కామెంటల్ - 2

మేధావులు: కొంతమంది మేధావులు వారి వారి ప్రపంచంలో వుంటారు. వారి రంగం కాని వేరే బ్లాగులని పెద్దగా పట్టించుకోరు. వారిని వారి మానాన వదిలేద్దాం. మరికొంతమని మేధావులకు మిగతా వారంతా అలగా జనంలా, బడుగు జనాల్లా అనిపిస్తారు. మేధావులు, మేధావులు మాత్రమే రాసుకొని తిరుగుతారు. అప్పుడు వారి మధ్యనే కామెంట్లు రాలు తాయి. నా లాంటి సన్నాసిని రాసుకుంతే మేధావులకి ఏమొస్తుంది - బూడిద తప్ప. అందుకే వారు మన మొఖం చూడరు - చూసినా కామెంట్లనే కనికరం చూపరు.

వాళ్ళతో కాస్తయినా పూసుకొని తిరిగితే మనకు మేధావితనం అబ్బుతుందేమోనని ఆయా బ్లాగుల్లో అతి తెలివిగా కామెంట్లు చేసే మేతావులు వుంటారు. లేదా తాము కూడా మేధావులము అనుకునే మేతావులు కూడా వారితో కామెంట్లు రాసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ముచ్చట మనక్కూడా వుంటుంది కదా. ఏ మేధావి అన్నా కరుణించక పోతారా అని కామెంట్లతో రాసుకొని చూస్తాను. ముచ్చటగా తమ బ్లాగుల్లో స్పందిస్తారు కానీ మన బ్లాగు జోలికి రారు. మనం ఖిన్నులమవుతాము. మేధావులు మన బ్లాగుకి రాకుంటెట్లా? మన బ్లాగు ఇమేజి పెరిగేదెట్లా? మన బ్లాగు పేపర్లలో పడేదెట్లా? మేధావులు మన బ్లాగు వంక చూడకపోతే మన బ్లాగు స్లీజీ బ్లాగు అయిపోద్ది మరీ. వారి వ్యాఖ్యల కోసం చకోరంలా ఎదురు చూసి చూసి అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనుకొని ఛీ వీడూ ఒక మేధావేనా, ఒట్ఠి మేతావి కానీ అని ఛీత్కరించుకుంటాను. అలా అనుకున్నాక ముచ్చటగా నా బ్లాకు లిస్టు తెరచి వారి పేరు అందులోకి ఎక్కిస్తాను. అప్పుడు గానీ మనకు ఆర్గాజం రాదు.

కవులు, కవయిత్రులూ: వీరు తమ కవితల టైటిల్లో కవితనో, తవికనో పెట్టి చావక పైగా మరీ ముచ్చటయిన టైటిలు పెడతారు కనుక అందులో ఏముందో అని గబుక్కున వెళ్ళి గిరుక్కున తిరిగివస్తుంటాను. అర్రెర్రే, అనవసరంగా ఓ హిట్టిచ్చా అనుకొని వర్రీ అయిపోతుంటాను. ఇహ ఆయా బ్లాగుల్లొ ఇంకా కామెంటేం వేస్తాం చెప్పండి- ఇహ వాళ్ళు మనకేం వేస్తారు చెప్పండి? మనకు కవితలు అంటే గిట్టవు కాబట్టి ఫలానా వారు కవీ అని తెలిస్తే ఆ బ్లాగు జోలికి పోను. మాలికలోనూ, హారంలోనూ టైటిలు తప్ప విషయం కనపడదు కాబట్టి ఈమధ్య అఫ్సర్ గారు వచనం వ్రాస్తున్నారని నిన్నటివరకూ నాకు అర్ధం కాలేదు!

సెలబ్రిటీలు: ఇహ సెలబ్రిటీ బ్లాగర్లకి మనం పందుల్లాగానో కుక్కల్లాగానో కనపడతామేమో అని నా సంశయం. చాలా ఏళ్ళ క్రితం నేను హైదరాబాద్ అలయన్స్ ఫ్రాన్సైజ్ సంస్థ దగ్గర ఫ్రెంచ్ నేర్చుకోవడానికి వెళితే ఫ్రెంచి బుక్కుల కోసమని గొల్లపూడి వచ్చారు. మా ఫ్రెండుకి హలో ఇచ్చారు కానీ నేను చెయ్యి చాపినా చూడనట్టే వెళ్ళారు. అప్పటినుండీ ఆయనంటే కచ్చ. అందుకే ఆయన్నెప్పుడో బ్లాక్లిస్టులో పెట్టేసా. హలో ఇవ్వకపోతే ఇద్దరికీ ఇవ్వకూడదు. మా ఫ్రెండుకి హలో ఇచ్చి నాకు ఇవ్వకపోతే నా మనోభావాలు ఏమయిపోవాలి? అహ ఏమయిపోవాలి అని అడుగుతున్నా. పుండు మీద కారం చల్లినట్లుగా మా ఫ్రెండ్ కొద్ది రోజులు తన చేతిని నా ముందే మురిపెంగా చూసుకుంటూ స్టైల్ కొట్టాడు!

అలా నన్ను అన్యాయం చేసిన గొల్లపూడి బ్లాగులో నేను కామెంటడమా? నెవ్వర్. చేసినోళ్ళకి ఆయనేమన్నా రిప్లయ్ ఇస్తున్నారా? ఇస్తే వాళ్ళ ఇమేజి ఏమయిపోవాలి? తీరికలేకనా? ఈ వయసులో ఏం చేస్తున్నారేంటీ తీరికలేకుండా వుండటానికి? అందుకే సెలబ్రిటీల బ్లాగుల్లో కామెంట్లు వేయడానికి నా అహం అడ్డు వస్తుంది. వారి బ్లాగులోనే వారు రిప్లయ్ ఇవ్వరు - ఇహ నా బ్లాగులోకి వచ్చి వారు కామెంట్లు ఇచ్చేదెన్నడూ. వారి బ్లాగుల్లో కమెంట్లు వేస్తే ఎనర్జీ వేస్టూ.

ఇహ AVS గారి సంగతి చూద్దాం. వారి బ్లాగు టెంప్లేట్ చూస్తేనే అర్ధమవుతుంది వారు డైరెక్ట్ చేసే సినిమాలు ఎంత గొప్పగా వుండవచ్చో! అలాంటి టెంప్లేటులల్లో పట్టుబట్టి కామెంట్లు వేసే వీరవిధేయులని మెచ్చుకోవాల్సిందే. ఆయన కూడా కామెంట్లకి రిప్లయ్ ఇవ్వరనుకుంటా. కోతిమూకతో బ్యుజీ అనుకుంటా. అది వీర ఫ్లాప్ కదా. ఇహ ఇంకేం డైరెట్రు ఛాన్సులు వస్తాయీ? తీరిగ్గానే వుంటారేమో - ఇహనయినా రిప్లయిలు ఇస్తారేమో చూడాలి. 

వచ్చే టపా ఈ సిరీసులో చివరిది. అందులో ఇతర విషయాలతో పాటుగా నా టాప్ సీక్రెట్ బ్లాక్ లిస్టు కూడా వుంటుంది.

10 comments:

  1. శరత్ గారూ:

    మీ ఫోన్ నంబరేమిటి?

    అఫ్సర్

    ReplyDelete
  2. బాగుందండి, మమ్మల్ని మరిచిపోకండెం, మాలాంటి వారికి మీ కామెంట్లు అవసరం.

    ReplyDelete
  3. నేను మేధావిని, కవిని గాదు. సెలబ్రిటీని అసలే కాదు. కాబట్టి నేను మీ బ్లాక్ లిస్ట్ లో ఉండే అవకాశమే లేదు. ఉంటే గనక మిగతా వారికి తెలిసేలోగా తీసెయ్యండి ప్లీజ్. :-)

    మీ బ్లాగింగ్ స్టైలూ, శైలీ బాగుంటాయి. కంటెంట్ మాత్రము అప్పుడప్పుడు OHT (Over Head Transmission) చేస్తాను.

    ReplyDelete
  4. Waiting for కామెంటల్-3

    ReplyDelete
  5. bale bale rasaru. I love this post. miru emi worry avvakandi. Hemamaalini modatlo films loki velthe reject chesaru. kani tarvathe ame no.1 ayindi. miru kuda tondarlone No.1 avutaremo ee blogger world lo. avutaremo enti ayyi theeratharu, already ayipotunnarule, vere cheppala nenu :)

    ReplyDelete
  6. @ అఫ్సర్
    మళ్ళీ ఈ మధ్య మీకు ఫోన్ చేసి మాట్లాడుతాను. వీలయినంత వరకు శుక్రవారం సాయంత్రం మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను.

    @ భాను
    తప్పకుండా :)

    @ తెలుగుయాంకి
    :)

    మీ ప్రశంస నాకు సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు.

    తెలుగుయాంకి పేరు ఎక్కడో విన్నట్లే వుంది. అర్ధం ఏమిటి?

    @ స్వప్న
    :)
    నేను బ్లాగుల్లో నంబర్ వన్ కాను, కాలేను. ఎందుకంటే అలా కావాలంటే ఎక్కువమంది మెచ్చే విధంగా రాయాలి. నా బ్లాగులేమో తక్కువమంది ఎక్కువగా మెచ్చుతారు. అయినా బ్లాగుల్లో నంబరింగ్ దురద ఇంకా రాలేదు లెండి. సరదాగా తీసుకువద్దామా!

    ReplyDelete
  7. can u give me the blog link for avs blog. just want to see the template. thanks !

    ReplyDelete
  8. @ అజ్ఞాత - ఈమధ్య ఏ వి ఎస్ గారు కాస్త టెంప్లేట్ మార్చినట్టున్నారు. మరీ అంత దరిద్రంగా ఏమీలేదు ప్రస్థుతం.
    http://avsfilm.blogspot.com/

    ReplyDelete
  9. భలే వ్రాసారే !! ఈ సిరీసు మిస్ అయ్యా ఇప్పటి వరకు

    ReplyDelete