పానీపూరీ, డల్లాస్ నాగ్ లను టెక్సాస్ లో కలిసిన విధం బెట్టిదన...

నా బ్లాగు మిత్రులు నన్ను కలవడనికి వస్తున్నారని తెలిసిన ఇతర మిత్రులు ఈ విషయం పై ఆసక్తి ప్రదర్శించారు. పైగా ఇదివరకెప్పుడు చూడని స్నేహితులను కలవడం పై ఎలాంటి ఉత్సూత వుంటుందో వ్యాఖ్యానించారు. ఎప్పుడెప్పుడు బ్లాగ్మిత్రులు వస్తారా అని ఎదురుచూస్తూవుంటే అక్కడ వున్న ఇతర మిత్రులు సరదాగా కామెంట్లు వేసారు.  

పానీపూరి ని నేను బస చేస్తున్న ఇంటికే రమ్మని ఆహ్వానించాను. వారు ఇదివరకు నా ఫోటో కానీ, వీడియో కానీ చూడలేదట. నేను కూడా వారిని చూడటం ఇదే ప్రధమం. వారి కలం పేరు వున్నంత సరదాగా వారు అనిపించలేదు. వారి కలం పేరుకి, బ్లాగు వ్యక్తిత్వానికీ, నిజమయిన వ్యక్తిత్వానికి తేడా వుంది. నిజ జీవితంలో వారు కాస్త రిజర్వుడుగా, ఫార్మల్ గా అనిపించారు. ఫార్మల్ గా మా మధ్య సంభాషణ నడిచింది. వారి గురించి నేను, నా గురించి వారు ప్రాధమిక విషయాలు తెలుసుకున్నాం.    

మేము మాట్లాడుకుంటుండగానే మధ్యలో డల్లాస్ నాగ్ వచ్చారు. వారి పేరుకి తగ్గట్టె హుశారుగా వున్నారు. చలాకీగా మాట్లాడారు.  పానీపూరీ, నాగ్ ల పరిచయం కూడా అప్పుడే. ఇక ముగ్గురం బ్లాగర్లం కలిసాము కాబట్టి బ్లాగుల మీద, బ్లాగర్ల మీద, బ్లాగుల్లో సమకాలీన రాజకీయాల మీద అందరం సరదాగా ముచ్చటించుకున్నాం.   అయితే మా వాళ్లంతా అనుకోకుండా వేరే చోటికి వెళ్ళే ప్రొగ్రాం పెట్టేయడంతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాము. మా బ్లాగర్ల సమావేశాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. ఇహ చాలు, మీ సమావేశం ముగించి బయలుదేరండి అన్న నా హై కమాండ్ ఆజ్ఞ విని హడావిడిగా కబుర్లు ఆపాము. నాకు వేరే ప్రోగ్రాం లేకపోయివుంటే మా ముచ్చట్లు ఇంకా ఎంతకాలం సాగివుండేవో. తనివి తీరని ముచ్చట్లతో అలా ముగ్గురం అర్ధాంతరంగా వీడ్కోలు తీసుకున్నాం. మిగతా విషయాలు ఫోనులో మాట్లాడుకోవాలని అనుకున్నాం.  

మా బుల్లి (వీడియో) బ్లాగర్ అమ్మలు ని ఇద్దరికీ పరిచయం చేసాను కానీ తను బ్యుజీగా వుండటం వల్ల మమ్మల్ని అంతగా లెక్కచేయలేదు. నా మిగతా కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసాను.  కొంతమంది ఇతర మిత్రులని కూడా పరిచయం చేయగలిగాను. మా సమావేశానికి ఏర్పాట్లు చేసి, మా అవసరాలు కనుక్కున్న నా మిత్రుడు రెడ్డి (గారు) కి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.  సమయాతీతమవుతున్న హడావిడిలో మేము ఫోటోలు తీసుకోవడం మరచేపోయాము.  

5 comments:

  1. ప్చ్....మిస్స్ అయ్యాను కదా, అవునా! పానీపూరీగారు అంత రిజర్వుడుగా ఉంటారా! ఆయన కమెంట్స్ చూస్తే అలా అనిపించదే!ఏమో:):)

    ReplyDelete
  2. హో పానీపూరిని కలిసారన్నామాట :-)

    ReplyDelete
  3. మీరు గే/బై అని అంటుంటారు కదా! అందుకని అలా రిజర్వుడుగా ఉన్నాడేమో? j/k

    ReplyDelete
  4. @ పద్మార్పిత
    ఏంటీ, మీరు కూడా టెక్సాసులోనేనా వుండటం?

    కొత్తగా పరిచయం అయినప్పుడు పానీపూరి అలా వుంటారో లేక వారి వ్యక్తిత్వమే అదేనో వారే చెప్పాలి. చాలామందిలో బ్లాగు వ్యక్తిత్వానికీ, నిజమయిన వ్యక్తిత్వానికీ పొంతన వుండకపోవచ్చు.

    @ పానీపూరి
    కలిసానో లేదో మీరే ధృవపరచాలి మరి :)

    @ అజ్ఞాత
    ఇదీ పాయింటే :)

    ReplyDelete
  5. దమ్ముంటే అట్లాంటా రా... నీతో గే ఇజం తప్పు అని చెప్పించాలని నా కోరిక...

    ReplyDelete