ఓ హీరోయిన్ (గతంలో) మా ఇంటికి వచ్చిన వేళ...

సూర్యాపేటలో కొత్తబస్టాండుకి దగ్గర్లోనే నేషనల్ హైవేకి కొద్ది దూరంలోనే మా ఇల్లు వుండేది. సూర్యాపేటలోని ఒక ముఖ్యమయిన రోడ్డు మా ఇంటి మీదుగానే వెళుతుంది. అప్పుడు ఇంటరో, డిగ్రీనో వెలగబెడుతున్నాను. మరి ఆ రోజు ఆదివారమో లేక లేజీ కాలేజీ ఎగ్గొట్టి పడుకున్నానో తెలియదు కానీ మధ్యాహ్నం ఎంచక్కా మస్తు నిద్రపోయాను. 

మా అమ్మ హడావిడిగా నిద్రలేపుతుండటంతో మా కొంపేమయినా అంటుకుపోయిందేమోనని ఉలిక్కిపడి లేచాను. సినిమా స్టార్ జయ... వచ్చిందిరా మనింటికీ, లేరా లేరా అని మా అమ్మ నిద్ర లేపుతోంది. ఎదురుగ్గా ఓ ఆడ ఆకారం నా గదిలోకి తొంగిచూస్తూ చెక్క బీరువాకు అంటించిన సినిమా తారల పోస్టర్లు పరికిస్తూ ఓ ఇంట్లో ఎవరో సినిమా అభిమానులున్నారే అంటోంది. అప్పుడు వెలిగింది నాకు - ఆమె ఎవరో. సంభ్రమాశ్చార్యాలతో పడక మీదినుండి దిగ్గున లేచాను.

'మా చిన్నోడు, సినిమాలంటే బాగా ఆసక్తి' అని నన్ను పరిచయం చేసింది మా అమ్మ. అలాగా అంటూ మా అమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ బయటకి నడుస్తోంది ఆమె. ఆమెతో బాటుగా నేను కూడా నిద్రలో నడుస్తున్నట్లుగా బయటకి నడిచాను. ఆమె వెళ్ళి కారులో కూర్చునే ముందు "మద్రాస్ ఎప్పుడయినా వస్తే తప్పకుండా మా ఇంటికి రండి" అని చెప్పింది నాకు. అలాగే అని గంగిరెద్దులాగా తల ఊపాను. కారు వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయాక మా అమ్మతో పాటుగా ఇంట్లోకి నడుస్తూ "నేనేమయినా కలగంటున్నానా?" అని అమ్మని అడిగాను.  అమ్మ నవ్వి "అదేం లేదు. నిజంగానే వచ్చింది. నువ్వు మెలకువగానే వున్నావు" అంది.  గిచ్చి చూసుకున్నాను. నిజమే. మెలకువలోనే వున్నాను. మరి ఆ ప్రముఖ కథానాయకి మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఆమెతో మాకు పరిచయమూ లేదు, స్నేహమూ లేదు, చుట్టరికమూ లేదు! అదే ప్రశ్న మా అమ్మని అడిగాను ఉత్సుకతతో.  మా అమ్మ నవ్వి ఆమె ఎందుకు వచ్చిందో చెప్పనారంభించింది...అమ్మ చెప్పింది అంతా విన్నాక ఆ వచ్చినామేదో నా అభిమాన హీరోయిన్ అయివుంటే ఇంకా సంతోషించేవాడిని కదా అనుకున్నాను.

మీరెవరయినా ఆమె మా ఇంటికి ఎందుకు వచ్చి వుండవచ్చో ఊహించగలరా? పైన కొన్ని క్లూలు ఇచ్చాను.

11 comments:

  1. > ఓ హీరోయిన్ మా ఇంటికి వచ్చిన వేళ...
    హో ఇంతకుముందు సూర్యాపేటలోనా!
    ఇప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నారని హీరోయిన్ మీ ఇంటికి వచ్చింది అనుకున్నాను :-)

    ReplyDelete
  2. క్లారిటీ కోసం టైటిల్లో గతంలో అని చేర్చానిప్పుడు :)

    ReplyDelete
  3. she wanted to use your restroom. Jayaprada or sudha?

    K

    ReplyDelete
  4. ఎందుకంటే.. మీ ఇళ్ళు హైవే కి దగ్గరగా ఉండటం వల్ల.... మంచి నీళ్ళ కోసమో, పాట పాడటానికో వచ్చింది....

    ReplyDelete
  5. @ అజ్ఞాత, అజ్ఞాత, తెరెసా
    వార్నీ, అందరూ తేలిగ్గానే ఊహిచేస్తున్నారే! అంత తేలిగ్గా ఎవరింటికి పడితే వారింటికి ఈరోయిన్నులు పాటపాడటానికి వెళతారా ఏంటీ?

    నిజమేలెండి. పాటపాడటానికే వచ్చింది. కొత్తగుడెంలో ఏదో వస్త్రాలయ ప్రారంభోత్సవానికి వెళుతోందిట. బస్ స్టాండుకి గానీ, మరో చోటికి గానీ వెళితే జనాలు గుర్తుపట్టి ఇబ్బంది అవుతుందని మా ఇల్లు కనపడి మా ఇంటికి వచ్చింది. ఆమె పేరు జయచిత్ర. నా అభిమాననటి అయిన జయప్రదనో లేక జయసుధనన్నా వచ్చివుంటే ఇంకా బావుండేదని అనుకున్నాను. మొత్తానికి మళ్ళీ జయచిత్ర ఇంటికి వెళ్ళి నా పాట నేను పాడి బాకీ చెల్లించడానికి అవకాశమే రాలేదు.

    ReplyDelete
  6. హీరోయిన్ జయచిత్ర, నక్సలైట్ లీడర్ రాధక్క ..... మరి తరువాత?

    ReplyDelete
  7. ఈ టపా కూ ఈ కామెంటుకూ అస్సలు సంబంధం లేదు. బ్లాగులు చూడటం కొంచం లేటు ఐంది.మీర్రాసిన పోస్టుల్లో నేను స్పందించగలిగిన పోస్టులకు కామెంట్లు రాసినట్లే గుర్తు. మీ వదిన గారి గురించిన టపా, మీ పెద్ద పాప గురించిన టపా లాంటివి. ఇప్పుడు నేను కామెంట్ వ్రాయాలా లేదా? అర్ధం కావడం లేదు!

    ReplyDelete
  8. బాకీ చెల్లించడం మీకు కుదర్డు లెండి... ఏ రోడ్డు పక్కనో పాడేత్తారు మీకు అవసరం ఐతే??హీ..హీ...

    ReplyDelete
  9. నేనింకా ఏదో అనుకున్నా. ఈ మద్య inception సినిమా చూసి అలా రాసావేమో అని..

    ReplyDelete
  10. @ స్నేహితుడు - ఇంకా చిన్నచిన్నవి వున్నాయిలెండి - నెమ్మదిగా చెబుతా :)
    @ సునీత - ఎలాగయితేనే వేసేసారుగా కామెంటు - మీకు ఓ పని అయిపోయింది :)
    @ kvsv- ఏంటండీ నా పాట అంటే మీకు అంత చులకనయిపోయిందా! ఆయ్! నా పాట ఎంత విలువయిందో వ్రాస్తా చూడండి.
    @ నెలబాలుడు - హ్మ్. నా కలల సౌధాలు అన్నీ వ్రాసుకుంటే జనాలు ఊరుకోరు లెండి :)

    ReplyDelete