మంగళవారం 29 జూన్ 2010

బి డి ఎస్ ఎం వైపుగా నా అడుగులు

బి డి ఎస్ ఎం http://en.wikipedia.org/wiki/BDSM మీద నాకు ఆసక్తి ఎన్నో ఏళ్ళుగా వున్నప్పటికీ అది ఫాంటసీలకే పరిమితం అయ్యింది. సరి అయిన వేదికలతో పరిచయం లేక, కాంటాక్ట్స్, అది ఆసక్తి వున్న పార్ట్నర్స్ దొరకక అలా ఊహల్లోనే ఇప్పటివరకూ ఫిక్స్ అయ్యాను. రేపటి తరం రోమాన్సు అయిన ఆ ప్రత్యామ్నాయ జీవన విధానానికి సంబధించిన కమ్యూనిటీ చికాగోలో బాగానే వుంది. దానికి సంబధించిన క్లబ్బులు కొన్ని వున్నాయి. సెక్స్ స్వేఛ్ఛకి సంబంధించిన గ్రూపులు ఆయా కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వుంటాయి.

వయోజనులు పరస్పర అంగీకారంతో చేసుకునే ఎటువంటి శృంగారానికీ అభ్యంతరం వుండకూడదన్న ఐడియాలజీ మీద ఇలాంటి కార్యక్రమాలు లీగలుగా నడుస్తున్నాయి. అలాంటి సంస్థలనూ, కార్యక్రమాలనూ పరిశీలించబోతున్నాను. ఆ తరువాత నేను గమనించిన విషయాలపై మీకు నివేదిక ఇస్తాను.

11 comments:

తార చెప్పారు...

మీ బావతో ప్రయత్నిచండి, పొడిచి పారేస్తాడు లేదంటే చెయ్యి నరికేస్తాడు.
ఒక్కసారిగా ఆ వికి లంకె చూసి డడుచుకున్నాను,.. బాబోయి, వెర్రి రెండు వేల విధాలు.
ఇది అరోగ్యానికి హాని కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని నిషేదించొచ్చు, లేదా మానసిక వికలాంగుల కింద లెఖ్ఖేయచ్చు

ఏక లింగం చెప్పారు...

ఎందుకొచ్చిన తిప్పలివన్ని?
ఏమన్న కిందికి మీదికి ఐతే అసలుకే ఎసరొస్తది. జర పైలం

వెంకట్ చెప్పారు...

అటు ఇటు ఐతే "సీన్ సితార్ బుల్ బుల్ తారే"

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ తార
మా ప్రవీణ్ బావ దగ్గర 'బూతు' మాట ఎత్తితే చాలు నాలుక కోసేస్తాడు - ఇంకా ఇంత దూరమా:))

ఇవాళ పెర్వర్షన్ అనుకున్నదే రేపు సాధారణం అవుతుంది. సాధారణ శృంగారం నడక వంటిది. ఇది కారులో ప్రయాణించడం లాంటిది. కారు ప్రయాణం కన్నా నడకే క్షేమకరమయినది కానీ అలా అని ఎప్పుడూ నడుస్తూ వుండలేము కదా. కారు అనేది ఒకటి వుంటుంది తెలియని వారికి నడకనే గొప్పగా, వేగంగా అనిపిస్తుంది.

ఒక అడవి బాలుడిని అకస్మాత్తుగా తీసుకువచ్చి నాగరిక సమాజంలో పెట్టామనుకోండి - అతనికి అంతా తిక్కతిక్కగా అనిపిస్తుంది. ఇదీ అంతే. అలవాటుపడితే సాధారణం అవుతుంది. మీకందరికీ అలవాటు చేయడమే నా అజెండా.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ఏకలింగం
నేను హార్లిక్స్ తాగను తింటాను అన్నట్లుగా చాలా కాలం అంటే నాకు కంఫర్టబుల్ అనిపించేదాకా చెయ్యను - చూస్తానంతే. కొంత సభ్యత్వ రుసుము చెల్లిస్తే డంజెనులల్లో జరిగేవి ఎంచక్కా చూస్తూ కాలక్షేపం చెయ్యవచ్చు.

టేక్ కేర్ కాదు మన పాలసీ - టేక్ రిస్క్!

@ వెంకట్
అటుదిటు - ఇటుదటు అయినా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు లెండి. నేను రెంటికీ సిద్ధమే కదా :))

తార చెప్పారు...

వైద్య శాస్త్ర ప్రకారం, మోహంలో, పూర్తి తెలివితో తనని తానుగా, లేక పరుల చేత హింసించుకోవటం మానసిక రుగ్మతే, ఒక సారి ఇది మొదలు పెట్టాక, ప్రాణాంతకం కుడా కావ్వొచ్చు కదా; ఎడిక్షన్ వలన, మరి ఇది సాధారణం ఎలా అవుతుంది?
మరి సాధారణం ఐతే అది క్లీనికల్‌గా నిరూపించగలగాలి, అదే మొదటి అడుగు మరి ఇది పెర్వర్షన్ కాదు అని నిరూపించటంలో

తార చెప్పారు...

వెంకట్ తన కామెంట్‌లో నా పేరు వాడుకున్నందుకు, ఏకలింగం వచ్చి మా అన్నకి అపాలెజీ చెప్పే దాకా నేను అన్న బ్లాగ్ లో కామెంట్లు రాయను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ తార
ఇదే కాదు - ఏది ఎడిక్షను అయినా ప్రాణాంతకమే!
కారు ప్రమాదం కాకుండా బ్రేకులు ఎలా వుంటాయో దీనికి కూడా బ్రేకులు వుంటాయి. వాటిని సేఫ్ వర్డ్స్ అంటారు. వివరాల్లోకి వెళితే అన్నీ తెలుస్తాయి.

ఏక లింగం చెప్పారు...

మీరు యూరోట్రిప్ (http://www.imdb.com/title/tt0356150/) సినిమా చూసారా? మంచి కామెడీ మూవీ. సేఫ్‌వర్డ్ పైన చిన్న కామెడీ సీన్ ఉంటుంది. (http://www.youtube.com/watch?v=9-2dN9E8vPk) ఒక్కసారి వీలయితే చూడండి.
-----------------
ADULTS ONLY VIDEO
-----------------

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ఏకలింగం
యూరోట్రిప్ సినిమా గురించి తెలియదు. చూస్తానయితే.

వెంకట్ చెప్పారు...

@తార గారు
అవును అవును ఏకలింగం గారు అపాలజి చెప్పాల్సిందే ;)