కామెంటల్ - 1

ఎవరెవరు నాకు కామెంట్లు వేస్తారో, ఎవరెవరికి నేను కామెంట్లు వెయ్యనో చూద్దాం. కొన్ని సార్లు ఇతరుల టపా బాగా నచ్చినా, నచ్చకపోయినా ఆ టపాకి కామెంటేంత కానీ, మెంటేంత కానీ సీనున్నా బద్దకించో, సమయం లేకనో వేయలేము కదా. వారాంతంలో ఇంటి దగ్గరుంటాను కాబట్టి టపాలు చూడగలనే కానీ వ్యాఖ్యానించేంత తీరిక లేదా ఓపిక వుండవు నాకు. అలాంటప్పుడు మంచి టపాలు వచ్చినా నా వ్యాఖ్యలు మిస్సవుతుంటాయవి.

కొంతమంది బ్లాక్ లిస్టుల్లో నా పేరు వుంటుంది. అలాంటి వారు నా బ్లాగులు చూస్తారో లేదో తెలియదు కానీ కామెంట్లు అయితే చచ్చినా వెయ్యరు. నాలాంటి త్రాష్టుడి బ్లాగులో వ్యాఖ్యానిస్తే ఇంకేమన్నా వుందా, మడి కొట్టుకుపోదూ! ఇహ కొంతమంది నామీద కోపం వుండో లేదా అర్ధాంతరంగా కోపం వచ్చో వారి బ్లాక్ లిస్టులో నా పేరు పేర్చి ఆత్మశాంతి పొందుతారు.

అప్పుడప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా పాత పగలు ఎందుకులే అని వారి బ్లాగుల్లో ఒకటో రెండో కామెంట్లు వేసి ఆలివ్ ఆకులు ఇచ్చివస్తాను. మళ్ళీ వారు కూడా కామెంట్లు నా బ్లాగులో వేస్తారో లేదో చూస్తాను. వెయ్యకపోతే ఇహ నేను కూడా బిగదీసుకుపోతాను. ఇహ వారెంత మంచి పోస్టు వేసినా నా నుండి అయితే స్పందన వుండదు. కచ్చ అన్నమాట. ఉదాహరణకు ఓ పెద్ద మనిషి అప్పుడప్పుడయినా మంచి రాజకీయ వ్యాసాలు వ్రాస్తుంటారు. ఆ చర్చల్లో పాల్గొనాలని వుంటుంది కానీ కచ్చకొద్దీ పాల్గొనను. అంటే నేను పాల్గొననంత మాత్రాన వారికేదో నష్టమని కాదు గానీ నాకో తుత్తి అంతే.

ఇహ కొన్ని సైట్లు నాలాంటి చారిత్రిక పురుషుడిని వ్యాఖ్యానించకుండా చేయడానికి ఐ పి అడ్రసులు బ్లాక్ చేస్తాయి. ఆ కథా కమీశూ మీకు తెలిసేవుంటుంది ;) ఇహ కొన్ని బ్లాగుల్లో ఎప్పటికీ మనమే వెయ్యాలి కానీ వారు మన బ్లాగుల్లో వెయ్యరు. కొంతమంది వేరే బ్లాగుల్లో కామెంట్లు వేసినా నా బ్లాగులో వెయ్యరు. అలాంటి బ్లాగుల్లో ఒకటి రెండు సార్లు చూసి నేను కూడా కామెంట్లు వెయ్యకుండా ఆత్మ నిగ్రహం పాటిస్తాను. ఇహ మరికొన్ని బ్లాగుల టెంప్లేట్ దరిద్రంగా వుండో లేక వ్యాపార ప్రకటనలు బాగా వుండో వాటి జోలికే వెళ్ళబుద్ధి కాదు - ఇంకా ఏం వ్యాఖ్యానిస్తాం?

ఇక కొందరు ఆడాళ్ళుంటారు. వీళ్లందరూ వృద్ధనారీ పతివ్రతలన్నమాట. వీరి కళ్ళకి నేను మైకేల్ మదన కామరాజులా అనిపిస్తాను కాబట్టి నా జోలికి వారు రారు. కొంతమంది ఆడవారి దృష్టిలో నేను రాముడిలా మంచి బాలుడిని కాదు కాబట్టి నా బ్లాగుల్లో వ్యాఖ్యానిస్తే ఏ ఎయిడ్స్ వైరస్ తమెకెక్కుతుందో అని చదివినా సరే అల్లంత దూరాన వుంటారు - హెందుకయినా మంచిదని. మరి కొంతమంది ఆడ భక్తి బ్లాగర్లు నేను నాస్తికుడిని కాబట్టి నా జోలికే రారు.

కొంతమంది అభ్యుదయ బ్లాగర్లమని అనుకునేవారికి నాదే టైపు అభ్యుదయమో అర్ధం కాక సనాతన అభ్యుదయానికీ, తమ బూజు పట్టిన విప్లవవాదాలకీ సరిపడతానో లేదో అన్న అభిజాత్యంతో లేదా తమ సామాజిక వర్గమో, తమలా అణగారిన వర్గమో కాదన్న నయా అంటరానితానంతో నా బ్లాగులో వ్యాఖ్యానిస్తే నన్ను తాకినట్లయి మైల పడిపోతామని అనుకుంటారు.

39 comments:

 1. ఇప్పుడు నేను కామెంట్ వ్రాయాలా లేదా అధ్యక్షా ;)

  ReplyDelete
 2. సారిత్ :) మీకు ఎమీ పని లేదా ? తెలుగులో వ్రాయటానికే రోజంతా పడుతుంది కదా... రోజుకి రెండు ఎలా వ్రాస్తున్నారు... ?

  ReplyDelete
 3. ఇలా రాయాని వాళ్ళ చేత కూడా కామెంట్లు రాయించుకోవడమేనా మీ ఉద్దేశం?ఆయ్! మీరు చెప్పిన లిస్ట్ లో నేను లేను అని చెప్పుకోవటానికి ఈ కామెంట్ పెడుతున్నాను. :p)

  ReplyDelete
 4. @ భా రా రే
  మీరు నా అసమదీయులు కాబట్టి భేశుగ్గా వ్రాయొచ్చు :)

  @ తెరెసా
  :)

  @ jiraste mishak
  నాకెందుకు పనిలేదు? రోజూ మీ బుర్రల్ని భేజా ఫ్రై చేయడమే నా పని. అధికార రహస్యాల చట్టం క్రింద రోజూ ఇంత ఎలా వ్రాయగలుగుతున్నా అన్నది చెప్పలేను. ఇది సమాచార ఛట్టం క్రిందికి రాదు.

  @ కల్పన
  మీరు పై లిస్టుల్లో లేరు లెండి. అఫ్సర్ గారు మాత్రం రేపటి లిస్టులో వుంటారు. ఆ లిస్టేమిటో రేపే చూడండి మరి :)

  ReplyDelete
 5. శరత్,
  నాకు బ్లాగు లేదు, అప్పుడప్పుడు మీ బ్లాగ్ లో కామెంటుతున్నాను. నేనే కేటగిరీలోకొస్తానో?

  ReplyDelete
 6. miku kaali time ekkuvayyindi.

  ReplyDelete
 7. సమఝ్ గాలే కానీ అయింది

  ReplyDelete
 8. kevvu post Sarat gaaru..
  కెబ్లాస అధ్యక్ష పదవి మీకు ఊరికే ఇవ్వలేదు సుమండి.. నవ్వలేక చస్తున్నాను బాబూ.. హ హ హ

  ReplyDelete
 9. పైన ఎవరో చెప్పినట్లు మీకు ఖాళీ టైం బాగా ఎక్కువైంది ..:) ఆవలింతలొస్తున్నాయా ..తుమ్ములొస్తున్నాయా అని ఏదో ఒకటి రాస్తునే ఉంటారు .. చక్కగా మంచి కధలు రాయచ్చుగా :)

  ReplyDelete
 10. ఫొటొ మరియు పోస్ట్...రెండూ బాగున్నాయి

  ReplyDelete
 11. ఈ పొస్ట్ లొ కామెంట్లు పెట్టినవారందరి బ్లాగుల్లొ మీరు రెగ్యులర్ గా కామెంట్లు పెట్టకపొవాలి.... అప్పుడు ఉంటుంది మీ పని.... :-)

  ReplyDelete
 12. :) లాగిన్ అయ్యే తీరిక, ఓపిక లేనపుడు మీ బ్లాగులో అజ్ఞాత కామెంట్ అంగీకరిస్తారు కాబట్టి నాకు నచ్చిన టపాకి అజ్ఞాత కామెంట్ పెడుతూ ఉంటాను. నేనే లిస్ట్‌లో కొస్తాను? :)

  ReplyDelete
 13. రాముడిలా మంచి బాలుడిని కాదు కాబట్టి నా బ్లాగుల్లో వ్యాఖ్యానిస్తే ఏ ఎయిడ్స్ వైరస్ తమెకెక్కుతుందో అని చదివినా సరే అల్లంత దూరాన వుంటారు
  ROFL
  కెవ్వు కేక
  చాలా రోజులకి మంచి పోస్ట్ తో ముందుకొచ్చారు
  still laughing :D

  ReplyDelete
 14. మంచు పల్లకి బాబు మాటే నా మాట :)

  ReplyDelete
 15. మరి నేను ఏ లిస్టు లోకి వస్తాను?

  - Raghav aka Venkat

  ReplyDelete
 16. మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టినప్పుడు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు. అదిగో అప్పుడు నాకు కోపమొచ్చి :-) టపాలు రోజు చదివినా కామెంటడం మానేసాను. మొన్న ఒకసారి మాత్రమే సమాధానం ఇచ్చారు.

  ReplyDelete
 17. ఇప్పుడు నేను కామెంట్ వ్రాయాలా లేదా అధ్యక్షా ;)

  Naadi ke blA sa ku bahirangan baita nunchee maddate?

  Dhanaraj Manmadha

  ReplyDelete
 18. శరత్ గారూ....... హి హి... అనాసరంగా ఈ టాపిక్ టచ్ చేసారు రేపట్నించి మొహమాటానికైనా పై బ్లాగుల్లో కామెంట్ పెట్టాలి. ఎందుకైనా మంచిది ఆఫీసులో రోజూ ఒకపూట సెలవు దొరుకుతుందేమో చూడండి. లేకపోతే కామెంట్ల గొడవలోపడి మీపుస్తకం ప్రాజెక్ట్ అటకెక్కిపోద్ది.

  ReplyDelete
 19. టపా ఘాటు బాగుంది.ఎన్నడూ మీ పోస్టులకి కామెంట్లు పెట్టని లేదా అతి తక్కువగా కామెంటే స్త్రీ/పురుషులు బోలెడు మంది వచ్చి ఏదో ఒకటి కామెంటారు.

  శరతా మజాకా మరి...అసలే బ్యాచిలర్ లైఫ్ ఆనందంతో మీ కలం అలా అప్రతిహరితం గా సాగిపోతోంది ఈ మధ్య.క్వాలిటీ గురించి అడగకండి,మందెక్కువయితే మజ్జిగ పలుచన లాగ,మీ టపాల క్వాలిటీ దెబ్బ తింటోంది ఈ మధ్య.గమనించండి.

  ఇంతకీ నేనెవరో చెప్పుకోండి..మీ రెగ్యులర్ కామెంటర్ ని..నేను....గుర్తు పట్టారా లేదా...

  ReplyDelete
 20. @ వాసు
  మీలాంటి వారు ఒక్క బ్లాగన్నా లేని నిరుపేదలు. ఇంకా ఈ సిరీసులో రెండు టపాలు వున్నాయి. మీలాంటి నిరుపేద బ్లాగులోక వాసుల గురించీ కవర్ చేస్తాను.

  @ అజ్ఞాత
  అవును. ఇంటా- బయటా తీరికెక్కువయ్యింది. అందుకే అందరినీ టోకుగా కెలికేద్దామనే కుట్ర పన్నాను.

  @ భా రా రా
  మీకు కామెంట్లు ఏమీ బాకీ లేను ఎందుకంటే ఈమధ్యనే కొన్ని కామెంట్లిచ్చాను మీకు. ఇదన్నా అర్ధం అయ్యిందా సరిగ్గా :)

  @ మంచు, కార్తీక్, అను, ఆ సౌమ్య
  :))

  ReplyDelete
 21. మందెక్కువయితే మజ్జిగ పలుచన లాగ,మీ టపాల క్వాలిటీ దెబ్బ తింటోంది ఈ మధ్య.గమనించండి.

  ఇంతకీ నేనెవరో చెప్పుకోండి..మీ రెగ్యులర్ కామెంటర్ ని..నేను....గుర్తు పట్టారా లేదా
  ___________________________________________________


  తమరు ఇదివరకు నా బ్లాగు లో కూడా ఇదే కామెంట్ చేసినట్టు గుర్తు ...... మీరెవరో నేను గుర్తుపట్టా :)

  ReplyDelete
 22. @ కొండముది
  నా బ్లాగులో మీ వ్యాఖ్య తొలిసారి అనుకుంటా.

  @ నేస్తం
  ఇదివరకు బయటే తీరిక వుండేది - ఇప్పుడు ఇంట్లో కూడా తీరికెక్కువయ్యి అసలే కోతికి కొపరి చిప్ప దొరికినట్లయ్యి డెవిల్స్ మైండ్ అయిపోయి మీ అందరి పనీ పట్టాలనిపిస్తోంది :) త్వరలో మీ ఆడ లేడీ కేడీ బ్లాగర్లందరిమీద వ్రాస్తున్నా. ప్లీజ్ స్టాండ్ బై!

  నేను కథ వ్రాసినప్పుడల్లా మీరు వహ్వా, వహ్వా అంటాననీ, మరో పది మంది చేత వహ్వా అనిపిస్తామనీ అంటేనే కథల విషయం ఆలోచిస్తాను. అలా అని సరే అనేస్తే సరిపోదు - కాంట్రాక్ట్ మీద సైన్ చేయాల్సి వుంటుంది. కాంట్రాక్ట్ ఉల్లంఘిస్తే అన్న ఆలోచనే మనస్సులోకి రానివ్వకండి - నా వైపు పెద్ద పెద్ద రౌడీలు వున్నారు - మీకు తెలుసు.

  @ మంచు
  నా పోస్టు నాకే బూమరాంగ్ లాగా తగిలేట్లుగా వుందే ఈ లెఖ్ఖన :(

  @ శిశిర ( మా అమ్మలు పేరు)
  మీలాంటి బుర్ఖా కామెంటర్ల సంగతి కూడా ఈ సిరీసులో తేలుస్తా/తెలియజేస్తా!

  ReplyDelete
 23. @ రాఘవ్
  మీరు కంఫ్యూజ్డ్ కామెంటేటర్ల జాబితాలోకి వస్తారు. ఇప్పుడే మీ ప్రొఫయిల్ చూసి వచ్చాలెండి :)

  @ వాసుకి
  నా క్షమాపణలు. రోజుకి మూడు నాలుగు టపాలన్నా, రెండు మూడు బ్లాగుల్లో వ్రాస్తున్నప్పుడు ఎంత ప్రయత్నించినా కామెంట్లని క్యాచప్ చేయలేకపోతున్నాను. అందుకే ముందస్తు జాగ్రత్తగా, ముందస్తు ధన్యవాదాలు నా కామెంటు బాక్స్ గమనికలో పెట్టాను కదా. అది గమనించేవుంటారు. అందువల్ల ఇకనయినా అలుక మాని ఇచ్చేయండిచ్చేయండి - మరో ఆలోచన లేకుండా కామెంట్లిచ్చేయండంతే!

  @ డుబుగు
  ఏంటీ ఈమధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారు? మరి మీ బ్లాగులో నేను కామెంటాలంటే నా బ్లాగులో అప్పుడప్పుడయినా మీరు కామెంట్లు చదివించుకోవాలి కాదూ!

  @ 3 జి
  ఏం పుస్తకమో లెండి - దానిని ఎడిట్ చేసే ఓపిక, ఫోకస్ లేక దానిని ఎప్పుడో అటకెక్కించాను కాబట్టే ఇలా టపాలు టపటపలాడిస్తున్నాను. పుస్తకలు వ్రాయడం కన్నా దానిని ఏడిట్ చేయడం తలకు మించిన శ్రమలావుంది. టపాలయితే పెద్దగా ఎడిట్ చేయాల్సిన అవసరం వుండదు - టపాలంటే మనోస్ఖలనం, మనోవాంతి, మెంటల్ ఫ్లాసింగ్ వగైరాలు కాబట్టి!

  ReplyDelete
 24. @ 3 జి
  చెప్పడం మరిచాను. అనవసరంగా ఓ కామెంట్ల తుట్టే కదిపించుకున్నానంటారా :( ఇహ నా కామెంట్లు లెక్కపెడతారేమో అందరూ!

  @ నేస్తం
  మరిచానండోయ్. ఈమధ్య మీ బ్లాగు చదివి కామెంటు పెట్టడం లేదనుకోకండి. చదవకనే పెట్టడం లేదు. మరీ మంచి టపాలు ఎక్కువగా చదివితే అజీర్తి చేస్తుందని...!

  @ ఆ సౌమ్య
  ఇదివరకు నా బ్లాగులో కామెంట్లుపెట్టకపోయేవారు (అప్పుడెప్పుడో తప్ప). మీరు నా శత్రువుకి మిత్రులు కాబట్టి మిమ్మల్నీ నా శత్రువుల జాబితాలో అనగా నా బ్లాక్ లిస్టులో వేసుకున్నాను. కానీ హిప్నటిజం నా ఫేవరెట్ టాపిక్ అవడంతో ఆగలేక నా బ్లాక్ లిస్టుకి మినహాయింపు ఇచ్చి కామెంటు వేసా. అలా ఐస్ బ్రేక్ అయ్యింది. మీరూ కామెంటడం ప్రారంభించారు. నేను మళ్ళీ వెయ్యలేకపోయాను. సో, మీకు కొన్ని కామెంట్లు బాకీ నేను. త్వరలో తీర్చేస్తా కానీ వాటికి వడ్డీ కట్టకండేం!

  ReplyDelete
 25. @ అజ్ఞాత
  హ్మ్. ఎవరబ్బా మీరు? చికాగో దగ్గర్లో వుండే అజ్ఞాత కామెంటరా మీరు? పుస్తకాల గురించి పొడిచేవారే - వారేనా మీరు? కాదనుకుంటా - వారి భాష ఘాటుగా వుంటుంది.

  టపాల క్వాలిటీ: ఇదే ప్రశ్న తన సినిమాల గురించి రాం గోపాల్ వర్మని అడిగితే ఏం చెబుతాడు? అదే నా వివరణ కూడా. అయినా సరే మీ సూచనని దృష్టిలో వుంచుకుంటాను. థేంక్స్.

  @ శ్రీనివాస్
  ఎవరబ్బా పై అజ్ఞాత?

  ReplyDelete
 26. నేను మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టలేదని చెప్పటానికే ఈ కామెంట్

  ReplyDelete
 27. శరత్ గారూ పనిలో పని అస్మదీయులు, తస్మదీయులు, అస్మదోతస్మదీయులు, తస్మదో అస్మదీయులు లాంటి పట్టిక ఒకటి తయారు చేసేయండి. అందరూ చాలా ఆదుర్దాగా ఉన్నారు. ముఖ్యంగా మీ బావ ఏ కేటగిరీలోకి వస్తాడో అని నాక్కూడా టెన్షన్ గా ఉంది.

  ReplyDelete
 28. అనుకున్నా మీరు ఈ మాట అంటారని :) వెంకట్ పేరు తో నా అన్వేషణ బ్లాగ్ మొదలెట్టింది నేనే లెండి, అసలు పేరు వెంకట రాఘవేంద్ర అదన్న మాట సంగతి.

  ReplyDelete
 29. ఈ టపా వెనక చరిత్రని మాలాంటి న్యూకమర్స్ కోసం జరిగిన కధగా చెప్పాలి యువరానర్!

  ఐ.పి.బ్లాక్ తరంగం తప్ప మిగిలిన విషయాలు తెలీవు కనుక మేము కితకితలు పెట్టుకుని నవ్వవలిసి వస్తుంది అని మనవి చేసుకుంటున్నాము మిలార్డ్!

  ReplyDelete
 30. @ తార
  అయితే మీతో పచ్చి. మీ బ్లాగులో కూడా కామెంటు పెట్టను ఫొండి!

  @ ప్రసాదం
  ఎక్కడండీ బాబూ. నాకు కామెంట్ల ఫండగ (ఫన్ + పండగ = సువర్ణ దీర్ఘ సంధి) అయిపోయి అందరూ అలగకముందే రిప్లయిలు ఇవ్వడానికే సరిపోతోండి. ఇహ కొత్త పోస్టు ఎప్పుడు వేసేనూ? ఇహ పిల్ల కాకి క్రిష్ణ అయితే మరీనూ సీరియల్లో తన కామెంటుకి రెస్పాన్స్ రాకపోయినా, వేరే ఎవరికయినా ముందొచ్చినా అలిగేస్తాడు. కామెంటర్ల మనోభావాలు బేబీ సిట్టింగ్ చేయడానికే సరిపోతోంది నా సమయం!

  @ వెంకట్ రాఘవేంద్ర
  :) మీ ప్రొఫయిల్లో మీ బ్లాగు కనిపించేలా చూడండి.

  @ క్రిష్ణ
  అనగనగా ఒక తెలుగు బ్లాగు పుట్టిన రోజు అని మొదలు పెట్టాల్సుంటుంది కథ. అయినా ఈ టపాకి పెద్ద బ్యాక్ గ్రవుండ్ స్టొరీ ఏమీ లేదులెండి. సాధారణ కామెంట్ కుట్రలే వ్రాసాను - మీరు ప్రస్థావించింది తప్ప.

  ReplyDelete
 31. అసలు మీకిలాంటి అయిడియాలు ఎలా తడతాయండీ? భలే నవ్వించారు :) :)

  ReplyDelete
 32. శరత్ గారు,
  కొత్తవాదినైన నా రెండు పోస్ట్ లకు మీఋ కామెంటే భాగ్యం కల్గించారు, థాంక్స్ అండి, మీ లాంటి పెద్దవాళ్ళకు కామెంట్ రాయాలంటే భయమేసి రాయలేదండి, మీ టపా చుసినతర్వత. ఒక మేము రాస్తామంది

  ReplyDelete
 33. మీరు ఈ మధ్య ఎవరి బ్లాగులోను కామెంట్లట్లేదు.దానికేమంటారు?

  మీ అమ్మయి బాగుంది.

  ReplyDelete
 34. వారాంతం లోనే ఇంటిదగ్గరుండి కామెంట్లు చేస్తే, మీ వుద్యోగం సమయం లోనే టపాలు చదవడం, రోజుకు రెండైనా కామెంట్లు వ్రాయడం చేస్తున్నారన్నమాట.

  బాగుంది మీ వుద్యోగం!

  ఇక 'ఆలివ్ ఆకులివ్వడం'; 'బిగదీసుకోవడం' అంత అవసరమంటారా?

  మీరు కామెంట్ చెయ్యాలనుకున్న టపాని పూర్తిగా చదవండి. ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోండి. దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి!

  అప్పుడు--మీ వ్యాఖ్యలు కొంత వుపయోగపడతాయి!

  ReplyDelete
 35. @ మధురవాణి :))
  @ భాను - నేను పెద్దవాడినేంటండీ? బద్రి, తార, పవన్ లాంటి వారు నేను చెబితే నమ్మరు కానీ నా వయస్సు ఎప్పటికీ పదారేళ్ళే! మీరేం ఖంగారు పడకండి.
  @ నీహారిక - ఎక్కడండీ బాబూ. నాకు వచ్చే కామెంట్లను బేబీ సిట్టింగ్ చేయడానికే సరిపోతోంది నా సమయమంతానూ. అయినా కృషి చేస్తూనేవున్నా.
  @ క్రిష్ణ శ్రీ - ఆలివ్ ఆకులివ్వడం - బిగదీసుకుపోవడం అనే నా వ్యూహాలని మీరలా తేలిగ్గా తీసేస్తే ఎలా :)) ఇలాంటివి అందరికీ ఏవో కొన్ని వుంటాయిలెండి. మీ సూచనలని దృష్టిలో వుంచుకుంటాను.

  ReplyDelete