నీతి సూత్రం 3:జీవితం అంటే ఓ చక్కని టెల్గు లవ్ సిన్మ!

మన జీవితాలకి ఎవరినుండి స్ఫూర్తి పొందాలి. ఏ వివేకానందుడో, భగత్ సింగో అనుకుంటే ప్రవీణ్ బ్లాగులో కాలేసినట్టే! తెలుగు ప్రేమ సినిమా నుండి స్ఫూర్తి పొందాలి. అందులో మరీ భంశు నుండి ఇన్‌స్పయిర్ కావాలి. భంశు అంటే ఏమిటో బూతు అనుకునేరు - తిరగెయ్యండి - శుభం అని అర్ధమవుతుంది. ఆ సినిమాల్లో చివరికేమవుతుంది? ప్రేమికులు ఒక్కటవుతారు - విలన్ మారిపోయి వీళ్ళని దీవిస్తాడు. బంధుమిత్రులందరితో గూపు ఫుటొ దిగుతారు కదా. అప్పుడు శుభం కార్డ్ పడుతుంది.

మరి తరువాత ఏమవుతుంది? ప్రేమికులు ఇద్దరూ అన్యోన్యంగా రాముడు సీత టైపులో పవిత్రంగా కాపురం చేస్తుంటారు. జీవితాంతం సీతని తప్ప వేరేవారి వైపు కన్నెత్తి చూడడు ఈ రామయ్య. అలా జీవితాంతం వారిద్దరూ కలిసివున్నప్పుడు ప్రేమగీతాలు, కాస్త ఎడబాటు కలిగితే విరహగీతాలు పాడేసుకుంటారు.

వాళ్లకి సమస్యలే వుండవు. భార్య చచ్చినా ఫ్రిజిడ్ అయివుండదు. మగవాడికి ఎవన్నా లైంగిక సమస్యలో, మరో అరోగ్య సమస్యలో అస్సలు వుండవు. ఇద్దరూ జీవితాంతం అన్ని విధాలా ఫిట్టు. వాళ్ళ సంసారమో, కాపురమో ఫట్టు మనడానికి ఏమీ వుండదక్కడ. వాళ్ళ మధ్య అసమానతలు, కలహాలు, కన్నీళ్ళూ ఏమీ వుండవు. ఇష్టపడే పెళ్ళి చేసుకున్నారు కాబట్టి వారి మధ్య అస్సలు విభేదాలు రావు. వాళ్ళసలు కొట్టుకోనే కొట్టుకోరు! వారి మధ్య మానసిక సారూప్యత 100 శాతం వుంటుంది కనుక ఎప్పుడూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ జీవితాన్ని అలా అలా అలవోకగా నడిపించేస్తుంటారు. వారి మధ్య విడిపోదామనే ప్రశ్నే కలలో కూడా రాదు. విడాకులు అని వినపడితే శివ శివా అని ఇద్దరూ చెవులు మూసుకుంటారు.

వారిద్దరికీ ఏ ఆరొగ్య సమస్యలు కానీ, శారీరక సమస్యలు కానీ వుండవు. వారిద్దరి అభిరుచులూ, భావాలూ, హాబీలూ మక్కీకిమక్కీ కలుస్తాయి కాబట్టి ఒకరినొకరు పల్లెత్తుమాట అనుకోవాల్సిన అవసరం వుండదు. మొగుడి పుట్టింటోళ్ళూ, పెళ్ళాం పుట్టింటోల్లూ వీరిలాగానే బహు మంచివారు కాబట్టి వాళ్ళు ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టకుండా ఇద్దరికీ తెగ ఏకాంతం కలిగిస్తుంటారు. ఈ ప్రేమికులకి లాగానే వీరి బంధుమిత్రులూ చాలామంచి వారయివుంటారు కాబట్టి వారినుండి వీరికి ఏ సమస్యా వుండదు. మొగుడు బంధుమిత్రుల్లో మరెవరికీ లైన్ వెయ్యడు. పెళ్ళానికి మరెవరూ లైన్ వెయ్యరు. ఇక సహజంగానే సొసైటీ కూడా చాలా మంచి సొసైటీ కాబట్టి సొసైటీ నుండి కూడా ఏం ఇబ్బందులు రావు. ఎవరూ కూడా పెళ్ళాం మీద చెయ్యి వెయ్యరు, అవమానించరు - కనీసం క్యూస్ కూడా ఇవ్వరు. ఒహవేళ వారు బ్లాగులు వ్రాసినా కూడా తెలుగు బ్లాగులోకం కూడా బహు చక్కనిది కాబట్టి వారిద్దరూ ఏం వ్రాసినా బ్లాగర్లందరూ వారిద్దరినీ పువ్వుల్లోపెట్టుకొని చూసుకుంటారు. వెర్రి మొర్రి కామెంట్లు, బూతు కామెంట్లు, తిక్క తింగరోడు అనే కామెంట్లు కూడా వెయ్యరు. ఆల్ ఈజ్ వెల్. ఇదీ దృశ్యం. మిగతా పచ్చని సంసారం అంతా మీరు ఊహించుకోండేం.

అప్పుడే అయిపోయిందా? ఇంకా వుంది. వీరిద్దరికీ ఇంకో ఇద్దరు పిల్లలు పుడతారు. వారు భారతమాత గర్వించదగ్గ పిల్లలు అవుతారు. పెరిగిపెద్దగా అయి కలెక్టర్లు అవుతారు. వాళ్ళూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వారూ అన్యోనయంగా జీవిస్తారు. బాగా సంపాదిస్తారు. తల్లితండ్రులకు పంపుతారు. తల్లితండ్రులను ప్రతిరోజూ మన కత పవన్ లాగా పూజిస్తారు. ఇహ కొంతకాలానికి వారికీ పిల్లలు పుడతారు. అప్పుడు కుటుంబసభ్యులందరూ కలిసి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఉల్లాసంగా గ్రూపు ఫుటో ఒహటి తీసుకొని గోడకు అతికించుకుంటారు. బంధుమిత్రులకి ఈమెయిల్ చేస్తారు. ఆ ఫుటో బ్లాగు ప్రొఫయిల్లో పెట్టుకుంటారు. అలా అలా జీవిత చక్రం ఎప్పుడూ ఆగకుండా సవ్యంగా అలా అలా తిరిగేస్తుందన్నమాట.

ఇదండీ, కాస్తోకూస్తో కాపురం బావున్నవాళ్ళు ఇతరుల సంసారాల గురించి ఎక్స్‌పెక్ట్ చెసేదీ. వారి వారి జీవితాల్లాగానే ఇతరుల జీవితాలు కూడా పచ్చగా వుంటాయనుకుంటారు. తప్పులేదు. మనం ఉటోపియా లో నివసిస్తున్నాం కదా. కాపురాల్లో కలతలెందుకు వుంటాయి? సమస్యలు ఎందుకువుంటాయి? ఆరోగ్య సమస్యలు ఎందుకు వుంటాయి, లైంగిక ఇబ్బందులు ఎందుకువుంటాయి? ఖచ్చితంగా అలా వుండవు కాబట్టి భర్త కానీ, భార్య కానీ వేరేవారి వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ భార్యనే ఎదురుగ్గా పెట్టుకొని చూస్తూ మురిసిపోవాలి. మనం ఐడియల్ సొసైటీలో నివసిస్తున్నప్పుడు అస్సలు ఆలమగల మీద ఆకర్షణ ఎందుకు తగ్గి పోతుంది? ఇతరుల మీదికి ఎందుకు మనస్సు పోతుంది? పోదు. జీవితాంతం అలాగే వుంటుంది - ఎందుకంటే మనం ఆదర్శ సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి.

ఒహవేళ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడనంత మాత్రాన పక్క చూపులు చూడాల్సిందేనా? తప్పు కాదూ? అలాగే సర్దుకుపోవాలి. మనిషికి ఆహారం ,నిద్ర, ఇంటర్నెట్టు, బ్లాగులు ముఖ్యం కానీ సెక్స్ ముఖ్యమా చెప్పండి. ఏం జీవితంలో సంతానం కొరకు ఒక్కసారి సెక్స్ చేస్తే సరిపొదా? ఏం సెక్స్ రోజూ చేయకపోతే ఛస్తావా? అస్సలు సెక్స్ అంటే ఏమనుకుంటున్నారు? అది బూతు. ఛీ. అలాంటి దానిని పట్టుకొని పెళ్ళాంతో అయినా రోజూ చేయడానికి సిగ్గు లేదూ? వెంఠనే త్యజించండి. యోగులని ఆదర్శంగా తీసుకోండి. జీవితంలో పైకి రండి. పైకి వచ్చాక, అప్పుడు ఆనందించండి. అలా అలా  పైకి వచ్చేసరికి ఎలాగూ ముసలోళ్ళూ వుతారు కాబట్టి మీ లిబిడో తగ్గి ఎలాగూ బ్లాగుల్లోకి వచ్చిన పతివ్రతల్లాగా అయిపోతారు కాబట్టి ఇహ సమస్యేం వుండదు.

సరే ఆ తరువాత జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. ఎలా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అంటున్నారా? అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కనపడటం లేదా? అందరూ పెళ్ళాంతో కులుకుతున్నారా అసహ్యంగా? టివిలు చూడాలి, సినిమాలు చూడాలి, సీరియళ్ళు చూస్తూ కన్నీళ్ళు కార్చాలి, బ్లాగుల ద్వారా బంధుమిత్రులకు శుభాకాక్షలు తెలపాలి. అలా అలా ఆనందించాలి.  సెక్స్ అంటే ఏంటి? ఎయిడ్స్. అదొక మహమ్మారి. దానిని రోజూ చేయకూడదు. జీవితంలో ఒక్కసారి అదీ సంతానం కోసం చేయాలి.

అస్సలు ఎక్కువమంది మొగుడు పెళ్ళాలలో కలతలు వస్తున్నాయంటే కారణం ఏంటి? సెక్స్. అందుకే సెక్సుకి శిలువ వేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. బుద్ధుడు ఏం చెప్పాడు? కోరికలని త్యజించమని చెప్పాడు. అందుకే సెక్సును త్యజించి సమాజసేవ చేయండి. సమాజసేవ వీధుల్లోకి తరలి చేయమనడం లేదు - బ్లాగుల్లో వ్రాయండి చాలు. మీ సంతానం కూడా సెక్స్ అనే మహమ్మారి బారిన పడకుండా సెక్స్ ఒక బూచి అని ఉగ్గుపాలతో నేర్పండి. వారికి పెళ్ళయ్యాక ఖర్మకాలి సెక్స్ అంటే లేశమాత్రం ఆసకి వున్న సెక్స్ మానియాక్ భర్తగా దొరికి పడక గదిలోకి రమ్మంటే 'ఆగండి చక్రవాకం సీరియల్లొ, రుతురాగాలు సీరియలూ, వుండమ్మా బొట్టు పెడతా సినిమా అయ్యాక వస్తా' అనమని కూతుర్లకి చిట్కాలు నేర్పించండి. లేకపోతే స్వంత అల్లుడు మీ కూతురిని రేప్ చేసేయ్యడూ. మానవహక్కులు ఏమయిపోవాలి? మళ్ళీ జస్టిస్ సుభాషిణ్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వుంటుంది. మీ అల్లుడు కనుక పదే పదే బాణం ఎక్కుపెట్టాలని తహతహలాడుతున్నట్లయితే తొందరగా ఒక మనవడిని కనిపించేయండి. పిమ్మట ఓ గ్రామలోకి తీసుకువెళ్ళి ఎద్దుల వృషణాలను చితగ్గొట్టించినట్లుగా చితగ్గొట్టించండి. మానియాక్ ఇహ మ్యావ్ మ్యావ్మంటూ జీవితంలో పైకివచ్చి గొప్ప బ్లాగరుగా కీర్తించబడుతాడు. తప్పుద్దా మరి ఇంకా చేయడానికి, ఫోకస్ పెట్టడానికి వేరే పని ఏముంటుంది కనుక.

ఇదంతా ఎందుకు, మొగుడూ పెళ్ళాల మధ్య అయిష్టం ఏర్పడితే పక్క చూపులు చూసేదానికి బదులు ఆ పెళ్ళిని పెటాకులు చేసుకోవచ్చు కదా అని రౌడీ గారు అంటున్నారు. చక్కని సలహ ఇచ్చారు. మరి అదెంత చక్కనిదో మరోసారి చూద్దామేం.
 
(మెజారిటీ) పెళ్ళి కాని కుర్ర సన్నాసులు:

వీరికి పెళ్ళి గురించి లోపాలు కనపడవు. పెళ్ళి గురించి ఆలోచిస్తే నేను పైన ఇచ్చానే సీన్ అలా ఆలోచిస్తూవుంటారనమాట. నాకో చక్కని అందమయిన భార్య దొరుకుతుంది, మేము చక్కగా కాపురం చేస్తాము. 'మేమిద్దరం - మాకిద్దరు' అనే కలల్లో తేలిపోతుంటారు. ఎవరయినా దాంపత్యేతర సంబంధాలు పెట్టుకున్నారు అని తెలిస్తే చాలు ఛీ చక్కని మొగుడో లేదా పెళ్ళామో పక్కన వుండగా వీరికి ఇదేం పని అని బుగ్గలు నొక్కుకుంటారు. ఎవరన్నా ఒకే పురుషుడు ఒకే స్త్రీ అని స్టేట్‌మెంట్ ఇచ్చారనుకోండి. అవును మరి పెళ్ళాన్ని తప్ప మరొకరి వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం ఏమిటీ అని వంత పలుకుతారు. ఎవరన్నా విడాకులు తీసుకుంటున్నారని తెలిస్తే ఏమోనబ్బా నేనయితే పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తామంటారు. మరి అలా జరగదా? జరుగుతుంది కానీ కొంత శాతం దాంపత్యాలలోనే అలా వుంటుంది కానీ చాలమందికి పెళ్లయ్యాక ముందు ముందు వుంటుంది ముసళ్ళ పండగ.

ఈ నిజాలుచేదుగా వుంటాయి కాబట్టి అసలా విధంగా ఆలోచించను కూడా ఆలోచించరు కాబట్టి మళ్ళీ మనమందరమూ తెలుగు సినిమా సీన్ కి వెళ్దాం. అందుకే పై పేరాలు మరొక్కసారి చదువుకుందాం. శుభం!

18 comments:

  1. దీనికి కౌంటర్ వేద్దామనుంది - ఫీల్ అవ్వనంటే నా బ్లాగులో వేస్తా

    ReplyDelete
  2. @ Malak

    హ హ. గో అహెడ్. ఎలాగయితేనేం కావాల్సింది కాలక్షేపం.

    ReplyDelete
  3. Why is the commitment to one person (marriage or whatever) if you want to have relations with more people all the times?

    Soemthings are more fair at USA. Does people here have the same mindset as you have expressed?

    I am confused about your views.

    ReplyDelete
  4. @ శరత్ గారు,
    హ్మ్..... బాగుంది మాష్టారు! మీరు వ్యంగ్యం రాసినట్టు చాలా తక్కువమంది రాయగలరు. సరే గానీ నా మీద కూడా ఒక టపా రాద్దురూ ప్లీజు! చదివి తరిస్తాను :)
    @ మలక్
    అట్‌లీస్ట్ నీ బ్లాగులో అన్నా శరత్ గారి తో పాటు నా గురించి రాయవా? ప్లీజు!

    ReplyDelete
  5. పెళ్ళి కాని కుర్ర సన్నాసులు //
    ఒక బ్రహ్మిగా(పెళ్ళి కాని కుర్ర వరకే సన్నాసిని మాత్రం కాదు) దీనిని నేను ఖండిస్తున్నాను అధ్యక్షా !!!
    పెళ్లయిన తరువాత ఎలాగు తప్పవు, కనీసం పెళ్లికి ముందయినా కాస్త ఆ ఊహల్లో ఆనందంగా వుండనీయండి.

    //ఎవరయినా దాంపత్యేతర సంబంధాలు పెట్టుకున్నారు అని తెలిస్తే చాలు ఛీ చక్కని మొగుడో లేదా పెళ్ళామో పక్కన వుండగా వీరికి ఇదేం పని అని బుగ్గలు నొక్కుకుంటారు//
    హ హ హ, మీరు అలా అనుకుంటున్నారా ?
    జనాలు మాకెందుకు వర్కవుట్ అవ్వట్లేదా అని ఫీల్ అయ్యే రకాలండి బాబు.(Generalized statement)

    సరే కాని శరత్ గారు, ఇది డీసెన్సిటైజేషన్ తరువాత ఫేజా ?

    ReplyDelete
  6. ఏంటో.. ఈ మధ్య మీరు రాసేవి అర్థం చేసుకోవడం నాకు కష్టం అయిపోతోంది. నాలాంటి పామర బ్లాగర్ల కోసం కొంత జరిగిన కథ టైపులో రాస్తే బాగుంటుందేమో చూడండి. అందరూ మీ బావంత తెలివిగలవారుండరు.

    ReplyDelete
  7. ఆహా... మీ బావ ఏం పుణ్యం చేసుకున్నాడో గానీ... అతన్ని తలచుకోని రోజు తెలుగు బ్లాగ్ప్రపంచం లో లెదేమో.... అందరినీ ఇంతలా ఇన్వాల్వ్ చేసిన ఆ శ్రీ మహా విష్ణువు గారెక్కడో....

    ReplyDelete
  8. ఇంతటితో ఈ నీతి సిరీస్ ఆపేస్తాను. ఇప్పటికే కార్తీక్, వెంకట్ గట్రాలు నేను ఏం వ్రాస్తున్నానో, ఎందుకు వ్రాస్తున్నానో, ఎవరిని టార్గెట్ చేసి వ్రాస్తున్నానో తెలియక జుట్టు పీక్కుంటునట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. బద్రి లాంటి వారు కాస్త క్యాచ్ చేయగలుగుతున్నారనీ, రౌడీకి ఇంకా బాగా తలకెక్కి రివర్సులో వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరీ ఎక్కువ చేయకుండా సరి అయిన సమయాన తోకముడవడం పలాయనవాదం కాకుండా వ్యూహాత్మక మేధావితనం అనిపించుకుంటుందని KCR సెలవిస్తుంటారు!

    ReplyDelete
  9. @ అజ్ఞాత
    విశాలభావాలతో కూడిన వివాహాన్ని లేదా సహజీవనాన్ని నేను ప్రోత్సహిస్తాను. ఇద్దరి మనస్సులు ఉన్నతం అయినప్పుడు వివాహంలో కూడా కూరలో కొద్దిగ మసాలా వేసినట్లుగా ఎక్స్‌పెరిమెంట్లు చేయవచ్చును. నలుగురితో అప్పుడప్పుడు తిరగడం ఇష్టమయినంత మాత్రాన సహజీవన జీవిత ఫలాలకి దూరం కానవసరం లేదు.

    @ క్రిష్ణ
    మీరు బ్లాగుల్లోకి వచ్చి కొద్ది నెలలే అవస్తోంది కాబట్టి నాకయితే మిమ్మల్ని కెలకడానికి ఇప్పటికింకా పెద్ద పెద్ద రంధ్రాలు కనిపించడం లేదే ఎలాగబ్బా :(

    'ప్రతి కుక్కకీ ఓ సమయం వస్తుంది!' అన్న సామెత తెలుసు కదా. అంటే నేను కుక్కనా అని మొరగకండి - ఏదో సామెత చెప్పానంతే.

    @ బద్రి
    తెలుసు. బ్లాగుల్లో మాత్రం తెగ బుద్ధిగా నోట్లో వేలు పెడితే కొరకనంత అమాయకంగా కామెంట్లు వేస్తారు మీ కుర్రకారు :)

    మీరన్నటువంటి ఫేజుకు ముందు వాటర్స్ టెస్టు చేస్తున్నా - గ్రవుండ్ వర్క్ చేస్తున్నా ;)

    ReplyDelete
  10. @ కార్తీక్, వెంకట్
    కొన్ని బ్లాగుల్లో ఈమధ్య వచ్చిన కొన్ని నీతి టపాల మీద వ్యంగ్యాస్త్రాలే ఈ నీతి టపాలు. పనిలో పనిగా నీతిమాలిన వాడిననిపించుకోకుండా 'మర్యాదా పురుషోత్తం శరత్' అనిపించుకోవాలనే ఉబలాటం. నా ఇమేజ్ ఈ టపాలతో ఓ అంగుళం అయినా పెరిగిందంటారా?

    @ భుజంగం
    మరి మా బావనా మజాకా! ఎప్పుడో అందరం మనోడికి దండేసి దండం పెట్టి సన్మానం చేయాల్సిందే! అందుగురించి ప్ర పీ స స ఆలోచిస్తుందని విశ్వసిస్తున్నాను.

    ReplyDelete
  11. What does it mean ప్ర పీ స స ?

    ReplyDelete
  12. అజ్ఞాత గారు,

    ప్ర పీ స స అర్ధం తెలుసుకోవాలంటే దర్శించండి
    http://onlyforpraveen.wordpress.com/

    regards
    Seshu

    ReplyDelete
  13. Sarath ji,

    Why dont you write a novel on this concept. It will be more informative and helpful.

    -Sriram

    ReplyDelete
  14. @ శ్రీరాం
    నవల్స్ వ్రాసే మూడ్ పోయిందండీ. అయినా ఈమధ్య తెలుగు నవలలు చదివేవారు తక్కువయిపోయారు కదా. దానికంటే ఏదయినా యూట్యూబ్ వీడియో వివరంగా వేస్తే కొంతమంది అయినా చూసి తెలుసుకోవచ్చు. వీడియోలు రూపొందించడం వల్ల డబ్బు ఖర్చు కాకున్నా చాలా సమయం వెచ్చించాల్సి వుంటుంది. చూద్దాం. మీ సూచనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  15. --ఎప్పుడో అందరం మనోడికి దండేసి దండం పెట్టి సన్మానం చేయాల్సిందే!

    ఘన సన్మానం చేద్దామనుకొని అన్నీ రెడీ చేసుకున్నాక, నేను తెలుగు పుస్తకాలు కొనుక్కోవటానికి భువనేశ్వర్ వెళ్తున్నాను అని మీ బావ అనగానే, ... కొన్ని రోజులు మైండ్ బ్లాక్ ఐపోయింది, తరువాత తెల్లబాడినా, అడ్డుగోడలు అడ్డం వచ్చింది, తరువాత సైన్సు లో విమానంలో ఎగురుతూ బుల్లేట్టు పట్టుకోవటం, గుండె పరిగెత్తుటుంది అనగానే .... ఇంకా అప్పుడే తేరుకోలేదు, మా అద్దెచ్చుల పత్తా, కాబోయే అద్దెచ్చులుగా పేరుగడించిన మంచు గారిని పట్టుకోవటానికి ఇంటర్ పోల్ సహాయం అర్ధించాము.. దొరికాక, అలాగే చేస్తాము..
    @శ్రీరాం గారు
    ఇదే అర్ధం కావటం లేదు, ఇంకా నవలా....బాబోయి దీన్ని 2 టపాలుగా చేసినా బాగుండేడి, చదవటానికి వొళ్ళు వొంగటం లేదు

    ReplyDelete
  16. @ తార
    సన్మానం చేయదలుచుకుంటే చేయదలుచుకున్నారు కానీ ఆ పేరిట విరాళాల సేకరణ కార్యక్రమం మాత్రం మొదలుపెట్టకండేం. నేను బావని కాబట్టి ఎక్కువ విరాళం ఇవ్వాలని డిమాండ్ చేసినా చేస్తారు మీరు. PPSS (ప్ర పీ స స) మాత్రమే తలో పదో పరకో వేసుకొని చేయండి. ఆ వార్త చీక్కాక్కులం జిల్లా ఎడిషన్లో ప్రముఖంగా వచ్చేట్లుగా చూసుకోండి. మీ సంఘం ఇమేజి పెరుగుద్ది.

    ReplyDelete
  17. ఎంత ఐనా, మీ అనుబంధాలు, ఆత్మీయతలు, మాకు అర్ధం అవుతాయి కానీ (ప్ర.పి.స.స) లోకులకు అర్ధం కావు కదా.. అందుకే ఘనంగా ఎదైనా చదివిద్దురులేండి

    ReplyDelete