అమెరికన్ సంస్కృతి మరియు జీవన విధానాలను గురించి...

...గురించి వ్రాయాల్సిందిగా ఆబ్రకదబ్రని ఒకరు కోరడం మీరు గమనించేవుంటారు. వారు వ్రాస్తారో వ్రాయరో అన్న సంగతి అలా వుంచి కొన్ని కోణాల్లోంచి, బహుశా సాధారణంగా ఎవరూ పట్టించుకోని కోణాలనుండి నేను ఈ దేశాలను గమనిస్తూవుంటాను. కోణాలు అనగానే గేకోణం అనుకోమాకండి. నాలో ఇంకా శానా కోణాలున్నాయి మరి :) నా బ్లాగుల్లో వైవిధ్యం కోసం అలాంటివి కూడా అప్పుడయినా టచ్ చేస్తే ఎలా వుంటుందని చూస్తున్నాను. వచ్చే వారం నుండే అలాంటి టపాలను కొన్ని వెలువరించి చూస్తాను. చదువరుల ఆసక్తిని బట్టి అలాంటి టపాలు అలాగే కంటిన్యూ చేయడమా లేదా అన్నది ఆలోచిస్తాను.


ఆ రచనలు ఈ దేశాల్లో వుంటున్నవారికి కూడా ఆసక్తికరంగా వుండవచ్చు. ఎందుకంటే అలాంటి విషయాలను గురించి ఎవరి టపాలూ నేను చూడలేదు - బహుశా మనవాళ్ళు అలాంటి సంగతుల మీద దృష్టి పెట్టరనుకుంటా. ఈ హైప్ చూసి ఏం వ్రాయబోతున్నానో అనుకోకండి - అవి మీకు ఉత్సుకత కలిగించక తుస్సుమనిపించవచ్చు. చూద్దాం.

7 comments:

  1. మంచి ఆలోచన వ్రాయండి వ్రాయండి తొందరగా !

    ReplyDelete
  2. I know you sometimes edit comments you don't like, but hope you'll have guts to publish this :

    http://www.narth.com/docs/istheregene.html

    ReplyDelete
  3. also this one :

    http://www.narth.com/docs/hom101.html

    I know publishing this comment won't take anything away from you, nor is it bashing you, so hoping you'll publish it.

    ReplyDelete
  4. శరత్ గారు

    అబ్రకదబ్ర గారిని ఆ కోరిక కోరింది నేనే. మీరు వ్రాస్తానంటున్నారు మంచిదే. మరో నాలుగు మంచి విషయాలు తెలుస్తాయి మాకు. ఆ టపా కోసం ఎదురుచూస్తూ..ఉంటా.

    ReplyDelete
  5. అవును ఈ రోజు మీకు సెలవనుకుంటాను

    ReplyDelete
  6. ఎవరైనా కాకినాడ వాళ్ళు కనిపిస్తే `సుబ్బయ్య మెస్` గురించి అడుగుతా..రెండేళ్ళు అక్కడ వున్నా..మనం ఇచ్చే డబ్బులకన్నా డబల్ ఫుడ్ ఇంట్లోలా వుంటుంది...అలాగే కాకినాడ కాజా..ఆయ్..అనే పిలుపులూ ప్రతీ ప్రాంతానికి..అనేక ప్రత్యేకతలు వుంటాయ్..[మా వూళ్ళో సెల్ ఫోన్ ఈ చేతిలోంచి ఆ చేతిలోనికి మార్చుకొనే లోపు ఎవడో ఒకడు దో..స్తాడు..అలా అన్న మాట].అన్నీ కోణాల్లో...అమెరికా ని ఆవిష్కరించండి...[ఈ మూల కూర్చుని మగ్గి పోతున్నాం]

    ReplyDelete
  7. @ శ్రావ్య
    అలాగే. అప్పుడప్పుడూ వ్రాస్తూ వుంటాను.

    @ వాసుకి
    అలాగేనండి. వ్రాస్తూవుంటా - అప్పుడప్పుడయినా

    @ తార
    యెప్. బ్లాగుకి సెలవయిపోయింది. మళ్లీ బ్లాగు మీద పడ్డా. ఎలాగూ తీరిక వుంది కాబట్టి వీడియో బ్లాగింగ్ మళ్ళీ ప్రారంభించాలని ఆలోచన.

    @ kvsv
    హ హ. అన్ని కోణాల్లో అమెరికాని అవిష్కరించడం నా వల్ల కాదండీ. నా కొన్ని కోణాల్లో నేను నడిపించేస్తానేం.

    ReplyDelete