అమెరికాలం: మన దేశీ స్త్రీల అసభ్య వస్త్రధారణ!

పై ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? నవ్వు రావడం లేదూ? ఎందుకు నవ్వు? మన చాలామంది దేశీలు కూడా మా దేశాల్లో మరీ అంతకాదు గానీ బజారుకి వెళ్ళేప్పుడు ఏ బట్టలయితే ధరిస్తారో అవే వేసుకొని స్విమ్మింగ్ పూల్స్ లోకి దిగుతారు. ఇంకా పై ఫోటో నయమే, అది ఏ బీచ్ లోనో కాబట్టి ఫర్వాలేదు. మరి మన స్త్రీలు? ఈ దేశాల్లో వుండి కూడా ఇక్కడి కల్చర్, హైజీన్ పాటించకుండా, బజారు బట్టలు (స్ట్రీట్ క్లోత్స్) వేసుకొని బలాదూరుగా నీళ్ళల్లోకి దిగుతారు. ఇలాంటివాళ్ళుంటారనే అక్కడ నోటీసు కూడా పెడతారు - అలాంటి బట్టలు వేసుకొని నీళ్ళలోకి దిగవద్దని.

మనాళ్ళు ఎన్నడు అలాంటి సూచనలు పట్టించుకోవాలీ. అలాంటి సూచనలు వున్నయ్యే త్రోసిపుచ్చేందుకు కదా. స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటే పరాయి మగ కళ్ళు పడి ఎక్కడ ప్రాతివ్రత్యం భంగం అవుతుందో అని కంగారు. బీచ్ లల్లో, నదుల్లో అయితే ఏ బట్టలు వేసుకున్నా ఫర్వాలేదు కానీ స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ డ్రెస్ కాకుండా అలాంటి బట్టలు వేసుకొవడం సభ్యత కాదు. మరి అలాంటి బట్టలు వేసుకుని ఈతకు దిగే మన వాళ్ళను చూసి ఈ దేశాల వారు మనం పైన నవ్వుకున్నట్టే లోలోన నవ్వుకుంటారని నా నమ్మకం. మరి మీరేమంటారు?

మా ఆవిడ కూడా అంతే. నేను ప్రోత్సహించినా కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలంటే తెగ సిగ్గు. అలాంటప్పుడు స్ట్రీట్ క్లోత్స్ తో స్విమ్మింగ్ చేయడం కన్నా ఊరుకున్నదే ఉత్తమమని నిరుత్సాహపరుస్తూవుంటాను. బీచ్ లకు వెళ్ళినప్పుడు ఫర్వాలేదు కాబట్టి బజారుకి వేసుకెళ్ళే దుస్తులతో జలకాలాడుతూవుంటుంది.

వికిపీడియా నుండి:
As an alternative to a swimsuit, some people wear trousers, underpants or a T-shirt either as a make-shift swimsuit or because they prefer regular clothes over swimsuits. In some countries, such as Korea or Thailand, swimming in regular clothes is the norm while swimsuits are rare. At beaches, this may be more accepted than at swimming pools, which tend not to permit the practice because underwear is unlined, may become translucent, and may be perceived as unclean.

6 comments:

  1. There are a few swimsuits in the market that cover the women down to the knees and not expose the skin. One can try that. Otherwise one can use the regular tights.

    (By the way this is applicable only for the monokinis not bikinis)

    ReplyDelete
  2. I mean to say the tights idea is applicable only to the monokinis (1 piece) and not the bikinis (2 piece)

    ReplyDelete
  3. అసభ్య అనకూడదేమో... అసంధర్భ వస్త్ర ధారణ అనాలేమో.

    ReplyDelete
  4. @ మలక్ - అలాంటి స్విమ్మింగ్ డ్రెస్సులకోసం వెతుకుతూనే వుంది కానీ మాకయితే ఎప్పుడూ కనిపించలేదు.
    @ భావన - అలా కూడా అనొచ్చేమో కానీ బట్టలు తక్కువ వుండాల్సిన దగ్గర ఎక్కువ వుండటం కూడా సభ్యత అనిపించుకోదు అనేది నా ఉద్దేశ్యం.

    ReplyDelete
  5. thokkale... endukante.. manollaki anta good structure undadoo.. inkaa rangoo ledu kaabatti..

    ReplyDelete
  6. "..పరాయి మగ కళ్ళు పడి ఎక్కడ ప్రాతివ్రత్యం భంగం అవుతుందో అని కంగారు."
    మన వాళ్ళకు ఈ కంగారు పరాయి మగవాళ్ళ ముందే కాదు, సొంత మగవాడి ముందు కూడా ఉంటుంది. అలవాటు లేని విషయం అవ్వటం వలన. అలవాటులేని విధం గా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్న వాతావరణానికి దూరం గా ఉండటం మంచిది. అక్కడికి వెళ్ళి అటూఇటూ కాకుండా ఉండటం మంచిది కాదు. ఫిన్లాండ్ సానాల లో మగవారు అండర్వేర్ వేసుకోరు. దిశమొలలతో కూర్చొంటారు. ఒక నాన్నా అతని కొడుకూ కూడా దిశమొలలతో వెళ్ళి సానా లలో కూర్చొంటారు. అండర్వేర్ తో వెళ్తే క్రిములు వస్తాయని సానా నిర్వాహకుడు చెప్పాడు.
    కానీ ఆ విధం గా వెళ్ళటానికి నాకు ఎంబరాసింగ్ గా అనిపించింది. ఇక తరువాత ఎప్పుడూ సానా ల కి వెళ్ళలేదు. ఒకవేళ అండర్ వేర్ తో వెళ్తే నిర్వాహకుడు అడ్డుచెప్పేవాడు కాదని నాకు తెలుసు. కొంతమంది ఇండియన్స్ అలా వెళ్ళారు కూడా. మరి కొంతమంది ఇండియన్స్ దిసమొలల తో కూడా వెళ్ళారు. కానీ, వారి సెన్సిబిలిటీ ని నేనెందుకు కాదనాలి.?

    ReplyDelete