస్పష్టమైన, విస్తృతమైన చర్చకి దారితీయడం సంతోషిించాల్సిన అంశం. ఎందుకంటే ఒక అంశాన్ని కార్పెట్‌ కింద దాచేసినట్లు దాచేస్తే ఆ అంశం ఉనికి లేకుండా పోదు. దాని పట్ల నిగూఢతను, స్టిగ్మాను కొనసాగించడం కాక బహిరంగంగా ఒక చర్చను లేవనెత్తడం అవసరం. మంచి, చెడ్డలను చర్చించడం అవసరం.
రాజ్యాంగ విరుద్ధమైన ఒక ఐపిసి సెక్షన్ (377) 149 సంవత్సరాలుగా కొనసాగడం చాలా అన్యాయమైన విషయం.. వ్యక్తి స్వేచ్ఛకు, ఛాయిస్‌కు సంబంధించిన భిన్నమైన లైంగిక జీవన విధానం నేరమని చెబుతూ వారిని హింసించడం అమానుషమే అవుతుంది. ప్రజలు తమ కిష్టమైన, నచ్చిన విధానంలో (ఎదుటి వారికి కష్టం, నష్టం కల్గించకుండా) బతికే తీరును, బతుకుతున్న విధానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందిందే కాదు.
దీనిమీద చెలరేగుతున్న వాదోపవాదాలను గమనిస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్‌ ఎల్‌జిబిటి (లెస్బియన్‌ , గే, బైసెక్సువల్‌ మరియు ట్రాన్స్‌ జెండర్‌)లుగా జీవనం సాగిస్తున్న వారికి లీగల్‌ సపోర్ట్‌ నిచ్చింది గానీ సామాజిక సమ్మతి చాలా దూరంలో వుందనిపిస్తోంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

సత్యవతి గారూ,
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ విషయాల పట్ల మీకు వున్న పాజిటివ్ దృక్కోణం నన్ను సంతోషపరచింది.