పేరులోనేముందో లేదో కానీ రివర్సు వుండొచ్చు... జాగ్రత్త!

టొరొంటోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు టర్కిష్ కోలీగ్ వుండేవాడు. పిల్లలకు పేరు పెట్టేముందు ముందూ, వెనకా అన్నీ చూడాలనీ, లేకపోతే పిల్లలకు స్కూలులో ఇబ్బందులు ఎదురవుతాయనీ చెప్పాడు. పేరుని రివర్సు చేసి లేదా అటు తిప్పీ, ఇటు తిప్పీ పిల్లల స్నేహితులు ఆటపట్టిస్తారనీ చెప్పాడు.  వాళ్ళమ్మాయికి తెలియక ఒక పేరు పెట్టాడట. దానిని రివర్స్ చేసి బడిలో పిల్లలు వెక్కిరించేవారుట. ఆ విధంగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోయిందంట. కాలేజీలో కూడా అలా అవస్థల పాలయ్యిందంట.

ఏమిటా పేరు అని మరో కోలీగు అడగనే అడిగేసాడు. వద్దులే బావుండదులే అన్నాడు మా టర్కిష్ కోలీగ్. ఫర్వాలేదులే, మనమే కదా వున్నాం, చెప్పు, చెప్పు అని ఆ కోలీగ్ ప్రోత్సహించాడు. సరే అని అప్పుడు చెప్పాడు మా టర్కిష్ కోలీగ్ తన కూతురి పేరు.  SUNA

మా పెద్దమ్మాయి ఇండియాలోనే పుట్టింది కాబట్టి అక్కడే పేరు పెట్టాము కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ ఇంతవరకు ఎదురుకాలేదు.    మా రెండో అమ్మాయి టొరొంటోలో పుట్టింది.  పేరు పెట్టేటప్పుడు మా కోలీగ్ చెప్పిన విషయాలు దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా పెట్టాము. ఇప్పటి వరకయితే ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.

పై ఫోటోలొని పేరు మీకు అర్ధమయ్యిందా? బల్బ్ వెలిగిందా లేదా :))   

6 comments:

  1. Check this


    http://blog.makezine.com/archive/2010/02/how-to_treadmill_desk.html

    ReplyDelete
  2. ముందు చూసిందే ఆ పేరు మాస్టారు.

    ReplyDelete
  3. ఈ మధ్యొక మరాఠీ వ్యక్తిని కలిశా. అతని మిడిల్ నేం: "అనల్"

    పాపం! ఇంగ్లీష్ లో రాసేటప్పుడు చచ్చుంటాడు

    ReplyDelete
  4. @ వేణు, శ్రీనివాస్, విట్ రియల్, నాగార్జున
    :))

    ReplyDelete