శరత్ - పేరు గొప్ప ఊరు దిబ్బ

ఈ శరత్ గాడు బావుంటాడా, బావుండడా అని ముసుగు ఫుటో పెట్టిన దగ్గరి నుండీ కొద్దిగా చర్చ మొదలయ్యింది. అది అంతర్జాతీయ సమస్య కాకముందే కాస్త క్లారైటీ ఇవ్వాలని ఈ పోస్టు.

అందరికీ లాగే నా యవ్వనంలో నాకు కొంతమంది అమ్మాయిలు బంధుమిత్రులుగా వుండేవారు. నా ఆజానుబాహుత్వంతో కాకపోయినా నా రొమాంటిక్ మాటలతో కొంతమందినయినా కట్టి పడేస్తుండేవాడిని. అలా తెగ ఇంప్రెస్ అయిపోయి నా గురించి తమ స్నేహితురాళ్ళకి తెగ బాగా చెప్పేవారు. ఎప్పుడన్నా అలాంటి స్నేహితురాళ్ళను కలిసినప్పుడు వారు శరత్ అంటే ఏంటో ఊహించుకున్నాం- వీడేంటీ ఇలా పొట్టిగా ఇలా వున్నాడు అని మా లేడీ బంధుమిత్రులతో గుసగుసలాడేవారుట.

అది విని నన్ను నేను కాకుండా నన్ను పుట్టించిన అమ్మానానలను తిట్టుకునేవాడిని. అలా అలా ఆ వ్యాఖ్యలు అలవాటయి పోయి మొత్తమ్మీద నా పొట్టితనం మార్చలేను కాబట్టి అంగీకరించేసాను. అలా అంగీకరించాక ఇహ నాకు దానివల్ల బాధ కాకుండా నవ్వు వస్తుండేది. నా ఎత్తు 5' 3'' మాత్రమే. నా బరువు 52 కేజీలు. ఇంకా గొప్ప పర్సనాలిటీ వుండమంటే ఏం వుంటుంది చెప్పండి? హేండ్సం అని పిలిపించుకునే భాగ్యం ఈ జన్మకి లేదు కాబట్టి వచ్చే జన్మలో చూసుకుందాం. అప్పుడు మీరు కూడా మళ్ళీ బ్లాగర్లై పుట్టండేం! అప్పుడు చూసుకుందాం.

నా పెళ్ళయిన రెండో రోజు మా ఆవిడ ఇలా అంది "వైట్ బాగానే వున్నావు కానీ ఇంకొద్దిగా హైట్ వుంటే బావుండేది". మన చేతుల్లో లేని విషయం కాబట్టి లైట్ తీసుకున్నాను. అయితే నన్ను పొట్టోడు, పొట్టోడు అని గేలిచేయడం మొదలెట్టింది. మరి రెండు సార్లు నన్ను పెళ్ళి చూపుల్లో చూసావు కదా ఎందుకు పెళ్ళి చేసుకున్నావు అని అడిగాను. మా నాన్న చేసుకొమ్మని చెప్పాడూ అంది. మరి నువ్వు కూడా పొట్టిదానివే కదా అంటే ఆడాళ్ళు పొట్టిగా వుండొచ్చు పర్లేదూ అంది. ఆమె ఎత్తు 5'1''. నా తల ఎక్కడ కొట్టుకోవాలో, పెట్టుకోవాలో అర్ధం కాలేదప్పుడు. నేను పొట్టివాడిననే విషయం ఎప్పుడో మరచిపోయాను - నువ్వు మళ్ళీ కెలక్కు అని స్ట్రిక్టుగా వార్నింగ్ ఇచ్చాను. అప్పటినుండీ నన్ను గేలిచేయడం మానివేసింది.

క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు కొంతమంది బాల్య మిత్రులు వారి ఇళ్ళళ్లకు రమ్మన్నారు. వారి ఇళ్ళళ్లకు వెళ్ళి చాలా ఏళ్ళు అయ్యింది. నేను వెళ్ళాక నన్ను చూసి వారి పిల్లలు డిజప్పాయింట్ అయ్యారు. శరత్ అంటే యు ఎస్ నుండి వస్తున్నాడంటే ఎలా వుంటాడో, ఎంతెత్తు వుంటాడో, ఎంత బావుంటాడో అనుకున్న వారంతా నా పిట్ట ప్రాణం చూసి పెదవి విరిచారు. మళ్ళీ మా అమ్మా నానలను తిట్టుకున్నాను.

అయినా శారీరకంగా బావుండటంలో ఏం వుంది లెండి, మనస్సు బావుండాలి కానీ కదా. మరి నా మనస్సు మరీ విశా...లం కదా. ఇంకా లోటేం వుంది. సినిమాలలో పొట్టి కమెడియన్లను గేలి చేస్తున్నప్పుడు మనస్సు చివుక్కుమంటుంది కానీ ఏం చేస్తాం - మనమూ నవ్వుతాం. ఏడవలేక నవ్వుతాం :)) ఇలాగే. ఇప్పుడు ఇండియా వెళుతున్నా కాబట్టి కొంతమంది బ్లాగర్లను కలుస్తాను కాబట్టి వారు నాముందే పెదవి విరిచేయకుండా ఇలా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నానన్నమాట ;)

13 comments:

  1. ఎమిటి టైగెర్ శరత్ ఎత్తు మరీ 5-3 ?? ఎవిటండి నిజమేనా ???

    ReplyDelete
  2. " పేరు గొప్ప ఊరు దిబ్బ " కన్నా... " పిట్ట కొంచం కూత ఘనం " అని టైటిల్ పెట్టాల్సింది....

    ReplyDelete
  3. @ మంచు - నిజమే. నామీది కొన్ని మంచి(?!) అపోహలు తొలగాలనే ఇది వ్రాయడం. పిట్ట కొంచెం కూత ఘనం అని మీరు అనాలి - నాకు నేను అనుకుంటే బావుండదు కదా :D

    ReplyDelete
  4. ఏమిటండి మంచుగారు అలా అంటారు, పులి పొడుగైతే ఏంటి పొట్టైతే ఏంటి? పులి పులే ;)

    ReplyDelete
  5. >> మరి నా మనస్సు మరీ విశా...లం కదా. ఇంకా లోటేం వుంది.

    నిజమా, ఏది కాస్త మీ మనసు వైశాల్యం, ఘనపరిణామం, చుట్టుకొలత చెప్తారా, ఎంత విశాఆఆఆఅలమో మాకు అప్పుడు బాగా అర్దం అయ్యేది..

    ReplyDelete
  6. అయినా ఇంతకు ముందు మీరు కొత్తపాళీ, శ్రీగారితో దిగిన ఫోటోలు చూసేశాం కదా మళ్ళీ ఈ ప్రిపరేషన్ ఏంటి?
    అయినా ఎత్తు ఎంతుంటే ఏంటి? ఏదైనా ఓపెన్ గా చెప్పేసే మా శరత్ గారి మనసు బంగారం... :)

    ReplyDelete
  7. ee manassu bagundatam ammayilaku kuda konchem apply cheyyandi... ammayya chance vachesindi..

    edo urike annalendi mi peree bagundi ani. nijam ga parady ne.. fun kee.

    ettu lone anta undi antara, edi ledu anukuntamo ade focus chestam kada.. mi positive things gurinchi focus cheyyandi.. appudu boldenta confidence.

    ReplyDelete
  8. @ వెంకట్ - కదా. పొట్టి పులులు వుండవా ఏంటీ?
    @ తార - ఈసారి మనం కలిసినప్పుడు మీరే స్వయంగా కొలుద్దురు గానీ - తొందరెందుకూ :)
    @ రవిచంద్ర - సర్లెండి. అందరూ మీలాగా కళ్ళప్పగించి నా ఫోటో చూస్తారా ఏంటీ. కొంతమంది సిగ్గుపడి కళ్ళుమూసుకుంటారు కదా. అలాంటి వారికోసం. పైన మంచు కామెంటు చూడండి. మంచు నా ఫోటో చూడనే చూడలేదనుకుంటా.
    @ అజ్ఞాత - మీరు సరదాగానే అన్నారని తెలుసు లెండి. ఎలాగూ ఇండియా వెళుతున్నా కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. సమయం వచ్చింది కాబట్టి ఎత్తు గురించి ఒకసారి వెళ్ళబోసుకున్నాను కానీ నాకు అసలు పొట్టివాడిననే గుర్తుకు వుండదు సుమండీ. ఆత్మ న్యూనత ఏమీ లేదు కానీ అలా అని వాస్తవాలని రిజెక్ట్ చేయడం బావుండదు కదా.

    ReplyDelete
  9. >> @ వెంకట్ - కదా. పొట్టి పులులు వుండవా ఏంటీ?

    వుంటాయి,వుంటాయి, ఎందుకుండవు కానీ వాటిని పిల్లులు అంటారు..

    ReplyDelete
  10. చూసా... చూస్తే మాత్రం .. ఎదొ పైపైన చూస్తాం కానీ... పొడుగు చుట్టుకొలతలు చూడటానికి అక్కడ అమ్మాయిలు ఎవరు వున్నారు...

    ReplyDelete
  11. శరత్, రాజమౌళి మర్యాద రామన్న మీద మరి ఆశలు పెట్టుకోకుండా
    ఆడియో రిలేజ్ అప్పుడే కధ రివేల్ చేసినట్టు మీరు ఇండియా రాకుండానే
    జనాల్ని మెంటల్ గా ప్రిపేర్ చెయ్యడం బానే వుంది .

    ReplyDelete
  12. మరేం భయపడకండి...ఎత్తులో మీకు తోడుగా నేనున్నాను... :-))నా ఎత్తు కూడా 5' 3''. :-))).. నాకు ఎత్తుతో ఇంతవరకు ఎటువంటి సమస్యలూ రాలేదు...

    ReplyDelete
  13. అయ్ బాబోయ్! అంత ప్రిపరేషన్ యెందుకు?

    నాకు 23 యేళ్లు నిండేసరికి నా యెత్తు 5' 4". సన్నగా, మీలా 'ఛబ్బీ' ఛీక్స్ తో కాకుండా, 'హై ఛీక్ బోన్స్' తో వుండి, అంత పెద్ద హీల్స్ కాక పోయినా, మీడియం హీల్స్ షూ వేసుకొని, 'హేండ్సమ్' అనే అనిపించుకున్నాను. పైగా ఖరీదైన బట్టలూ, కూలింగ్ కళ్లజోడొకటి! (అప్పట్లో బ్యాంకు గుమాస్తా అంటే, ఇప్పటి సాఫ్ట్ వేర్ టీం లీడరు తో సమానం!)

    అప్పటి "అమ్మాయి" బంధు మిత్రులు కూడా, నామీద అలాంటి కామెంట్లు యెవరి దగ్గరా చేసినట్టులేదు!

    ఇప్పుడుకూడా, (నా బరువు 65 కేజీలు) వాళ్లని దగ్గరకు తీసుకొని, కామెంటు చేస్తే, చిలకల్లా కులుకుతారు!

    మా ఆవిడ మాత్రం "దిగొచ్చాడండీ! అపర మన్మధుడు" అని ఇప్పటికీ ఈసడిస్తూంటుంది!

    చెప్పేదేమిటంటే, హైటూ, వెయిటూ లో 'నేమున్నది?'

    ReplyDelete