అక్కడే ఆగిన ఆడ లేడీ బ్లాగర్స్ - 2

ఇంతకుముందు టపాలో నేను ప్రస్థావించినటువంటి విషయాలు బహిరంగంగా చెప్పుకోలేకపోతే సీత గారిలా అజ్ఞాతంగా అయినా చెప్పుకోవచ్చు. చెప్పడం, అలాంటి సమస్యలను వెలికితీయడం, చర్చించడం, పరిష్కారాలు వెతకడం అన్నవి కాలక్షేపానికి కాలక్షేపం ఇవ్వడంతో పాటుగా, మెదడుకి పదును పెడుతాయి. కొందరికి పరిష్కారం చూపిస్తాయి. మీ ఇంట్లో సొరకాయ ఎంత పొడుగు వుంది, మా ఇంట్లో సొరకాయ ఇంత పొడుగు వుంది, పంట పొలాల్లో పాట లాంటి నా టపాలాంటి చచ్చు పుచ్చు  టపాల కన్నా అవి చాలా వరకు బెటర్.

సరే, అవి వ్రాస్తే మాకేంటి? అని అడుగుతున్నారు. ఇపుడు మీరు వ్రాస్తున్నవి చదివితే మాకేంటి అని అడుగుతున్నాను నేను! ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్రాస్తారు అన్నది నిజమే. అందరూ అలాంటివి వ్రాయాలని కాదు గానీ కొందరయినా , ఒక్కరయినా వ్రాయట్లేదే అన్నదే నా చర్చ. పోలోమంటూ అందరూ కడివెడు కడివెడు కన్నీళ్ళు బ్లాగుల్లో కుమ్మరించినా ఏడుపుగొట్టు సినిమాల్లా మళ్ళీ బ్లాగులోకానికి కూడా దూరంగా వుండాల్సివస్తుంది. అంచేతా, మై డియర్ లేడీ బ్లాగర్స్, అందరినీ వ్రాయమని ఉచిత సలహా ఇవ్వలేదు, కొందరినన్నా వ్రాయమని కోరాను - వైవిధ్యం కోసం. ఓక్కే? అవన్నీ వ్రాయడం కష్టం కదా - చేతులూ, వేళ్ళూ, కళ్ళూ ఎంత నొప్పెడతాయీ. హమ్మో అన్ని త్యాగాలు చేయాలా అన్నది వారి మరో ప్రశ్న. వద్దు, అన్ని త్యాగాలు చేసి త్యాగమూర్తులు కావద్దు. నిజంగా వ్రాయలనుకున్నవారు ఆ నొప్పులకు సిద్ధమయే వుంటారు. వ్రాస్తే మాకేం వస్తుంది అన్నది ఒక ముఖ్యమయిన ప్రశ్న. ఇప్పుడేం వస్తోందేం? ఎవరయినా టిక్కెట్లు పెట్టి కొనుక్కొని చదువుతున్నారా? ఇప్పుడేం వస్తోందో అవి వ్రాస్తే ఆ వచ్చేవేవో ఇంకా బాగా వస్తాయి. గ్యారంటీ. లిస్టు చెప్పండి - బ్లాగులు వ్రాయడం వల్ల మీకు కలుగుతున్న ఉపయోగాలు.

అదే విషయం మొగాళ్ళకి చెప్పొచ్చు కదా అంటారు. ఇది ఎలా వుంటుందంటే పక్కోడికి చాక్లెట్ ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదు అని ఫిర్యాదు చేసినట్లు. నాతో సహా ఇంకో ఇద్దరయినా అప్పుడప్పుడయినా వ్రాస్తున్నారు. అందులో ఓకటి సంకలినిల్లో రాకపోవచ్చు. పేర్లొద్దు లెండి - మళ్ళీ ఎదవ గొడవ మొదలవుతుంది. వారు అన్నీ కాకపోయినా, ప్రతీసారి కాకపోయినా అప్పుడప్పుడయినా కాస్త వైవిధ్యం కురిపిస్తున్నారు. ఇహ మిగతావారంటారా? నువ్వెవడివి బే మాకు చెప్పడానికి - పంజూసుకో అంటారు. మీరయితే మెత్తని హృదయం కాబట్టి తిట్టినా సరే దెబ్బలు తగలవు. అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాను. ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్పమంటారు మరి? ప్రతి అడుగూ ఆలోచించీ చించీ వేస్తామా? కొన్ని అడుగులు అలా అలా అలవోకగా పడుతాయి. కుడికాలు ముందు వేస్తే ఎడమకాలు అలుగుతుందా? ఏది ముందు, ఎవరు ముందు అనేది ముఖ్యం కాదు - ఇసయం, ఇసయం ముక్కెం.

మరి మీరు మాత్రం అన్నీ వ్రాస్తున్నారా అన్నది కొందరి ప్రశ్న. నేను పబ్లిగ్గా వ్రాస్తున్నాను. నాకో కుటుంబమూ వుంది. అందువల్ల నేను ఎంత వ్రాసుకున్నా 10% మాత్రమే వ్రాయగలను. 90% రహస్యాలు, సమస్యలు నేను వ్రాయలేను. అదే అజ్ఞాతంగా వ్రాసివుంటే కేవలం 10% కప్పిపుచ్చి మిగతా 90% వ్రాయడానికి అవకాశం వుండేది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళి స్వేచ్చగా వ్రాసుకుందామనుకున్నా కుదరదు. నా శైలి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈజీగా మీరందరూ గుర్తుపడతారు. ఇహ రౌడీ అయితే ఈ బ్లాగులో ఎన్ని చుక్కలు వున్నాయి, ఆ బ్లాగులో ఎన్ని చుక్కలు వున్నాయి లెక్కలు పెడతారు :)  

ఇహ ఆ పది శాతం విషయాలు కూడా కేవలం నా గురించి మాత్రమే వ్రాసుకోగలను. నా దగ్గరి వారి గురించి వ్రాయడానికి వారికి ఇష్టం వుండాలి కదా. వారూ మీలాంటి గొర్రెలే కాబట్టి వారు అందుకు ఇష్టపడరు, అనుమతించరు. అలా అనుమతి ఇవ్వకపోయినా వ్రాసే గట్స్ లేవా అంటే అది గట్స్ కి సంబధించిన విషయం కాదు. ఒకరి అనుమతి లేకుండా ఒకరిని గుర్తించేలా బయటకి చెప్పకూడని విషయాలు వ్రాయడం నా దృష్టిలో భావ్యం కాదు. మీ దృష్టిలో భావ్యం అయివుండవచ్చు.

నా గురించి నేనే చాలా వరకు బాధ్యుడిని కాబట్టి నా గురించి కొంతయినా వ్రాసుకోగలుగుతున్నాను. మిగతా ఎవ్వరూ అలాంటివి వ్రాయలేని పరిస్థితుల్లో ఆ మాత్రమూ ఎక్కువే. అయితే అప్పుడప్పుడయిన్న నా బ్లాగుల్లో ఇతరుల వివరాలు మార్చి నాకు తెలిసిన ఆడవారి సరదాలూ, వ్యధలూ, సవాళ్ళూ, శృంగారాలూ ఏకరువు పెడదామనుకుంటున్నాను. ఏం చేస్తాం మరి, మీలో ఎవరూ సరిగ్గా ముందుకు రాకపోతే?

అలాంటివి ఎవరూ వ్రాయకపోతే కొత్తగా వచ్చేవారు బ్లాగుల్లో చాలా పద్ధతిగా వుండాలేమో అని భ్రమపడాల్సివుంటుంది. నెట్టులో వున్న గొప్ప విషయం ఎనానిమిటీ. అనవసరంగా పబ్లిక్ బ్లాగరయ్యానేమో అనిపిస్తుంది. ఈ లేకి అజ్ఞాతల చిరాకుకు మంచి మందు మనం కూడా అజ్ఞాతంగా వ్రాయడమే. నేను కూడా అలా అజ్ఞాతంగా కామెంట్లు వ్రాసివుంటే నేను వేసిన చిన్న చిన్న సన్నాయి నొక్కులకు కూడా ఈరోజు ఇలా సౌమ్య నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడానికి అవకాశం వుండేది కాదు. ఏం చేస్తాం - కామెంట్లన్నీ పబ్లిక్ గానే వెయ్యాలనేది నా కమిట్మెంట్. అందువల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు వస్తుంటాయి. సరే.

సొ, పబ్లిక్ బ్లాగర్లకి అంత స్వేఛ్ఛ లేదు కానీ ఎనానిమస్ బ్లాగర్లకి పూర్తి స్వేఛ్ఛ అని కాదు గానీ చాలావరకు స్వేఛ్ఛ వుంది. మన మనసంతా బ్లాగులో పరిచే అవకాశం వుంది. అందువల్ల నెట్టులోని ఎననిమిసిటీని ఎడ్వంటేజీగా తీసుకొని ఎవరయినా తమ మనస్సును విప్పిచెప్పాలనుకుంటే వారికి ఇదే నా అభినందన. అలా అని ఏది వ్రాసినా చెల్లుతుంది అని కాదు. చట్టవ్యతిరేకమయిన వ్రాతలు వ్రాస్తే ప్రభుత్వం దగ్గర అజ్ఞాతల ముసుగులు తీసి బయటపడేసే పద్ధతులు వుంటాయి. మాకేం వస్తుంది, మాకేం లాభం లాంటి శషభిషలకు పోకుండా వ్రాయాలనిపించింది, పరచాలనిపించి పరిచేయడమే.

ఓ సాధారణ జీవనం గడపడానికీ, ఓ సాహసోపేతమయిన జీవితం గడపడానికి ఎలాంటి తేడా వుందో అలాగే సాధారణ వ్రాతలు వ్రాయడానికీ, సాహసమయిన వ్రాతలు వ్రాయడానికీ మధ్య అలాంటి తేడా వుంటుంది. మీకు బ్లాగుల్లో థ్రిల్ రైడ్ కావాలంటే సాహసోపేతంగా వ్రాయండి, మొగుడి చంకనెక్కడమే పెద్ద థ్రిల్ రైడ్ అనుకుంటే మామూలుగానే వ్రాస్తుండండి. ఛాయిస్ వుంది - ఛాన్స్ తీసుకోండి.

(అయిపోయింది)

12 comments:

  1. అన్నాయ్
    సాహసం అంటే?
    నీకు సాహసం ఇంకొకరికి సిల్లీ అవొచ్చుగా?
    బ్లాగ్ లోనేకాదు ఎక్కడైనా, మనసుకి నచ్చింది రాయాలి అని నా ఉద్దేశం.

    ReplyDelete
  2. ఏదిపడితే అదిరాస్తే, మార్తాండలా అవ్వాల్సొస్తుందని నా ఉద్దేశం.
    అదీ సంగతి

    ReplyDelete
  3. మనం చేసే తప్పులు మర్చిపోయి, ఎవరినో ఒకరిని కార్నర్ చేసి ఏడ్చే లోకంలో సొంత ఐడింటీతో నిజం చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి.

    మీరు ధైరస్థులు.

    ReplyDelete
  4. శరత్చంద్ర గారు,
    ఆడవారి బ్లాగుల మీద మీ విశ్లేషణ కు సంతోషం..మీరే చెప్పారు గా మీరే కొద్దిగా అని, మరి అలాంటప్పుడు అమ్మాయిలు చెప్పలేదనడం ఎంతవరకు? ఎవరిష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటారు కనీసం ఆ స్వేచ్చ కుడా లేదా!! మీ ఇష్టం మీది వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎవరికీ రాయాలనిపించింది వాళ్ళు రాస్తారు ఒకళ్ళు రాయమంటే రాయరు.....ఎనీవే చాలా సంతోషం మీ విశ్లేషణ వ్యాసానికి

    ReplyDelete
  5. ఎవరిష్టం వారిది అని చెప్పిన మీరే ఇలా అనడం భావ్యమా...??
    తీపి సంఘటనలు మాత్రమే పంచుకొవాలనుకుని రాస్తుండవచ్చు...అలాగే ఒకే లాంటి సంఘటనలకు అందరూ ఒకేలాగా స్పందించాల్సిన అవసరం లేదు...వారి పరిస్తితులపై ఆధారపది వుంటుండి...
    అనుమతి లేనిదే ఎవ్వరిగురించి వ్రాయని మీ విచక్షనకు,విజ్ఞతకు మాత్రం నిజం గా జోహార్లు....

    ReplyDelete
  6. ఏది ఆ సీతగారి బ్లాగ్ లంకె ఇవ్వండి చుద్దాం ఎంత రాస్తున్నారో..

    ReplyDelete
  7. ఇసయం, ఇసయం ముక్కెం.

    Super.
    మీరు ధైరస్థులు.

    ReplyDelete
  8. >>>>నా దగ్గరి వారి గురించి వ్రాయడానికి వారికి ఇష్టం వుండాలి కదా. ఒకరి అనుమతి లేకుండా ఒకరిని గుర్తించేలా బయటకి చెప్పకూడని విషయాలు వ్రాయడం నా దృష్టిలో భావ్యం కాదు. మీ దృష్టిలో భావ్యం అయివుండవచ్చు. >>>>

    మొగుడు ఎలా తన్నాడో, ఎక్కడ సిగరెట్‌తో కాల్చాడో రాయమన్నారు. నువ్వెక్కడతన్నావో, నువ్వెక్కడకాల్చావో రాస్తున్నాను, అనుమతి కావాలి అని అడిగితే తన్నినవాడు, కాల్చినవాడు అనుమతిస్తాడు. అనుమతించిన తరువాత రాయడమే భావ్యం.
    ఉదాహరణే అన్నా రాసేముందు కొంచెం ఆలోచించిరాస్తే బాగుంటుంది. మీ నాన్న ఎలా ఉన్నాడు అనడానికీ, మీ అమ్మా మొగుడు ఎలా ఉన్నాడు అనడానికీ చాలా తేడా ఉంది. మీకు తెలియనిదికాదు.

    ReplyDelete
  9. @ భా రా రా - యెప్. నేననేది కూడా అదే. మనస్సుకి నచ్చిందే ఎలాంటి సంకోచాలు లేకుండా వ్రాయమని. అదే పెద్ద సాహసమయిపోయింది ఈ బ్లాగులోకమ్లో!
    @ అజ్ఞాత - మీ అభినందనకి సంతోషంగా వుంది.
    @ చెప్పాలంటే - ఎవరిష్టం వచ్చింది వారు సిగ్గు పడకుండా, ధైర్యంగా వ్రాయమనే నేనూ చెబుతూంట. ఒకే ధోరణిలో వెళుతున్నప్పుడు మనలో వున్న బ్లయిండ్ స్పాటులు మనకు అర్ధం కావు. బ్లాగుల్లో వున్న అలాంటి లోపాన్ని ఎత్తిచూపితే ఎవరయినా పూరించాలని ఇష్టపడుతుండవచ్చు కదా. అందుకే వ్రాసాను.

    ReplyDelete
  10. @ అజ్ఞాత - నేనేమయినా ఇలా వ్రాయమని ఫత్వా ఏమీ జారీ చేయలేదు కదా. బ్లాగుల్లో ఇలాంటి రచనలు కూడా వుంటే ప్రయోజనం వుంటుంది, వైవిధ్యం వుంటుంది అని సూచిస్తున్నానంతే. సూచన నచ్చినవారు అందుకుంటారు - వీడేంటీ బోడి మాకు చెప్పేది అనుకునే మహిళా మేధావులు లైట్ తీసుకుంటారు. వారికి వాలి తోక ఎంత పొడుగుందీ, సుగ్రీవుని తోక ఎంత పొడవుందీ కావాలి కాని ఇలాంటి విషయాలు పట్టవు.
    @ అజ్ఞాత - http://seeta-kaalam.blogspot.com

    ReplyDelete
  11. @ కవిత - నా ధైర్యాన్ని మెచ్చినందుకు సంతోషం
    @ అజ్ఞాత - ఉదాహరణలు కాస్త మొరటుగా వున్నాయంటారు. సరే. మారుస్తాను.

    ReplyDelete
  12. చాలా లేటు గా చూస్తున్నా ..శరత్ గారు మీరు చెప్పేది చాలా బాగున్నట్లు మీకనిపిస్తు౦దా ..అసలు యెవ్వరు ఒక మాట ఎ౦దుకు ప్రస్తావి౦చలెదు..

    మీరు చెప్పినవన్నీ వ్రాయొచ్చు ..యెక్కడ?

    సరె ఇప్పటికె అలా౦టివి వ్రాస్తున్నారు...చాలా మ౦ది స్ప౦దిస్తున్నారు అని మీకు తెలియదా?

    ఎప్పుడు, ఎక్కడ అ౦టారా? ఆ వివరాలు చదివితే మీకే౦ వస్తాది?

    మీరు అవ్వన్నీ ఎ౦దుకు అడుగుతున్నారు...మీ ఇ౦ట్లొ కాని బయట కాని ఉపయోగిస్తారేమో ..(మీరు అ౦టే మీరు కాదు లె౦డి :))

    ReplyDelete