కామెంటల్-3

కొన్నేళ్ళ క్రితం హిట్స్ HITS అనే బూతు కథల యాహూ గ్రూపులు బాగా చూస్తుండేవాడిని. అప్పట్లో చాలామంది రచయితలు ఎంతో చక్కగా అందులో కథలూ, సీరియళ్ళూ రాసేవారు. నేనుకూడా బూతు కథలు కాకపోయినా సరసమయిన కథలు, సీరియళ్ళూ వ్రాసేవాడిని. అయితే ఎవరి రచనకూ పాఠకులు పెద్దగా స్పందించేవారు కాదు. అందువల్ల రచయితకి తమ రచన ఎలా వుందో తెలియక, ఫీడ్‌బ్యాక్ రాక బాగా నీరసంగా వుంటుండేది. ఒకనాడు బాగా వళ్ళు మండిన రచయిత ఒకరు గ్రూపులో అందరికీ ఒక మెసేజీ ఇచ్చాడు. ఇక్కడ కథలన్నీ చదివి ....మేనా లేక ఎవడన్నా ఈ కథలు ఎలా వున్నాయో అని చెప్పేది వుందా అని బూతులు తిట్టాడు. దానితో చాలామంది చదువరులకు నిద్రమత్తు వదిలి అప్పటినుండీ రచనలపైన వ్యాఖ్యానిస్తూ వచ్చేరు.

నా ఉద్దేశ్యం ప్రకారం ఏ రచయితకయినా విమర్శలు వచ్చినా ఫర్వాలేదు కానీ అసలు స్పందనే లేకుంటే చాలా నిరుత్సాహంగా వుంటుంది. ఊరికనే చదివి వెళ్ళిపోవడం కాకుండా కనీసం మీకు బాగా నచ్చిన టపాకో లేదా బాగా నచ్చని టపాకో స్పందిస్తూ వెళుతుంటే ఆయా రచయితలకి ఇంకా వ్రాయాలన్న ఉత్సాహం వుంటుంది.

మనం ఏదయినా ఫంక్షన్లు చేసినప్పుడు బహుమతులు వస్తుంటాయి కదా. ఎవరెవరు ఏమిచ్చారనేది ఇంటి ఆడవాళ్ళు భలేగా గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఎదుటి వారింట్లో ఏదయినా ఫంక్షన్ అయినప్పుడు మళ్ళీ అదే వెలకు సమానమయినదే చదివిస్తుంటారు. ఈ ఆడవారికి ఎన్నేళ్ళయినా ఎవరు ఏ ఫంక్షనుకి ఏం ప్రెజెంట్ తెచ్చి ఇచ్చారో భలేగా గుర్తుకువుంటుంది. మరి ఈ కాలంలో ఏమోగానీ నా చిన్నప్పుడు అయితే ఇంట్లో ఆడవారి మధ్య ఈ బహుమతుల ముచ్చట్లు చూసి భలే నవ్వొచ్చేది.

అలాగే కామెంట్ల విషయంలో కూడా ఎవరయినా (నాలాగా!) గుర్తుంచుకు వుంటారేమోనని ఖంగారుగా వుంటుంది. ఎందుకంటే ఇండియాలో వున్నప్పుడు ఎవరయినా ఫ్రెండ్స్ తో పాటుగా చాయ్ తాగినప్పుడో, టిఫిన్ తిన్నప్పుడో నేను బిల్లు కడతానంటే నేను బిల్లు కడతానని ఆవేశపడుతూ కట్టేస్తుంటాము కదా. నాకేమో అలా ఫైటింగ్ చేయడం రాక ఇతరులకి ఆ బిల్లు కట్టే బాధ్యత వదిలేస్తుంటాను. అలా మూడు నాలుగు సార్లు ఎవడయినా వరుసగా బిల్లు కట్టాడనుకోండి - వాడి మనస్సులో మనతో స్నేహం గురించి రిగర్ మార్టిస్ ప్రారంభమవుతుంది. అలాగే బ్లాగుల్లో కూడా ఛీ నేనే ఎప్పుడూ పనిలేని వాడిలాగా వాడి బ్లాగులో కామెంట్లు వెయ్యాలి కానీ వాడేమో నా బ్లాగు ముఖం కూడా చూడడా అని ఎక్కడ ఏ మిత్ర బ్లాగరయినా అలిగికూర్చుంటారేమో అని సందేహంతో పిసుక్కు ఛస్తుంటాను.

ఎవరెవరికి కామెంటు వేసి చాలారోజులయ్యింది అనేది దృష్టిలో వుంచుకుని వారెదయినా మంచి పోస్టు లేదా నాకు నచ్చిన పోస్టు వేసినప్పుడు నేను కూడా కామెంటేసి నా హృదయభారం దింపుకుంటా. ఉదాహరణకు నాన్న బ్లాగులో ఆ మధ్య కామెంటు వేసి చాలా రోజులయ్యింది. నాకు సూటబుల్ పోస్టులు అందులో రావడం లేదు. ఇటేమో భా రా రా అడపాదడపా నా బ్లాగులో వ్యాఖ్యానిస్తూనేవున్నారు. వారేమనుకుంటున్నారో అని నాకు అనిపిస్తూనేవుంది. మొత్తమ్మీద ఈమధ్య ఆ బ్లాగులో నాకు నచ్చిన పోస్టులు వచ్చాక నా సమస్య తీరింది. అయితే మరి అందరూ ఇలాగే కొంతయినా ఆలోచించి వ్యాఖ్యానిస్తారా లేదా అన్నది నాకు తెలియదు. అయితే టపా నచ్చకపోయినా సరే, స్పదించాల్సినంత అవసరం లేకపోయినా సరే మొహమాటానికి వ్యాఖ్యానించడం నాకు నచ్చదు. అందుకే నేను సాధారణంగా అలా చెయ్యను.

ఇహ ఇంకా కామెంటర్లను వర్గీకరణ చెయ్యాలంటే చాలా రకాలుగా చెయ్యవచ్చును. అదంతా ఎందుకులెండి ఇప్పుడు. నా భావం మీకు చేరింది కదా - చాలు. అయితే ఇలా నేను ఎప్పుడూ ఇలా కామెంట్ల లెక్కల్లో సీరియస్ అనుకోకండి. ఈ విషయాలన్నీ నిజమే అయినా సరదాగానే తీసుకోండి. మరీ తూకం వేసి వ్యాఖ్యానిస్తాననుకోకండి. అలాగే మీ కామెంట్లు లెక్క కడుతూ బాకీ కామెంట్లు వసూలు చేస్తాననుకోకండి. మొహమాటానికి నా బ్లాగులో కామెంట్లు వెయ్యకండి. నిజంగా మీకు స్పందించాలనిపిస్తే మాత్రం కాస్త ఓపిక చేసుకొని నిర్మొహమాటంగా వ్రాయండి. తిట్ల కామెంట్లయినా ఇష్టమే కానీ అసలే కామెంట్లు లేకపోతే ఉత్సాహంగా వుండదు. మీరు బహిరంగంగా మీ అభిప్రాయం చెప్పలేకపోతే అజ్ఞాతంగానయినా వ్యాఖ్య వెయ్యండి. నాకు అజ్ఞాతల మీద గౌరవం వుంది. వారు నాకు విలువైన సూచనలు, సలహాలూ ఇస్తూ వస్తున్నారు. 

ఇక నా బ్లాక్ లిస్టు సంగతేంటో చూద్దామా? ఇది టాప్ సీక్రెట్ సమాచారం. ష్! ఎవ్వరికీ లీక్ చెయ్యకండేం!

1. నవతరంగం (ఎందుకో మీకు తెలుసు)

2. గడుసరి బ్లాగు (వీరికి చాదస్తం ఎక్కువ)

3. బాకు బ్లాగు (ఇందులో కామెంటెస్తే వచ్చే జన్మలో దున్నపోతయి పుడతామని ఎవరో బెదిరించారు - ఎందుకయినా మంచిదనీ...)

4. కోతల బ్లాగు ( అన్నీ ఛాదస్తపు వ్రాతల కోతలే)

5. తూలిక బ్లాగు (పెద్దవారు. అంత పెద్దవారితో నాకెందుకులే అని)

6. పి ఎస్ మహాలక్ష్మి యాత్రా బ్లాగ్ (వారి మెంటాలిటీ నాకు నచ్చదు)

7. గొల్లపూడి (సెలబ్రిటీ)

8. AVS (సెలబ్రిటీ)

9. మా బావ బ్లాగులన్నీ (ప్రేమ ఎక్కువై)

10. తాడేపల్లి (మహా సనాతన బ్లాగు)

ఇంకా ఏం బ్లాగులని బ్లాక్ చేసానబ్బా? ప్రస్తుతానికి వేరే బ్లాగులేవి గుర్తుకు రావడం లేదు. ఈ లిస్టులో మార్పులు, చేర్పులూ, కొండొకచో మినహాయింపులూ సహజంగానే వుంటూవుంటాయి. పై లిస్టులోని బ్లాగుల్లో నా కామెంటు కనిపిస్తే అట్టేట్టా అనకండి.  బ్లాకు లిస్టులోలేని బ్లాగులన్నింటిలో నేను వ్యాఖ్యానిస్తాననీ, వ్యాఖ్యానించాననీ కాదుగానీ వాటి పట్ల నాకు ప్రత్యేక తిరస్కారం మాత్రం ప్రస్తుతానికి లేదు. అలా అని ఆ బ్లాగులు అన్నీ నాకు నచ్చే బ్లాగులూ అని కాదు. హమ్మయ్య. ఇక ఈ కామెంట్ల కామెంటరీ ముగించేద్దామా? మీ బ్లాక్ లిస్టు ఏదయినా వుంటే కూడా తెలపండి మరి. అలాగే ఎవరెవరు నా బ్లాగులని బ్లాక్ లిస్టులో పెట్టారో ఇక్కడే కామెంటు ద్వారా తెలియజేయండి ;)

31 comments:

 1. ఈ మధ్య నా కామెంటలు పడటం లేదు. కొంపదీసి నల్ల పట్టిక (బ్లాకు లిస్టు) లో పడేసారా ఏంటి?

  ReplyDelete
 2. :-) శరత్ గారూ, టూ గుడ్! నేను ఈ మధ్య చదువుతున్నాను చాలా వరకు చాలా బ్లాగులు.. కాకపోతే కామెంట్ ఎందుకో బ్లాగ్ రాసినంత ఈజీ గా పెట్టలేను. ఏప్రిల్ లో బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు అసలు కామెంట్లకి కూడా రిప్లై ఇవ్వాలనే బేసిక్ సభ్యత కూడా లేకుండా చూసి ఊరుకునేదాన్ని. ఈ మధ్యే బాగా నచ్చిన బ్లాగులకి అప్పుడప్పుడూ వ్యాఖ్యలు పెడుతున్నాను..
  మీ బ్లాగ్ లో ఒకేసారి కామెంట్ ఇచ్చిన గుర్తు. (బాల్కి పదం యూసేజ్ గురించి అనుకుంటా)..
  కృష్ణప్రియ/

  ReplyDelete
 3. 4. కోతల బ్లాగు ( అన్నీ ఛాదస్తపు వ్రాతల కోతలే)
  who is this?

  ReplyDelete
 4. దీన్నే అదెదో అంటారు, అందరి బ్లాగ్లు చెప్పి, మా బావ బ్లాగులన్ని అని ఒక లైన్ రాసి పడేస్తే సరిపోతుందా??
  అసలు మీ బావ బ్లాగులెన్ని, వాటి పేర్లు, (పనిలోపనిగా మీ బావగారి అవతారాలు కుడా), పాఠకులకి తెలియజెయాల్సిందే, అప్పటి వరకు నేను సాహిత్యావలోకనంలో కామెంట్ పెట్టను.

  ReplyDelete
 5. I can tell you one thing Mr.Sharat, you would make your mind very clear in your comments. I like your clarity of thought.
  Ramu
  apmediakaburlu.blogspot.com

  ReplyDelete
 6. Suryapeta mundala gurinchi, Goa lanjala gurinchi raastoo...nee "naagu paamu" gurinchi vivaristoo...aa postulaku coments raaledani ante yelaa tammudoo..
  Abrakadabra
  Hyderabad

  ReplyDelete
 7. పనికట్టుకుని మీ బ్లాగ్ లొ సెంచురీల మీద సెంచురీల కామెంట్ల వర్షం కురిపించి రికార్డులు సృస్టించిన నాది, పిల్లకాకి కృష్ణ, మలక్ పేర్లు కనీసం ప్రస్తావించకపొవడాన్ని ఖండిస్తున్నాం... అర్జెంట్ గా 1లింగం వచ్చి మాకు క్షమాపణలు చెప్పకపొతే మేం ధర్నా చేస్తాం.

  ReplyDelete
 8. enti nenu epudu chusina ekalingam vachhi kshamapanalu cheppali ani chala sarlu idavariki posts lo chusanu ento naku em artam kavatledu :(
  asalu emi jarugutondo telusukovachha

  ReplyDelete
 9. 2 నుండి 5 బ్లాగులు ఎవరివి..I want to know right now

  ReplyDelete
 10. ఏకలింగం వచ్చి క్షమాపణ చెప్పాలి అనే పదం తీసేసి శరత్ బ్లాగులో కామెంట్ పెట్టాలి అని వాడుదాం ఇక నుండి

  ReplyDelete
 11. @ విట్ రియల్
  అలాంటి దేమీ లేదే. ఈమధ్య ఓ రెండు పదాల గురించి తాత్విక చర్చ చేసేము కదా. అవి మాత్రం తీసివేసాను.

  @క్రిష్ణప్రియ
  మీ వ్యాఖ్య గుర్తుకు వుందండీ. మీ బాకీ త్వరలోనే తీర్చేస్తాను :)

  @ తార
  అవన్నీ వ్రాయాలంటే మళ్ళీ కనీసం మూడు టపాలయినా వ్రాయాలి. ఈ లోగా నా బుర్ర ....

  @ రాము
  ధన్యవాదాలు

  ReplyDelete
 12. @ హైదరాబాద్ - ఆబ్రకదబ్ర
  కేవలం నా బ్లాగులో కామెంట్ల గురించి వ్రాసాననుకుంటే ఎలా? జెనెరల్ గా వ్రాసాను. వ్యాఖ్యల ప్రాధాన్యత గురించి మరో సారి అందరికీ గుర్తు చేసాను. మీకు నచ్చని టపాలు వదిలేద్దాం. వేరే టపాలు ఏవీ నచ్చలేదా? మీ ఫ్రెండు లాగా ఈమధ్య నీతి టపాలు కూడా వ్రాసానుగా. కనీసం అవయినా నచ్చలేదా ;)

  @ మంచు
  అలాగే సార్. తప్పయ్యింది. పై లిస్టు ఎమెండ్ చేసి మీ బ్లాగులు జత చేస్తా!

  @ స్వప్న
  అదో పెద్ద విషాద గాధ. అనగనగా ఒక రోజు ఏకలింగం కత పవన్ కి అడ్డంగా దొరికిపోయారు. అస్సలు ముందుగా దొరికింది నేనేనేమో కానీ నేను వ్యూహాత్మకంగా తప్పించుకొని ఏకలింగాన్ని ముందుకుతోసాను. అప్పటి నుండి ఏకలింగం బుక్కయ్యారు. ఇహ మిగతా కథ ఏకలింగం వచ్చి వారి సాంప్రదాయం ప్రకారం ముందుగా అపాలజీ చెప్పి తరువాత వివరిస్తే బావుంటుంది.

  స్వప్న, నిజానికి దీనివెనకాల ఇస్టోరీ ఏమీ లేదు. సరదాగా అంటుంటాం అంతే. కావాలంటే మీరూ తనని ఓ అపాలజీ అడుక్కోవచ్చు. వారిది వెన్నలాంటి మనస్సు. ఎవరు అపాలజీ అడిగినా ఇట్టే కరిగిపోతుంది. ఏమీ అనుకోరు. వెంటనే బేషరతుగా చెప్పేస్తారు. ఓ సారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది.

  ReplyDelete
 13. @ నాగార్జున
  అబ్బా, మరీ నన్ను బయటపడేయించడమే మీ ఉద్దేశ్యమా! సరే.

  2. చదువరి
  3. కత్తి
  4. కస్తూరి రాతలు - కోతలు
  5. తెలుగు తూలిక

  @ శ్రీనివాస్
  నా బ్లాగుకి అలానన్నా టి ఆర్ పి రేటింగ్ పెరుగుతుంది

  ReplyDelete
 14. హమ్మయ్య, నాబ్లాగు పేరు ఉంటుందేమో అని భయపడ్డాను!
  :)

  ReplyDelete
 15. "ఏ రచయితకయినా విమర్శలు వచ్చినా ఫర్వాలేదు కానీ అసలు స్పందనే లేకుంటే చాలా నిరుత్సాహంగా వుంటుంది"
  యిది చాల కరెక్ట్ శరత్. స్పందన లేక చాలా గ్రూపులు మటాష్ అయిపోయాయి. కానీ మీ బావ వేరులే. ఎవరయినా నచ్చలేదని కామెంటారో, వదిలెయ్యండిసార్ అనేవరకు తాటతీస్తాడు.

  ReplyDelete
 16. మీతో ఏకీభవిస్తాను. నాకు కూడా బ్లాక్ లిస్టు ఉంది. ఇహ కామెంట్ల విషయానికి వస్తే, కామెంట్స్ ACK చెయ్యని వారి బ్లాగుల్లో నేను కామెంట్ చెయ్యను.(Few exceptions)

  ReplyDelete
 17. కామెంట్ల పండుగ చేసుకుంటున్నట్లు ఉన్నారు కదా శరత్

  ReplyDelete
 18. @ హరి, వాసు, గణేశ్
  :)

  @ స్నేహితుడు
  :)

  మీరు హేండ్సం గా వున్నారే. గే కోణంలో అంటున్నా అనుకోకండి కొంపదీసి. క్యాజువల్గా అంటున్నానంతే.

  ReplyDelete
 19. bagundi story, motthaniki andaru kalisi ekalinganni bakara ni chesaarannamaata hatavidi ;)
  intaki katha pavan ki ela dorikipoyaru a post ento :)

  nenu matram naku nachhitene comment vestaanu mohamaataniki poyi assalu veyyanu.

  ReplyDelete
 20. i second మంచు.పల్లకీ garu!

  ReplyDelete
 21. మీ బ్లాగు ఒకప్పుడు నా బ్లాక్ లిస్ట్ లో ఉండేది, ఎవరి స్నేహమో, శత్రుత్వమో వల్ల కాదు, నాకే నచ్చేది కాదు. ఎంతసేపు సెక్సు సెక్సు సెక్సు అని ఓ అరుస్తుంటే చిరాకేసి కామెంటు పెట్టేదాన్ని కాదు. అలా అలా చదవడం కూడా మానేసాను. కానీ మీ రాతల స్టైల్ నాకు నచ్చుతుంది. మీరెప్పుడైతే సెక్సు ని కాస్త పక్కకిబెట్టి మిగతా విషయాలపై స్పందించడం మొదలెట్టారో అప్పుడే (నాకు నచ్చిన టపాకి మాత్రమే) నేనూ కామెంటు పెట్టడం మొదలెట్టాను. ఇహ మితృత్వాలు, శతృత్వాలనేవి...ఒక్కొక్కరి భావనల బట్టి ఒక్కోలా ఉంటాయి. నా మటుకు నేను టపా నచ్చితే కామెంటు పెడతాను, మిగతా రాగద్వేషాల జోలికి పోను.

  ReplyDelete
 22. @ స్వప్న - ప్రత్యేకంగా పోస్టు అంటూ ఏమీలేదు. డార్విన్ పరిణామ వాదం లాగా అలా అయిపోయిందంతే :))
  @ క్రిష్ణ - అలా అంటారా, అయితే నా లిస్టులో 11 వ నంబర్ మీదే. 11. పిల్ల కాకి క్రిష్ణ
  @ ఆ సౌమ్య
  నాకూ ఎప్పుడూ సెక్స్ గురించి వ్రాయబుద్ధి కాదు గానీ రాయడానికి వేరే ఎవరూ లేకపోవడంతో నేనన్నా వ్రాయాలని వ్రాస్తుంటా. లేకపోతే బ్లాగుల్లోని చాదస్తులు ఈ బ్లాగులోకాన్ని పవిత్ర గంగిగొవులానే వుంచేస్తారు. మేము బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో బ్లాగులకి పాతివ్రత్యాన్ని అంటగట్టి మూఢంగా ఫత్వాలు జారీచేసేవారు. నాలాంటి వారం కష్టపడి కాస్త స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు తీసుకువచ్చాం. ఇహపోతే మీ ఆడ బ్లాగర్లలో మాలాంటి గట్స్ వున్న బ్లాగర్లెవరూ లేరు. ప్చ్! కనీసం అజ్ఞాతంగా అయినా లేరు. హ్మ్.

  ReplyDelete
 23. సెక్సు గురించి రాయడం తప్పు అనలేదు, కానీ అదే యావగా, అదే ప్రపంచంగా ఉంటేనే చిరాకేసింది, అంతే. నాకు మీ బ్లాగు నచ్చడానికి మొదటి కారణం చాంధసత్వానికి వ్యతిరేకం కావడం. అందుకే మీ బ్లాగులోకి నేను అడుగుపెడతాను, లేదంటే ఎప్పుడో ఆమడ దూరం పారిపోయేదాన్ని.

  ఆడబ్లాగర్లకి మీఅంత గట్స్ లేవా!....ఉండి, మీ అంత స్వేచ్చ, స్వాతంత్ర్యాలు ప్రదర్సిశ్తే మీ మగ బ్లాగర్లు ఊరుకుంటారా?...దాన్ని సహించగలరా? ఆడవాళ్ళు, పాపం, శీలం అని అన్నిరకాలు అంటగట్టరూ? కొందరు స్త్రీలు ఇటువంటి వాటిని ఎంత పట్టించుకోకపోయినా అదేపనిగా దాడి చేస్తే ఎవరు సహించగలరు? అజ్ఞాతల దాడులు ఆగుతాయా? అంతెందుకు మీరు వెక్కిరించకుండా, ఏమీ అనకుండా ఉంటారా? నాకు డౌటే.

  ReplyDelete
 24. ఎప్పటిలాగే ఈ సిరీస్ ఆలస్యంగా చదివా, ఈ మధ్య మీకు కామెంట్లు తక్కువయ్యాయనిపించిందా!
  ఇంతకు మీ వర్గీకరణలో నేను ఎందులోకి వస్తానో అర్థం కాలేదు

  ReplyDelete
 25. @సౌమ్య,
  బ్లాగర్లైతే ఊరుకోరు అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్రజలు ఇంకొక అడుగు ముందుకువేసి కూడలి నుంచీ బ్లాగును పీకించెయచ్చు..
  నాకు తెలిసి శరత్ గారు అలా వెక్కిరించే మనిషి కాదు.. ఎవరైనా వెక్కిరించి గొడవ జరిగితే వెళ్ళి చుట్ట అంటించుకుంటారు అంతే!! నీకు ఇంకా వివరాలు కావాలంటే శరత్ గారి సూపర్ కామెంట్లు కొన్ని నేను తీసిపెట్టాను.. కావాలంటే మెయిల్ చేస్తాను..

  ReplyDelete
 26. కార్తీక్ నాకు చెయ్యవా

  ReplyDelete
 27. బ్లాగర్లైతే ఊరుకోరు అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్రజలు ఇంకొక అడుగు ముందుకువేసి కూడలి నుంచీ బ్లాగును పీకించెయచ్చు..
  ______________________________________________________

  rofl ... ipudu ee dialouge ki value ledabbayi

  ReplyDelete
 28. @karthik
  "నాకు తెలిసి శరత్ గారు అలా వెక్కిరించే మనిషి కాదు.."
  ఈ మాట శరత్‌గారిని చెప్పమను ఒప్పుకుంటాను. ఆయన ఎప్పుడు ఎవరినీ కామెంటు చెయ్యలేదా, చెప్పమను.

  ReplyDelete
 29. @ ఆ సౌమ్య, కార్తీక్, తార, వెంకట్, శ్రీనివాస్ - మీకు కొత్త టపాలో స్పందిస్తాను
  @ కన్నా - మీరు నేను కామెంట్లు వేసుకుంటాము కాబట్టి మీరు ఈ లిస్టుల్లో రారు లెండి :) నా ఒక్కడికి కామెంట్లు తగ్గాయని కాదు - జనరల్గా ఓ సారి వ్రాద్దామని వ్రాసాను.

  ReplyDelete